పుష్పక విమానం – నా ఫేస్‌బుక్ పేజీ !


బ్లాగుల్లో రాస్తే ఆ సుఖమే వేరు. మనకు కావలసింది, కావల్సినట్టు రాసుకోవచ్చు. కానీ, ఈ మధ్య ఫేసుబుక్కే ఎక్కువగా వాడుతున్నారు అంతా ! బ్లాగులు నిదానంగా తమ ప్రభను కోల్పోతున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే… నేనూ మార్గదర్శిలో చేఅరా ఒక ఫేసుబుక్కు పేజీ ఓపన్ చేశా 😀

పుష్పక విమానం – ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా, మాట్లాడుకోవడానికి ఇంకో టాపిక్ ఎప్పుడూ ఉంటుంది !

వీలైతే ఒక లుక్కేయండి. దాన్ని రెగ్యులరుగా అప్‌డేట్ చేయడం నాకు ప్రస్తుతం కుదరని పనే అయినా, చాలా మంది జాయిన్ అయ్యే వకాశం ఉంది కాబట్టి.. కొంత కాలానికి రెగ్యులరుగా అప్‌డేట్స్ పెడుతూ ముందుకు సాగుతామని మాత్రం చెప్పగలను. దాదాపుగా అది ఒక మ్యాగజైనులా నడపాలన్నది నా కోరిక. త్వరలో దాన్ని పూర్తి స్థాయిలో .. నడపగలిగే శక్తి సామర్ధ్యాలూ సమీకరిస్తానని చెప్పగలను !

ఇప్పటివరకూ రాసిన అన్ని టపాలూ … 

Advertisements
Published in: on February 2, 2017 at 3:02 pm  Comments (2)  
Tags:

మూడు సంవత్సరాల క్రితం నేను ఫేసుబుక్కులో పెట్టిన పోస్ట్ !


మూడు సంవత్సరాల క్రితం 2013నులో నేను ఒక పోస్టు పెట్టా ఫేసుబుక్కులో ! అది ఈరోజు నాకు మెమరీస్ అని చూపించింది. అప్పట్లో నిర్భయ అత్యాచారం జరిగిన తరువాత పురుష హక్కుల కార్యకర్తలు, మగవారూ గడ్డు కాలాన్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే, నిర్భయ ఘఠనకు కారణం పురుషాధిఖ్యమని, మనం అన్నీ చూస్తూ సహిస్తుండడం వలననే ఇలాంటివి జరుగుతున్నాయని మీడియా అంతా కొన్ని నెలల పాటు ఊదరగొట్టేసిన తరువాత… ప్రతీ ఒక్కరూ హైపర్ యాక్టివుగా తయారైపోయారు.

అమ్మాయి చెబితే చాలు, తప్పా ఒప్పా అని ఆలోచించకుండా, ఎవరిది తప్పు అని తేల్చుకోకుండా అమ్మాయికి సపోర్టు చేయడమే తమ కర్తవ్యంగా భావించేశారు అంతా ! అదొక పేద్ద కెరటంలాంటిది. తప్పుకోవాలంటే .. తలొంచడమొక్కటే మార్గం అని చాలా మంది డిసైడ్ అయిపోయి సైలెంటైపోయారు. కానీ, పురుష హక్కుల కార్యకర్తలు మాత్రం ఆ కెరటం మీద సర్ఫింగ్ చేశారు. అది చాలా ప్రమాదం అని తెలిసినా  ! కొందరు సక్సెస్‌ఫుల్ గా చేశారు. మరికొందరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అవి కాకుండా, అప్పటలో 498A కేసులు గట్రా కోర్టులో పెండింగు ఉన్నవారు మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో శ్రమకోర్చి, ఎన్నో విలువైన కాలాన్ని వెచ్చించి మేము 498A ఎంతగా దురుపయోగమవుతుందో తెలియచెప్పిన తరువాత, కొద్ది కొద్దిగా సమాజములో మార్పు వస్తూ ఉన్నది అప్పటికి. కానీ, ఒక్కసారి ఈ ఘఠన జరిగిన తరువాత, కమ్యూనిష్టులు ఫెమినిష్టులు ఆఘఠనను ఉపయోగించుకుని ప్రతీదాన్ని హైజాక్ చేయడం మొదలుపెట్టారు.

దానితో అనేక మందికి 498A కేసుల్లో కష్టాలు మరింత తీవ్ర మయ్యాయి. అసలు ఆడవారికి సంబందించిన అన్ని కేసుల్లో ప్రజలు అటువైపు వారికి కూడా ఒక వర్షన్ ఉంటుందని, అది కూడా వినడం అవసరమని లేకపోతే అమాయకులు బలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మర్చిపోయారు. వారందరికీ  సమాజములో ఉందని చెబుతున్న పురుషాధిఖ్యత, ఏదైతే నిర్భయ ఘఠనకు కారణమైంది అని చెప్పబడుతోందో ఆ పురుషాధిఖ్యత “తమకు” లేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం, అగత్యం ఏర్పడింది. దానితో వెనకా ముందూ చూడకుండా నిరూపించేసుకున్నారు. ఎందరో అమాయకుల్ని బలిచేశారు.

అలాంటి సమయములో రాసిన పోస్టు ఇది.

చాలా మంది, పడ్డ శ్రమంతా వృధా అని బాధపడ్డారు. స్త్రీలు దురుపయోగం చేస్తున్న చట్టాల వలన ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో తెలపాలని ప్రయత్నించిన వారికి అడుగడుగునా అవమానాలే ఎదురైనా తట్టుకుని నిలబడ్డవారే వారంతా ! ప్రతీ రోజూ ఎవరో ఒక హీరో మాకు తగులుతూనే ఉంటాడు. ఆహీరో ఆడవారు ఎంతటి సున్నిత హృదయులో మేము ఎంతటి కౄరమైనవారమో మాకు గుర్తు చేస్తూనే ఉంటారు. అసలు మాలాంటివారికి 498A గట్రా చట్టాలే సరైనవని, కట్నము తీసుకొని మేము ఎంత పాపము చేశామో, తరువాత స్త్రీలను అదనపు కట్నం కోసం హింసించి అంతకు రెట్టింపు పాపంచేశామో, మాలాంటి వాల్లకు శిక్షలు పడడం వలన సమాజములో మిగిలిన వారికి ఒక వార్నింగులా ఎలా ఉంటుందో వివరించి మరీ చెప్పేవారు ! కేసుల్లో ఇరుక్కుని పడే బాధలు ఒకటైతే ఈ హీరోలు పెట్టే బాధలు వాటికి బోనస్ అన్న మట ! వెల్, అవన్నీ అలవాటైపోయాయి. మేము ఎన్నుకున్న మార్గం అంత ఈజీకాదని మాకు తెలుసు, తెలిసే ఎన్నుకున్నామా మార్గం !

కానీ, ఈ నిర్భయ ఘఠన తరువాత జనాలు మరీ దారుణంగా తయారైపోయారు ! ఆ నిరుత్శాహం కొంత మంది పురుష హక్కుల కార్యకర్తల్లో కనపడేది. ఎన్ని కష్టాలు పడ్డా, తప్పు తమది కాకపోయినా .. కేవలం అవతల ఉన్నది “ఆడది” అవ్వడం వల్ల సమాజం మొత్తం తప్పు పడుతుంటే .. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ బాధ !

ఆ బాధను అనుభవించే వీల్లు … కోరుకునే న్యాయం సమాజం ఇవ్వలేదు. అన్యాయంగా కేసులు ఎదుర్కొన్న వారు పడ్డ మానసిక క్షోభ, సమాజము నుండి ఎదుర్కొన్న సూటిపోటి మాటలు అవి కలుగజేసే గాయాలు ఇవేవీ సమాజానికి పట్టవు. వాల్లకు కావలసింది కేవలం … తాము “పురుషాహంకారులం” కామన్న సర్టిఫికేట్. సమాజం మొత్తం పురుషాధిక్యం అని స్త్రీవాదులు ముద్రవేస్తుంటే, దానిలో తాములేము అని నిరూపించుకోవడానికి పడే తపన వారిది ! పీత కష్టాలు పీతవి మరి ! దానికోసం అవసరమైతే కొంత మంది మగవారిని “బలిపశువు”లను చేయడానికి కూడా వెనకాడదు సమాజం. ఒకటీ అరా కేసుల్లో ఇలాంటివి జరుగుతాయి కానీ, ఇలాంటివి అవసరమే అని సర్ధిచెప్పుకుంటుంది. కానీ, అవేవీ ఒకటీ అరా కేసులు కావు. ఒకటీ అరా అన్నది కేవలం ఇలాంటివాటికి వాడే ఊతపదం అంతే !!

MyPost

అలాంటి సందర్భములో మమ్మల్ని రాసుకున్నది ఇది !

(తెలుగు అనువాదం …)

పురుష హక్కుల పోరాటం విఫలమయ్యిందా !?

పురుష హక్కుల పోరాటం విఫలం చెందలేదు. స్త్రీవాదం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సాధించడానికి కొన్ని దశాబ్దాలు పనిచేయాల్సి వచ్చింది అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇది ఒక సుదీర్ఘమైన పోరాటం మితృలారా ! కేవలం కొద్ది మంది పురుషులు, మరికొద్ది మంది స్త్రీలూ పురుష హక్కుల కోసం, కేవలం కొద్ది కాలం మాత్రమే పోరాడి వాటిని సాధించగలమని ఎలా అనుకున్నారు ? (అది కూడా కనీసం రెండంకెల సంఖ్యను కూడా చేరుకోలేదు గట్టిగా). ఇంతలోణే అంతటి మార్పు సమాజములో అసాధ్యం. కాకపోతే, ప్రస్తుతం కొంత మంది ఎంపీలూ, కొంత మీడియా మాట్లాడుతున్న విధానం చూడండి! ఒకప్పుడు స్త్రీవాదులతో టీ.వీల్లో చర్చల్లో పాల్గొనడానికి పురుషులు జంకేవారు. ప్రస్తుతం స్త్రీవాదులు పురుష హక్కుల కార్యకర్తలతో చర్చలు చేయడానికి జంకుతున్నారు. ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఒక నిస్సహాయుడు, అమాయకుడి కంటినుండి కారిన కన్నీరు, వారి దుఖః ఎన్నడూ వృధాగా పోదు. ప్రతీదీ పరిగణలోనికి తీసుకోబడుతుంది. మనం మన కష్టాలనూ, అభిప్రాయాన్నీ సమాజానికి చెప్పాం. సమాజం విన్నది. మన కష్టములో, అభిప్రాయములో న్యాయం మనవైపే ఉంటే సమాజం దాన్ని అర్థం చేసుకుంటుంది. దాన్ని నలుచెరగులా వ్యాపింపజేస్తుంది. కానీ, దీనికి కొంత సమయం పడుతుంది. కానీ, ఏదొ ఒకరోజు సమాజం మనకోసం, మనకు సపోర్టుగా వస్తుంది. ఆరోజు మనమే ఆశ్చర్యపోతాం. ఆరోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. అప్పటివరకూ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. రోజు కొద్దిసేపైనా మీ హక్కుల పోరాటాన్ని కొనసాగించండి. పురుష వ్యతిరేక విధానాలనూ, పురుష ద్వేషాన్ని వ్యతిరేకించండి. మనం యుద్దాన్ని ఒకరోజులో గెలవలేం, అలా గెలిచినా గెలిచినట్టుకాదు. ఒక్కో చిన్న చిన్న పోరాటాలలో గెలవాలి. ఒకదాని తరువాత ఒకటి !!

అదీ అప్పట్లో నేను రాసింది. కాస్త నిరాశ నాలోనే ఉంది అప్పట్లో. ఇప్పటికీ కూడా అంతగొప్పగా ఏమీలేదు. రీసెంటుగా నాగాల్యాండులోని దిమాపూరులో జరిగిన ఘఠనే తీసుకోండి. ఒకమ్మాయి ఒకతను తనపై రేప్ చేశాడని కేసు పెట్టింది. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. నిర్భయలాంటి చట్టం, అమాయకులు కూడా కొన్ని సార్లు శిక్షింపబడానికి ఆస్కారమున్న కఠినమైన చట్టం ఉంది … అయినా కూడా ప్రజలు ఊరుకోలేదు. జైలుగోడలు బద్దలు కొట్టారు, అతన్ని నడిరోడ్డుమీదకి లాక్కొచ్చారు.. నగ్నంగా చేసి కొడుతూ, ఈడ్చుకుని వెలుతూ .. హింసించి అతి కౄరంగా చంపేశారు. ఎందుకు? They want to set an example. భవిశ్యత్తులో ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పాలని డిసైడ్ అయ్యారు. అతను దోషా, నిర్దోషా అన్నది వారికి అనవసరం. వారికి కేవలం వారి ఆదర్శమే ముఖ్యం !

dimapur_650_030615105533

ఇలా గుంపులుగా కలిసి చేసే నేరాలు ప్రజల్లో ఒక రకమైన ఫీలింగును తెస్తాయి. వాల్లకు గిల్టీ అనేది ఉండదు. గుంపుగా చేసెవాటికి గిల్టీనెస్ ఉండదు. వారు ఏదోరకంగా దారుణాన్ని సమర్ధించేసుకుంటారు. ఎంతో మందిని ఊచకోత కోసిన మతాలూ, ఇజాలూ ఇలానే సమర్ధించుకుంటాయి. దిమాపూర్ ఘఠన విషయములో కూడా అదే జరుగుతుంది. మొక్కు బడిగా ప్రభుత్వాలు కేసులు పెట్టినా, ఒక పేద్ద సమూహం దోషిగా ఉన్నటువంటి ఈలాంటి కేసుల్లో బాధితుడికి న్యాయం దొరకడం అసంభవం. వారు తమ చర్యలను ఏదో ఒక విధంగా సమర్ధించేసుకుంటారు. అదీ కాక జరిగింది “ఆడవారి” రక్షణ కోసం జరిగిన విషయమాయే ! సొసైటిలో అలాంటివాటికి ఆమోదం ఎక్కువే !!

కానీ, చింతించాల్సిందేమీ లేదు. Everything goes worse, before it’s get better. పురుష హక్కుల కార్యకర్తలు చేయాల్సింది కేవలం నిజాన్ని చెప్పుకుంటూ పోవడమే. ఎవరు విన్నా వినకపోయినా ! గుంపులు గేలిచేసినా, వ్యక్తులు విషం కక్కినా, మితృలు దూరమైనా, మోసం చేసినా, శతృవులు పైచేయి సాధించినా .. కర్మకాలి, ఈ పోరాటాల్లో జీవితమే బలి అయినా … నీ కర్తవ్యం నీది అన్నట్లుగా పోవడమే !!

ఇప్పటి వరకూ నేను రాసిన పోస్టులన్నీ ఇక్కడ చూడండి …

ఇప్పటివరకూ రాసిన అన్ని టపాలూ … 

ప్రాణం ఖరీదు – కొన్ని పాటలంతే టచ్ చేస్తాయి !


కొన్ని పాటల్లో సాహిత్యం చాలా బావుంటుంది. వాటితో నువ్వు అంగీకరించకపోవచ్చు, అంగీకరించొచ్చు కానీ అవి  కొద్దో గొప్పో మనసును స్పృసిస్తాయి ..! అలాంటి వాటిలో ఈ పాట ఒకటి ! ప్రాణం ఖరీదు సినిమాలోని పాట !!

 యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు

దేవుని గుడిలోదైనా పూరె గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే

ఆ దీపముండదు, ఆ దీపముండదు
(యాతమేసి)

పళుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా

పసుపుతాడు ముడులేస్తే ఆడదాయిరా

కుడితినీళ్లు పోసినా, అది పాలు కుడుపుతాదీ

కడుపుకోత కోసినా, అది మనిషికే జన్మ ఇత్తాది

బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుచుకో

గొడ్డు కాదు ఆడదన్న గుణం తెలుసుకో
(యాతమేసి)
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే

చీము నెత్తురులు పారే తూము ఒక్కటే

మేడమిద్దెలే వున్నా, సెట్టు నీడ తొంగున్న

నిదురముదర పడినాక పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే

కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటర

ఆకలేసి అరిచినోళ్లు కాకులంటరా  (యాతమేసి)

ఇలాంటివే మరికొన్ని

Published in: on August 5, 2016 at 9:11 pm  Leave a Comment  
Tags: ,

పుతిన్ … దేశాలను ట్రోలింగ్ (Trolling) చేస్తున్న ఘనుడు !


మనం ఇప్పటి వరకూ Trollsని ఆన్‌లైనులో చూసుంటాం. ట్విట్టరులో, ఫేసుబుక్కుల్లో, బ్లాగుల్లో … ఎక్కడబడితే అక్కడ జనాలు ఈ Trollingకి అలవాటు పడి సరదాగా వాన్ని వీన్ని కెలికి ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంటారు. ఇవన్నీ పర్సనల్ లెవెల్లోనే ఉంటాయి. లేదా ఒక సమూహం ఇంకో సమూహాన్ని ట్రోల్ చేయడం వరకూ ఉంటుంది. కానీ, ఒక దేశం వేరే దేశాలను Trolling చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ?

tip_ny_0206_04

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రస్తుతం అలాంటి పనే చేస్తున్నాడని నా ఫీలింగ్. ప్రస్తుతం మనోడు అమెరికాను, అటు యూరోపును.. ఒక రేంజులో ఆడుకుంటున్నాడు. కాసేపు హిల్లరీ క్లింటన్ ను కెలుకుతాడు. మరి కాసేపు బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీని కెలుకుతాడు. హిల్లరీ క్లింటన్ ఈ-మెయిల్స్ విషయం మొదలుకొని, డెమోక్రటిక్ పార్టి తమ సొంత అభ్యర్తే అయిన బెర్నీ సాండర్స్ ఏవిధంగా ముంచి, హిల్లరీని ఎన్నిక చేసింది అనే విషయాల వరకూ అన్నీ లీకేజుల వెనుక రష్యా హస్తం ఉందన్నది కొంత మంది ఆరోపణ. అసలు వికీలీక్సే రష్యా వాడి పేరోల్ లో పనిచేస్తోంది అనే వారున్నారు.

ఇక బ్రిటన్ విషయానికి వస్తే, డయానాను చంపించింది రాయల్ ఫ్యామిలీనే ఆధారాలున్నాయ్ అంటాడు. (కనీసం, అలా అని వార్తలు వస్తూ ఉన్నాయి). ఇంటర్నెట్‌లో పుతిన్ ట్రోలింగ్ ఆర్మీ చాలా ఎఫిషిఎంట్‌గా పనిచేస్తోందని చెప్పకతప్పదు. వాల్లు కెలకనివి అంటూ US, Europe రాజకీయాలలో ఏమీ లేవేమో అనిపిస్తుంది కొన్ని సార్లు.

ప్రస్తుతం ఈ ట్రోలింగ్ వల్ల హిల్లరీ క్లింటన్ బాగానే ఇబ్బందులు ఎదుర్కుంటొంది. ఒక వేల ఆమె కనుక అమెరికా ప్రెసిడెంట్ అయితే … పరిస్థితులు ఎలా ఉంటాయో, రష్యాతో సంబంధాలు ఎలా ఉంటాయో ఏమో !

కాకపోతే, పుతిన్ వరస చూస్తుంటే.. I don’t care అన్నట్లుగా ఉంది !!


ఇలాంటివే మరికొన్ని టపాలు …

డి.సీ కామిక్స్ – కొత్త సినిమాలండీ, కొత్త సినిమాలు !


ఇప్పటి వరకూ మనకు ఎక్కువగ మార్వెల్ కామిక్సే సినిమాలుగా వచ్చాయి. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, యాంట్ మ్యాన్ లాగ. దానికితోడు, ఈ క్యారక్టర్లతో కొత్త ఊహా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ.. “మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో” జరిగే కథలతో “అవెంజర్ 1 & 2”, క్యాప్టెన్ అమెరికా, థోర్ వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఎక్స్ -మ్యాన్ సిరీస్ ఉండనే ఉంది.

ఇప్పుడు డి.సీ కామిక్స్ వంతు. డి.సీ కామిక్సులో ఫేమస్ సూపర్ హీరొ “సూపర్ మ్యాన్” అతని తరువాత “బ్యాట్ మ్యాన్” అతని తరువాత “వండర్ ఉమన్”. ప్రస్తుతం వండర్ ఉమన్ ట్రైలర్ రిలీజ్ అయింది. దానితో పాటే.. “డి.సీ ఎక్స్‌టెండెడ్ యూనివర్స్” అనే ఊహా ప్రపంచములో జరిగే కథలతో కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే మీరు బ్యాట్‌మ్యాన్ vs సూపర్ మ్యాన్ సినిమా చూసే ఉంటారు. దానికి సీక్వెలుగా వచ్చేది, “జస్టిస్ లీగ్”. ఇది కాక “సూసైడ్ స్క్వాడ్” అనే మరో సినిమా కూడా ఈ సంవత్సరమేరిలీజ్ అవబోతోంది. ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబందం ఉన్న సినిమాలన్న మాట.

సుదూర ప్రపంచమునుండి కొన్ని శక్తులు భూమి మీద దాడిచేయడానికి ప్రయత్నిస్తున్నాయని తెలుసుకున్న బ్యాట్‌మ్యాన్ ఒక టీమును ఏర్పరచి భూమిని రక్షించడానికి ప్రయత్నిస్తాడన్న మాట. ఈ ట్రైలెరులో అదే చూపిస్తున్నాడు. ఆ జస్టిలీగ్ ట్రైలర్ చూడండి …

ఇక “వండర్ ఉమన్”. స్త్రీ ప్రధాన పాత్రగా వచ్చే సినిమాలు అంటే, వాటిలో స్త్రీలను మగవారు కౄరంగా అతి దారుణంగా హింసిస్తూ ఉంటే … చీమకు కూడా హాని తలపెట్టని హీరోయిన్ కన్నీళ్ళతో భరించి, సెకండ్ హాఫ్‌లో పగతో … ప్రతీకారం తీర్చుకుని.. చివరగా సినిమా ముగిసేప్పుడు ఉదయిస్తున్న సూర్యునివైపు నడుచుకుంటు వెలుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా స్త్రీవాదులు, ఎర్రబాబులు అందరూ పనిగట్టుకుని మన నెత్తిన రుద్దిన భీభత్సమైన ఫార్ములా ఇది.

బేసిగ్గా ఇలాంటి వాటిని చూసి చూసి విసిగొచ్చిన జనాలకు “వండర్ ఉమన్” లాంటి సినిమాలు కాస్త ఊరట అని నా ఫీలింగ్. స్త్రీ ప్రధాన పాత్ర ఉన్న సినిమాకి వెల్లి కూడా.. పురుషాహంకార, స్త్రీల అణచివేత వంటి తీవ్ర్రమైన పదజాలాలతో తలంటించుకోవాల్సిన పనిలేకుండా హాయిగా చూడదగ్గ సినిమాలలో ఇదొకటి అవుతుందని అవుతుందని ఆశిస్తున్నా ప్రస్తుతానికి ! ఆ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి …

ఇక మూడవది “సూసైడ్ స్క్వాడ్”. ఇది కూడా “డి.సీ ఎక్ష్‌టెండెడ్ యూనివర్స్”లో జరిగే కథతో తీసిందే. కొంత మంది చావడానికి రెడీగా ఉండే “బ్యాడ్ పీపుల్” ఒక టీముగా ఏర్పడి మనల్ని ఎలా ప్రమాదాలనుండి కాపాడాతారు అనేది థీము. ఇందులో “విల్ స్మిత్” ఒకానొక సూపర్ బ్యాడ్ మ్యాన్‌గా నటించడం విశేశం. దాని ట్రైలర్ ఇక్కడ చూడండి…

ఈ సినిమాలు ఎంత మందికి నచ్చుతాయో నాకు తెలీదు కానీ, నాకు మాత్రం ఇలాంటి సినిమాలంటే పిచ్చి అన్న మాట. Waiting for them 🙂

ఇలాంటివే మరికొన్ని టపాలు …

బ్లాక్ డే ! దళితులపై నరమేధానికి 30 యేల్లు !


ఒక సంవత్సరం క్రితం కారం చేడు పైశాచికత్వానికి నిరసనగా వేసిన పోస్టు. ఆ ఘోరం జరిగి ఇప్పటికి 31 యేల్లు.. ఆ పాత పోస్టునే రీషేర్ చేస్తున్నా !!

350 కుటుంబాలు, అంతా కలిపినా 1500 లేదా 2000 జనాభాకు మించని మాదిగ పల్లె పై వేలమంది కర్రలు, బరిశెలు, గొడ్డల్లతో చేసిన దాడి.

దీని గురించి కత్తి పద్మారావ్‌గారు రాసిన ఆర్టికల్ ఒకటి.
history-of-karamchedu-and-what-actually-happened ?  

పౌర హక్కుల సంఘాలవారు ఇచ్చిన రిపోర్టు. 
Andhra Pradesh Civil Liberties Committee Report

హిందూ మతంపై జకీర్ నాయక్, అతని శిష్యుల హాస్యాస్పద దాడి !


Update: బంగ్లాదేశ్‌లో జరిగిన తీవ్రవాద దాడుల తరువాత ఒక పేరు బయటకి వచింది. అదే “జకీర్ నాయిక్”.  అతను టెర్రరిస్టులను ప్రోత్సహించే విధంగా ప్రసంగాలు చేశాడని కొంత మంది, కాదని కొంత మంది అంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, అతని మీద అనుమానం ఉన్నట్టు మేము చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ, జకీర్ నాయక్ ప్రసంగాలు అతివాదానికి దగ్గరగానే ఉంటున్నాయి.

ఇతర మతాలను నిందించడం, వారిని తప్పులు పట్టడం, ఇస్లాములో కూడా కాస్త భిన్న అభిప్రాయాలు ఉన్నవారిని ముస్లిములు కాదనడం వంటివి ఆయన ప్రసంగాలలో మనం చూడొచ్చు. ప్రస్తుతం NIA జకీర్ నాయక్ ప్రసంగాల పరిశీలిస్తోంది. ప్రభుత్వం కూడా సీరియసుగానే తీసుకుంటోంది. ఆయన నడుపుతున్న “పీస్ టీవీ”కి ఇండియాలో అనుమతులు లేవని, దాన్ని ప్రసారం చేయడం నేరమని తేల్చింది.

ఇది వరకు నేను జకీర్ నాయక్ మీద రాసిన రెండు ఆర్టీల్లు మళ్ళీ  ప్రచురిస్తున్నాను చూడండి !!


Posted on July 12, 2015 at 9:22 am

ప్రస్తుతం మనం బ్లాగులో ఒక వింత వాదనను చూస్తున్నాం. హిందూ మతములో అసలు విగ్రహారాధనేలేదని, బహుదేవతారాధన మహాపాపమని, ఇంకొంచెం ముందుకు వెల్లి అది ఆధ్యాత్మిక వ్యభిచారమనీ తేల్చేస్తున్నారు. దానికి వారు చూపిస్తున్న సాక్షాలు కూడా వేదాలు, అందులోని ఉపనిషత్తులూ, భగవద్గీతనే. అఫ్ కోర్స్, అవన్నీ కేవలం వక్రీకరణలూ, అర్థసత్యాలేలెండి.

అసలు వీరి ముఖ్య ఉద్దేశ్యమేమిటి? ఎందుకు ప్రస్తుతం వీరు హిందూ మతములో కేవలం ఏకేశ్వరోపాసన మాత్రమే ఉందనీ, విగ్రహారాధన పూర్తిగా నిషిద్దమనీ ప్రచారం చేస్తున్నారు ? దీనికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. వారి ముఖ్య ఉద్దేశ్యమేదో మనం సులువుగానే చెప్పేయొచ్చు. తమ మతమే గొప్పదనీ అన్ని మతాలవారూ అనుకుంటారు. అలానే వీరూ అనుకుంటున్నారు. కాకపోతే కొన్ని మతాల వారు ఇతర మతాలలోని వారిని మత మార్పిడుల ద్వారా తమ మతములోనికి చేర్చుకోవాలని అనుకుంటారు. మరికొందరు అవేమీ పట్టించుకోకుండా వదిలేస్తారు. భారత దేశం అనేది మత మార్పిల్లకు ఎప్పటునుండో వేదికగా మారింది.

ఈ మతమార్పిడికి ఒక్కోక్కరు ఒక్కోపద్దతిని ఎంచుకుంటూ ఉంటారు. కొంత మంది, హిందూ దేవుళ్ళు మహిమలేని వారనీ, వారు దెయ్యాలనీ, వారు ఇతరులను చంపమని బోధిస్తారనీ, దేవాయలయాల మీద కూడా ఈతరహా శిల్పాలే ఉంటాయని, తమ దేవుడు మాత్రమే ప్రేమను పంచే దేవుడని, ప్రజలందరికోసం ఆయన రక్తాన్ని చిందించాడనీ, మనందరి కోసం కూడా ఆయన రక్తాన్ని ఇదివరకే చిందించాడనీ భరోసా ఇచ్చేస్తూ, తమ మతములోని రమ్మని ఆహ్వానించడం చూడొచ్చు. మరికొంత మంది అయితే ఎవరికైనా కళ్ళూ, కాళ్ళూ పోయుంటే వారిని, స్టేజి మీదకి రప్పించేసి, వ్యాధులేమన్నా ఉంటే నయం చేసి పంపేస్తూ ఉంటారు. ఆపని వారు ఎలా చేస్తారు అని తెలుసుకోలేనంత అమాయకులు ఇక్కడ ఎవరూలేరనుకోండి. కాకపోతే అదొక పద్దతి. ఇలా ఎవరి పద్దతులు వారికుంటాయి.

ఇప్పుడు నేను చెబుతున్న పద్దతి పాటించేవారు చేసేదేమంటే, దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయన మనందరికీ దేవుడు, మన పవిత్ర గ్రంధాలన్నీ ఇవే విషయాన్నే చెప్పాయి అని చెబుతారు. నిజానికి ఇందులో వ్యతిరేకించాల్సింది ఏమీలేదు. దేవుడు ఎవ్వరికైనా ఒక్కడే అంటే ఎలా తప్పు పట్టగలం చెప్పండి? కానీ, అక్కడితో ఆగరుగా వీరు. దేవుడు ఒక్కడే, ఆయనకు రూపం లేదు కావాలంటే మీ వేదాలలో కూడా ఇదే చెప్పబడి ఉంది అని చెబుతారు. అంతటితో ఆగక, ఆ సిద్దాంతాన్ని బేస్‌గా చేసుకుని, మనం దేవుడు అనుకుంటున్న కృష్ణుడు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు గట్రా దేవతలంతా నిజానికి దేవుళ్ళు కాదని, వారిని ఆరాధించడం ఆధ్యాత్మిక వ్యభిచారమనీ తేల్చేస్తారు. ఎందుకంటే, దేవునికి రూపంలేదు అని వేదాలు చెప్పాయి (అని వీరు చెబుతున్నారు). మరి ఈ దేవుల్లందరికీ ఏదో ఒక రూపం ఉంది. కాబట్టి వీళ్ళు దేవుళ్ళు కాదనీ, మహా అయితే దేవుడు పంపిన దూతలయ్యుండొచ్చనేది వీరి బ్రహ్మాండమైన థియరీ.

ఇక్కడ విషయం ఏమిటంటే, వీరి మతం, ఇస్లాం ప్రకారం కూడా దేవుడు ఒక్కడే. విగ్రహారాధన నిషిద్దం. వారి మతం ప్రకారం దేవుడు ఇదివరకు ఎంతో మంది ప్రవక్తలను పంపించి ఉన్నాడు. వారిలో మహమ్మద్ ప్రవక్త చివరి వాడు. ఆయన తరువాత ఇంకెవరూ రాలేదు. అలానే దేవుడు అనేక గ్రంధాలను ఇచ్చియున్నాడు. ఖురాన్ చివరిది (ఈ విషయం నేను అనుకుంటున్నది. ఖురానులో అలా ఉందో లేదో నాకు ప్రస్తుతం అయితే తెలీదు). మన వేదాలలో, ఆమాటకొస్తే అన్ని పవిత్ర గ్రంధాలలో దేవుడుగా చెప్పబడుతున్న “నిరాకార శక్తి” అల్లాహ్ నే. ఈపుస్తకాలన్నీ అల్లాహ్ గురించే వివరించాయి అని ఖురానులోని సూక్తులూ, బైబిలులోని సూక్తులూ, భగవద్గీత, వేదాలలోని సూక్తులూ ఒకచోట చేర్చి అందంగా, ప్రేమగా విశదీకరికరిస్తారు … ఏమని విశదీకరిస్తారంటే, దేవుడు అల్లాహ్ మాత్రమేనని, దేవుళ్ళు అని మనం అనుకుంటున్న వారంతా కేవలం అల్లాహ్ దూతలు మాత్రమేనని.

ఈ గొప్ప ఫిలాసఫీలో భాగంగానే, మొదటగా వీరు హిందూ మతమూ, ఇస్లామూ, క్రిష్టియానిటీ ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయనీ, గీత బైబిలు ఖురానూ అన్నీ మన ఉమ్మడి గ్రంధాలనీ ప్రేమను కురిపిస్తారు. కానీ, ఆయా పవిత్ర గ్రంధాల ప్రకారం మనం నిరాకారుడైన దేవుడిని మాత్రమే ఆరాధించాలని మనకు తెలియజేస్తారు. అలా ఆరాధించకపోతే, అది ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుందని నిందలు కూడా వేస్తారు. నరకానికీ, చీకట్లలోకి ఎక్కడికెక్కడికో పోతారని తెలియజేస్తారు. శ్రీ కృష్ణుడూ, రాముడూ, శివుడు, వినాయకుడు వీల్లంతా దేవుల్లు కాదనీ, వారిని పూజించాల్సిన అవసరం లేదనీ, నిరాకార బ్రహ్మన్‌ను మాత్రమే పూజించాలనీ “మన మత గ్రంధాల ప్రకారమే” ప్రూవ్‌చేసి, మనల్ని ప్రేమతో అంగీకరింపజేస్తారన్న మాట.

తరువాత, మా దేవుడు, మీదేవుడూ ఒక్కడే, మీ గ్రంధాలన్నీ పాత గ్రంధాలు, కొత్త నిబంధనలతో దేవుడు పంపించిన మా పవిత్ర గ్రంధం ప్రకారం మీరుకూడా నడుచుకోండి అని మనకు సేం టు సేం ప్రేమను కంటిన్యూ చేస్తూ తెలియపరచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, వీరు మన మీద బోలెడంత ప్రేమ కురిపిస్తారు. కానీ, ఆ ప్రేమ మన ఆచారాల్నీ, పద్దతులనీ గౌరవించడానికి కాదు, వాటిని వదిలేసి వారి మత గ్రంధాల ప్రకారం, ప్రోఫెట్ చెప్పినదాని ప్రకారం మనం నడుచుకునేలా చేయడానికి మాత్రమే అని నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా !

ఈ తరహా బోధనలు, ఉపన్యాసాలూ ఇవ్వడములో జకీర్ నాయక్ అనే ధార్మిక గురువు బాగా పేరుగడించాడు. తన అర్ధ ఙ్ఞాణముతో, స్ట్రీట్ స్మార్ట్ యాటిట్యూడుతో, భగవద్గీత, వేదాలలోని శ్లోకాలను వక్రీకరించడమో లేదా సగం శ్లోకాలను మాత్రమే తీసుకుని వచ్చి తన ఎజెండాను ప్రచారం చేయడములోను బాగా పేరుగడించాడు. కొంత మంది ఆయనతో చర్చకు దిగగానే ఆయన వారిని మాట్లాడనివ్వడు. తానే అన్నీ మాట్లాడేస్తాడు, ఇంతలోనే పక్కలో ఉన్న నిర్వాహకులు లేదా వాలంటీర్లు చర్చిద్దామని చూసిన వ్యక్తిని పక్కకు తీసుకొని వెలతారు. జకీర్ నాయక్ వేదాలలోనుండి, భగవద్గీతనుండి కోట్ చేసిన అనేక శ్లోకాలను, అంతర్జాలములో చూడొచ్చు. వాటికి కౌంటరుగా అనేక మంది, జకీర్ నాయక్ కోట్ చేసిన శ్లోకాలన్నీ  ఉద్దేశపూర్వకముగా వక్రించినవేనని నిరూపించడం కూడా మనం చూడొచ్చు.

జకీర్ నాయక్‌ను, ఒకానొక అమ్మాయి ప్రశ్నిస్తే ఆయన చిరాకు పడ్డాడో చూడండి. ఆయన భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చూపించి అది బహుదేవతారాధనా, విగ్రహారాధనను చేయవద్దని చెబుతోందని చెబుతున్నాడు. నిజానికి ఆశ్లోకం అర్థం అది కానేకాదు. ఈ విడియో చూడండి .. మీకే తెలుస్తుంది.

ప్రశ్న అడిగిన అమ్మాయి ఎంతో వినయంగా, సంస్కారవంతంగా అడిగితే ఈయన మహా చిరాకుకా, అహంకార ధోరణిలో సమాధానం ఇవ్వడం చూడొచ్చు. ఈ విడియోలోనే, జకీర్ నాయక్ కోట్ చేసిన శ్లోకాల అర్థం వివరించడం జరిగింది. ఒక సారి వీడియో చూడండి.  అదీ కాక భగవద్గీతలోనే “నిరాకార భ్రహ్మన్”ను కొలవడం కష్టమని, దానికి బదులు తననే కొలమని సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెబుతాడు. మరి ఈయనకి ఆ శ్లోకం కనిపించలేదా? స్ట్రీట్ స్మార్ట్ యాటిట్యూడ్‌ను ప్రదర్శించి, ఏదో ఒక శ్లోకాన్ని ర్యాండముగా తీసుకుని, దాని అర్థాన్ని వక్రీకరించో, ఆ శ్లోకాన్ని వాడిన కాంటెక్స్‌ట్‌ను వదిలేసి తనకు అనుకూలమైన రీతిలో దాన్ని ఉపయోగించుకొని, తానో మేధావినని ఆయన ఇతరులను భ్రమింపజేస్తూ ఉంటాడు.ఆ భగవద్గీత శ్లోకాల గురించి నేను రాసిన పోస్టు చదవండి.

భగవద్గీతలో “విగ్రహారాధన” మేలని చెప్పడం జరిగిందా !? వేదాల ప్రకారం దేవునికి రూపం ఉందా !?

ఇంతేకాదు, ఈయన గురించి NDTV వార్తలలో కూడా చెప్పడం జరిగింది. అనేక మంది ముస్లిం స్కాలర్లు కూడా ఈయన చెప్పే విషయాల్ని విభేదించారు. కొంత మంది ఈయనకు వ్యతిరేకంతా “ఫత్వా” కూడా జారీ చేశారు.

శ్రీ జకీర్ నాయక్‌గారు ఒసామా బిన్ లాడెన్ అభిమానికూడా అనిచెప్పొచ్చు. ఆయన ప్రకారం ఒసామా బిన్ లాడెన్, ఇస్లాం శతృవులపై పోరాడుతున్నాడు. అవసరమైతే ప్రతీ ముస్లిం ఒసామా బిన్ లాడెన్‌లా మారాలని ప్రవచిస్తున్నారు. చాలా మంది సెక్యులరిస్టులు కూడా ఇతన్ని వ్యతిరేకించారు. వారు చెప్పేదేమిటంటే, హిందూత్వ అతివాదులు ఏవిధంగా ప్రమాధకరమైన వారో, జకీర్ నాయక్ కూడా అటువంటీ వాడేనని ఒకావిడ ఆ ప్రోగ్రాములోనే చెప్పడం మనం గమనించవచ్చు. NDTVలో వచ్చిన ఆ ప్రోగ్రం ఇక్కడ చూడండి.

కాకపోతే, ఇంటర్నెట్లో ఈయన శిశ్యులు చాలామందే ఉన్నారు. ఈయన అడుగుజాడలలోనే ఆయన శిశ్యులు చాలా మంది నడుస్తున్నారు. ఏ ఆన్‌లైన్ ఫోరముకు వెల్లినా వాల్లు ప్రత్యక్షమై జకీర్ నాయక్ కోట్ చేసిన కొన్ని అర్ధ “శ్లోకాలని” కోట్ చేసి, హిందూ మతం బహుదేవతారాధననూ, విగ్రహారాధననూ నిషేధిచిందని నిరూపించడానికి నానా ప్రయాసా పడుతూ ఉంటారు.

ఇంకో విషయం, జకీర నాయక్ గారి వచనాల ప్రకారం హిందూ – ముస్లిముల మధ్య ఐక్యత రావాలంటే, హిందువులు బహుదేవతారాధనను వదిలేయాలి, విగ్రహారాధనను వదిలేయాలి. అప్పుడు వారు ఎంతో ప్రేమతో హిందువులను దగ్గరకి తీసుకుంటారు. అఫ్ కోర్స్, దాని తరువాత హిందువులు అల్లాహ్‌ను దేవుడు అని అంగీకరించాలేమో !ఈ తరహా కండీషన్లతో కూడిన ప్రేమ మనకు అవసరమా ? ఈ తరహా కండీషన్లతో కూడిన సఖ్యత అవసరమా ? వీరు సఖ్యతగా, ప్రేమగా ఉండాలంటే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, నిజానికి వీరు తెలిచిన తలుపునే పదే పదే తడుతున్నారు. కానీ, ఆ ద్వారం నుండి వీరు లోపలికి రావాలంటే మాత్రం మా సాంప్రదాయాలనూ, మా ఆచారాలనూ, మా విధానాలను గౌరవించాల్సి ఉంటుంది. వీరు పాటించక్కర్లేదు, గౌరవిస్తే చాలు, అలానే మేము కూడా వారి విధానాలనూ గౌరవిస్తాం, పాటించము. మనుషులుగా మనం ఈ మాత్రం మెచ్యూరిటీ సాధించాల్సిందే.

పోనీ, హిందువులు వారు చెప్పినవిధంగానే ఏకేస్వరోపాసన చేస్తూ, విగ్రహారాధనను ఖండిస్తే, ఐక్యత ఉంటుందా? లేదు. ఎందుకంటే, ముస్లిములలోనే ఐక్యతలేదు. ఇరాక్ – ఇరాన్, పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ ఇలా ప్రపంచములో అనేక చోట్ల ముస్లిములు ముస్లిములే కొట్టుకుంటు ఉంటారు. దేవుడు ఒక్కడే, పవిత్ర గ్రంధం ఒక్కటే అయినా ఐక్యతలేదు. మరి ఇప్పుడు హిందువులు తమ విధానం మార్చుకుంటే మాత్రం ఐక్యత వస్తుందా? మనిషి ఎదగనంతవరకూ ఐక్యత రాదు. ఐక్యతకు కావలసింది అందరూ ఒకే విధానాన్నీ, మతాన్నీ పాటించడం కాదు, వివిధ విధానాల పట్ల, మతాల పట్లా సహనం. అదే ఐక్యతను తెస్తుంది. అదిలేనంతవరకూ ఐక్యత రాదు.

ఇండియాలో ఇస్లామిక్ యుద్దాలు : సూఫీ Vs వహాబి, ఖాద్రీ Vs జకీర్ నాయిక్


Update: బంగ్లాదేశ్‌లో జరిగిన తీవ్రవాద దాడుల తరువాత ఒక పేరు బయటకి వచింది. అదే “జకీర్ నాయిక్”.  అతను టెర్రరిస్టులను ప్రోత్సహించే విధంగా ప్రసంగాలు చేశాడని కొంత మంది, కాదని కొంత మంది అంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, అతని మీద అనుమానం ఉన్నట్టు మేము చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ, జకీర్ నాయక్ ప్రసంగాలు అతివాదానికి దగ్గరగానే ఉంటున్నాయి.

ఇతర మతాలను నిందించడం, వారిని తప్పులు పట్టడం, ఇస్లాములో కూడా కాస్త భిన్న అభిప్రాయాలు ఉన్నవారిని ముస్లిములు కాదనడం వంటివి ఆయన ప్రసంగాలలో మనం చూడొచ్చు. ప్రస్తుతం NIA జకీర్ నాయక్ ప్రసంగాల పరిశీలిస్తోంది. ప్రభుత్వం కూడా సీరియసుగానే తీసుకుంటోంది. ఆయన నడుపుతున్న “పీస్ టీవీ”కి ఇండియాలో అనుమతులు లేవని, దాన్ని ప్రసారం చేయడం నేరమని తేల్చింది.

ఇది వరకు నేను జకీర్ నాయక్ మీద రాసిన రెండు ఆర్టీల్లు మళ్ళీ  ప్రచురిస్తున్నాను చూడండి !!


Posted on July 23, 2015 at 9:35 am

(జకీర్ నాయక్ అతని అనుయాయుల ప్రచారాలు మీడియాను బాగానే ఆకర్షిస్తున్నాయి. మొన్న టైంస్ ఆఫ్ ఇండియా పేపరు చదువుతూ ఉంటే కనపడింది ఈ ఆర్టికల్. దానికి నా స్వేచ్ఛానువాదం, ఇందులో కొంత నా విశ్లేషననూ కూడా జోడించాను.)

ప్రస్తుతం అంతర్జాలములో ఇస్లామిక్ యుద్దాలు బాగానే జరుగుతున్నాయి. టెక్నాలజీ అభివృద్ది చెందేకొద్దీ ఈ యుద్దాలు బాగా ముదురుతున్నాయి కూడా. ప్రస్తుతం ఇండియాలోని ముస్లిముల మధ్య అంతర్జాలములో విచిత్రమైన పోరు ఒకటి సాగుతోంది. అదే సూఫీ Vs వహాబీ పోరు.

ఈ రెండు సిద్దాంతాలకూ ఫేసుబుక్కులో గ్రూపులు, పేజీలు, అనేక మంది ఫాలోయర్లూ ఉన్నారు. వహాబీల రిప్రెజెంటేటివుగా జకీయ నాయిక్ వ్యవహరిస్తూంటే, సూఫీల రిప్రెజెంటేటివుగా తాహిర్ ఉల్ ఖాద్రీ వ్యవ్యహరిస్తున్నారు. వీరిద్దరు చెప్పే అంశాల మీద, వీడియోల మీద వందల కొలది కామెంట్లు ఉంటాయి. సమర్ధిస్తూ కొంత మంది, వ్యతిరేకిస్తూ మరి కొంత మంది ! ఈ ఇద్దరు గురువులకీ అంతర్జాలములో, నిజ జీవితములో అనేక మంది ఫాలోయర్లు ఉన్నారు. వీరిని అనుసరించే వారి మధ్య విభేదాలు, ఒకరినొకరు తమ పక్క సిద్దాంతం వారిని “కాఫిర్” అని పిలుచుకునే స్థాయిలో ఉన్నాయి.

వీరికి (వహాబీలకు) నిధులు సౌదీ నుండి అందుతున్నాయని తెలుస్తోంది.

వికీలీక్స్, బహిర్గత పరిచిన వివరాల ప్రకారం సౌదీ ఆయిల్ డాలర్లు, ఇండియాలో వహాబీ, సలాఫి భావజాలాన్ని ప్రోత్సహించడానికి విరివిగా అందుతున్నాయి.

హైదరాబాదును తీసుకుంటే 35% జనాభా ముస్లిములే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ మాజీ  సభ్యుడి ప్రకారం, భారత దేశం సూఫీ తత్వానికి పెట్టింది పేరు. సూఫీ తత్వం ప్రేమనూ, సహనాన్నీ బోధిస్తుంది. (కనీసం వహాబీ ఇజముతో పోలిస్తే, ర్యాడికల్ కాదు).

కానీ, సౌదీల సిద్దాంతం (వహాబీ ఇజం) ప్యూరిటీ కోసం తపించే అతివాద భావజాలమని చెప్పొచ్చు. మనకు హిందూ అతివాదులు ఎలా ఉన్నారో, వీరిలో వహాబీలు అలాంటివారు. దీని వలన భారత దేశములోని ముస్లిం సొసైటీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

వహాబి ఇజం, ముస్లిములను పూర్తిగా అతివాద మార్గాన్నఎంచుకోమంటుంది. కానీ సూఫీ ఇజం మాత్రం, ఇస్లామిక్ గురువులు (Saints) చెప్పినవి కుడా పరిగణలోనికి తీసుకోవాలంటుంది. కొన్ని మజీదులు కూడా ఈ రెండు భావజాలాలలో ఏదో ఒకదాన్ని నమ్ముకొని ఉంటాయి. అబిడ్స్‌లో ఉన్న ఒక మజీదు, పురానీ హవేలీలో ఉన్న మరో మజీదు వేరు వేరు భావజాలాన్ని ఫాలో అవుతున్నాయి. ఈ మజీదుల మధ్య ఆధిపత్య పోరుకూడా ఉంటుంది. ఎవరు జనాలను బాగా ఆకర్శించగలరు ఊనేదాని మీద.

హైదరాబాద్ సిటీలో వహాబీ ఇజం తన ఉనికిని బాగానే చాటుకుంటోంది. అరబిక్ పదమైన రమాదాన్, అల్లాహఫీజ్ బాగా పాపులరవుతున్నాయి. ఉర్దూ పదాలైన రంజాన్, ఖుదాహఫీజ్ వంటి పదాలు వాడకం క్రమేపీ తగ్గుతోంది. దీన్ని కొంత మంది తప్పు పడుతున్నారు. ఇండియాలో ఇస్లాం అరబ్బులకన్నా, పర్షియన్లకు (ఇరాన్) దగ్గరగా ఉంటుంది అని వీరి భావన.

వహాబీ ఇజాన్ని సమర్ధించేవారి మాట మరోలా ఉంది. వహాబీ ఇజం శాంతినీ, సహనాన్ని పెంపొదింప జేసేది అని వారు వాదిస్తున్నారు. అంతే కాక, పాశ్చాత్య మీడియా తమని వక్రికరిస్తోంది అని కూడా చెబుతున్నారు. సౌదీ నుండి భారత్‌కు ఎంత డబ్బు వచ్చింది చెప్పడం కష్టమే అయినా, ఈ వహాబీ ఇజాన్ని పెంపొందించడానికి దాదాపుగా మిలియన్ డాలర్లు వచ్చాయని ఒక అసోసియేషన్ చెబుతోంది.

కాకపోతే మరికొందరు ఏమంటున్నారంటే, ఈ వహాబీ ఇజం అనేది, సౌదీలొ పనిచేసి వచ్చిన వారి ద్వారా వ్యాప్తి చెందుతోంది అని. మజీదులకీ, మదర్సాలకు నిధులు రావడం బాగా తగ్గిందని, ఇప్పుడు కేవలం విధ్య, హెల్త్ కేర్ వంటి వాటికే అధికంగా నిధులు వస్తున్నాయనీ అంటున్నారు. వహాబీ ఇజములో అతివాదం  ఏమీ లేదనీ, ఇది కేవలం దేవునికీ భక్తునికీ మధ్య మరో మనిషి ఉండకూడదు అనే ఫిలాసఫీని ఫాలో అవుతుందనీ చెబుతున్నారు.

విశేషమేమిటంటే, సూఫీ శాఖను నమ్మేవారు ఈ వహాబీ ఇజాన్ని పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెలుతున్నారు. ఇది వహాబీలకు అంతగా రుచించడం లేదు. భారతీయ ముస్లిములు తమ సమస్యలు తామే పరిష్కరించుకోగలరని వారికి మధ్యవర్తుల సహాయం అవసరం లేదనీ చెబుతున్నారు.

టైంస్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆ ఆర్టికల్ చూడాలనుకుంటే ఇక్కడ చూడండి.

Wahabi versus Sufi: social media debates
Link : http://timesofindia.indiatimes.com/home/sunday-times/deep-focus/Wahabi-versus-Sufi-social-media-debates/articleshow/48128165.cms

సింపులుగా చెప్పాలంటే, ఈ వహాబీ ఇజం, సలాఫీ ఇజం అనేవి అతివాద భావాలు. సూఫీ ఇజం కాస్త లిబరలుగా ఉండే భావజాలం.

ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్స్, ప్రస్తుతం ఇరాక్, సిరియాలలో అరాచకాలు సృష్టిస్తున్న ISIS or ISIL ఇవన్నీ ఈ వహాబీ ఇజాన్ని ఫాలో అవుతున్నవే. 

కొంత మంది ఈ వహాబీ ఇజం అనే పదాన్ని అంగీకరించరు. వారు దీనికి సలాఫీ ఇజం అని పిలుచుకుంటారు. ఈ వహాబీ ఇజనికీ, సలాఫీ ఇజానికీ కొన్ని తేడాలు ఉన్నాట్లున్నాయి. కానీ, రెండు ప్యూరిటీ కోసం పరితపించే అతివాద భావజాలాలే.

Wahhabism
Link : https://en.wikipedia.org/wiki/Wahhabism

ఈ వహాబీ ఇజం గురించి ఒక సారి రాం జెట్మలాని చెప్పిన మాటలు ఇవి.  

Mr. Jethmalani, who is president of the All-India Senior Advocates Association, said:

“Unfortunately in the 17th century, they produced an evil man in Saudi Arabia by the name of Wahab, who was concerned about the decline of the Muslim world, but he hit upon a wrong remedy.”

He alleged that the Wahabi terrorism instilled rubbish in the minds of young people to carry out terrorist attacks. When he said

“India had friendly relations with a country that supported Wahabi terrorism,”

Saudi Arabia’s Ambassador Faisal-al-Trad was seen walking out of the conference held at Vigyan Bhavan.

Jethmalani’s remarks on Wahabism prompt Saudi envoy to walk out of meet

Link: http://www.thehindu.com/news/national/jethmalanis-remarks-on-wahabism-prompt-saudi-envoy-to-walk-out-of-meet/article52666.ece .

జెఠ్మలానీ ఈ మాటలు అన్న తరువాత సౌదీ అంబాసిడర్ ఆ పరిసరాలని వీడి వెల్లిపోయారు. తరువాత వీరప్ప మొయిలీ, ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని భారత ప్రభుత్వం మాటలు కావని వివరణ ఇచ్చిన తరువాత తిరిగి వచ్చాడు.

ఇక మన బ్లాగుల్లోకి వద్దాం .మన మితృలు కొంత మంది, దేవునికీ, భక్తునికీ మధ్య ఇంకెవరూ ఉండకూడదు  చెబుతున్నారు. తప్పేమీ కాదు. ఎవరి ఇష్టం వారిది. కానీ, వీరు దర్గాలను, ఉర్సులనూ వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మాత్రం నేను ఆమోదించను.

దర్గా అనేది సూఫీ శాఖ వారికి ఎంతో ముఖ్యమైనది. అజ్మీర్ దర్గా, కడప దర్గా, నిజాముద్దీన్ దర్గా ఇవన్నీ పవిత్ర ప్రదేశాలు. భారత దేశములో ఉన్నంత వరకూ వాటిని వ్యతిరేకించే అధికారం ఎవరికీలేదు. అది వహాబీలకు అయినా సరే, సలాఫీలకు అయినా సరే.

నిజానికి దర్గాలకు వెల్లడం అనేది ముహమ్మద్ చెప్పిన హడిత్‌ల ప్రకారం సమ్మతమే. కొంత మంది దీన్ని ఒప్పుకోవడం లేదు అంతే.

సున్నీల ప్రకారం:

  • The person who performs Hajj and then visits my tomb, will be regarded as though he had seen me in my worldly life.
  • I had prohibited visiting graves for you. From now on you can visit graves.

సో, ప్రవక్త కొన్ని హడిత్‌లలో, సమాధులను సందర్షించవచ్చని చెప్పడం జరిగింది.

షియాల ప్రకారం కూడా సమాధులను సందర్శించడం తప్పు కాదు.

కానీ వహాబీ ఇజం మాత్రం ఖురాన్ సూక్తులు, హడిత్‌ల ఆధారంగా అది తప్పని చెబుతుంది.

  • If you join others in worship with Allaah, (then) surely (all) your deeds will be in vain, and you will certainly be among the losers.
  • The most evil of mankind are those who will be alive when the Last Day arrives and those who take graves as places of worship.

Validity of Dargah in Islam
Link: https://en.wikipedia.org/wiki/Dargah#Validity_of_Dargahs_in_Islam

ఏదేమైనా, మన ముస్లిం మితృలు, ఈ అతివాద వహాబీ ఇజాన్ని వదులుకుని, ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించి, దర్గాలకు వెల్లడం తప్పు అని చెప్పడం మానుకుంటే బావుంటుంది. సూఫీ శాఖలోని వారికి, వారికి నచ్చినట్లుగా ప్రార్థనలు చేసుకునే హక్కుంది. దాన్ని కాదనే హక్కే మనకు లేదు.

ఇవే కాకుండా, హిందువులనూ, క్రిష్టియన్లనూ దేవాలయాలకు వెల్లొద్దు అని చెప్పడం మానండి. మా శాస్త్రాలలో దేవాలయానికి వెల్లడం నిషిద్దం  కాదు. కాబట్టీ మాకు వెల్లే హక్కుంది, ధర్మ శాస్త్రాల పరంగా మరియు భారతీయ చట్టాల పరంగానూ, ఆవిషయం మరిచిపోకండి.

ఫాదర్స్ డే – కొన్ని చిత్రాలు, ఒక విడియో, – ఒక గొడవ !!


Update: ఫాదర్స్ డే సందర్భంగా పాత టపానే మళ్ళీ ఒక సారి !  అన్నట్టు, ఈ టపాలో ప్రస్తావించిన గొడవలో ఎలాంటి మార్పూలేదు. ఆ రచ్చ అలా కొన సాగుతూనే ఉంది. సో, ఈ పోస్టు ఈరోజు కూడా  అర్థవంతమైనదే !


Happy Father’s Day to All.

ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని మంచి కొటేషన్లు,  ఫొటోలు, విడియోలు చూశాను.  అలానె ఒక గొడవ కూడా చూశాను. ముందుగా ఆ మంచి చిత్రాలు, విడియోలూ మీకోసం.

హృదయానికి హత్తుకొనే ఒక విడియో

ఇప్పుడు గొడవకు వద్దాం.

ఏంజెల్ సాఫ్ట్ అనే కంపెనీ, ఫాదర్స్ డే సంధర్భాన్ని పురష్కరించుకొని ఒక వాణిజ్య ప్రకఠనను రూపొందించింది. ఆ ప్రకఠనలో అది.. “Happy Father’s Day, Mom” అని చెప్పింది. అంతే ఒక్కసారిగా తండ్రుల హక్కుల కోసం పోరాడుతున్నవారు బగ్గుమన్నారు.  ఇందులో తప్పేముంది అంటారా? ముందు ఆ విడియో చూడండి, తప్పుందో లేదో తరువాత చెబుదురు..!

అదీ విషయం. ఆ విడియో చేసింది ఏమిటంటే, ఫాదర్స్ డే రోజు “Single Mothers” ని పొగుడుతూ, తండ్రులను ఎత్తిపొడిచే ప్రయత్నం చేశారు.  సింగిల్ మదర్స్, తమ పిల్లలను కష్ట పడి పెంచుతున్నారని చెబితే అందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏమీలేదు.  కానీ, దానికి “ఫాదర్స్ డే” ను వేదికగా చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది వారి పాయింట్.  మదర్స్ డే ఎలానూ ఉండనే ఉంది. దాన్ని ఎవరూ హైజాక్ చేయడం లేదు కదా? అంతగా వారికి ఒక ప్రత్యేక దినం కావాలంటే.. “సింగిల్ మదర్స్ డే” అని ఒక కొత్త రోజును క్రియేట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు. “ఫాదర్స్ డే” రోజు తండ్రులను కించ పరిచేలా మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నది వారి వాదన.

కొంత మంది తండ్రులు, కేవలం జన్మను మాత్రమే ఇస్తారు. తరువాత తండ్రిగా తమ బాధ్యతలు నిర్వర్తించరు. అది నిజమే. కానీ, “ఫాదర్స్ డే” అనేది అలాంటి వారికోసం ఏర్పాటు చేసింది కాదు. అనేక మంది తండ్రులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఈ “ఫాదర్స్ డే”ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాన్ని, విషతుల్యం చేయాల్సిన అవసరం లేదు, అన్నది వారి వాదన.

నాకైతే వారి వాదన సబబుగానె అనిపిస్తోంది. సింగిల్ మదర్స్కు వ్యతిరేకంగా మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. Leave Father’s Day, Have your own day అని చెప్పడం మాత్రమే వారి ఉద్దేశ్యం, నా ఉద్ద్దేశ్యం.

Source:
‘Happy Father’s Day, Mom!’ Angel Soft Ad Causes Unexpected Outrage: Justified?

Published in: on June 19, 2016 at 9:00 am  Comments (2)  

మీలో స్కర్ట్ ధరించేంత మగతనం ఉందా !?


Update: ప్రస్తుతం పిల్లలు జెండర్ న్యూట్రల్ యూనిఫార్మ్ వేసుకోవచ్చట. ప్రస్తుతం ఉన్న యూనిఫారంలు ట్రాన్స్‌జెండర్‌లకు ఇబ్బందులు కల్గిస్తున్నాయని అందుకే జెండర్ న్యూట్రల్ యూనిఫార్మ్ ప్రవేశ పెట్టాయట స్కూల్లు. (వార్త ) దీని ప్రకారం అబ్బాయిలు స్కర్టు వేసుకోవచ్చు, అమ్మాయిలు ట్రౌసర్లు వేసుకోవచ్చు !

ఇందులో తప్పేముంది అంటారా ?వెల్, పైకి చూడడానికి ఎంతో గొప్పగా అనిపించే ఈ చర్యను కాస్త నిశితంగా పరిశీలిస్తే అందులో ఉన్న ఒక “కమ్యూనిష్టు పైత్యం” గమనించ వచ్చు !  అదేంటో తెలియాలంటే … గత సంవత్సరం నేను రాసిన ఈ టపాను మళ్ళీ ఒక సారి చదవండి !

 ————————————————

కూల్, మీ ప్రయత్నాలు విరమించుకోండి (నా మీద విరుచుకు పడడం లాంటివన్న మాట :-P). ఈ ప్రశ్న నాది కాదు.  కొన్ని పేపర్లలో మగవారిని ఉద్దేశించి రాసిన ఆర్టికల్సు ఇవి.  విషయమేమిటంటే … మగవారు ఆడవారిలా డ్రస్సులు వేసుకోవడం. సరదాగా ఈచాయా చిత్రమును చూడండి !

Andrej_Pejic_at_MICHALSKY_StyleNite

ఇక్కడున్న వారు అమ్మాయి కాదు అబ్బాయి ! ఇదో ఫ్యాషన్ షో. దీనికే యూనిసెక్స్ (Unisex) ఫ్యాషన్ పేరు కూడా పెట్టారు.ఈ “ముద్దుగుమ్మడు” పేరు ఆండ్రెజా పెజిక్ (Andreja Pejić).  అమ్మాయిగా పుట్టి, అబ్బాయిగా మారిన వ్యక్తి ! ఆ “ముద్దుగుమ్మడు” గురించి ఇక్కడ చదవొచ్చు.

Link : https://en.wikipedia.org/wiki/Andreja_Peji%C4%87

ఇప్పుడు మనం కొన్ని పేపర్లలో వచ్చిన ఆర్టికల్స్ చూద్దాం …

 

మన “భాజీ రావ్” రనవీర్ సింఘ్,  “ఫాస్ట్ అండ్ ఫ్యురియస్” వాన్ డీజిల్,  ” “300, గ్రీకు యోధుడు” గెరాల్డ్ బట్లర్ వంటి వారు చక్కగా స్కర్టులేసుకుని ఎలా ఫోజిచ్చారో ! రెండో వార్తలో … స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని పెంపొందించడానికి కొంత మంది మగవారు ఇలా స్కర్ట్ వేసుకుని ఫోజులు కూడా ఇచ్చారు. ఎంత భావ దారిద్ర్యమో కదా ! సమానత్వాన్ని సాధించాలంటే ఇలా ఆడవారి దుస్తులు వేసుకోక తప్పదా … !

ఇక పాశ్చాత్య దేశాల పత్రికలైతే వీటిని తెగ ప్రచారం చేస్తూ ఉంటాయి.  ఈ కింది చాయాచిత్రాలను చూడండి …

 

పైన ఉన్నది కూడా అమ్మాయికాదు, అబ్బాయే !  ఈ పన్నెండేల్ల కుర్రాడికి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అమ్మాయిలేమో ఎంచక్కా స్కర్టుల్లోకి మారిపోతూ ఉంటే తాను మాత్రం ఆ గొట్టాం ప్యాంట్లు వేసుకుని, చమటలు కక్కడం ఇష్టం లేదట. ఆవాతావరణములో అలాంటి ప్యాంట్లు వేసుకుంటే, ఏకాగ్రత కుదరక సరిగా చదవలేడట ! ఈ పన్నెండేల్ల వయసులో అబ్బాయికి ఎన్ని గొప్ప విషయాలు తెలిశాయి ! దీని గురించి వార్త చక్కగా ఇక్కడ చదువుకోండి…

Link: http://www.dailymail.co.uk/news/article-1385492/Chris-Whitehead-wears-skirt-school-protest-uniform-rule.html

మరో చోట,  వేసవిలో కూడా తమను షార్ట్‌స్ వేసుకోనివ్వడం లేదని అలిగిన కొంత మంది కుర్రాళ్ళు తమ నిరసనను ఈ విధంగా స్కర్ట్‌స్ వేసుకోవడం ద్వారా తెలిపారు.

అమ్మాయిలేమో ఎంచక్కా స్కర్ట్స్ వేసుకోవచ్చు, అబ్బాయిలు మాత్రం ఎంత వేడిగా ఉన్నా గొట్టాం ప్యాంట్లు వేసుకోవాలా ? మేము షార్ట్స్ ఎందుకు వేసుకోకూడదు అనేది వారి వాదన. స్కూలు అబ్బాయిలు షార్ట్స్ వేసుకోవడం నిషేదించింది కానీ స్కర్ట్స్ మీద ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. దానితో వారు అలా తమ నిరసనను తెలియ జేశారన్న మాట ! దాని గురించి ఇక్కడ చదువుకోండి …

Link: http://www.medicaldaily.com/welsh-boys-wear-skirts-school-protesting-no-shorts-policy-during-heat-how-long-until-school-uniforms

ఇలాంటి నిరసనే “స్వీడన్”్‌లో కూడా జరిగింది. అక్కడ ట్రైన్ డ్రైవర్లు కొంత మంది ఇలా షార్ట్స్ వేసుకోనివ్వడం లేదని స్కర్ట్స్ వేసుకున్నారు !   డ్రైవర్లు ప్యాంట్లుకానీ, స్కర్ట్స్ కానీ వేసుకోవచ్చు కానీ షార్ట్స్ కాదు. వేడిని తట్టుకోవడానికి మేము వేసుకుంటున్నాం అన్నది వారి మాట !

ఇక ఫ్యాషన్ షోలలో అయితే ఒకటే మెరుపులు !  స్కర్టులు  భీకరమైన డ్రెస్సులు ధరించిన మగ మోడల్లు తెగ హడావిడి చేసేస్తారు. మీడియాలో Real men wear skirts అని హెడ్డింగులు పెట్టి ఊదరగొట్టేయడాలు కామన్ !

 

ఆ తతంగమేమిటో ఒక సారి ఇక్కడ చూసుకోండి …
Link : http://junkee.com/sucked-in-guys-this-is-pretty-much-what-youll-be-wearing-this-year/27379

ఇదేనా మన దేశములో కొంత మంది అబ్బాయిలు ఇలాంటి వెరైటీ డ్రెస్సు వేసుకున్న తీయించుకున్న ఫొటో ఒకటి కొన్ని రోజులు నెట్లో హల్చల్ చేసింది ! Why should girls have all the fun అనే క్యాప్షనుతో !

ఫన్నీగా ఉంది కదా .. కుర్రోళ్ళు కేక ఫోజులిచ్చారు. క్రియేటివిటీ అదిరింది !!

ఇవన్నీ కాకుండా మా “బీయింగ్ హ్యూమన్”, “భజరంగి భాయిజాన్”, సల్మాన్ అయితే ఇలాంటి స్కర్టులు గట్రా ఎప్పుడో వేసేశాడు ఒక సాంగులో .. 😛 ఈ పాటలో 2:45 టైం దగ్గర, 3:20 టైం దగ్గర ఒక సారి గమనించండి… సల్మాన్ భాయికి షర్టూ ఫ్యాంటూ వేసుకోవడమంటే భలే చిరాకు అని గమనించగలరు 😛

సరే, ఇప్పుడు ఇవన్నీ వదిలేసి కాస్త సీరియసుగా మాట్లాడుకుందాం …

మగవారు స్కర్టు లాంటివి,  ఆడవారి డ్రెస్సులాంటి డ్రెస్సులు వేసుకోవడం కొత్తేం కాదు. స్కాటిష్ మగవారు “కిల్ట్ (Kilt)” అనే సాంప్రదాయ దుస్తులు ధరించేవారు.  ఇవి వారి సాంప్రదాయ దుస్తులు అనేది మనం మర్చిపోకూడదు ..!

 

 

ఫిజి దేశములో అయితే పోలీసులు, చివరకి ఆర్మీ వాల్లు కూడా ఈ స్కర్ట్స్ వేసుకుంటారు. దీన్నే “సులు (Sulu)” అంటారక్కడ.

కింద బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న పోలీసులని చూశారుగా ! భలే ఉన్నారుగా దొంగలను పట్టుకోవడానికి ఎలా పరిగెడతారో ఏమో మరి ??

ఇదే కాక, ఫిజీ దీవుల్లోని గ్రామములో అయితే ఆదివారం ఖచ్ఛితంగా ఈ Sulu వేసుకోవాలని మత పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం పవిత్రమైనది అట. ఆరోజు ప్రభువును సేవించుకోవడానికే తప్ప మరే పనులూ చేయకూడదని లేదంటే దేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని  ఆ  అదేశాలు జారీ చేశారు అక్కడ. ఆ వార్తను ఇక్కడ చూడండి …

Link:  http://www.heraldsun.com.au/news/tiny-fijian-island-bans-mens-pants-on-sundays/story-e6frf7jo-1225763255884

ఒకానొక వెబ్‌సైటులో చెప్పిన దాని ప్రకారం అక్కడ మగవారు ఈ Sulu వేసుకోవడమే కాదు, తల్లో పూలు కూడా పెట్టుకుంటారట !

If you see two men, wearing skirts and with flowers in their hair, holding hands in the street, do not assume they are gay. They are not called skirts, by the way – they are sulus. For work and formal occasions they are mainly plain grey, brown or blue. At home or informally, they may wear more colourful designs. If your children are going to go to school there, the boys may have a choice of wearing shorts, long trousers or sulus. Before they go they will probably swear an oath that they will never wear a sulu to school. After about a week they will change their mind.

Link: http://www.blue-oceans.com/ohana/fiji_expat.html

వీల్లే కాదు “సమోవ (Samoa)”  ఆనే దేశములో కూడా పోలీసులు స్కర్ట్స్ వేసుకుంటారు.

 

వీరేకాదు “అల్బేనియన్” సైనికులు కూడా ఇలా స్కర్టులాంటి దుస్తులని వేసుకునే వారు. దాని పేరు “ఫుస్టానెల్లా (Fustanella)”.  ఈ తరహా దుస్తులు దాదాపుగా చాలా మంది రాజులు వేసుకునే వల్లనుకుంటా !

 

 

అక్కడెక్కడికో ఎందుకు మన భారతదేశానికి వద్దాం ! రాజులు ఒకప్పుడు వేసుకున్న దుస్తులు కాస్త పంజాబీ డ్రెస్సుల్లా ఉండేవా కాదా !

 

 

రాజులను వదిలేసి ఈ కాలానికి వస్తే ఇప్పటికీ పల్లెల్లో మగవాల్లు లుంగీలు కట్టడం కామనే కదా !  లుంగీ పైకెత్తి కట్టి పనులకు వెల్లే మగవారు కోకొల్లలు !  తమిళనాడు అంటేనే లుంగీ గుర్తుకు వస్తుంది కొంత మందికి, ఇది దాదాపుగా ఆడవారి డ్రెస్‌ను పోలి ఉండేదే కదా … కిందికి దించితే చీర, పైకి ఎత్తి కడితే స్కర్టూ…  🙂 😛

సడనుగా జనాలందరూ ఇలా స్కర్టుల మీద ఎందుకు పడ్డారంటారు ? ఒకరేమో, ఇది ఫ్యాషన్ అంటారు. మరొకరేమో నిరసన అంటారు. పన్నెండేల్ల కుర్రాళ్ళకు నిరసన తెలియ జేయాలని ఎందుకు అనిపించింది ? అది పేపర్లో అంత ప్రముఖంగా ఎలా రాగలిగింది ? సెలబ్రిటీలను మొదలుకొని, సినిమా హీరోల వరకూ ఎందుకు వాటిని ధరిస్తున్నారు ?  “మీరు స్కర్టులు వెసుకోగల మగతనం కలవారా”  అనే పిచ్చి ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, అవి మీడియాలో ఎందుకు వస్తున్నాయి ?

అబ్బో దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. దాని కన్నా పెద్ద సిద్దాంతం ఉంది. సదరు “జెండర్” అనేది సామాజిక నిర్మాణం అంటే (తెలుగులో సోషియల్ కన్‌స్ట్రక్ట్) అని స్త్రీవాద, వామపక్ష వాద మేధావుల ఉవాచ. ఆ ఉవాచలేవో ఉవాచించి ఊరుకోరుకదా వారు ! దాన్ని సమాజం మీద ప్రయోగిస్తారు. ఆ ప్రయోగములో భాగమే ఇదంతా అని మా డౌటనుమానం !

మగవారు ప్యాంటూ షర్టూ ఎందుకు వేసుకోవాలి, ఆడవారు స్కర్టులు మాత్రమే ఎందుకు వేసుకోవాలి. మగవారు స్కర్టులు వేసుకుంటే తప్పేమిటి ? ఇలాంటి ప్రశ్నలు వేసి ఊరుకోక, మగవారిని చేత కూడా ఇలాంటివి వేయించాలని కంకణం కట్టుకున్నారన్న మాట.

స్త్రీవాదులు,  వామపక్ష వాదులూ ఇలాంటివి అనుకున్న తరువాత, వారు దాన్ని లోపాయకారిగా పత్రికలలో,  ప్రసార మాధ్యమాలలో,  సీరియల్లలో, నవల్లలో ఒకటేమిటి ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా వాడేస్తారు. వాల్లకు నిధులు కూడా బ్రహ్మాండంగా ఉండడముతో కొన్నింటిని స్పాన్సర్ కూడా చేసేస్తారు. ఎవరో ఒక స్త్రీవాద, వామపక్ష ఫ్యాషన్ డిజైనర్ల చేత ఇలాంటి డ్రస్సులు మగ మోడల్లకు వేసి ర్యాంపుపై పిల్లినడకలు నడిపించేస్తారు.

సెలబ్రిటీల చేత, మరికొంత మంది సినిమా వాల్ల చేత ఇలాంటి దుస్తులు వేయించి … చూశారా ఇదో కొత్త ఫ్యాషన్ అని ఊదరగొడతారు.  ఒక్కసారి ఫ్రాన్సులోనో, అమెరికాలోనో కొంత మంది సెలబ్రిటీలు ఈ పనులు చేయగానే మన దేశీయ అనుకరణ పిల్లులు (అనగా తెలుగులో కాపీ క్యాట్స్) దాన్ని ఫాలో అయిపోతారు. ఇక్కడున్న స్త్రీవాద, వామపక్ష వాద మేధావులు కూడా పత్రికలలో మీలో వీటిని ధరించేంత మగతనం ఉందా? మీలో ఆ ఆదర్శ భావాలు, అభ్యుదయ భావాలూ ఉన్నాయా అని పేపర్లలో తెగ ఆర్టికల్సు రాసేస్తారు !

మీకు నమ్మకం లేదా ?  నేను మరీ వారి మీద నిందలు వేస్తున్నాను అని మీ ఫీలింగా అయితే ఒక సారి యూనిసెక్స్ Unisex ఫ్యాషన్ మీద వచ్చిన ఈ ఆర్టికల్ ఒక సారి చదవండి.  సదరు భావజాలం పట్టువదలని విక్రమార్కునిలా, నిరాశ చెందని ఘజనీలా ఎన్ని దండయాత్రలు చేసిందో ఇప్పటి వరకూ మీకే తెలుస్తుంది.

A Brief History of Unisex Fashion

సో, నేను చెప్పొచ్చేదేమంటే … మగవారు స్కర్టు వేసుకోవడం తప్పు కాదు. అలా అని అది వేసుకునే దమ్ము ఉందా, Are you enough man to wear it అనో రెచ్చగొట్టేట్టు మాట్లాడడమూ మంచిది కాదు.  ఒక్కో దేశములో ఒక్కో సంస్కృతికి తగ్గట్టుగా వస్త్రధారణ ఉంటుంది.  కొన్ని చోట్ల మగవారు స్కర్టులు బ్రహ్మాండంగా వేసుకుంటారు. మరోచోట వేసుకోవాడానికి ఇష్టపడరు. మగవారు స్కర్టు వేసుకోవడం “స్త్రీ – పురుషుల” సమానత్వానికి ఏవిధంగానూ దోహద పడదు. పైపెచ్చు, అది కేవలం వెక్కిరించినట్టుగా మాత్రమే ఉంటుంది.  పైగా జెండర్ అనేది సమాజ నిర్మితం కాదు, బయోలాజికల్.  కాబట్టి,  ఈ యూనిసెక్స్ ఫ్యాషన్లు లాంటి పిచ్చి పనులు దాన్ని మార్చలేవు.  అనవసరంగా మీ అయోమయముతో ప్రజల్ని అయోమయానికి గురిచేయకండి.

ఒక వేల మగవారు స్కర్టు వేసుకోవాలని అనిపించి వేసుకుంటే, నేను పూర్తిగా సమర్ధిస్తా !  మగవారి దుస్తులు మగవారి ఇష్టం. కానీ, ఈ తరహాలో “స్కర్టు వేసుకునేంత మగతనం ఉందా?” అనో, నిజమైన మగవారు స్కర్టులు వేసుకుంటారు అనో తిరోగమన వాదాలు చేయదలిస్తే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తా !

నాకు సంబందించినంత వరకూ …

Yes, I am man enough to wear skirts but I don’t wear it to prove that stupid “Man thing”.
%d bloggers like this: