గృహ హింస నిరోధక చట్టానికి వ్యతిరేకంగా నిరసన మరియు ధర్నా

ఈనెల (అక్టోబరు)26 ను Black Day గా జరుపుకోవాలని దేశానికి Save Indian Family(SIF) వారు పిలుపునిచ్చారు. గృహ హింస నిరోధక చట్టం అక్టోబరు 26, 2006 నుండి అమలులోనికి వచ్చింది. ఇది రెండు సంత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పక్షపాత పూరితమైన చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 26 న డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11:00 గంటల నుండి, 1:00 వరకూ ధర్నా నిర్వహించనున్నట్లు సేవ్ ఇండియన్ ఫామిలీ వారు ప్రకటించారు.

పైకి మాత్రం ఈ చట్టం మహిళా సాధికారతను సాధించడానికి మరియు స్త్రీలను గృహహింసనుండి రక్షించడానికి తీసుకువచ్చిన చట్టమని చెపుతుంటారు.చాలామందికి తెలీని నిజమేమిటంటే, ఇది పాశ్చాత్య దేశాలలోని కొన్ని చట్టాలకు నఖలులాంటిది(ఉదాహరణకు అమెరికాలోని VAWA). ఆచట్టాలు ఆయా దేశాలలో దారుణంగా విఫలమవ్వడమేకాదు, సామాజికంగా మరిన్ని సమస్యలను ఉత్పన్నం చేశాయి. ఇవి మగవారి ప్రాధమిక హక్కులను కూడా కాలరాసాయి. కుటుంభ వినాషనానికి దోహదం చేసాయి. దారుణమేమిటంటే అటువంటి ఈచట్టాన్ని, భారత దేశంలోనికి దాని వలన భారత సమాజానికి కలిగే లాభ నష్టాలను కనీసము చర్చకూడా లేకుండా ప్రవేశపెట్టడం జరిగింది.

గృహహింసచట్టం, అందులోని కొన్ని అంశాల కారణంగా, రాజ్యాంగ వ్యతిరేకమైనదే కాక అంతర్జాతీయ మానవ హక్కుల నియమాలకు విరుద్ధమైనది కూడా.

ఈ చట్టంలోని “లక్షాలు మరియు కారణాలు” అన్న అధ్యాయంలో గృహహింస మానవ హక్కులకు సంభందించిన అంశమని, అభివృద్దికి తీవ్ర ఆటంకమని అని 1994 లొ జరిగిన వియన్నా ఒప్పందాన్ని, బీజింగ్ డిక్లరేషన్ మరియు కార్యాచరన వేదిక 1995 (Bijing declaration and The platform for action)ని ఉటంకిస్తూ చెప్పడం జరిగింది. కానీ ఈచట్టాన్ని రూపొందించడంలో ఒక నిజాన్ని ఉద్దేశపుర్వకంగా విస్మరించడమ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక అధ్యనాలలోను పరిశోధనలోనూ గృహహింస ఏఒక్క లింగానికో(gender) పరిమితమైనది కాదని, స్త్రీపురుషులిరువురూ దీని భాదితులేనని నిరూపించబడింది. స్త్రీపురుషులిరువురూ తమ భాగస్వాములను హింసించడం జరుగుంతోందని నొక్కి చెప్పడం జరిగింది. కానీ ఈచట్టం ఈ నిజాన్ని పరిగణలోనికి తీసుకోకుండా రూపొందించబడింది.

ఈ గృహహింస చట్టము స్త్రీలను కేవలము భాదితులుగానే గుర్తిస్తుంది, పురుషుడు ఎప్పుడూ ప్రతివాది(ముద్దాయి) మాత్రమే. కానీ NCRB (National Crime Records Bureau) గణాంకాల ప్రకారం కేవలం 2005 మరియు 2006 సంవత్సరాలలోనే వివాహితా స్త్రీలకన్నా దాదాపుగా రెండు రెట్లు ఎక్కువమంది వివాహిత పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు.

NCRB గణాంకాలు:
ఆత్మహత్య చేసుకున్న వివాహిత పురుషుల సంఖ్య : 52,483 (2005) మరియు 55,452 (2006).
ఆత్మహత్య చేసుకున్న వివాహిత స్త్రీల సంఖ్య : 28,186 (2005) మరియు 29,869 (2006).

అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానం ప్రకారం స్త్రీలూ పురుషులూ,…, వైవాహిక బంధంలోను,వివాహ సమయంలోను, విడిపోయే సమయంలోను, సమాన హక్కులు కలిగివున్నారని చెప్పడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానులేనని, వివక్షారహితంగా అందరికీ చట్టంలో సమాన రక్షన వుండాలని చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగములోని 14వ ఆర్టికలు ప్రకారం, భారత దేశంలో ఏవ్యక్తి ఐనా చట్టం దృష్టిలో సమానమే, చట్టంద్వారా సమాన రక్షణను ప్రభుత్వం కల్పించాలి. (“The State shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India.”).కానీ దారుణమేమిటంటే గృహహింస చట్టం పురుషులకు గృహహింస నుండి ఎటువంటి రక్షణను కల్పించదు.

అంతర్జాతీయ మానవహక్కుల తీర్మానం ప్రకారం, నేరం నిరూపించ బడేవరకూ చట్టప్రకారం ఆ వ్యక్తిని నిర్ధొషిగానే భావించాలి, దోషిగా కాదు. (“everyone charged with a penal offence has the right to be presumed innocent until proved guilty according to law”).కానీ ఈగృహహింస చట్టంలో మాత్రం, నిరూపించ బడేవరకూ అతను దోషిగా పరిగణించబడతాడు. అంటే ఇది అంతర్జాతీయ మానవహక్కుల తీర్మానాన్నే కాదు, భారత రాజ్యాంగములోని ఆర్టికలు 20 మరియు 21 ని కూడా విస్మరించాయి.

అంతే కాదు, గృహహింసలోని కొన్ని నిభందనలు పద్దతులూ అత్యంత వివక్షా పూరితంగాను, అసంబద్దంగానూ వున్నాయి. వాటిలో కొన్ని…..

1) గృహహింస చట్టం స్త్రీలందరినీ నిజాయితీ గల బాధితులుగా భావిస్తుంది. అందుకే ప్రతివాది మీద వారు చేసిన ఆరోపనలను నిరూపించుకోవాల్సిన అవసరం వారికి లేదు. ఈచట్టం ప్రకారం న్యాయస్థానాలకు కేవలం బాధితురాలి యొక్క వాఙ్మూలం చాలు నేరంజరిగింది అని నిర్ధారణకు రావడానికి. ఇటువంటి వివక్షాపూరితమైన నిభందనల కారణంగా ఈచట్టము కొంతమంది స్త్రీల చేతిలో భర్తలను హింసించే ఒక ఆయుంధంగా మారింది. అంతే కాకుండా ఈచట్టాన్ని దుర్వినియోగ పరిచే వీలును కల్పిస్తోంది.

2)ఈ చట్టంలోని 10వ సెక్షను service providers లకు కొన్ని ముఖ్యమైన న్యాయ సమీక్ష అధికారాన్ని(judiciary) మరియు విచారన చేసే అధికారాన్ని కల్పిస్తోంది.కానీ ఇటువంటి కేటాయింపులు పూర్తిగా అసహజమైనవి మరియు అసంబద్దమైనవి,చట్టంలో ఇదివరకెన్నడూ లేనటువంటివి.

3) ఈ చట్టంలోని 14వ నిబంధన ప్రకారం ప్రతివాది (అంటే భర్తగానీ, భర్త తరపు బందువులుగానీ) ఎటువంటి ప్రతివాదనలు చేసే అవకాశము లేదు. ఉదాహరనకు భార్యే మొదట కొట్టడానికి ప్రయత్నించిందని అనుకుందాం, ఆ ప్రయత్నాన్ని భర్త అడ్డుకోవడంలోనో లేక అతను తప్పుకోవడం కారనంగానో భార్యకే గాయమైనదని అనుకుందాం. భర్తకు దీనిమీద ప్రత్యారోపన చేసే అవకాశం వుండదు.అంతే కాక కౌన్సిలరు గా నియమింపబడ్డ వ్యక్తి పద్దతి అంతా ఏక పక్షంగాను, ఫిర్యాది పక్షపతంగాను వుంటుంది.

4) ఈ చట్టంలోని 20వ సెక్షను ప్రకారం, భాదితురాలికి నష్టపరిహారము అందివ్వడం జరుగుతుంది. ఈ పరిహారమిచ్చేటప్పుడు, భాదితురాలు ఏటువంటి జీవన ప్రమాణాలకు అలవాటుపడిందని ఫిర్యాదులో పేర్కొంటుందో, దాని ప్రకారం ప్రతివాదిని నష్టపరిహారం చెల్లించమని అదేశించే అధికారం న్యాయాధిపతికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే భర్తయొక్క సంపాదనా సామర్ధ్యంతో పనిలేకుండా ఈ ప్రక్రియంతా జరుగుతుంది. అంతే కాకుండా ప్రతివాది ఆపరిహార మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే, అతను పనిచేసె సంస్థ యొక్క యాజమాన్యమే దాన్ని భాదితురాలికి గానీ న్యాయస్థానానికిగానీ అందించమని ఆదేశించే అధికారాన్ని న్యాయాధిపతికి ఇవ్వడం జరిగింది. ఒక స్త్రీ గృహహింసకు గురవుతే ఆమెను ఆపరిస్థితి నుండి తప్పించి, తిరిగి అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలనుకోవడం విచక్షనా జ్ఞానంతో కూడుకున్న పనే, కానీ ఈవిధమైనటువంటి లాభదాయక తాయిలాలను అందిస్తే అది అన్యాయం చేయడానికి వెనుకాడని స్త్రీలు దుర్వినియోగపరచడం కూడా జరుగుతుంది.

5)ఈ గృహహింస చట్టంలోని చాలా అంశాలు మరియు వాటివలన స్త్రీకి లభించే రక్షణ హక్కులు ఇదివరకే చేసిన చట్టాల ద్వారా కల్పించడం జరిగింది. ఉదాహరణకి, భార్యపై భర్త అతని కుటుంభసభ్యులు జరిపే హింసను అరికట్టడానికి 498A అనే చట్టం చేయడం జరిగింది, దీన్నే గృహహింస చట్టంలో మల్లీ పొందుపర్చడం జరిగింది. ఇది భారత రాజ్యాంగములోని 22వ ఆర్టికలుకు వ్యతిరేకమైనది. 22వ ఆర్టికలు ప్రకారం, “ఏవ్యక్తినీ ఒకే నేరంకింద ఒకసారికన్నా ఎక్కువసార్లు విచారించడం కానీ, శిక్షించడం కానీ చేయరాదు”. గృహహింస చట్టంలో బాధించే భర్తలనుండి స్త్రీలు భరనాన్ని కోరే అవకాశం కల్పించబడింది. కానీ ఈసదుపాయం స్త్రీలకు ఇదివరకే రెండు చట్టాలద్వారా కల్పించడం జరిగింది. అవి భారతీయ శిక్షా స్మృతిలోని 124వ సెక్షను మరియు హిందూ వివాహ చట్టంలోని 24 సెక్షను ద్వారా ఏకకాలంలో భరణాన్ని కోరే హక్కు కల్పించబడింది.

అంతే కాకుండా ఈ చట్టము పూర్తిగా పురుషులకు, కుటుంభ వ్యవస్థకూ వ్యరేకంగా రూపొందించడం జరిగింది.అంతేకకుండా ఈచట్టం వివాహం యొక్క చట్టపరమైన, సామాజిక పరమైన పవిత్రతకు భంగం కలిగించే విధంగా వుంది. హిందూ దత్తత మరియు సంరక్షన చట్టం (Hindu adoption and maintenance act) ప్రకారం భార్యకు వివాహేతర సంబధం వున్నా లేదా మతమార్పిడి చేసుకున్నా ఆ స్త్రీ భరణం పొందడానికి, ప్రత్యేక గృహాన్ని పొందడానికి అర్హురాలుకాదు. కానీ ఈగృహహింస చట్టంలో మాత్రం భార్యకు ఆధికారాన్ని కల్పించడం జరిగింది. అంటే గృహహింస చట్టం వలన స్త్రీలు వైవాహిక నిభందనలను ఏటువంటి శిక్షకూ లోనుకాకుండా, సురక్షితంగా అతిక్రమించవచ్చు. అంతేకాకుండా గృహహింస చట్టం live-in(పెల్లిచేసుకోకుండా కలిసి జీవించే) సంబంధాలకి, అందులోని స్త్రీలకి లేదా ఉంపుడుగత్తెలకి చట్టబద్దంగా వివాహం చేసుకున్న భార్యతో సమానమైన హొదాని కల్పించింది. చాలా సందర్భాలలో రక్షణనూ, ప్రత్యేక అధికారాలను( భరణం, నివాసపు హక్కు మొదలగునవి..) live-in స్త్రీకి లేదా ఉంపుడుగత్తెకి, చట్టబద్దంగా వివాహంచేసుకున్న స్త్రీ హక్కులకు భంగం కలిగే విధంగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి సదుపాయాలు వివాహ వ్యవస్థ మరియు కుటుంబ వ్యవస్థ యొక్క అస్థిత్వాన్ని వెక్కిరించడమే కాక వాటి నాశనంచేస్తాయి. అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానంలో కుటుంబమనేది సహజ,ప్రాధమిక అంకమని దానిని సమాజం,జాతి పరిరక్షించుకోవాలని చెప్పడం జరిగింది(“the family is the natural and fundamental group unit of society, and is entitled to protection by society and the State”). కానీ గృహహింస చట్టం మాత్రము కుటుంబ అసమతౌల్యాన్ని పెంచిపోషించేవిధంగా రూపొందిచబడింది.

కుటుంబ హక్కులను అతిక్రమించడమే కాక గృహహింస చట్టం పిల్లలకు ఇరువురి తల్లిదండ్రులనుండి ప్రేమనురాగాలను పొందే హక్కును కూడా దూరంచేసి, బాలల హక్కులను కూడా నిర్లక్షము చేసింది. ఈ చట్టం యొక్క లక్షాలు మరియు కారణాలలో (objects and reasons) స్త్రీలపై జరిగే అన్నిరకాలైన వివక్షకూ వ్యతిరేకంగా జరిగిన ఒప్పందం(CEDAW),1989 ను ఉటంకించడం జరిగింది. నిజానికి ఈ ఒప్పందం ఎట్టిపరిస్థితులలోనైనా రాజ్యం(state) బాలల ప్రయోజనాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలని సూచిస్తుంది. బాలల ప్రయొజనాలను ద్రుష్టిలో వుంచుకొని, న్యాయస్థానాలు ఎలాంటి వివక్షకూ తావులేకుండా న్యాయంగా విచారణ జరిపి, తల్లిదండ్రులలో ఎవరు పిల్లల సంరక్షన భాధ్యతలు స్వీకరించడానికి అర్హులో నిర్ధారించడం, నిజంగా బాలల ప్రయొజనాలు కాపాడే ప్రక్రియలో ముఖ్యమైనదన్నది సముచితమైన అభిప్రాయం. కానీ గృహహింసలోని 23(2)వ సెక్షను పిల్లల సంరక్షనను తండ్రినుండి/పురుష భాగస్వామి నుండి దూరంచేయడానికి ex-parte orders ను ఇచ్చే వీలును, కేవలం ఆస్త్రీ ఇచ్చిన ఫిర్యాదులోని వాఙ్మూలం అధారంగా కల్పించడం జరిగింది. అంటే గృహహింస చట్టం పితృరహిత సమాజాన్ని( తండ్రులులేని సమాజం) ప్రొత్సహిస్తోంది.

ఇంకో దారుణమైన విషయమేమిటంటే, గృహహింస చట్టం స్త్రీలపై జరిగే అన్నిరకాల వివక్షలకు వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ ఒప్పందం(CEDAW) యొక్క స్పూర్తిని కూడా తుంగలో తొక్కింది. నిజానికి ఈ గృహహింస చట్టానికి ఈ అంతర్జాతీయ ఒప్పందమే ఆధారం. గృహహింస చట్టం బహిరంగంగానే ప్రతివాది(పురుషుడి) బందువులైన స్త్రీలపై వివక్షను చూపిస్తోంది. ఈ చట్టంలోని “లక్షాలు మరియు కారణాల” లో ఈ చట్టము ఒక పురుషుడి భార్య లేద అతనితో కలిసి జీవించే(live-in) స్త్రీ కి, ఆపురుషుడి మీద గానీ అతని బంధువులపైగానీ ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఆ పురుషుడి యొక్క బందువులైన స్త్రీలకు అతని భార్యమీద కానీ అతనితో కలిసి జీవించే స్త్రీపైన కానీ ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించలేదు.

అంటే, ఈ చట్టము కోడలిగా వచ్చిన స్త్రీ అత్తమీద, ఆడబడుచులమీద అనేక సందర్భాలలో జరిపే గృహహింసను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఇంకో అసక్తికరమైన విషయమేమిటంటే గృహహింస చట్టం విడాకులు పొందిన స్త్రీలపై, మరియు మాజీ ప్రేయసులపై చట్టబద్దంగా వివాహంచేసుకున్న స్త్రీలహక్కులను తోసిరాజని,పక్షపాతం చూపిస్తోంది.ఇది పురుషుడి యొక్క ప్రేయసి(ప్రస్తుత మరియు మాజీ) అతని ఆస్తిని ఆక్రమించుకోవడాన్ని, ఆ పురుషుడి యొక్క నివాసపు హక్కును, అతనితో చట్టబద్దంగా వివాహంచేసుకున్న స్త్రీ హక్కును మరియు అతనిపై ఆధారపడిన మిగిలిన స్త్రీల హక్కులను ఫణంగా పెట్టి సమర్దిస్తోంది. అంటే ఒకవర్గం స్త్రీలను రక్షించే మిషమీద ఆ వర్గం స్త్రీలు చేసే సరైన లేద తప్పుడు ఆరోపనల అధారంగా ఈ చట్టం అమాయక స్త్రీలను వేదిస్తోంది. స్త్రీలపై జరిగే అన్ని రకాల వివక్షను ఎంత చక్కగా దూరంచేస్తోందో కదా ఈ చట్టం!!!

న్యాయధికారులు, న్యాయనిపుణులు, NGOలు, భాధ్యతకలిగిన పౌరులు ఈ చట్టాన్ని తీవ్రంగాను, సునిషితంగానూ విమర్శిస్తున్న తరుణంలోకూడా ప్రభుత్వము ఈ చట్టాన్ని సామాజిక దృక్పదంతోగానీ, కుటుంబ శ్రేయస్సు ద్రుష్టిలో పెట్టుకొనిగనీ సవరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖవారు ఆర్భాటంగా రౌండు టేబులు సమావేసాన్ని డిల్లీలో, జూను 25,2008 న నిర్వహించారు. ఈ సమావేసంలో పురుష హక్కులకోసం పోరాడుతున్న పురుష సంఘాలకు సూచనలను, సలహాలను ఇచ్చే అవకాసాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి కుటుంబ సమతౌల్యాన్ని, నిజమైన స్త్రీపురుష సమానత్వాన్ని కాపాడడం కోసం పనిచేసే Save Indian Family మరియు దాని అనుబంద సంస్థలను పలుమార్లు అభ్యర్థించే వరకు విస్మరించడం జరిగింది. ఇంతాజరిగితే, చివరకు ఆ సమావేశము కేవలము కంటితుడుపు చర్యమాత్రమే అని తేలిపోయింది. ఆ మంత్రిత్వశాఖ వారు గృహహింస చట్టంలో మార్పులకు ససేమిరా అనడం జరిగిపోయాయి.

పైన చెప్పిన వాస్తవాల ద్రుష్ట్యా, సామాజికంగా ఈచట్టం కలిగించే నష్టాన్ని వెలుగులోకితేవడానికి Save Indian Family వారు మరియు దాని అనుబంధ సంస్థలు ఈనెల (అక్టోబరు)26 ను భారతదేశ చరిత్రలో, Black Dayగా జరుపుకోవడానికి యావజ్జాతికీ పిలుపునిచ్చారు. అంతే కాకుండా అన్నిరకాల ముద్రణ, ఎలక్ట్రానిక్ ప్రసార మాద్యమాలను సంఘీభావం ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ ధర్నా 26న, ఉదయం 11:00 గంటలనుండి, మధ్యాహ్నం 1:00 గంట వరకూ జరుగుతుంది.

సందర్భంగా, Save Indian Family వారు సమాజానికి మరింత నష్టం వాటిల్లకుండా, కుటుంబ సమతౌల్యాన్ని కాపాడే దిశగా గృహహింస చట్టానికి కింద పేర్కొన్న మార్పులను చేయాలని అభ్యర్థిస్తున్నారు

1) గృహహింస నిరోదక చట్టాన్ని తటస్థంగా (gender neutral) మార్చాలి, స్త్రీపురుషులిరువురికీ శారీరక, మానసిక, ఆర్థిక హింసలనుండి సమాన రక్షనను కల్పించాలి.

2) గృహహింస నిరోదక చట్టం మిగిలిన అన్ని చట్టాలలానే నేరము నిరూపించబడేవరకూ సదరు ప్రతివాదిని నిర్దోషిగానే గుర్తించాలి. అంతేకాకుండా ప్రతివాదికి fair trial ను అందించాలి.

3) service providerలకు న్యాయపరమైన మరియు విచారణ భాధ్యతలను అప్పగించరాదు. దీనితోపాటుగా ఈ service providerలు కౌన్సిలరులుగా కుటుంబ సమతౌల్యాన్ని కాపాడే వారిని,నిజమైన స్త్రీపురుష సమానత్వానికి పాటుపడిన చరిత్రకలవారిని, గృహహింస వంటి ముఖ్యమైన అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగిన వారిని, సమతుల్యతను పాటించే వారిని ఎన్నుకోవాలి.

4) గృహహింస భాదితులను మల్లీ గృహహింసకు లొనుకాకుండా రక్షించడానికి, వారికి ప్రత్యేక షెల్టర్లలో రక్షన కల్పించాలి.. అంతేకానీ వారికి నష్టపరిహారాన్ని అందిచడం లాంటి సదుపాయాలు ఈ చట్టాలు దుర్వినియోగం చేయడానికి దోహదపడతాయి. ఈచట్టం ద్వారా నేరం అరోపించబడిన వ్యక్తికి అతని సొంత ఇంటిలో అతనికుండే నివాసపు హక్కును వ్యతిరేకించడం మానవహక్కులను ఉల్లంఘించడమే. అంతే కాకుండా,నిజమైన గృహహింస భాదితురాలిని తక్షనమే ఆప్రదేశమునుండి తొలగించకుంటే ఆస్త్రీ పలుమార్లు ఆహింసకు గురయ్యే అవకాశాలు వున్నాయి.

5) గృహహింసను ఫిర్యాదుచేసేవారు దీని ద్వారా భరణాన్ని కోరడాన్ని ఎట్టిపరిస్థితులలోను అంగీకరించరాదు. దీని బదులుగా దీనికొరకే ప్రత్యేకంగా ఏర్పాటుచ్వేసిన చట్టలైన CrPC సెక్షను 125ను, మరియు హిందూ వివాహ చట్టమును లోని సెక్షను 24 ను వుపయోగించడానికి మాత్రమె అనుమతించాలి.

6) గృహహింస చట్టము , ఇదివరకే ఇతర చట్టాలు కల్పించిన రక్షనను గానీ, సదుపాయాలను గానీ కల్పించరాదు. ఒకవేల అలా చేయవలసి వస్తే మొదట ఆయా చట్టాలను రద్దుచేసిన తరువాత మాత్రమే దానిని అంగీకరించాలి. ఉదాహరణకి గృహహింస చట్టము స్త్రీకి భర్తద్వారా అతని బందువుల ద్వారా సంభవించే గృహహింసనుండి రక్షన కల్పించేటట్లైతే 498Aని తక్షనము రద్దుచేయాలి.

7) గృహహింస చట్టము పెల్లిచేసుకోకుండా కలిసివుండే బంధాలను (live-in relationships) చట్టబద్దం చేస్తోంది. దీనితో ఈచట్టము బహుభార్వత్వానికి వ్యతిరేకంగా వున్న చట్టస్పూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. అంతేకాక చట్టబద్దంగా( సంప్రదాయ బద్దంగా) పెల్లిచేసుకున్న భార్య హక్కులకు విఘాతం కలిగిస్తోంది. live-in సంబందమనేది చట్టబద్దత లేనటువంటి ఒక ఒప్పందం. ఇటువంటి బందాలన్లోకి ప్రవేసించే ఆడవారు మగవారు అది విచ్చిన్నమయ్యే అవకాశాలను అంగీకరించే ఇందులోనికి ప్రవేసిస్తున్నారు (అలా విచ్చిన్నమయ్యేందుకు దోహదపడే కారణాలు ఏవైనప్పటికీ). చట్టబద్దతే లేని (బహుషా అదే ఆశించి) సంబందాలలోకి చట్టము ప్రవేశించడం హాస్యాస్పదమైన విషయం. కాబట్టి ఈ live-in సంబందాలు గృహహింస చట్టపరిధిలోనుండి తొలగించాలి.

8) పిల్లల సంసక్షన బాధ్యతలు అప్పగించే సమయములో విచారణ న్యాయబద్దంగా, ఇరుపక్షాల వాదనలు విన్నతరువాత, పిల్లలకు తల్లివల్లగానీ లేద తండ్రివల్లగానీ లేదా ఇరువురివల్లగానీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆపదవాటిల్లుతుందన్న సందర్భాలలో తప్ప, మిగిలిన అన్ని సందర్భాలలో తల్లిదండ్రులిరువురికీ ఊమ్మడి సమ్రక్షన బాధ్యతలను అప్పగించాలి.

9) ఈగృహహింస చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిని , న్యాయవ్యవస్థను తమ వ్యక్తిగత లాభాలకోసం వుపయోగించుకున్నందుకు, మరియు మరొక నిజమైన బాధితురాలికి న్యాయం జరిగడాన్ని నిరోదించినందుకు కఠినంగా శిక్షించాలి.

క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ గృహహింస చట్టము స్థానంలోనే వేరొక చక్కని, లింగవివక్షకు తావులేనటువంటి చట్టాన్ని స్త్రీపురుషులిరువురి గౌరవాకి, హక్కులకు ఇంటిలోపల, ఇంటిబయట హామీ ఇవ్వగలిగేటట్లు, కుటుంబ సమతుల్యాన్ని పెంపొందించే విధంగా మరియు చట్ట దుర్వినియోగం ద్వారా జరిపే తీవ్రవాదాన్ని (legal terrorism) నిరోధంచేల రూపొందించాలి.

ఈ టపా నేను, Fight for Gender Equality అన్న ఉమా చెల్ల గారి బ్లాగులోని Black Day అన్న ఆంగ్ల టపాను అనువాదము చేసి రాయడం జరిగింది. ఆంగ్లములోనుండి తెలులోకి అనువాదము కాబట్టి ఉన్నది వున్నట్లుగా తర్జూమా చేయడం కొంచెం కష్టమైనా ఆ తపా స్పూర్తికి ఎటువంటి భంగమూ కలగకుండా ( ఆకడక్కడ అనువాద సమయములో నేను కొంత స్వ్వతంత్రము తీసుకున్నప్పటికీ) రాయడము జరిగింది. ఆమె బ్లాగులోని ఆ అసలు తపాను చదవాలనుకుంటే కింద ఇచ్చిన లంకెను నొక్కండి.

Save Indian Family Foundation calls on the nation to observe BLACK DAY

ఉమా చెల్లగారు, Save Indian Familyలొ సభ్యురాలు మరియు All India Forgotten Women సంస్థ యొక్క అధ్యక్షురాలు.

Advertisements
Published in: on October 23, 2008 at 3:54 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2008/10/23/%e0%b0%97%e0%b1%83%e0%b0%b9-%e0%b0%b9%e0%b0%bf%e0%b0%82%e0%b0%b8-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a7%e0%b0%95-%e0%b0%9a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95/trackback/

RSS feed for comments on this post.

4 Comments

 1. చాలా మంచి సమాచారాన్ని అందించారు. అభినందనలు.

  Like

 2. chaalaa Opika gaa, entO nErpu tO rachayita cEsina ee anuvaadaaniki naa hRdayapoorvaka abhinaMdanalu. iTluchallaa uma

  Like

 3. కాస్త పని ఒత్తిడి వలన వాఖ్యలకు జవాబు ఇవ్వడం ఆలశ్యమైంది. మన్నించాలి.@కత్తి మహేష్ కుమార్ధన్యవాదలండి.@చైతన్యఅవునండి చైతన్య గారు. ఈ గృహహింస చట్టం విచిత్రాలకు నెలవు. అసలు ఇలాంటి చట్టం ఒకటి చెయ్యొచ్చని, దాన్ని ఆమోదించిన తరువాతే చాలామందికి తెలిసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని Loosely Drafted Law అని గట్టిగానే మొట్టింది. ఇక AIFW గురించి మరో టపాలో తప్పక చెబుతాను.

  Like

 4. Save Indian family ఇంతకముందే తెలిసిన సంస్థే కానీ, All India Forgotten Women గురించి ఇప్పుడే విన్నాను. ఉమా చెల్ల గారి బ్లాగును పరిచయం చేసినందుకు నెనర్లు.స్త్రీలు గృహహింస నిరోధక చట్టం క్రిందకు రారని, అత్తని, ఆడపడుచుని ఈ కేస్ క్రింద అరెస్ట్ చెయ్యలేమని, ఇంట్లోని మగవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని, నిన్నే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఒక కేసు విషయంలో తీర్పు ఇచ్చింది. ఇంకా ఎన్నెన్ని ట్విస్టులు చూడాలో మరి.

  Like


Comments are closed.

%d bloggers like this: