అంతర్జాతీయ పురుషదినోత్సవం -నవంబరు 19,2008

భరత్ ఒక ప్రతిభావంతుడైన యువకుడు. అనేక ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కొని, కృషితో శాస్త్రవేత్తగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. జంటిల్‌మన్ అనేవాడు స్త్రీలను గౌరవించాలని, వారికి పిల్లలకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలని,కుటుంబ పోషణ సంరక్షణ భాధ్యతలను స్వీకరించాలని, అవసరమైనప్పుడు త్యాగాలను చేయాలని నూరిపోసే పరిసరాలలో పెరిగాడు. దురుదృష్టవశాత్తూ, జంటిల్‌మన్‌లని కొనియాడబడే వాల్లే తరచూ నిందలను మోయాల్సి వుంటుందని, బాధలను,సమాజం యొక్క నిర్లక్ష వైఖరిని భరించాల్సి వుంటుందని… భార్య కౄరత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, భారతీయ శిక్షాస్మృతిలోని 498A పంజాకు చిక్కే వరకూ అతను నమ్మలేదు. చేయని నేరానికి అతను, అతని తల్లిదండ్రులూ, తోడబుట్టినవారూ ఖైదు చేయబడ్డారు. ఉద్యోగాన్ని కోల్పోయి, తన బిడ్డనుండి వేరుపడి, తీవ్ర వేదననూ అనుభవించాల్సి వచ్చింది.భవిష్యత్తు అంధకార బంధురంగా మారడంతో, నిరాశా నిస్పృహలతో చివరికి అతను జీవితాన్నే అంతం చేసుకున్నాడు.అప్పుడు అతని వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. అతని మరణ వార్తను స్థానిక దినపత్రికలు “ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువ శాస్త్రవేత్త ఆత్మహత్య” అని ప్రచురించి చేతులు దులిపేసుకున్నయి.

ఇది భరత్ ఒక్కడి కథ కాదు, జీవితం వికసిస్తున్న సమయంలో ఎటువంటి మాధుర్యాన్ని అనుభవించకుండా తమ జీవితాల్ని అంతం చేసుకున్న వేల మంది మగాళ్ళ గాథ. National Crime Records Bureau (NCRB) గణాంకాల ప్రకారం 2005 మరియు 2006 సంవత్సరాలలోనే వివాహిత స్త్రీల సంఖ్య కన్నా (2005 లో 28,186 మంది మరియు 2006 లో 29,869 మంది) రెండు రెట్లు వివాహిత పురుషులు (2005లో 52,483 మంది మరియు 2006లో 55,452 మంది) శారీక, మానసిక, ఆర్థిక హింసనే కాక, మాటల వల్ల(verbal) కలిగే హింసను తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.

SFF(Save Family Foundation) వారు మరియు దాని అనుభంద సంస్థలు నవంబరు 19ని అంతర్జాతీయ పురుష దినోత్సవంగా గుర్తించి, మగవారి గౌరవార్ధం దీన్ని జరుపుకోనున్నాయి. ఎంతోమంది తండ్రులు, అన్నలు, భర్తలు, పుత్రులు, మగ స్నేహితులూ మరియు సహోద్యోగులు చేసిన విస్తృత సేవలని,త్యాగాలని… కుటుంబ సంక్షేమానికి, సమాజ శ్రేయస్సుకు, దేశ సౌభాగ్యానికి వారు చేసిన కృషినీ గుర్తిస్తూ, ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా, ప్రస్తుత సమాజంలో మగవారి స్థితి గతులను సమీక్షించాలని SFF నిర్ణయించింది. అంతేగాక సాటి మనుషులుగా మగవారికి న్యాయంగా దక్కవలసిన రక్షణ, హక్కులపై అవగాహన కల్పించవలసిన అవసరాన్ని highlight చేయదలచారు.

భారత ప్రభుత్వం వసూలుచేసే పన్నులలో 82% మగవారినుండే వసూలు అవుతుంది, కానీ గత 60 ఏల్లుగా మగవారి సంక్షేమం కొరకు పంచవర్ష ప్రణాలికలలో (budget) ఎటువంటి కేటాయింపులూ జరుపలేదు. పైపెచ్చు, మగవారు చట్టాలలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు, అంతేకాక స్త్రీల సాధికారత పేరుతో మరిన్ని వివక్షా పూరిత చట్టాలను రుపొందించి మగవారి కనీస హక్కులను కూడా తృణీకరించడం జరుగుతోంది.

అనేక వేలమంది మగవారు భారతీయ శిక్షాసృతి 498A, గృహహింస నిరోదక చట్టం, వివాహేతర సంబందాలకు సంబందించిన చట్టం (adultery law), మానభంగాలు,లైంగిక హింస(sexual harassment) నిరొధానికి చేసిన చట్టాలు,విడాకుల చట్టం,భరణానికి సంబందిచిన చట్టం, పిల్ల పోషన మరియు సంరక్షన కొరకు చేసిన చట్టం(maintenance and child custody laws), మొదలైన చట్టాల దుర్వినియోగం కారణంగా జరుగుతున్న legal terrorism కి బలౌతున్నారు.

అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానం ప్రకారం, చట్టం ముందు అందరూ సమనులే, చట్టం ద్వారా వివక్షారహితమైన రక్షణను పొందడే హక్కు అందరికీ వుంది.(“all are equal before the law, and are entitled without any discrimination to equal protection of the law”). భారత రాజ్యాంగములోని 14వ ఆర్టికలు ప్రకారం, భారత దేశంలోని ఏవ్యక్తైనా చట్టం ముందు సమానమే,చట్టం ద్వారా సమాన రక్షణను పౌరులకి ప్రభుత్వం కల్పించాలి.(The State shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India.)అయినప్పటికీ భారత ప్రభుత్వము గృహహింసనుండి గానీ, పనిచేసే చోట ఎదురయ్యే వేధింపులనుండి గానీ మగవారిని రక్షించడానికి ఎటువంటి సదుపాయాలను కల్పించలేదు.

అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానం ప్రకారం నేరం నిరూపించబడే వరకూ ఆవ్యక్తిని నిర్దోషిగా భావించాలే గానీ దోషిగా కాదు(“everyone charged with a penal offence has the right to be presumed innocent until proved guilty according to law”). కానీ స్త్రీల రక్షణకై భారత ప్రభుత్వం చేసిన చట్టాలు మాత్రం, నిరూపించబడే వరకూ ఆ వ్యక్తినిని దోషిగానే పరిగణిస్తాయి. దీనివలన అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానాన్నే కాక భారత రజ్యాంగములోని 20 మరియు 21వ ఆర్టికలును కూడా ఉల్లంఘించడం జరుగింది.

SFF ఈ విషయాలను ప్రజలందరికీ విషదపరచడానికి, వారిలో వీటిమీద సరైన అవగాహన కలిగించడానికి నడుంబిగించింది. అంతేకాక మగవారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా సరైన చర్యలను తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు.

ఈ చర్యలలో భాగంగా, 2007 నవంబరు 19న SFF మరియు దాని అనుబంధ సంస్థల ప్రోద్భలంతో భారత దేశములో మొదటిసారిగా అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఏకాభిప్రాయ సాధనలో భాగంగా SFF ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ప్రచారానికి స్పందించిన ఆస్త్రేలియా, ఈ సంవత్సరము భారతదేశముతో పాటుగా ఈ అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని జరుపుకోనున్నది.

ఈ అంతర్జాతీయ పురుష దినోత్సవము – 2008 సందర్భముగా SFF వారు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నవంబరు 19న మధ్యాహ్నము 1:00గంట నుండి సాయంత్రము 4:00గంటల వరకూ ప్రజలకు, ప్రసార మాధ్యమాలకు, చట్ట రూపకర్తలకు, మరియు భారత ప్రభుత్వానికి తమ వాణిని వినిపించదలచారు. ఈ భావాలను ముంబై,కోల్‌కతా,నాగపూర్,లక్నో, బెంగులూరు మరియు హైదరాబాదు పట్టణాలలో, కుటుంబ సంక్షేమానికి పాటు పడే వివిధ సంఘాలు, స్వచ్చంద సంస్థలు ప్రతిబింబింప జేయనున్నాయి.

ఈ సంధర్భంగా,మారుతున్న సమాజానికి అనుగుణంగా పురుషుల సంక్షేమార్ధం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయావలసిందిగా, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించడమైనది.

దీనితో పాటుగా, భారత ప్రభుత్వానికి SFF వారు తమ అభ్యర్థణలను పూర్తిగా విషదపరచదలిచారు, అవి..

1) కుటుంబాలకి, మగవారికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాను దుర్వినియోగపరిచి చేసె ఉగ్రవాదాన్ని (Legal Terrorism) నివారించాలి. ముఖ్యంగా సెక్షను 498A ను bailable గా మార్చాలి. అంతేకాక దీనిని non-cognizableగా మార్చి, ఎటువంటి సాక్షాధారాలు కానీ, విచారణ గానీ లేకుండా కేవలము ప్రతివాది యొక్క ఫిర్యాదు కారణంగా అరెస్టు చేయడాన్ని ఆపాలి.

2) సివిల్ మరియు క్రిమినల్ చట్టాలు ఆడవారికీ మగవారికీ సమానంగా వర్తించే విధంగా రూపొందిచాలి. ముఖ్యంగా, IPC సెక్షను 498A, గృహహింస నిరోధక చట్టం మరియు వివాహేతర సంబందాలకై చేసిన చట్టాలను, లైంగిక హింసకు సంబందిచిన చట్టాలను, కుటుంబానికి సంబందించిన చట్టాలను(విడాకులు,పిల్లల సంరక్షణ,భరణం లాంటివి)లింగ వివక్షారహితంగా మార్చాలి.

3) వైవాహిక బంధంలో ఏర్పడే కలతలను, సమస్యలను సివిల్ చట్టాల ద్వారా మాత్రమే పరిష్కరించాలి.

4) న్యాయ వ్యవస్థను, ప్రక్రియను దుర్వినియోగపరచే వారిని లింగవివక్ష లేకుండా కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా, IPC సెక్షను 498A మరియు గృహహింస నిరోధక చట్టాలను వ్యక్తిగత కక్షలు తీర్చుకొనుటకు దుర్వినియోగపరిచే వారికి భారీ జరిమానాలు విధించాలి.

5) వివాహ విచ్ఛిన్న సమయంలో తల్లిదండ్రులివురికీ పిల్లల సంరక్షణ బాధ్యతలను అప్పగించాలి(joint custody).

ఈ సందర్భంగా అన్నిరకాల ముద్రణ మరియు ఎలక్త్రానిక్ మాధ్యమాలకు ఈ విషయములో సంఘీభావం ప్రకటించ వలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ టపా నేను, Fight for Gender Equality అన్న ఉమా చెల్ల గారి బ్లాగులోని International Men’s Day – 19 November, 2008 అన్న ఆంగ్ల టపాను అనువాదము చేసి రాయడం జరిగింది. ఆంగ్లములోనుండి తెలులోకి అనువాదము కాబట్టి ఉన్నది వున్నట్లుగా తర్జూమా చేయడం కొంచెం కష్టమైనా ఆ టపా స్పూర్తికి ఎటువంటి భంగమూ కలగకుండ రాయడము జరిగింది.ఆమె బ్లాగులోని అసలు టపాను చదవాలంటే ఈ కింద ఇచ్చిన లంకెను నొక్కండి.

International Men’s Day – 19 November, 2008

ఉమా చెల్లగారు, Save Indian Familyలొ సభ్యురాలు మరియు All India Forgotten Women(AIFW) సంస్థ యొక్క అధ్యక్షురాలు.

Advertisements
Published in: on November 15, 2008 at 9:07 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2008/11/15/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%b7%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8/trackback/

RSS feed for comments on this post.

2 Comments

  1. @sujathathank you for understanding our problme Ms.Sujatha.

    Like

  2. Good Info sir. I have seen very closely this kind of a situation, where a close relative of mine was seperated from his child. This is inhuman. The Law should never be partial to one gender alone.

    Like


Comments are closed.

%d bloggers like this: