హిందూ తీవ్రవాదానికి ఆజ్యం పోసేవేమిటి?

కొత్తగా మరో తీవ్రవాదం తెరపైకి వచ్చింది. అదే హిందూ తీవ్రవాదం. వినడానికి కొత్తగా ఉన్నా సాక్షాలు, పరిస్థితులు ఇది ఉందనే చెబుతున్నాయి. ఇంకా విచారణ పూర్తికాలేదు, అప్పుడే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మీరు అనవచ్చు. నిజమే, సగం విషయ పరిఙ్ఞానంతో ఇటువంటి మాటలు మాట్లాడడం మొదటికే మోసం తెస్తుంది. అసలు తీవ్రవాదాన్ని పెంచి పోషించేవి ఏవి? ద్వేషం, తమకు అన్యాయం జరిగుతోందన్న కోపం. తాము ఇప్పుడు పూనుకోక పోతే తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందన్న అనుమానం.

ఖచ్చితంగా హిందువులలో ఇటువంటి భావాలు ఉన్నాయి . కాబట్టి కొంత మంది ఆవేశపూరితులైన యువకులని ఆదారి మల్లించడం పెద్ద కష్టమేం కాదు. కావాల్సిందల్లా దానికి ఒక ఆసరా.

ఇంతకాలం హిందూ తీవ్రవాదం ఉండడం అసంభవం అనుకోవడానికి నాకున్న కారణాలు.

1) తీవ్రవాదం వృద్ది చెందాలంటే, వారికి Safe Heaven లాంటి ప్రదేశం ఒకటి కావాలి. ఇస్లామిక్ తీవ్రవాదానికి అలాంటి ప్రదేశాలు ఈ ప్రపంచములో చాలా ఉన్నాయి. కానీ హిందూ తీవ్రవాదానికి అలాంటి ఛాన్స్ లేదు. ఇది చాలా ముఖ్యమైనది.

2) వారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే వాల్లు కావాలి. ఇస్లామిక్ తీవ్రవాదానికి ఇలాంటి సహాయము చేయడానికి కొన్ని దేశాలే ఉన్నాయి. అవసరానికి మించిన ధనమున్న దేశాలు అనేకం ఉన్నాయి. కానీ అలా డబ్బు సహాయం చేయగలిగిన వారు, హిందూ తీవ్రవాదులకు ఎందరున్నారు? దాదాపుగా లేరనే చెప్పాలి.

3) ఆయుధాలు సమకూర్చుకోవడం అనేది మరో ప్రహసనం. ఇది కూడా అంత సులువేమీ కాదు. ఉదాహరణకి, ముంబై రైల్లపై జరిగిన దాడిలో ఉపయోగించిన బాంబులు చాలా శక్తివంతమైనవి. అంతే కాదు వాటిని తయారు చేయడములో వాడిన సాంకేతిక పరిఙ్ఞానం కూడా చాలా ఉన్నతమైనది. అంత సాంకేతిక పరిఙ్ఞానం,శక్తిమంతమైన పేలుడు పదార్థాలు దొరకడం దాదాపుగా అసంభవం. దానికి పాకిస్తాను ఇస్లామిక్ తీవ్రవాదులకి సహాయము చేసినట్లు, హిందూ తీవ్రవాదులకి కూడా ఏదో ఒక దేశం సహకరించాలి.

4) ఇక హిందువులను అరెస్టు చేయడానికి కానీ, వారిని విచారించడానికి కానీ ప్రభుత్వానికి ఎలాంటి చిక్కులూ ఉండవు. ఎందుకంటే వారు ఈ దేశములో మేజారిటిలో ఉన్న మైనారిటీలు. వారిని అరెస్టు చేస్తే అమాయక హిందువులను అరెస్టు చేశారని గొంతు చించుకునే వాల్లు ఉండరు. పైపెచ్చు, తాము ఉదారవాదులమని ఆదార్శానికి మారుపేరని చెప్పుకోవడానికి పోటీ పడే పెద్దమనుషులే ఎక్కువగా ఉంటారు.

ఇక హిందూ తీవ్రవాదులు ఉండొచ్చు అనుకోవడానికి కారణాలు చెబుతాను.

1) ద్వేషం: తమ సంస్కృతిమీద జరిగిన దాడి. చరిత్రను చదివితే ఎవ్వరికైనా కోపం రాక మానదు. తమ మీద దాడిచేసిన వారిపై ద్వేషం రాక మానదు. ఇరువర్గాల మధ్య సుహృద్బావ వాతావరణం ఉంటే ఆ ద్వేషం సమసిపోతుంది. కానీ దురదృష్టవశాత్తూ అది లేదు.

2) హిందూ మతముమీద ఇప్పటికీ జరుగుతున్న దాడులు. మైనారిటీల మనో భావాలు కాస్త ఎక్కువ సమానం అన్నట్లు ప్రవర్తిచే ఉదారవాద, లౌకిక (లౌక్య) వాద భావజాలాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు. నిజానికి ఒక తీవ్రవాది హిందువును గాయపరిస్తే వీరు తమ భావాజాలాలతో దానికి కారం రాస్తుంటారు, మరింత రెచ్చగొడుతుంటారు.

3) రోజు రోజుకీ పెరుగుతున్న తీవ్రవాద దాడులు. తీవ్రవాదులు బహిరంగంగా చేస్తున్న హెచ్చరికలు. అవి జరుగుతున్నప్పుడు మన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు, హిందువులలో అభద్రతా భావాన్ని, ద్వేషాన్ని, విపరీతమైన ఆగ్రహాన్ని పెంపొందిస్తున్నాయి. ఒక తీవ్రవాది, పాకిస్తాను నుండి భారత దేశాములో ఎవ్వరి సహాయము లేకుండా దాడులు చేయడం కుదరదు. ఇక్కడ ఉన్న వాల్లు దానికి సహాయము చేయాలి. చేస్తున్నారు. అందుకే ఆ ద్వేషము విపరీతంగా పెరిగిపోతున్నది.

అందుకే హిందూ తీవ్రవాదాన్ని పూర్తిగా కొట్టి పారవేయలేను. కాకపోతే, ఈ హిందూ తీవ్రవాదము ఎక్కువకాలము ఉండడము కానీ, ఇస్లామిక్ తీవ్రవాదమంత తీవ్రంగా ఉండడముగానీ జరగడం అసంభవం. ఎందుకో మొదటే చెప్పాను. హిందూ తీవ్రవాదులకి స్వర్ఘధామలాంటి దేశం లేదు. వారికి ఆర్తిక సహాయము చేసే వాల్లు, ప్రతీ దానికి దాన్ని వెనుకోసుకొచ్చే వాల్లూ లేరు. కాబట్టి, ఇది కేవలం ఒక abberationగా మాత్రమే మిగిలిపోతుందని నాకు అనిపిస్తోంది.

హిందూ తీవ్రవాదమైనా ఇస్లామిక్ తీవ్రవాదమైనా మావోయిస్టు తీవ్రవాదమైనా దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేవే. హిందూ తీవ్రవాదం త్వరగానే అంతమవుతుందని ఆశిద్దాం (ఇస్లామిక్ తీవ్రవాదం, మావోయిస్టు తీవ్రాదం కూడా, కానీ నాకు అలా జరుగుతుందన్న నమ్మకం లేదు).

ఇట్లు,
మీ ఆకాశరామన్న.

Share

Advertisements
Published in: on May 14, 2010 at 7:05 pm  Comments Off on హిందూ తీవ్రవాదానికి ఆజ్యం పోసేవేమిటి?  
Tags: , , ,
%d bloggers like this: