కొన్ని యాదృచ్ఛిక సందేహాలు – మీకు సమాధానం తెలుస్తే చెప్పండి

1. మన దేశానికి వ్యూహాంత్మకంగా ఆలోచించి సలహాలిచ్చేసంస్థలుగానీ, మేధావులుగానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే, అవి నేపాల్ లోని మావోయిస్టులను మన దేశం సపోర్టూ చేస్తుంటే .. ఎందుకు ఊర్కున్నాయి? నేపాల్ లో రాచరికం ఉన్నంత వరకూ, దాన్ని కూల్చడానికి భారత్ సహాయాన్ని పొందిన మావోయిస్టు నేత ప్రచండ, తరువాత చైనా పంచన చేరడం మనందరికీ తెలుసు. నాకు అందులో ఆశ్చర్యమేమీ అనిపించలేదు. ఎందుకో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఎర్రబాబులు – ఎర్రబాబులు ఎప్పటికైనా ఒక్కటే. ఈమాత్రం మనవాల్లు ముందుగా ఎందుకు ఊహించలేకపోయారు..??

మన దేశములో కూడా మావోయిస్టుల సమస్య తీవ్రంగా ఉంది, అయినా కూడా మనవాల్లు మన పక్కలోనే మావోయిస్టులకు అధికారం వచ్చేలా ఎలా సహాయం చేయగలిగారు? ఇప్పుడు వాల్లు Red Corridor  ఏర్పాటుచేస్తాం అనడమే కాదు, మావోయిస్టులందరికీ (దేశముతో సంభందం లేకుండా) తమ నైతిక మద్దతుంటుంది అని బాహాటంగానే చెబుతున్నారు. భారత్ మీద విషం కక్కుతూనే ఉన్నారు. మన పక్కలో బళ్ళేన్ని మనమే తయారు చేసుకున్నట్టు కదా ఇది??

మావోయిస్టులు, చైనాను వదిలి మనతో స్నేహం చేస్తారని ఎలా అనుకున్నారు మన వ్యూహకర్తలు? ఈ మధ్య కాలములో మన వాల్లు చేసిన  అతిపెద్ద తప్పిదాలలో ఇదే ముఖ్యమైనదని నా అభిప్రాయం.

2. ఈరోజు పేపర్లో  ఒకవ్యాసం సారాంశమేమిటంటే, బంగ్లాదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ ఛాంధసవాద పార్టీ అని, దానికి పాకిస్తాను ISI తో సంభంధాలున్నాయి అని ప్రధాన మంత్రి, ఏదో పిచ్చా పాటిగా మాట్లాడూకునే వాటిలో అన్నారట. ఈ వార్తను, ఆ పిచ్చాపాటి కార్యక్రమానికి హాజరైనా ఏపత్రికా ప్రచురించలేదు, వారు ఎంతో సమ్యమనం పాటించి అటువంటి వాటికి ప్రాచుర్యం కల్పించలేదట. కానీ, మన PMOనే  నిర్లక్షంగా వ్యవహరించింది.  మన PMO (Prime Minister’s Office) వర్గాలు, ఆ సంభాషణలను యధాతధంగా తమ వెబ్ సైట్లో ఉంచాయి. అంతే, బంగ్లాడేశ్ లో పేద్ద దూమారం చెలరేగిందట, ఎంతవరకూ వచ్చిందంటే.. మన  ప్రధానే స్వయంగా, బంగ్లా ప్రధానికి ఫోను చేసి మాట్లాడేంత, మన రాయభార కార్యాలం క్షమాపణ చెప్పుకునేంత.  ప్రస్తుతం PMOలోని అధికారులను బదిలీచేసేందుకు సన్నద్దమవుతున్నారు అని ఆ వ్యాస సారాంశం.

PMO ఎంత ముఖ్యమైనదో మనకందరికీ తెలిసిందే. అలాంటి వాటిలో ఉన్న అధికారులు అంత నిర్లక్షంగా ఎలా వ్యవహించగలిగారు? వారి నిర్లక్షం ఖరీదు పొరుగు దేశంతో సంభంధాలలో అనవసర ప్రతిభందకాలు.  సరే జరిగిందేదో జరిగింది, ఇంత తీవ్రమైన నష్టాన్ని కలిగించిన వారిని కేవలం బదిలీ చేయడమా? ఎందుకు వారిని విధులనుంచి తొలగించకూడదు? చట్టపరంగా ఏవైనా సమస్యలు వస్తాయా? నాకైతే అలా అనిపించట్లేదు మరి.

3. ఇక, మొన్ననే మన రాజశేఖర్ రెడ్డి జయంతిని జరుపుకున్నారు, ఆ పార్టీకి చెందిన వారు.  అదేమంత పెద్ద విషయం కాదు కానీ, ప్రవాస భారతీయులు కూడా ఆ జయంతిని ఘనంగా జరుపుకున్నారట.  ఆకాశంలో సంబరాలు అని, రాజశేఖర్ రెడ్డి చిత్రం చూపించారు. బహుషా లేజర్ షో కూడా వేసినట్టున్నారు.  సొంత ఫ్యామిలీవారు జరుపుకున్నరంటే అర్థముంది, మరి మన ప్రవాసులు అంతెందుకు కష్టపడ్డారో అర్థం కాలేదు. (వారికి సీట్లివ్వడం కూడా జరగదు కదా).  ఇదేకాదు, అంతకుముందెప్పుడో చంద్రబాబు అమెరికా వెల్లినప్పుడు కూడా, ఇలానే నానా హడావిడీ చేశారట. నా ఫ్రెండు చెబుతూ, అమెరికా అధ్యక్షుడికి కూడా అన్ని వాహనాలతో ర్యాలీలుండావు అని చెప్పాడు.

ఇది కేవలం మనమేనా లేక మిగిలిన రాష్ట్రాల వారు కూడా చేస్తారా?  వాల్లు చేస్తే నీకెందుకు అని మీరడగొచ్చు, చిన్న క్యూరియాసిటీ అంతే. ఇలా గొప్పలుపోయే గుణం, ఒక వ్యక్తిని ఆరాధించే పిచ్చి మనదేనా లేక చాలా మందికుందా అన్న చిన్న క్యూరియాసిటి.

ఇదే కాదు, మొన్నా మధ్య ఆస్ట్రేలియాలో భారతీయుల మీద దాడులు జరిగాయన్న వార్తలు వచ్చాయి. ఆ సమయములో ఆస్ట్రేలియాలోనే కాదు, కొన్ని దాడులు అమెరికాలో కూడా జరిగాయి. అప్పుడు ఒక నార్త్ ఇండీయా ఫ్రెండ్ అడిగాడు.. ఎందుకు, ఎక్కువగా తెలుగు వారే దాడులకు గురవుతున్నారు అని. నిజంగానే ఆసమయములో ఎక్కువగా దాడులకు గురైనవారు మన తెలుగువారే. నిజంగానే, మన తెలుగువారి మీదే అధికంగా దాడులు జరుగుతుంటాయా విదేశాలలో, దానికి కారణం మనవారు కలుపుగోలుగా అక్కడి స్థానికులతో ఉండకపోవడమే కారణమా?

ఏదో, అలా కలగాపులగంగా నాకున్న సందేహాలన్నీ రాసేశాను. తెలిసిన విఙ్ఞులు ఎవరైనా ఉంటే సందేహ నివృత్తి చేయవల్సిందిగా ప్రార్థణ.

Advertisements
Published in: on July 13, 2011 at 2:57 pm  Comments Off on కొన్ని యాదృచ్ఛిక సందేహాలు – మీకు సమాధానం తెలుస్తే చెప్పండి  
Tags: , , , , , , ,
%d bloggers like this: