చరిత్రలో మార్క్సిస్టులు పడ్డారు – టిప్పు సుల్తాను గొప్పవాడెట్లయ్యెన్?

దేశములో దొంగలు పడ్డారు అని అప్పుడెప్పుడో ఒక సినిమా వచ్చినట్టుగుర్తు. వాల్లు పడ్డారో లేదో కానీ, చరిత్రలో మాత్రం మన మార్క్సిస్టులు పడ్డారు.

అసలు చరిత్ర అంటేనే గెలిచేవాడు రాసిందిరా అబ్బాయ్ అని వెటకారం మాటొకటుంది. మన చరిత్ర మాత్రం అర్ధసత్యాలతో, Selective Criticism, Selective Liberalism తోనూ, అబ్బద్దాలతోనూ నిండి పోయి, యేది అసలు చరిత్రో, ఏది కాదో తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది.

ఓపెద్దాయన మా నిజాములు చాలా గొప్పవాల్లు అంటాడు. అప్పటి తెలంగాణా పోరాటములోని వ్యక్తులు తెలియజేసే దాన్ని బట్టిచ్చూస్తే నిజాములు ఎంత గొప్ప వాల్లో తెలుస్తుంది.

మరొకాయన ఎవరో మొదట వచ్చిన కొద్ది మంది ఇస్లామిక్ పాలకులు మాత్రమే దేవాలయాలు కొల్లగొట్టారని, మిగిలిన వాల్లు చాలా చక్కగా పాలించారని ఊదరగొట్టేస్తాడు.

మరి జిజియా పన్ను అంటే ఏమిటో అది ఏకాలములో ఎవరు ఎవరిపై విధించారో తెలీదా ఆపెద్ద మనిషికి? గొప్పవారుగా చెప్పుకొంటున్న మొఘలుల కాలములోనే జరిగిన విషయాలు, విదేశీ చరిత్రకారులు నిరబ్యంతరంగా రాసినవాటిని చదివితే తెలుసుకోవచ్చు వారెంత గొప్పవారో.

టిప్పుసుల్తాను చాలా గొప్పవాడని భావిస్తారు మరొకరు. మరి కొంత మంది చరిత్రకారులు ఆయన్ను ఒక హిందూద్వేషిగా చెబుతారు. ఎవరి సాక్షాలు వారిదగ్గరున్నాయి. అలాంటప్పుడు టిప్పు సుల్తాను గొప్పవాడని ఏకపక్షంగా ఎలా రాస్తారు? ఉన్నది ఉన్నట్టు, కొంతమంది ఇలా కూడా అంటున్నారు అని రాయాలి కదా? మరి రాయరేం?

నిజానికి టిప్పు సుల్తాను తన తండ్రి హైదర్ అలీ కంటే కృరంగా వ్యవహించే వాడని, హిందువులపై చాలా అకృత్యాలకు పాల్పడ్డాడనీ, చాలా గుళ్ళను నాశనము చేశాడని చెప్పే చరిత్రకారులూ ఉన్నారు.

హిందువులపై ఎంతో కౄరంగా ప్రవర్తించిన టిప్పుసుల్తాను, తరువాతికాలములో హిందూ సంస్థలపైనా, గుళ్ళపైనా చూపించిన ఆధరణా, సమర్పించిన కానుకలు కొన్ని యుద్దాలలలో కలిగిన ప్రతికూల పరిస్థితుల వల్ల, లోకల్‌గా ఉన్న హిందువులను మంచి చేసుకోవడం కోసం తీసుకున్న రాజకీయ నిర్ణయాలే తప్ప, హిందువులపై ఆదరముతో చేసినవి కావని వాదిస్తారు కొంత మంది చరిత్రకారులు.

కాకపోతే మన మార్క్సిస్టులు, వీరిని  కాషాయ చరిత్రకారులు (అంటే హిందువు అయ్యుండి, ముస్లిము రాజులు సరిగాపాలించలేదు అని చెప్పే సాహసం చేసిన వారు) అని, తెల్లదొరలు (హిందూ-ముస్లిములను విభజించి పాలించాలి అని కుట్రతో చరిత్రను వక్రించి రాసిన వారన్నమాట) అని ముద్ర వేశేశారు. 😦

టిప్పు సుల్తాను గురించి ఆర్టికలు ఒకటి ఇక్కడ ఇస్తున్నాను అందులో వీటికి సంబందించిన రిఫరెన్సులతో సహా ఉన్నాయి. తప్పక చూడండి.

TIPU SULTAN: AS KNOWN IN KERALA

అవేకాదు ఆస్ట్రిచ్ పక్షుల్లా బతికేవారికి, చరిత్రలో హిందువులపై జరిగిన అకృత్యాలను తెలుసుకోవాలనిపిస్తే ఈకిందిచ్చిన లింకును చూడవచ్చు

Persecution of Hindus

అసలు ఈ చరిత్ర మార్క్సిస్టుల చేతికి ఎందుకు వెల్లిందో కానీ, వారు తమ తింగరి సిద్దాంతాలతో, పక్షపాతపు రాతలతో, అర్ధసత్యాలతో, చరిత్ర అంటే నిజమా అబద్దమా/ నమ్మాలా వద్దా అని సంశయపడే స్థితికి తీసుకు వచ్చారు.

బహుషా, అప్పటి పాలకులు హిందువులపై సాగించిన అకృత్యాలని ఇప్పుడు తెలుసుకోవడం వలన ఇప్పుడున్న వారిమీద ద్వేషాన్ని పెంచుకోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు అనుకున్నారేమో?

అదీ నిజమే. రాజుల దండయాత్రలూ, ఓడినవారిపై అకృత్యాలు మతాలతోనూ, దేశాలతోనూ సంభంధం లేనివి. ఓడినవారు బానిసల్ల బతకడం చరిత్రలో ఎక్కడచూసినా కనిపించేదే. కాకపోతే, మిగిలిన దేశాల్లోని వారెవ్వరూ చరిత్రను వక్రీకరించి రాసినట్టు కనిపించదు. చరిత్రను చరిత్రలా చదివి వదిలేయాలే కానీ ప్రత్యేకించి ఒకరిమీద ద్వేషం పెంచుకోకూడదు.

ఈ సిద్దాంతాన్ని నమ్మి మనవాళ్ళు అవసరార్ధం, అనవసర ద్వేషాన్ని తప్పించడం కోసం చరిత్రను వక్రించి రాశారే అనుకుందాం, అదే సహృదయాన్ని హిందువులపై మాత్రం ఎందుకు ప్రదర్శించలేదు?

హిందూ మతమంటేనే దురాచారాలతో, కుల వ్యవస్తతో కునారిల్లుతున్నది అన్నట్టుగా ఎందుకు బిల్డప్పిచారు? ఆమాత్రం అన్ని మతాలలో ఉన్నాయిగదా? ఎందుకీ Selective Liberalism and Selective Criticism, దీనివల్ల వీరు సాధించేది ఏమిటి?

చరిత్రను చరిత్రలా, ఏ యిజాలతోనూ, రాజకీయాలతోనూ సంబంధం లేకుండా చదువుకునే రోజు ఎప్పుడు వస్తుందో..!!

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2011/12/23/%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/trackback/

%d bloggers like this: