మగవారి దుస్తులపై మోరల్ పోలీసింగ్ .. నా కంఫ్యూజన్..!!

సెటైర్ టోటలుగా కాకపోయినా కొద్దిగా మిస్-ఫైర్ అయినట్టుంది..!!

మీరెప్పుడైనా గమనించారా? మగళ్ళబారి నుండి రక్షించుకోవడానికి స్త్రీలు అవలంభించ వలసిన ఆత్మరక్షణా పద్దతులు అంటు కొంత్ మంది కరాటే, కుంగ్-ఫూ లు నేర్చుకోండి అని చెబితే, మరికొంత మంది కొన్ని సాధారణ సలహాలు ఇస్తుంటారు.

నిజానికి ఆ సాధారణ సలహాలే 90% ఉపయోగ పడతాయి కూడా. వాటిలో కొన్ని, చీకటిగా ఉన్న ప్రదేశాల్లో వెల్లకుండా వీధిదీపాలున్న వీధుల్లో వెల్లడం, ఒంటరిగా వెల్లకుండా వీలైనంత వరకూ నలుగురితో వెల్లడం, ఇంకోకటి.. మోడెర్న్ దుస్తులు అంటే కాస్త రెచ్చగొట్టేవి వేసుకోకుండా ఉండడం.

పైన చెప్పిన పాయింట్లు, చాలా మంది చాలా చోట్ల చెప్పారు. ప్రతీ పేపరులో స్త్రీలకు సంబందించి ఒక పేజీ ఉంటుంది. వసుంధర అని కావచ్చు, చెలి అని కావచ్చు.. వాటిలో చాలా మంది స్త్రీవాదులు వ్యాసాలు రాస్తుంటారు. వాటిలో కూడా నేను పైన చెప్పిన అంశాలు (దుస్తులతో సహా) ప్రస్తావించడం జరిగింది.

ఇంకా అనుమానంగా ఉందా, అయితే ఇద్దరమ్మాయిలను ఎన్నుకోండి. వారిలో ఒకరికి సాంప్రదాయ బద్దంగా ఉందే దుస్తులు వేయండి. మరొకరికి కాస్త పోష్‌గా ఉండే దుస్తులు వేయండి. వారిద్దరిని బస్‌స్టాపులోనో, లేక మగవారున్న ప్రాంతములోనో తిరగమనండి. ఎవరు ఎక్కువగా మగవారిని ఆకర్షిస్తారో గమనించండి.

నా ఉద్దేశ్యం ప్రకారం, ఇలాంటి విషయాలలొ దుస్తుల పాత్ర కూడా ఉంది. అవి ఖచ్ఛితంగా రెచ్చగొడతాయి. కానీ, దాన్ని వీరు దాన్ని ఒప్పుకోక పోవడానికి కారణం, అత్యాచారాలు జరిగినప్పుడు తప్పు బాధితిరాలి మీదకి నెట్టబడుతున్న భయమే అని నాకనిపిస్తుంది.

రెండు చేతులూ కలిస్తే కానీ చప్పుడు కాదు, భాదితురాలు అతన్ని అటువంటి దుస్తులతో రెచ్చగొట్టింది అనే వాదనలు మొదలవుతాయి. అత్యాచారం చేసిన వాడి మీద కొద్దిగా సానుకూల ధోరణి ఏర్పడుతుంది. అదే వారి భయం.

అంతే కాదు అత్యాచారానికి కారణం వేసుకునే దుస్తులు కూడా అని అంగీకరించిన మరుక్షణం మన సంస్కృతీ, సాంప్రదాయాలూ అంటూ క్లాసులు మొదలవుతాయి. పోనీ, మన సంస్కృతికి తగినట్టు వేషధారణ ఉన్నా అత్యాచారాలు జరగవా అంటే, సమాధానం “లేదు” అనే వస్తుంది.

అప్పుడు కూడా అత్యాచారాలు జరుగుతాయి. అప్పుడేమంటారు, స్త్రీలు ఉద్యోగాల పేరిట బయటికి వస్తున్నారు అనా? లేక కొంత మంది స్త్రీలు అందంగా ఉండడం వలన అలా జరుగుతోందనా? ఒక దానికి సమాధానం ఇంట్లో కూర్చోమని వస్తుంది, మరో దానికి బుర్ఖాలు వేసుకోమని వస్తుంది. అదేనా సమస్యకి పరిష్కారం?

మరో విధంగా ఆలోచిద్దాం. అమ్మాయిలు విపరీత పోకడలతో దుస్తులు వేసుకున్నా మగాళ్ళందరూ అత్యాచారాలు చేయడం లేదు. ఎందుకు? వారికి సంస్కారం, చట్టం పట్ల భయం లాంటివి అడ్డొస్తున్నాయి. సో, అలాంటివే అందరికీ కల్గించగలగాలి. రెండు అంత సులువైన విషయాలు కావు.

చట్టం పట్ల భయం అనేది కఠినమైన చట్టాల ద్వారా కలిగించొచ్చు అనేది కొందరి వాదన. కానీ, ప్రస్తుతం ఉన్న శిక్షలు తక్కువైనవేమీ కావు. అవీ కూడా ఖఠినమైనవే. అవి అమలవ్వడం లేదంతే. అవి ఖచ్ఛితంగా ఆమలయ్యి దోషులకు త్వరగా శిక్షలు పడాలి. అది చెప్పినంత సులభం కాదు.

బాగా కంఫ్యూసింగ్ గా ఉందికదా. నాదీ సేం ఫీలింగ్. ఈతరహా వాదనలు వచ్చినప్పుడల్లా అలానే ఉంటుంది.

అందుకే ఆ కంఫ్యూజన్ను వదిలేసి, కొన్ని గుడ్డిగా ఫాలో అవ్వడమే చేయగలిగింది.

1. దుస్తులు కొంత మందిని రెచ్చగొడతాయన్నది నిజం.
2. అంత మాత్రాన అవతలి వారికి అత్యాచారం చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు.
3. అత్యాచారానికి కారణం రెచ్చగొట్టినట్టు ఉందే దుస్తులే అయినా అత్యాచారం చేసిన వాడికి శిక్ష తప్పదు.
4. ఆడవారు కూడా దుస్తుల విషయములో కొంత తెలివిని చూపించాలి. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమాన హక్కులు ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. కానీ, వాస్తవాలు కొన్ని చాలా దారుణంగా ఉంటాయి.

నావరకూ నేను ఇవే గుడ్డిగా ఫాలో అవదలుచుకున్నా. (అంటే నా ఉద్దేశ్యం, ఈ తరహా వాదనలు వచ్చినప్పుడు నేను అనుసరించాల్సిన మార్గమన్న మాట).అందుకే ఎవరన్నా దుస్తులు కూడా కారణమవుతాయి అన్నప్పుడు, నిజమే అని ఒప్పుకోవడం. అలా అని తప్పు వారిదీ ఉంది కాబట్టి ఆపని చేసిన వాడి పట్ల సానుభూతి చూపకండి. అని గట్టిగా చెప్పడం.

మన DGP అయినా, Slut Walk కు కారనమైన మరో పోలీసు అధికారి అయినా ఇది మనసులో ఉంచుకునే చెప్పాడని నాకనిపిస్తుంది.

=============================================

గమనిక: ఇందులోని పాత్రలూ,  పేర్లూ కల్పితాలే, ఎవ్వరినీ ఉద్దేశించి రాసినవి కావు. పొరపాటున ఇవి ఎవరి జీవితములో నైనా జరిగిఉంటే మాకు తెలుపండి. ఓ యదార్థగాద ఆధారంగా రాసినది అంటూ పబ్లిసిటీకి ఉపయోగించుకుంటాం. 😛

అందమైన కుర్రాడు తరుణ్. అందం, వయస్సు తెచ్చిన చురుకు దనం అతని సొంతం. గలగలా నవ్వుతూ, తుల్లుతూ, మందేసినప్పుడు కాస్త తూలుతూ ఉండే తరుణ్, ఆరోజు మాత్రం అలా లేడు. కళ్ళలో నీరు ఉబికి వస్తోంది, దుఖః తన్నుకు వస్తోంది. పదే పదే జరిగిన సంఘఠన గుర్తుకు వస్తోంది.

ఆరోజు ఎప్పటిలానే షాపింగ్ చేయడానికి నగరములో పేరుమోసిన ఓ షాపింగ్ మాల్ కి వెల్లాడు తను. అరగంటపాటు షాపింగ్ మాలంతా తిరిగాక కాని దొరకలేదు అతనికి నచ్చిన కర్చీఫ్. తన పాదాల దగ్గరున్న అరలో నీట్‌గా పాలితీన్ కవర్‌లో ప్యాక్ చేసి ఉందది. అది కనపడగానే ఉద్వేగం ఆపుకోలేక చటుక్కున కిందికి వంగి దాన్ని అందుకుని .. ప్యాకింగు విప్పి ఆప్యాయంగా నిమురుతుండగా ..

ఏదో బలమైన శక్తి ముందుకు తోసినట్టు దభీమని ముందుకు పడ్డాడు. మొహం బలంగా నేలనుతాకింది. కంగారుగా మొహాన్ని తడిమిన చేతికి తగిలింది వెచ్చని రక్తం. ముక్కు పగిలి రక్తం కారుతోందని అర్థమైంది అతనికి. తలెత్తి చూస్తే ఎదురుగా ఒకమ్మాయి నిల్చుని ఉంది. కోపంగా, అసహ్యంగా తననే చూస్తూ…

—— / 0 / ——–

ఎందుకు  తన్నావ్ అతన్ని?  కరుకుగా అడిగింది ఇన్స్పెక్టర్ రాగిని.  మేడం, అతను అశ్లీలంగా, అసహ్యకరంగా ఉండే దుస్తులు వేసుకున్నాడు. అతను hip huggerను ( అంటే నాభి నుండి ఓ 8 సెంటీమీటర్లు కిందికి ఉండే ప్యాంట్లు) అండర్‌వేర్ లేకుండా వేసుకున్నాడు. అదివేసుకుని అలా వంగుని ఉంటే వెనుకనుండి మనం ఏమేం చూసి భరించాల్సి వస్తుందో తెలీదా?  .. ఆ అసహ్యాన్ని తట్టుకోలేక పోయాను. అందుకే అలా చేశాను అంది.

ఆలోచనలో పడింది రాగిని. ఈ మధ్య అబ్బాయిలు ఫ్యాషన్ల పేరుతో మరీ బరితెగించి డ్రస్సులు వేసుకుంటున్నారు. అయినా ఆ అమ్మాయి అలా తన్నడం తప్పు, కాబట్టి ఆ అమ్మాయి మీద కేసు బుక్ చేసి, తరుణ్ వైపు చూస్తూ ఇలాంటి రెచ్చగొట్టే డ్రస్సులు వేసుకోకు అంటూ సలహా ఇచ్చింది, చాలా మంది మగాళ్ళు ఇలా తన్నులు తినడానికి ఇలాంటి రెచ్చగొట్టే దుస్తులే కారణమవుతున్నాయి అంది.

ఆమె దురదృష్టం 2008లో వచ్చిన ఆర్థిక మాంధ్యమంత బలంగా ఉండడముతో.. ఆసంఘఠన, ఒక కేసుగురించి వివరాలు తెలుస్కోవడం కోసం అక్కడికి వచ్చిన విలేఖరి చెవులకి, ఒక కెమెరామాన్ కెమెరా కంటికీ చిక్కింది.

—— / 0 / ——–

పేపర్లూ, న్యూసు ఛానెల్లూ హోరెత్తిపోయాయి. మగవారి దుస్తులపై ఒక మహిళా ఇన్స్పెక్టర్ మోరల్ పోలీసింగ్ అని, మగవారిని సీటుమీద తన్నడాన్ని సమర్దించిన లేడీ ఇన్స్పెక్టర్ అనీ ఒకటే గొడవ, ఆవిడ చెప్పిన దాన్ని మీరు అంగీకరిస్తారా? అవును అయితే ఫలానా నంబరుకి yes అని లేకపోతే No అని SMS చేయండి అంటూ పోలింగులు..

దీనితో పురుష సంఘాలు తోకతొక్కిన త్రాచులే అయ్యాయి. ఇది అలా అలా ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసిపోయింది. అప్పుడే “రోగ్‌వాక్ ” అనే ఉధ్యమం ఊపిరిపోసుకుంది. వేల కొలదీ మగాళ్ళు రోడ్లమీదికి అండర్వేలతో వచ్చి నిరసనలు తెలియ జేశారు. కొన్ని దేశాలలో నగ్నంగా కూడా వచ్చారు.

It’s my ugly body,I Do what i want.
Yes, I am rogue. So, what?.
My dress is not an invitation to kick my bu**

లాంటి అనేక నినాదానల్తో, ప్లకార్డులతో ప్రపంచం హోరెత్తి పోయింది.

—— / 0 / ——–

ఎక్కడ చూసిన చర్చలు, మగవారి రెచ్చగొట్టే డ్రస్సులే వారు తన్నులు తినడానికి కారణమవుతున్నాయా అని. కొంతమంది, మగవారు తన్నులు తినడానికి డ్రెస్సులు కారణం కాదని వాదిస్తున్నారు. మరికొందరు అవునని వాదిస్తున్నారు. ఫలానా చోట కొంత మది మగాల్లు, చిన్న పిల్లలూ ఇలాంటి డ్రస్సులు వేసుకోకపోయినా తన్నులు తిన్నారని కాబట్టి డ్రస్సులు దీనికి కారణం కాదనీ మగవారి వాదన.

ఆడవారు మాత్రం, అలాంటి డ్రస్సులు వేసుకున్న వారిని చూస్తే అసహ్యం వేస్తుంది కదా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. రేపొక మగవాడు, నా శరీరం నా ఇష్టం నేను చూపించుకుంటను అని న్యూడ్‌గా బయటికి వస్తే ఏమిచేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

పల్చటి గుడ్డతో తయారు చేసిన స్కిన్ టైట్ ప్యాంట్లూ, ట్రాన్స్‌పరెంట్ ప్యాంట్లూ,  ఇవన్నీ అశ్లీలంగానూ, అసహ్య కరంగానూ ఉంటాయని వారి వాదన. అంత అసహ్యంగా అనిపిస్తే, ఆడవారినే కళ్ళుమూసుకో మనండి అంటూ మగవారి సెటైర్లూ. ఒకటే గోల గోలగా తయారవుతున్నాయి.

—— / 0 / ——–

మీరే చెప్పండి, ఎవరు కరక్టు? అబ్బాయిలు అలాంటి డ్రస్సులు వేసుకోవచ్చా? అవి అసహ్యం కలిగించవా? కలిగించినంత మాత్రాన అబ్బాయిల్ను అలా కొట్టకూడదు అంటారా? అయితే అలాంటివి అసహ్యాన్ని కలిగిస్తాయని ఒప్పుకుంటారా లేక మగవారి అభిప్రాయాలకి విలువిచ్చి వదిలేస్తారా?

P.S: ఇదంతా రాయడానికి ప్రేరణ, ఆడవారి దుస్తులు అశ్లీల కరంగానూ, అభ్యంతర కరంగానూ ఉన్నాయని కొంత మంది చెబితే, మా శరీరం మా ఇస్టం, మధ్యలో నీకేమి అంటూ వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే. అంతే కానీ, రేప్ జరగడానికి ఇవి కారణమని చెప్పడానికో, రేపులను సమర్ధించడానికో కాదు.

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2012/01/03/%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa/trackback/

%d bloggers like this: