ప్రతిపక్షములో ఉన్నప్పుడు..
తమ ఇజానికి చెందిన పార్టీ అధికారములోకొస్తే
అందరికీ మంచి జరుగుతుందంటారు
దున్నే వాడిదే భూమంటారు..
కార్మికులు, రైతులే రాజులంటారు కొందరు.
ఒకటీ లేదా రెండు రూపాయలకే కిలో బియ్యమంటారు
ఇంటింటికీ కలర్ టీ.వీ అంటారు
ఉచిత విధ్యుత్తులంటారు..
మధ్యపానాన్ని నిషేదిస్తామంటారు..
రైతులే నా సర్వస్వమంటారు .. మరికొందరు
సెజ్‌లకు తాము వ్యతిరేకమంటారు..
పంటపోలాలను నాశనం చేసి
వాటినే నమ్ముకున్న రైతుల కడుపు కొట్టొద్దంటారు.
అరణ్యములోని అన్నలతో చేతులు కలుపుతారు..
జనారణ్యములోని తమ్ముళ్ళతో మంతణాలు సాగిస్తారు.
అధికారము రాగానే..
పేదప్రజల స్థితిగతుల్లో మార్పులుండవు..
దున్నేవాడు ధూన్నుతూనే బతుకుతుంటాడు..
కార్మికులూ, రైతులూ గతి అలానే ఉంటుంది..
బియ్యం ధర ఉట్టినుండి ఆకాశానికి ఎగురుతుంది
మందు, బెల్టు షాపుల్లో ఏరులైపారుతుంది…
కలర్ టీ.వీ వస్తుంది, కరెంటుబిల్లు పెరుగుతుంది,
రైతులకు ఉచిత విధ్యుత్తు దొరుకుతుంది, కరంటుకోత పెరుగుతుంది.
తాము వ్యతిరేకించిన సెజ్‌లు ఆమోదం పొందుతాయి
పంటపొలాల ఆక్రమన నిరభ్యంతరంగా జరుగుతుంది
అరణ్యాల్లో అన్నలకు డెడ్‌లైన్ ఇస్తుంది..
జనారణ్యములోని తమ్ముళ్ళపై కేసులు మోపుతుంది
ఎందుకిలా..
అధికారములో ఉన్న వారికి భాధ్యత ఉంటుంది
ప్రతిపక్షములోని వారికి కోరిక ఉంటుంది.
ప్రతిపక్షమో ఉన్నప్పుడు ఎర్ర జబ్బు సోకుతుంది..
కళ్ళకు ఎర్రపొరలు కమ్ముకుంటాయి..
అధికారము ఆజబ్బుకు మందవుతుంది..
అధికారముతో వచ్చే బాధ్యత..
కళ్ళకున్న ఎర్రపొరల్ని కరిగిస్తుంది.
వాస్తవాన్ని చూడడం నేర్పిస్తుంది.
ఉచితాలు ఇవ్వగలిగేంత సమపన్నులెవరూ లేరని
సమానత్వమంటే ఉన్నవాన్ని కిందికి లాగడం కాదని
కిందున్న వాడిని ఉన్నత స్థాయికి తీసుకెల్లడమని..
శాంతి భధ్రతలను దెబ్బతీసి, అభివృద్దికి అడ్డుగావచ్చే..
అన్నలనూ, తమ్ముళ్ళనూ పక్కన పెట్టడం మేలని..
సమానత్వం సాధించడానికి
ఉపాధి అవకాశాలు కల్పించాలే కానీ
పరిరక్షణ పేరుతో దెబ్బతీయకూడదనీ
వారికి తెలిసివస్తుంది.