కార్ల్ మార్క్స్ గొప్ప ఫిలాసఫరా..?

విషయమేమిటంటే, బి.బి.సి రేడియో 4 వారు నిర్వహించిన పోల్‌లో గొప్ప ఫిలాసఫర్‌గా   మార్క్సిస్టుల డెమీగాడ్ మార్క్స్ ఎన్నుకోబడ్డాడు. దానితో, పెట్టుబడిదారులు ఒక్కసారి విస్మయానికి గురి కావాల్సి వచ్చింది. మరో పక్క మార్క్సిస్టుల ఆనందానికి అవధులు లేవనుకోండి. ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు 2005లో.

ఆ Pollలో 30,000 వోట్లలో దాదాపుగా 28% వోట్లు మార్క్సుకు వచ్చాయి. మార్క్సు తరువాత రెండవ స్థానం డేవిడ్ హ్యూం 12.7% వోట్లతో నిలిచాడు.  మార్క్సుతో పోలిస్తే కనీసం సగం కూడా లేదు. 20 మందిని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో సోక్రటీసు, అరిస్టాటిల్ల స్థానం 8, 9 కావడం ఆశ్చర్యకరమైన అంశం.

సహజంగానే మన కమ్యూనిస్టులు, ఉబ్బితబ్బిబ్బయ్యారనే చెప్పాలి.  మా మార్క్సు గొప్పదనము చూదురు రారండోయ్ అని గొప్పగానే చెప్పుకున్నారు. దీనిని ఉటంకిస్తూ, పెట్టుబడిదారులు డేవిడ్ హ్యూం (David Hume) మరియు కాంట్ (Kant) అనే ఫిలాసఫర్ల కోసం ఎంత లాబీచేసినా లాభం లేకపోయింది. మార్స్కునే ప్రజలు మెచ్చారు అని చెప్పుకున్నారు.

కాకపోతే మనం ఇక్కడ గమనించ విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది, ఇది ఒక పోల్ మాత్రమే.  వారాలపాటు సాగిన ఈపోల్ లో ఒక్కో వ్యాఖ్యాత ఒక్కో ఫిలాసఫర్ను సమర్ధిస్తూ, వారి సిద్దాంతాలను వివరించడం జరిగినా, పోల్స్ అనేవి ఎలా జరుగుతాయి అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు.

మన మార్క్సిస్టు మితృలు చెప్పకుండా దాచేసిన అంశమేమిటంటె, పెట్టుబడిదారులే కాడు, మార్క్సిస్టులు కూడా మన మార్క్సుకు వోటేయండి అంటూ పత్రికలలో, వెబ్సైట్లలో కంపైన్ నిర్వహించడం జరిగింది. అంటే, ఈ రేడియో పోల్ అనేది, మార్క్సిస్టుల డెమీగాడ్ మార్క్సు యొక్క పాపులారిటీ టెస్టులా వారు భావించారు.  ఈవిషయాన్ని మాత్రం మన మార్క్సిస్టు మితృలు ఎంతో కన్వీనియంటుగా చెప్పకుండా దాచేశారు.

కానీ, సోషలిస్టులు నడుపుతున్న వెబ్సైటులోని ఆర్టికలును పరిశిలిస్తే, మార్క్సిస్టులు కూడ కాంపెయిన్ చేశారని అర్థమవుతుంది. దీన్ని మన మార్క్సిస్టు మితృలు ప్రస్తావించనైనా ప్రస్తావించలేదు … (link)

Marx won hands down, despite a campaign by the pro-boss media, urging people to vote for anyone but Karl Marx. The respectable upper-crust publication, London’s The Economist, urged its readers: “Vote for David Hume!” (David who?) The pro-labor web site “In Defence of Marxism,” based in Britain, was more successful in organizing its readers to vote for Marx.

In Defense of Marxism అనే బ్రిటనుకు చెందిన వెబ్సైట్, తన పాఠకులను మార్క్సుకు వోటువేయమని ప్రోత్సహించడం జరిగింది. సరే అందరూ చేశారు కదా, మరి మార్క్సుకు మాత్రమే అన్ని వోట్లెలా వచ్చాయి అంటారా? సింపుల్.  వోట్లనేవి మార్స్కు నిజంగానే ఫిలాసఫర్ అయ్యుంటేనే రానవసరం లేదు. ఆయన సిద్దాంతానికి పంఖాలుగా ఉన్న మార్స్కిస్టులందరూ ఒటేస్తే చాలు అలా వచ్చేస్తాయి. మార్క్సిస్ట్ అనే వారెవరైనా సరే మార్క్సుకు మాత్రమే ఓట్లేస్తారు. మార్క్సుకు బ్రిటనులో చాలా మందే పంఖాలున్నారు. వారందరూ దీన్ని తమ హీరో పేరు ప్రతిష్టలకు సంబందించిన ఇష్యూగా భావించారు.

కానీ మార్క్సిజాన్ని నమ్మని వాల్ల వోట్లు ఎవరికి పడాలి? ఆవిషయములో మాత్రం మార్క్సిస్టు వ్యతిరేకులు, మార్క్సిస్టులంత ఆర్గనైజుడు కాదు. వారంతా కేవలం తనకు నచ్చిన వారికి వోట్లేయడం జరిగింది. They are divided.

The Guardian came out in favour of Kant; The Economist, Hume; and The Independent Wittgenstein, then changed its mind, playing on Wittgenstein’s famous change of philosophical position. (link)

ఒకానొక మార్క్సిస్టు ప్రొఫెసర్ చెప్పినదాన్ని గమనిస్తే మనం దాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. (link)

Andrew Chitty, who, at Sussex University, teaches the UK’s only MA in Marxist philosophy, said: “This shows that philosophy should take Marxism seriously. It is possible he won because Marxists organised a mass vote; they’re much more organised than Hegelians, for instance.

మార్క్సిస్టులందరూ, తమ డెమీగాడ్‌కు వోట్లేసేలా ఆర్గనైజ్ చేయబడి ఉండొచ్చు అని, అసలు విషయం చెప్పకనే చెప్పాడాయన. అంతే కాదు,  మిగిలిన వారు మార్క్సిస్టులంత బాగా ఆర్గనైసుడు కాదు అని కూడా చెప్పేశాడు.

పనిలో పనిగా, ఇక మీదటైనా ఫిలాసఫీ .. మార్క్సిజాన్ని సీరియస్సుగా తీసుకోవాలని కూడా కోరాడు. బహుషా మార్క్సిజాన్ని అసలు ఫిలాసఫర్లెవరూ ఫిలాసఫీగా అంగీకరించకుంటా. నాకు అది సమంజసమే అనిపిస్తోంది. ఎందుకంటే, ఫిలాసఫీ అనేది సైంటిఫికల్‌గా ఉండాలట. మార్క్సిజం సైన్సుకు ఆమడదూరం. మరి దాన్ని ఫిలాసఫీగా ఎలా పరిగణిస్తారు. నాకు కూడా ఈవిషయం ఇది వరకు తెలీక, మార్క్సిజం అయ్యుంటే ఫిలాసఫీ అయ్యుండొచ్చు కానీ శాస్త్రీయమైంది కాదు అనేవాన్ని. నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. మార్క్సిజం ఫిలాసఫీ కూడా కాదు. అదో నమ్మకం అంతే.

అసలు గొప్ప ఫిలాసఫర్ ఎవరు అనేది, వోట్లేసి తేల్చుకునేది కాదు కదా? ఏదేమైనా, ఈ పోల్‌ను భట్టి చూస్తే మార్క్సు గొప్ప ఫిలాసఫర్ అని ఒప్పుకోకపోయినా, బ్రిటనులో మార్క్సిస్టుల జనాభా బాగానె ఉందని మాత్రం ఒప్పుకోవాల్సి వస్తుంది. Marx (even though he is not a philosopher) is more popular than many philosophers.  మార్క్సు పాపులర్ అని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలూ లేవు, కానీ మార్క్సు ఫిలాసఫర్ అని ఒప్పుకోవడమే కుదరని పని. అలా కాదు మార్క్సు గొప్ప ఫిలాసఫరే అని నమ్ముతామంటారా? ఇక మీ ఇష్టం.

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2012/10/25/%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%81/trackback/

%d bloggers like this: