మగాళ్ళను పిచ్చ కొట్టుడు కొట్టడమే … అక్కడ హోళీ స్పెషాలిటీ..!!

ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరగా ఉన్న బర్సన అనే ఊళ్ళో హోళీని వెరైటీగా జరుపుకుంటారు. అక్కడ హోళీ సందర్భంగా మహిళలు మగవారిని లాఠీలతో పిచ్చ కొట్టుడు కొడతారన్న మాట. దీన్నే వారు లఠ్ మార్ హోలీ అని ముద్దుగా పిలుచుకుంటారు.  లఠ్ అంటే లాటీ అని అర్థమట.

దీనికి ఓ ప్రత్యేక కారణముంది. పురాణ కాలములో చిలిపి క్రిష్ణుడు, తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి, అక్కడ ఆమెను, ఆమె స్నేహితురాళ్ళను ఆటపట్టించాడట. దీనిని తప్పుగా భావించిన ఆ గ్రామం మహిళలు, కర్రలతో క్రిష్ణయ్యను వెంట తరిమారట. అప్పటినుండి, ఈ పండగ ఇలా జరుపుకోవాడం జరుగుతోంది. పక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం, నంద్‌గావ్ నుండి మగవారు హోళీ ఆడడానికి ఈ గ్రామం రావడం,  హుషారుగా హోళీ పాటలు పాడడం, ఆడవారిని రెచ్చగొట్టడం వారిచేతిలో లాఠీ దెబ్బలు తినడం ఆనవాయితీ అన్న మాట.  కాకపోతే, ఆడవారు కొట్టే దెబ్బలను వారు ఢాలు వంటి దానిని ఉపయోగించి తప్పించుకోవచ్చు.  ఆడవారు కూడా వారిని ఢాలు మీదనే ఎక్కువగా కొడతారు.

ఈ హోళీకి అక్కడ ఒక నెల రోజుల ముందు నుండే ప్రిపరేషన్ జరుగుతుంది.  అత్తలు తమ కోడళ్ళకు ఆ నెల రోజు మంచి పౌష్టిక ఆహారం పెడతారట, బాగా కొట్టడానికి.  ఇక్కడ కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాడు, వారి పట్ల తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెబుతారు గ్రామస్తులు.

ఇలాంటిదే మరో హోళీ హర్యానాలో జరుగుతుంది. దాని పేరు “కరోర్ మార్” హోళీ. ఇక్కడ వదినలు (మరదళ్ళూ కూడానేమో)  మరిదిని (బావను కూడా అని నా అనుకోలు) పిచ్చ కొట్టుడు కొట్టడం స్పెషాలిటీ.   సంవత్సరమంతా వారు తమ మీద వేసిన జోకులకూ సెటైర్లకూ, టీజింగులకు ఆరోజు కసి తీర్చుకుంటారన్న మాట.  ఇది కేవలం కుటుంబమంతా తమ విభేదాలను మర్చిపోయి,  కలిసి మెలసి జీవించడనికి చేసుకునే పండగ అని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమనీ చెబుతున్నారు.

విశేషమేమిటంటే, లాఠ్ మార్ హోళీ లా ఇక్కడ మగవారు ఢాలు లాంటివి తెచ్చుకోరు, ఆదవారు కూడా కేవలం దెబ్బలు తగలకుండ కొట్టడం అనే కాన్సెప్టును ఫాలో అవ్వరు. ఏది దొరికితే అది అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలి, లేదా తన్నులు తినాలి. విడియోలో ఓ ఇద్దరు ఆడవారు, ఒక మాజీ కేంద్ర మంత్రిని రఫ్ఫాడించేయడం చూడొచ్చు.

వెరైటీగా ఉంది కదా? హర్యానాలో ఎవరైనా పిల్లనిస్తామని వస్తే కమిటవకండే.. 😛

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2013/03/27/%e0%b0%ae%e0%b0%97%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%a1%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

3 Comments

 1. తమాషాగా ఉంది.

  Like

 2. బాగుందండి:)

  Like

 3. @SriRam,
  @Jaya,

  Thanks for responding.. 🙂

  Like


Comments are closed.

%d bloggers like this: