మావోయిస్టులను రొమాంటిక్‌గా చూపడం మానండి – జైరాం రమేష్

కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడం వలన ప్రతిష్టనూ, అప్రతిష్టనూ రెండింటినీ మూటగట్టుకున్న కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఈ సారి మావోయిస్టుల మీద తన అభిప్రాయాన్ని ఘాటుగానే వెలిబుచ్చాడు. ఒక వ్యక్తి చేసిన వ్యాక్యల విలువను తర్కించి, వాటిలోనీ నిజానిజాలను బేరీజు వేసుకొని నిర్ణయించాలే తప్ప, ఇంతకు ముందు చేసిన వ్యాక్యలను చూపి వీటిని అదేగాటన కట్టేయడం విఙ్ఞుల లక్షణం కాదు. కాబట్టే, జైరాం రమేష్ ఏమన్నాడో ముందుగా చూద్దాం..!!

They[Maoists] are terrorists. What else are they? You can’t romanticize them. They are spreading fear. They are spreading terror.

ఇందులో ఎటువంటి సందేహానికీ తావులేదు. వారు నిజంగానే తీవ్రవాదులు. అనేక మంది గిరిజనులను, ఆడవారు, పిల్లలు అని కూడా చూడకుండా వారు సల్వాజుడుం సానుభూతి పరులు అన్న అనుమానముతో ఊచకోత కోసారు. మన కమ్యూనిస్టు మితృలు చెబుతున్నట్టు కేవలం సల్వాజుడుంకు చెందిన వారు మాత్రమే మావోయిస్టు సానుభూతి పరులపై దాడులు చేయలేదు. అవి రెండువైపులా అంతే తీవ్రతతో జరిగాయి. సహజంగానే అర్ధసత్యాలకు అలవాటుపడ్డా మనవారు దాన్ని దాచేస్తున్నారు. మరి మావోయిస్టులు మాత్రం గిరిజన సంక్షేమాన్ని కాంక్షించే వారు ఎలా అయ్యారు?

వారిది గిరిజన సంక్షేమం కాదు. తమ సిద్దాంతాన్ని అమలుపరచడం. దానికి వారు ఎన్నుకున్న మార్గం సాయుధ పోరాటం. హింసాత్మక పోరాటం. అందులో ఎంతో మంది అమాయకులు అసువులు బాసారు. మరి వారు తీవ్రవాదులు కాకుండా ఎలాపోతారు? ఇక్కడ గిరిజనులు, దోపిడీకి గురవుతున్న వర్గం వారు, పేదలు అలాంటివేమీ ఉండవు. వారిని వ్యతిరేకించిన వారు అలా దోపిడీకి గురైన వర్గములో ఉన్నా, వారు పేదలే అయినా వారిని అతికౄరంగా హతమార్చడం మనం గమనించవచ్చు. సల్వాజుడుం నిషేదించబడ్డది. అంతం కావించబడ్డది. మరి మావోయిజం మాటేమిటి? దాన్ని సమర్ధిస్తున్న వారు, అది తప్పు చేసింది అంటూనే, వారు పేదలపక్షం అంటూ సానుభూతి కురిపిస్తున్నవారి మాటేమిటి??

తమ సిద్దాంతాన్ని అమలు పరచడానికి వీరు[మావోయిస్టులు] ఎన్నుకునే మార్గం, అమాయకులైన గిరిజనులనూ, కష్టాల్లో ఉన్న పేదలను రెచ్చగొట్టి, వారికి ఆయుధాలు అందించి హింసాత్మక చర్యలకు ప్రేరేపించడం. ఈ పనులు మరే సంస్థ చేసినా వాటిని అందరూ ఖండిచే వారు. అది కనుక పొరపాటున ఏదైనా మతానికి చెందిన సంస్థలైతే మతమనేదే మత్తు. అది హింసనే ప్రేరేపిస్తుంది అంటూ, మతాలపై విరుచుకుపడేవారు. కానీ, ఈ మావోయిస్టులను ఎందుకు వదిలేస్తున్నారు?

ఎందుకంటే, మనం మావోయిస్టులను రొమాటిసైజ్ చేయడానికి అలవాటుపడ్డాం. వారు పేదల పక్షం అనే అపోహను పెంపొందించుకున్నాం. ఆ కోణములోనే సాహిత్యాన్ని సృష్టించుకున్నాం, సినిమాలు తీసుకున్నాం. పేదలకోసం, అణగారిన వారి కోసం పనిచేసే వారు అదే పేదలను, అణగారిణవారినీ, గిరిజనులనూ ఎందుకు హతమార్చుతున్నారు? అసలెందుకు ఈపేదలూ, అణగారిన వర్గాలవారు అంతా మావోయిస్టులను సమర్ధించడం లేదు? దాన్ని అర్థం చేసుకోవాలి. మావోయిస్టులను రొమాంటిసైజ్ చేయడం ఆపాలి. కాబట్టీ ఆయన అన్నది సరైనదే అని నా అభిప్రాయం.

ఈ సందర్భంగా జై రాం రమేష అన్న మరో మాటను మనం గుర్తుంచుకోవాలి.

if Maoists were “so confident of themselves, why don’t they participate in the electoral process?”

నిజంగా వీరు చేసేవి ప్రజా పోరాటాలే అయితే, సామాన్య ప్రజల్లో, తాము ఉద్దరిస్తున్నామంటున్న గిరిజనుల్లో అంత మద్దతే ఉంటే, రాజకీయాల్లోకే వచ్చి గెలవచ్చు కదా? ఆ ప్రజాపోరాటాలే (అహింసాయుతంగా) చేసి, ప్రజలను చైతన్య పరిచి, ప్రజాస్వామ్యములో ఏనేత అయినా అర్థం చేసుకునే “వోటు” భాషలో సమాధానం చెప్పించొచ్చు కదా? వీరు అలా చేయలేరు. ఎందుకంటే, వారు చెప్పుకుంటున్నట్టు పేదలు, గిరిజనులూ వీరిని తమ రక్షకులుగా భావించడంలేదు. లేని పెద్దరికాన్ని, నాయకత్వాన్ని నెత్తినవేసుకుని, దానికి హింసాత్మక రూపాన్ని ఇచ్చి అదే పేదలు, గిరిజనులూ అభివృద్దికి నోచుకోకుండా చేస్తున్నది వీరే.

References:

News from “The Hindu” – Maoists shouldn’t be romanticised: Ramesh

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2013/05/28/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b0%e0%b1%8a%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d/trackback/

RSS feed for comments on this post.

One Comment

  1. నక్సలైట్ ల సంగతి వోదిలివేయండి ,అసలు వోట్ల సంగతి తెలుసా ఆయనకీ ,[ Edit] దోపిదిదొంగాలు.99% మంది వారే ,ఇది ప్రజా అభిప్రాయం ,ఆ 99 % మందిలో జయరాం రమేష్ ఒకడు ,అడగండి సామాన్య ప్రజలను

    Like


Comments are closed.

%d bloggers like this: