రాంబో “మోడీ” – ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కిన 15,000 మందిని సురక్షితంగా తరలించాడు

అసలు నేను చదివిన వార్త నిజమే అయితే (కాకుండా ఎలాపోతుంది, వచ్చింది TOI అనే జాతీయ పత్రికలో?) నరేంద్ర మోడీని ఎంత పొగిడినా తక్కువే. ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదలు ఎంత ప్రాణ నష్టాన్ని కలిగించాయో, కలిగిస్తున్నాయో చూస్తున్నాం. ప్రస్తుతం లెక్క తేలిన ప్రాణ నష్టం కన్నా, అక్కడా చిక్కుకు పోయిన యాత్రీకుల సంఖ్య అధికంగా ఉంది. కొంత మంది 50,000 మంది చిక్కుకు పోయారని అంటున్నారు. మరికొన్ని ఆ సంఖ్య 70,000 వరకూ ఉంటుందని అంటున్నారు.  ప్రస్తుతం అక్కడున్న వాతావరణం, సోమవారం నుండి వర్షాలు మళ్ళీ పడొచ్చన్న వార్తలు కలవరం కలిగించేవే. సరైన సహాయక చర్యలు జరగకపోతే జరిగే ధారుణం ఊహించడానికి కూడా భయం కలిగించేదే. కానీ, సహాయక చర్యలలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలను సరిగా నిర్వర్థించడం లేదన్న విమర్శలున్నాయి.

ఇక మోడీ గురించి చెప్పుకుంటే, బాధితుల పట్ల అందరిలానే ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాడు. క్యాబినెట్ రిసొల్యూషన్ పాస్ చేసి, రెండు నిమిషాల మౌనం కూడా పాటించారు గుజరాతులో. ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి విజయ్ బహుగుణతో ఫోన్లో మాట్లాడి సాయం చేయడానికి తమ సంసిద్దతను వ్యక్తపరిచాడు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి 2కోట్లు సహాయక చర్యల నిమిత్తం విడుదల చేశాడు.

అంతటితో ఆగలేదు. ఏకంగా ఉత్తరాఖండ్ బయలు దేరి అక్కడ ఒక రెండురోజులుండి, దాదాపుగా 15,000 మంది గుజరాతీయులను సురక్షితంగా గుజరాత్ చేరేలా చేశాడు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, అక్కడున్న పరిపాలనా అధికారులు ఆశ్చర్యపోయేలా చేశాడు. శుక్రవారం రాత్రి ఉత్తరాఖండ్ చేరుకున్న మోడీ, రాత్రి 1:00 వరకూ “సహాయక బృందం” తో చర్చలు జరిపాడు. ఈ సహాయక బృందములో, 5గురు IASలు, 1 IPS, 1 IFS, మరియూ ఇద్దరు గుజరాత్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు చెందిన ఆఫీసర్లు ఉన్నారట. వీరితో పాటుగా మరో ఇద్దరు DSPలు 5గురు పోలీస్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు. 80 టొయోటా ఇన్నొవాలు, 25 లక్సరీ బస్సులు కూడా ఉపయోగించారు.

మోడీ బృందాలు, వైధ్య సహాయక బృందాలను పారాచూట్ల సహాయముతో హరిద్వారలో దించాయి. మొత్తం మెడికల్ టీమంతా ఆ బృందాలలో ఉందని చెబుతున్నారు. అంతేకాక, వరదలకు గురైన ప్రాంతాలలో సహాయక చర్యల నిమిత్తం అనేక క్యాంపులను ఏర్పాటుచేశారు. అక్కడున్న బీ.జే.పీ పార్టీ కార్యకర్థలు గ్రామలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. “ఆహారము ఎక్కడిచేరవేయాలి” లాంటి విషయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇవేకాదు, మోడీ కేదార్నాథ్ దేవాలయాన్ని పూర్తిగా పుణర్మించేందుకు సహాయం చేస్తానన్నాడు. ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగించి, భవిశ్యత్తులో ఎటువంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినా చెక్కుచెదరకుండా ఉండేలా దాన్ని నిర్మిస్తానని ప్రపోసల్ పెట్టాడట. సహజంగానే అటువంటి వాటిని ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి తిరస్కరించాడు. వీటిని గురించి, మోడీ 15,000 మంది గుజరాతీయులను రక్షించడములో చూపిన “కొత్త మోడల్” సహాయక చర్యల గురించి అడిగితే, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకాయన కోపంగా … ” చూశారా మేము ఎప్పటినుంచో చెబుతున్నది ఇదే, మోడీ మోడల్ గుజరాతీయులకు మాత్రమే పనిచేస్తుంది” అంటూ సమాధాన మిచ్చాడట. నాకు బోలెడన్ని సామెతలు గుర్తుకొచ్చాయి, ఆ సమాధానం చదివిన తరువాత.

ఇక ప్రజల గురించి చెప్పుకుంటే, కొందరు హీరోలున్నారు, మరికొందరు మానవత్వం లేని మనుషులున్నారు. 5/5 గోర్ఖా రైఫిల్‌కి చెందిన మేజర్ మహేష్ ఖర్కి ప్రస్తుతం సెలవులలో ఉన్నారు. జూలై 7 వరకూ ఆయనకు సెలవులే. భార్యా, పిల్లలు, అత్తతో కలిసి డెహ్రాడూన్ నుండి, బద్రీనాథ్ వెలుతున్నారు. జూన్ 15 ఆయన, కర్ణప్రయాగ్‌లో వరదలలో చిక్కుకున్నారు. అయినా వెరవకుండా “జోషిమఠ్” వెల్లారు. అక్కడ రోడ్లు పాడైపోయాయి, దానితో రోడ్డుకు అవతలి వైపు 25 మంది చిక్కుకు పోయారు. అతన్ని వెనక్కి వెల్లమని సలహా ఇచ్చారట అక్కడ. కానీ, ఆయనలోని సైనికుడు అందుకు అంగీకరించలేదు. తన భార్యా పిల్లలను పక్కకు వెల్లమని చెప్పి, చిక్కుకు పోయిన వారిని రక్షించే పనికి పూనుకున్నారు. తడవకు నలుగురిని తీసుకు వచ్చి, మొత్తం 25 మందిని సురక్షితంగా తీసుకు వచ్చి, గోవింద్‌ఘాట్ వద్దనున్న ఆర్మీకి అప్పగించారు.

ఆయన (మేజర్), మరో విషయాన్ని కూడా చెప్పారు. కొంత మంది 500 వందలు చేసే రూములకు 3000 వసూలు చేస్తూ తమ హీనత్వాన్ని చాటుకుంటున్నారని. కొంత మంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు.

రేణూ. డి. సింఘ్ అనే ఆవిడ అక్రమ తరలింపులకు గురైన (Trafficked Women) వారికి సహాయం చేయడానికి హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు అత్యాచారాలు, స్త్రీల అక్రమ తరలింపులు ఎక్కువౌతాయని చెబుతున్నారు. అలాంటివి జరగకుండా చూసేందుకు నడుము బిగించారు. ఒకానొక ప్రబుద్ధుడు, పెళ్ళై రెండు నెలలో తన భార్యను వదిలించుకోవడనికి ప్రయత్నిస్తున్నాడట. అతను గంగలో కొట్టుకు పోయానని స్నేహితుని ద్వారా భార్యకు చెప్పించాడట. అతనో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతని ఫైలిప్పుడు డెహ్రాడూన్ పోలీస్ హెడ్‌క్వార్టరుకు చేరిందని చెబుతున్నారు.

వీరే కాక కొంత మంది విద్యార్థులు కూడా సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. బాధితులకు ఆహారము, మందులు అందివ్వడం లాంటివి చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ దొంగతనాలూ, దోపిడీలు పెరగడముతో కొందరిని విజిలెంట్లుగా నియమించారు.

వీరు ఇంకో కోణాన్ని కూడా తెలియజేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఆహారం, నీరు, మందులు ఎం.ఆర్.పీ ధరలకన్నా 5 లేదా 10 రెట్లు ఎక్కువ ధరలతో అమ్ముతున్నారట. ఇలాంటి విపత్తులలో కూడా తమ హీన బుద్దిని చాటుకునే వాల్లుండడం బాధాకరం.

Sources:

1. Narendra Modi lands in Uttarakhand, flies out with 15,000 Gujaratis

2. Mountains echo with tales of heroism, greed and depravity

3. Narendra Modi offers help to deal with Uttarakhand disaster

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2013/06/23/%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b1%8b-%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a1%e0%b1%80-%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b0%e0%b0%be%e0%b0%96%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%b0/trackback/

%d bloggers like this: