గాంధీభవన్ వద్ద సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ధర్నా – కొత్త విడాకుల చట్టం పై నిరసన :ఫొటోలు

కాంగ్రెస్ ఆఫీస్ (గాంధీ భవన్) వద్ద సేవ్ ఇండియా ఫ్యామిలీ ఆంధ్ర ప్రదేశ్ విభాగానికి చెందిన యాక్టివిస్టులు మెరుపు ధర్నా నిర్వహించారు.  ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన విడాకుల చట్టమును (హిదూ వివాహ చట్టములో మార్పులు) వారు వ్యతిరేకిస్తూ ఈ ధర్నాను నిర్వహించారు.  ఈ సరికొత్త వివాహ చట్టం వలన మగవారు విడాకుల తరువాత 50% ఆస్థిని భార్యకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆస్థిలో భర్త పెళ్ళిచేసుకున్న తరువాత సంపాదించినదే కాక, పెళ్ళికి ముందు సంపాదించినది, తల్లిదండ్రులద్వారా వారసత్వంగా లభించిన ఆస్థికూడా 50% కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని పురుష హక్కుల సంఘాల వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  కానీ ప్రస్తుతం ప్రభుత్వం చిన్న సవరణ చేసింది. అదేమంటే 50% ఆస్థి అనికాకుందా ఎంత పంచాలి అనందాన్ని కోర్టులు నిర్ణయిస్తాయి.  అంటే 50% కన్నా తక్కువైనా కావొచ్చు, ఎక్కువైనా కావొచ్చు.

దీన్నే IrBM (Irretreavable Breakdown of Marraige) అని కూడా పిలుస్తున్నారు.  అంటే బాగుచేయలేనంతగా వివాహ బంధం విచ్ఛిన్నమైనప్పుడు, ఆబంధములో ఉండాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశ్యముతో చేసిన సవరణ.  ఆపేరు మీదుగా దీన్ని పిలిస్తున్నారు.

ఇందులో అభ్యంతరకరమైనవఏమంటే..

1. భర్త పెళ్ళిచేసుకున్న తరువాత సంపాదించిన దానిలో భార్య తనవంతు సహకారం అందించింది అనుకోవడములో అర్థం ఉంది. కానీ, పెళ్ళి కాక మునుపు మగవాడు సంపాదించిన ఆస్థిని, తాతలనాటి వారసత్వపు ఆస్థిలో భార్య భాగస్వామ్యం ఉంది అన్నట్లుగా ఆమెకు ఆస్థి పంచాల్సి రావడం.

2. ఇందులో భార్య, విడాకులు కావాలంటే తీసుకోవచ్చు. వారిద్దరి మధ్యా ఎటువంటి గొడవా ఉండాల్సిన పనీలేదు. దీన్నే నో-ఫాల్ట్ డైవోర్స్ అంటారు.  దానికి అభ్యంతరం తెలిపే హక్కు మగవాడికి లేదు. కానీ పురుషుడు విడాకులు తీసుకోవాలంటే మాత్రం భార్య అభ్యంతరం తెలుపవచ్చు. ఆర్థికంగా తాను ఇబ్బందులకు గురవుతాను అన్న కారణం చూపి.

3. ఇందులో కేవలం భర్త ఆస్థిని మాత్రమే పరిగణలోఇకి తీసుకుంటారు. అతని ఆస్థి మాత్రమే భార్యా భర్తలిరువురికీ సమానంగా పంచబడుతుంది. కానీ, భార్య ఆస్థిని మాత్రం ఆవిడ ఆస్థిగానే పరిగణించ బడుతుంది, అందులో భర్తకు ఎటువంటి హక్కూ ఉండదు.

ఈ చట్టమే కనుక వస్తే మగవారు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుంది. ఇప్పటికే 498ఏ వంటి చట్టాలు దుర్వినియోగం వల్ల మగవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికితోడు ఇది కూడా కలిస్తే మగవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆలోచించండి. ఒకమ్మాయి ఒకబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత కావచ్చు, కొన్ని నెలల తరువాత కావచ్చు, ఆమెకు అతనితో పడక పోవచ్చు. అప్పుడు ఆమె అతని మీద తప్పుడు 498A కేసును పెట్టి, తరువాత విడాకులకులు కోరుతుంది. మగవాడికి స్త్రీ విడకులు అడిగితే కాదనే హక్కులేదు కాబట్టి చచ్చినట్టు విడాకులకు ఒప్పుకోవాల్సిందే, అతని ఆస్థిలో, అతని తాతల నాటి వారసత్వపు ఆస్థిలో చాలా భాగం కోల్పోవాల్సిందే. అంతా అయ్యాక కూడా 498A చట్టాన్ని అతను మరో 4లేదా 5 సంవత్సరాలు ఎదుర్కోవాల్సిందే. (అంత తొందరగా అవి తేలవు).  

అందుకే ఈ చట్టాన్ని పురుష వ్యతిరేకం అంటూ పురుష సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాదులోని పురుష హక్కుల సంఘం సేవ్ ఇండియన్ ఫ్యామిలీ  దీనికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద మెరుపు ధర్నాకు దిగింది. వాటికి చెందిన ఫోటోలు కొన్ని.

14 13 12 11 10 09 08 07 06 05 04 03 02 01

ఈ చట్టానికి సంబందించి జాతీయ స్థాయిలో వాడివేడిగా చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ మన మీడియా తెలంగాణ గొడవలో పడి దీన్ని పట్టించుకున్నట్టులేదు.  దీని గురించి మరింత సమాచారం కోసం NDTVలో వచ్చిన ఈ చర్చా కార్యక్రమాన్ని చూడండి.

ఆకాలం  నటీమణులలో ఒకరైన పూజా బేడీ స్త్రీవాడుల హిపోక్రసీని కడిగిపారేసిన తీరు నిజంగానే అభినందించ తగ్గ విషయం. ఆమె స్త్రీవాది కాదు, పురుష వాది కూడా కాదు. కేవలం ఇద్దరు పిల్లలకు తల్లి. అదే కాక ఆమె విడాకులు తీసుకున్న సమయములో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది కూడా. కానీ, ఇప్పుడు, ఒక మగ బిడ్డకు, ఒక ఆడబిడ్డకు తల్లిగా ఎంతో బ్యాలన్సుడుగా ఆలోచించి ఆమె మాట్లాడిన తీరు మన ఫెమినిస్టులకు చెంపపెట్టులాంటిది.

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2013/07/22/%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80%e0%b0%ad%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b1%8d-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

10 Comments

 1. ఈ ఉద్యమం వెనుక ఏదో ‘మనవూ హస్తం ఉంది. నాకెందుకు ఈ అనుమానం అంటే నిన్న ఒక బ్లాగులో పెట్టిన ఈ పోస్ట్ చూడండి http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_8384.html

  Like

 2. సేవ్ ఇండియన్ ఫ్యామిలీవారు మనువులకూ, మంత్రాలకూ, అసలు మతాలకూ చాలా దూరం లెండి. అదో నేషనల్ వైడ్ నెట్వర్క్. ఈ చట్టం గురించి వారు నిరసనను చాలా కాలంగా తెలిపుతూనే ఉన్నారు. మొదట ఇది పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు ప్రధాన మంత్రి కార్యాలయం దగ్గర కూడా కొంత మంది ఆందోళనకు దిగడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంటనే అక్కడనుండి తరలించారు కూడా.

  Like

 3. అది నేషనల్ వైడ్ నెట్వర్కైనా, ఇంటర్నేషనల్ దైనా, మెరుపు దర్నా చెయ్యడం అనుమానాస్పడం. దీని వెనుక చేతకాని పురుష అహంకారులు,, వారిని నడిపించే “మను వాదులు” ఉన్నారన్నది స్పష్టం అవుతూనే ఉంది.

  Like

 4. చేతకాని పురుష సంఘాలా?? అదెలా, ఫెమినిస్టుల హిపోక్రసీని ఉతికారేయడమే కాకుండా, తెగించి ధర్నాకు దిగిన వారు చేతకాని వారు ఎలా అవుతారు? వారు చేతకాని వారు కాదు, పోరాడే నైజమున్న యాక్టివిస్టులు. ఇక ఇది పురుషాహంకారమైతే, మరి జెంటిల్‌మన్ ఎలా ఉంటాడో? ఫెమినిస్టులు చెప్పిన దానికల్లా డూడూ బసవన్నలా తలాడించే వారా? వారిని మేము మగ పతివ్రతలూ అంటాం. ఆయాక్టివిస్టులు అలాంటీవారు కాదులెండి.

  నిజానికి ఇక్కడ మనువాదులు ‘ఫెమినిస్టులే’ కాకపోతే తేడా ఏమిటంటే, ఒకప్పుడు మనువాదులు స్త్రీలపై ఆంక్షలేసారు, ఇప్పుడు మోడర్న్ మనువాదులు పురుషులపై ఆంక్షలు వేస్తున్నారు, తమహక్కుల కోసం పోరాడేవారిపై అబాంఢాలు వేస్తున్నారు.

  Like

 5. ఇటువంటి విషయాలను ఎప్పటికప్పుడు బ్లాగులోకం లో అందరితో పంచుకొంట్టునందుకు అభినందనలు. స్వరుప్ సర్కార్ గారితో తార్కికం గా వాదించి గెలిచిన వారిని ఇప్పటివరకు చూడలేదు. పాకిస్తాన్,చైనా లాంటి దేశాల లో కూడా జెండర్ సమానత పాటిస్తుంటే మనదేశంలో దానిని ఎందుకు అటకేకిస్తారు? అని అడిగితే అటువైపునుంచి జవాబే ఉండదు. ఇక పూజాబేడి వాదన చాలా బాగా ఉంది. ఆమే మాటల్లో నిజాయితి,వాస్తవికత, బాధ్యత అన్ని కనిపించాయి. ఇటువంటి వారిని చూస్తే నిజమైన స్వేచ్చ కోసం మనుషులు ఏటువంటి పరిస్థితులను, ఎదుర్కోవటానికి సిద్దంగా ఉండాలో తెలుస్తుంది. స్వేచ్చా, స్వాతంత్రం అంట్టు కాల్పనిక సాహిత్యం రాసేవారి పుస్తకాలు చదివితే మనుషులకు ధైర్యం రాకపోగా, భయం ఎక్కువై పూజాబేడి లాగా స్వేచ్చగా జీవించటానికి సిద్దపడరు.
  ఇక కీర్తి సింగ్ గారు ఇంగ్లాండ్, యురోప్ దేశాలలో చట్టాల గురించి,హక్కులు గురించి మాట్లాడుతున్నాది. ఇటువంటి చట్టాలు అమలైన తరువాతా , అక్కడి సమాజ పరిస్థితి గురించి వారికి అవగాహన ఉందో లేదో మనలాంటివారికి తెలియదు. వీరితో వచ్చిన తంటా ఇదే. అసలికి ఆ దేశాలలో పెళ్ళిళు చేసుకోని పిల్లలను కనటానికి ఎవరు ముందుకు రావటంలేదు. ఆ విషయం ఆమేకు తెలుసోలేదొ ? అది పరిగణలోకి తీసుకోకుండా, ఆ చట్టాలు మనదేశానికి తీసుకొస్తే గొప్ప విజయం సాధించామనుకొంటే ఎలా? ఇటువంటి చట్టాలను అమలు చేసే కొద్ది మనదేశo రేపు ఇంగ్లాండ్ బాటపడుతుందేమో!

  Most children will be born out of wedlock by 2016
  http://www.telegraph.co.uk/news/politics/10172627/Most-children-will-be-born-out-of-wedlock-by-2016.html
  http://www.dailymail.co.uk/news/article-2360084/Most-babies-born-wedlock-2016-marriage-falls-fashion.html

  Like

 6. అమేరికాది అదే బాట.
  Marriage rate in US lowest in a century
  The marriage rate in the United States has plummeted to 31.01, the lowest in over a century, a new study has found
  Fewer women in the US are getting married and they are waiting longer to tie the knot
  The current marriage rate is 31.1, the lowest it’s been in over a century, it said. That equals roughly 31 marriages per 1,000 married women. Compare that to 1920, when the marriage rate was a staggering 92.3, researchers said.

  http://timesofindia.indiatimes.com/world/us/Marriage-rate-in-US-lowest-in-a-century/articleshow/21185636.cms
  టి వి షో లలో వాదనలతో వాస్తవాలు ఎలా మరుగునపడిపోతాయో పైన లింక్ చదివితే అర్థమౌతుంది. అమేరికాలో 1000 మంది ఆడవారికి 969 పెళ్ళిళే లేవు. అమేరికా,యురోప్ లలో పెళ్లిళు చేసుకోవటమే పడిపోతూంటే దానిని దాచి పేట్టి, అక్కడి చట్టాలను,హక్కుల గురించి TV లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు.

  Like

 7. I remember some time back you wrote on this topic.

  Every home to have a ‘porn block’ by default: David Cameron cracks down
  http://www.independent.co.uk/news/uk/politics/every-home-to-have-a-porn-block-by-default-david-cameron-cracks-down-on-online-pornography-8725803.html

  Like

 8. పైన “నిత్య” అనే శాల్తీ ఎవరోగానీ తమ నిత్యానందాన్ని భలే చూపించారు. “చేతగాని పురుషాహంకారులు” అనే గట్టి పదాన్ని చాలా తేలికగా వాడేశారుగాని ఈ చట్టం లోని లోపాలని చూడటం లేదు. (1)చట్టం లోని ఈ మార్పుని వ్యతిరేకించే మగాల్లు కేవలం తమకోసమే ఇదంతా చేస్తున్నారనుకుంటే మనం పంది పెంటలో కాలు వేసినట్లే. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నది తమ తమ కుటుంబాల ఐక్యతకోసం. తమ అక్కచెల్లెల్ల/తల్లుల బాగోగులకోసం కూడా అన్నది గుర్తించాలి.
  (2) ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం అనేది దంపతుల అంతర్గత వ్యవహారం. అటువంటపుడు వారి విడాకుల వ్యవహారం కూడా వారి అంతర్గతమే కావాలిగాని అందులోకి కుటుంబపు ఆస్థినో పూర్వీకుల ఆస్థినో లాగడం ఏ విధంగానూ న్యాయం కాదు.
  (3) న్యాయపరంగా చూసినా పెళ్ళి అయిన తరువాత దంపతులిద్దరూ ఒక కుటుంబం. ఒక యూనిట్. అప్పటినుంచి ఇద్దరూ ఉమ్మడిగా ఆర్జించినదానిపై ఇరువురికీ సమాన హక్కులుంటాయి. పెళ్ళికి ముందు వ్యక్తిగతంగా సంపాదించుకున్నది నిజానికి వ్యక్తిగతమైనదే అవుతుంది. వివాహానంతరం ఇరువురూ కొన్ని త్యాగాలు చేసి ఉండొచ్చు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే విడిపోయిన తరువాత ఎవరు బలమైన పరిస్థితిలో ఉంటారో వారు రెండోవారికి భరణం చెల్లించాలి. ఈ విషయం లో స్త్రీలకు ఒకలా పురుషులకి ఒకలా న్యాయం ఉండడానికి అసలు వీలు లేదు.
  (4) నేటి కుటుంబాలలో వివాహానంతరం దంపతుల ఆదాయం/ఖర్చు అనేవి వారి వ్యక్తిగత విషయాలవుతున్నాయి. ఈ విషయం లో దంపతుల తల్లిదండ్రులు గాని తొడబుట్టినవారుగాని సలహాలివ్వటం వరకే పరిమితం కాని, శాశించే స్థితిలో ఉండరు (సాధారణంగా). మరిపుడు చెప్పండి. వాళ్ళు సంపాదించుకున్నదానిపై అబ్బాయి కుటుంబం వారు ఎలాంటి ఆశా పెట్టుకోకూడదుగాని దంపతులు విడిపోతే తమ ఆస్థిలోంచి ఎందుకు భాగం ఇవ్వాలి? ఇదెక్కడి సమన్యాయం?
  (5) కొన్ని దేశాల్లో వివాహం రిజిస్టర్ చేసుకున్నపుడే terms & conditions కూడా రాసి సంతకం పెడతారు. అంటే ఒకవేల ఖర్మకాలి విడిపోతే భరణం చెల్లిస్తారా, ఎంత చెల్లిస్తారు లాంటి వివరాలు రిజిస్త్రార్ కి రాసి ఇస్తారు. నన్ను అడిగితే ఈ పధ్ధతి బెటర్. తమ కండిషన్స్ కి ఒప్పుకునే మగవారినే స్త్రీలు పెళ్ళి చేసుకోవచ్చు. బలవంతం ఏమీ లేదు. వివాహం అనేది స్త్రీ పురుషులిద్దరికీ సమాన అవసరం అయినపుడు విడిపోతే తగిలే దెబ్బకూడా సమానంగానే తగలాలి కదా?

  Like

 9. రష్యా, యురోప్ తెల్లవాళ్ల, ఎర్ర సాహిత్య పుస్తకాలు చదివి, అందులోని పాయింట్లను లోకలైజ్ చేసి, తెలుగు పుస్తకాలలో అర్థ సత్యాలతో కాల్పనిక సాహిత్యాలను,సిద్దాంతలను కుమ్మరించే వారిని మనం కూడా “ఓడ్కా వాదులు” అని పిలుచుకొందాం.

  http://www.niticentral.com/2013/07/22/joyous-divorce-time-for-pre-nuptial-arrangements-107812.html

  Since the Government now believes that marriage is a contract, contract-style rules should be applied to
  a marriage. Since it will now be only between the two persons, who alone are responsible for its success or failure, third parties cannot be cited as reasons for breakdown of the marriage, and certainly their property/assets cannot be extracted by a departing wife. It bears mentioning that by giving judges the discretion to decide what compensation a divorcing wife is due from the wealth of her in-laws, the Government has opened a door for rampant judicial corruption. This should be closed without further ado
  If pre-marital assets are to be brought into the division, then this must be gender-neutral and a man married to a richer woman must get equal access to her and her family’s wealth. Then, while the rights of children, if any, are undeniable, there is no case for alimony for working women. The courts are aware that there have been several cases of affluent working women giving up their jobs when the marriage broke down in order to claim robust alimony as the price of consenting to divorce. This trend will be reinforced under the present proposed changes in divorce law, which will encourage women to take punitive action against their in-laws on the slightest pretext
  It is noteworthy that the rights of children to inherit ancestral property is sacrosanct in Hindu law; what the new law proposes is the deprive parents of a divorced man while they are still alive. It is pertinent that in many countries, such as Britain, all inherited property is excluded from divorce settlements. Regarding ‘inheritable’ property, it is pertinent that parents may need their assets for the marriage of other children, to support themselves, or pay for costly medical treatment of themselves or some member of the family
  Ironically, this move is the exact reverse of the Muslim Women’s (Protection of Rights on Divorce) Act 1986 – by a Congress Government – which pushed the responsibility for destitute divorced women back on their natal families, even if they were in no position to assume such a burden, and absolved rich husbands of the duty to pay alimony to their abandoned wives

  Like

 10. భర్తల ప్రాణాలు తీస్తున్న ‘498ఎ’
  మన దేశంలో పెళ్లయిన మగాళ్ల ఆత్మహత్యలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ప్రతి 9 నిమిషాలకు ఒక వివాహితుడు బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు జాతీయ నేర రికార్డు బ్యూరో(ఎన్సీఆర్బీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. వివాహిత మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని తెలిపింది. 2012లో వివాహిత పురుషులు 64వేల మంది ప్రాణాలు తీసుకోగా, 32 వేల మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు.

  మహిళపై జరుగుతున్న గృహహింసను నిరోధించేందుకు ప్రభుత్వం తెచ్చిన ఐపీసీ సెక్షన్ 498ఎ మగాళ్ల పట్ల మృత్యుశాసనంగా మారుతోంది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండడంతో వివాహిత పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. భర్త కుటుంబంపై కక్ష సాధించేందుకు ఈ సెక్షన్ను కొంత మహిళలు దుర్వినియోగం చేస్తుండడం మగాళ్ల బలవన్మరణాలకు కారణమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ ఎదురైన పరిస్థితుల్లో కొందరు భర్తలు ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదని విశ్లేషిస్తున్నారు.

  ఒక్క పశ్చిమబెంగాల్లోనే భర్తల ఆత్మహత్యలు గత రెండేళ్లలో 11 శాతం పెరిగాయి. బెంగాల్లో 498ఎ కింద 1.06 లక్షల కేసులు నమోదు కాగా, 80 వేల మంది భర్తలను అరెస్ట్ చేశారు. ఇలాంటి కేసుల్లో ఇరుకున్నవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అయితే 498ఎ దుర్వినియోగం నిలువరించడం కష్టమైన పని అని పోలీసులు అంటున్నారు.
  http://www.sakshi.com/news/features/every-9-minutes-a-married-man-commits-suicide-in-india-71185?pfrom=home-latest-story

  Like


Comments are closed.

%d bloggers like this: