కండక్టరుపై చేయి చేసుకున్న మహిళా టెక్కీ, 15 రోజుల జ్యుడిషియల్ కష్టడీ..!!

స్వాతి నిగం అనే అమ్మాయి అసెంచూర్‌లో (Accenture) సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది.  బెంగుళూరులో సిటీ బస్సెక్కింది (వోల్వో). చార్జీ ఎందుకు 25 రూపాయలు వసూలు చేస్తున్నారు అని అడగడముతో మొదలైన గొడవ, అమ్మాయి దగ్గర సరైన చిల్లర లేకపోవడం దాకా వచ్చింది. కండక్టరు మినిమం 10 రూపాయలు కట్టి తరువాతి స్టాపులో దిగమని చెప్పాడు. ఆ అమ్మాయి దానికి ఒప్పుకోలేదు. తరువాత బస్ కండక్టర్ కన్నడలో మాట్లాడడం మొదలు పెట్టాడు. అమ్మాయి తనను తిడుతున్నాడు అనుకొని అతని చెంప మీద బలంగానే కొట్టింది. తరువాత గోర్లతో మొహం మీదనే రక్కింది. దెబ్బ చెవి దగ్గర తగలడముతో కండక్టరుకు కాసేపు వినపడడములో సమస్య తలెత్తింది అని తరువాత పరీక్ష చేసిన డాక్టర్లు చెబుతున్నారు. గొడవ గమనించిన డ్రైవర్ బస్సు డోర్లు మూసేసి HAL పోలీస్ స్టేషనుకు తీసుకెల్లాడు.

ఇద్దరి వాదనలు విన్న తరువాత, ఇంకో నలుగురు ప్రయాణీకులనూ విచారించిన తరువాత, ఆమె మీద ప్రభుత్వ ఉధ్యోగిపై దాడి చేసింది అని కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు.  జడ్జి ఆమెకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండు విధించాడు. ఇంకా శిక్ష పడలేదు, కేవలం విచారణ మాత్రమే జరుగుతోంది.  నేరం రుజువైతే (99% ఛాన్సుంది అనిపిస్తోంది నాకు) ఎంత పెద్ద శిక్ష పడుతుందో ..??

దీన్నేమనాలో నా కర్థం కావడం లేదు. తలరాత అనా? లేక దురదృష్టం అనా? బస్సులో కండక్టర్ల ప్రవర్తన కొన్నిసార్లు దురుసుగానే ఉంటుంది.  ఆ విషయములో నేనా అమ్మాయికి సానుభూతినే తెలుపుతాను. కానీ, ఆ అమ్మాయి చేయిచేసుకోవడం మాత్రం సమర్ధించలేను. సాధారణ మగవాడి మీద చేయి చేసుకునుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో గానీ, అతను ప్రభుత్వ ఉధ్యోగి కావడముతో సీను రివర్సయ్యింది.

మన సినిమాలలో,  నవల్లలో అన్నింటిలో ఇలా చేయి చేసుకునే ఆడవారిని దుర్గలుగానో, ఝాన్సీలుగానో చిత్రీకరించడానికి అలవాటు పడ్డాం మనం. అన్యాయమే జరిగినా, పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడమో లేక మాట్లాడడమో మానేసి, దురుసుగా చేయి చేసుకుంటే ఒక్కోసారి ఫలితాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి ఈ ఘఠనే ఉదాహరణ.  అసలు ఎవడన్నా తప్పు చేశాడు అనగానే వీధిలోనే తీర్పులిచ్చేసి, అక్కడే వారిని కొట్టడం మానుకుంటే బాగుంటుంది కదా?

ఈ వీధి తీర్పులు మగవారిపట్ల అధికంగానే జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మాయి చేత్తో సరిపెట్టింది. మరికొన్ని చోట్ల కాలి చెప్పుల దాకా కూడా వెలతాయి. నేను ఇటువంటి వాటిని పూర్తిగా వ్యతిరెకిస్తాను. చెప్పులతో కొట్టడం, బయట స్తంబానికి కట్టేసి, బట్టలూడదీసి కొట్టడం లాంటి ఘఠనలు మగవారి విషయములో ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఇంతా జరిగిన తరువాత కూడా, కేసు మగవారి మీదనే ఉంటుంది. అంత దారుణంగా కొట్టిన ఆడవారి మీద ఉండదు. ఈ వీధి తీర్పులకు వ్యతిరేకంగా మగవారు పోరాడాలి అనిపిస్తుంది. అన్నింటికన్నా ముందు, సినిమాలలో హీరోలు కాస్త హీరోయిజం కూడా తగ్గించుకోవాలి అనిపిస్తుంది.

15 రోజుల జైలు జీవితం, తరువాత ఎంత శిక్ష పడుతుందో చెప్పలేం. ఆ అమ్మాయి రెండు రోజుల పటు ఏడుస్తూనే ఉందట అన్నం కూడా తినకుండా. ప్రస్తుతం ఎవరైనా జాలి పడడం తప్ప ఏమిచేయగలరు?? ఆమె బయటికి రాగానే అతని మీద కేసు పెడతాం అని ఆమె స్నేహితులు అంటున్నారు. కానీ, తోటి ప్రయాణీకుల వాఙ్ఞ్మూలం కూడా ఆమెకు వ్యతిరేకంగానే ఉన్న విషయం వారు మరిచిపోతున్నారు. బుద్దిగా పెద్దలను పిలిచి రాజీ ప్రయత్నాలు చేసుకుంటే మంచిదని నాకనిపిస్తోంది.

Source: Woman techie slaps BMTC conductor, lands in judicial custody

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2013/08/16/%e0%b0%95%e0%b0%82%e0%b0%a1%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%81%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b1%87%e0%b0%af%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d/trackback/

RSS feed for comments on this post.

One Comment

  1. ఇదే పని సౌత్ ఇండియా అబ్బాయి ఒక లక్నో, కాన్పుర్, పాట్న,వారణాసి వంటి నగరాల లో చేయగలిగే ధైర్యం ఉంట్టుందని అనుకోను. చేసిన దానికి పశ్చాతాపం లేకుండా ఇంకా కండక్టర్ మీద కేసు పెడాతాం అనటం, పొగరుకి పరాకష్ట.
    ప్రస్తుత యువతరం మీద జాలి చూపవలసిన అవసరం ఎమి లేదు. ఈ కాలం పిల్లల తల్లిదండృలే వారితో వేగలేక ,ఎదో ఉద్యోగం వచ్చి ఇంట్లో లేకుండాపోతే చాలను కొనే వారి సంఖ్య చాలా ఎక్కువైంది. ఒకప్పుడు ఎవరైనా కాలేజి విద్యార్దులు సిటిబస్సులో డోర్ దగ్గర వేలాడుతూంటే, బస్సు లో కి రామ్మ అని ఎవరైనా వయసులో పెద్దవారు చెపితే వచ్చే వారు. ఇప్పుడేలా తయారయ్యారు అంటే, చిన్నా పెద్దా లేకుండ నేను ఎక్కడ నిలుచుంటే నీకెందుకు? నాకు తెలుసులే, నీ పని నువ్వు చూసుకో. ఇటువంటి అడ్డదిడ్డమైన మాటలు రవితేజ లాగా మాట్లాడుతారు.

    Read this
    http://www.dailymail.co.uk/news/article-2395791/Shocking-moment-girl-kicks-elderly-Asian-man-80-ground-causing-turban-fall-spitting-face.html

    Like


Comments are closed.

%d bloggers like this: