ఓ సామాన్య మగవాడిని నేరస్థునిగా మారుస్తున్న చట్టాలను రద్దు చేయాలి ..!!

(ఈ టపా ఉమా చల్ల గారు రాసిన “Time to Scrap Laws Which Turn Ordinary Men into Criminals!” అనే టపాకు స్వేచ్ఛాను వాదం. ఉమా చల్లగారు ” Fight for gender equality”  అనే బ్లాగును నిర్వహిస్తున్నారు. వారి Youtube Channel లో ఆమె 498A మరియు ఇతర పురుష వ్యతిరేక చట్టాల గురించి వివిధ టీ.వీ ఛానెల్లలో స్త్రీవాదులతో చేసిన చర్చలను చూడొచ్చు.)

అది అక్టోబర్ 4 2014, శనివారం,  రాఘవేంద్ర గురుప్రసాద్, అతని ఇద్దరు కుమారుల మరణం గురించి, పేపర్లలో, టీవీ ఛానెల్లలో, సామాజిక మాధ్యమాలలో చర్చలు జోరుగా సాగాయి.

గురుప్రసాద్ ఎవరో చాలా మందికి తెలిసే ఉంటుంది.  తెలియని వారికోసం అతని గురించి కొంచెం చెబుతాను. అతనో సాధారణ భారతీయ పురుషుడు. సాధారణమైన తెలివితేటలు కలవాడు. కష్టపడి చదువుకుని, ఒక యూనివర్సిటీలో అసిస్టంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నవాడు. అతనికి పదేళ్ళ క్రితం వివాహం అయ్యింది,  ఇద్దరు కుమారులున్నారు.  తన భార్యా పిల్లలతో అన్యోన్యంగా జీవించాలని, కుటుంబంతో కలిసి ఉండాలని అతను కలలు కన్నాడు.  దానికోసం, తన భార్య చేత  వ్యక్తిగతంగానూ, బహిరంగంగానూ అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చినా సహించాడు, అత్త మామల భౌతిక దాడులను భరించాడు.

కానీ, దానికి ప్రతిఫలంగా గురుప్రసాద్‌కు దక్కినవి, 498A  సెక్షను కింద తప్పుడు కేసు. అబద్దాలతో కూడిన విడాకులు. అతన్ని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి, చట్టపరమైన ఇబ్బందులకు గురిచేసినా, భార్యా పిల్లల నుండి వేరు చేసినా,  అతను తన భార్యా పిల్లలతో కలిసి జీవించడానికే ప్రయత్నించాడు. తండ్రి అవసరం తన పిల్లలకి ఉందని భావించాడు. భార్యతో తిరిగి కలిసి జీవించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతీ సారి, అతనికి తిరస్కారమే ఎదురయ్యింది. చివరికి తన “దౌర్భాగ్యానికి” ఆత్మహత్యతో ముగింపు పలకవలసి వచ్చింది. దానికి ముందు, చివరి ప్రయత్నంగా  అతను అనేక మంది అధికారులకు లేఖల ద్వారా తన మొర వినిపించుకున్నాడు. కానీ, అవేవీ ఫలితాలనివ్వలేదు.

అతను చివరిసారిగా తన భార్యతో చేసిన ఫోను సంభాషణ అంతర్జాలములో అందుబాటులోనే ఉంది. ఆ అసంభాషణలో అతను తన జీవితాన్ని అర్థంతరంగా ముగిస్తున్నానన్న విషయాన్ని తెలియజేశాడు, దానికి సమాధానంగా “దాని వలన ఉపయోగం ఏముంది?” అన్న కౄరమైన ప్రశ్నే ఎదురయ్యింది. దానికి ప్రతిగా అతను “దాని వలన కలిగే ఉపయోగం ఏమిటో నాకూ తెలీదు, కానీ ఈ బాధను నేను ఇక ఓర్చుకోలేను..” అంటు సమాధాన మిచ్చాడు.  అతని భార్య, “నాకు ఫోను చేసి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు” అని ప్రశ్నిస్తే, “నా ఫోను నిన్ను డిస్టర్బ్ చేస్తోంది అంటున్నావు, కానీ నీతో, నా కుటుంబముతో విడిగా ఉన్నా ప్రతీ క్షణం నన్ను డిస్టర్బ్ చేస్తోంది” అని సమాధానం ఇచ్చాడు.   అతని ఆత్మహత్యకు ముందు అతను రాసిన 7-పేజీల సుదీర్ఘ లేఖ, భార్య పిల్లల పట్ల అతనికున్న ప్రేమను, వారికి దూరమవ్వడం వలన అతను పడుతున్న మానసిక క్షోభనూ,  సామాజికంగా అతని మీద పెరుగుతున్న ఒత్తిడినీ, దాని ఫలితంగా ఎదుర్కొన్న తిరస్కారాన్ని తెలియజేస్తుంది.

ఇవి చాలదన్నట్లు, పత్రికలూ, ఛానెల్లు కూడా తక్కువేమీ తినలేదు.  “వైవాహిక సమస్యలతో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య”  అంటూ అతని గురించి రాయడం జరిగింది. ఎప్పుడెప్పుడా అని కాచుకు కూర్చున్న స్త్రీవాదులైతే శివతాండవమే చేశారు. అతన్ని, అతనితో పాటుగా మొత్తం మగజాతినీ తూర్పారబట్టారు. “స్త్రీల అణచివేత” అనే అంశాన్ని పైకి తేవడానికి ఈ సంఘఠనను మరో అవకాశముగా వినియోగించుకున్నారు.

గురుప్రసాద్ కేంద్ర హోం శాఖకు కూడా ఒక లేఖ రాశాడు.  498A చట్టం దుర్వినియోగం గురించి వివరిస్తూ,  భవిశ్యత్తులో తనలాంటి మగవారు  బాదలు పడకుండా ఉండాలనీ, దానికోసం 498A చట్టాన్ని రద్దుచేయాలని ఆ లేఖలో వేడుకున్నాడు. స్త్రీవాదులు, పురుష హక్కుల కార్యకర్తలు చర్చల పేరుతో తీవ్ర మాటల యుద్దాలు చేసుకుంటూంటే, దాన్ని ప్రైం టైంలో చూపిస్తూ తమ టీ.ఆర్.పీలు పెంచుకునే మీడియా వారికి ఈ సంఘఠన నిజంగానే ఒక అవకాశం.

విశేషమేమిటంటే, గురుప్రసాద్ ఉదంతం ఇంత సంచలనం సృష్టించడానికి కారణం అతని ఆత్మహత్య మాత్రమే కాదు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన బిడ్డలిద్దరినీ చంపడం. స్త్రీవాదులూ, స్వయం ప్రకటిత మానసిక శాస్త్ర నిపుణులు, ఇంకా కొన్ని మీడియా వర్గాలూ ఈ ఒక్క అంశాన్ని వేరుగా చూపించాయి. ఆ అంశం మీద చర్చలు కొనసాగించి, గురుప్రసాద్‌ను ఒక “సైకో”, ఒక “మానియాక్” , ఒక “మానవత్వం లేని, కౄరమృగం” అనీ, “మానవ జాతికి మాయని మచ్చ” అని ముద్ర వేశాయి.  అంతే కాదు, గురుప్రసాద్ పై ఈ తరహా (498A) క్రిమినల్ కేసులు పెట్టడం, అతనికి విడాకులు ఇవ్వడం సమంజసమే అని ఈ హత్యల వల్ల తేలుతోందని తేల్చిపారేశాయి. ఎందుకంటే అతనో కౄరమృగంలా, ఒక పర్వర్ట్‌లా, ఒక మాటువేసి హత్యలు చేసే రక్త పిపాసుడైన హంతకుడిలా మారాడని అభిప్రాయపడ్డారు.  498A చట్టం దుర్వినియోగం వలన ఆ చట్టం ఎదుర్కొంటున్న తీవ్ర విమర్శలను ఎదుర్కోవడానికి,  తాము ఎంతో కష్టపడి తెచ్చిన విష ఫలాన్ని రక్షించుకోవడానికి స్త్రీవాదులు ఈ సందర్భంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేశారు, అతని  పై బురద జల్లడానికి ప్రయత్నించారు.

నిజానికి, గురుప్రసాద్ తన పిల్లలను నెలలో రెండు రోజులు, అదీ కేవలం కొన్ని గంటలు మాత్రమే కలిసే భాగ్యం పొందడానికి ఎంతో పోరాడాల్సి వచ్చింది. పోరాడి చివరకి దాన్ని సాధించాడు కూడా.  అతనికి పిల్లల పట్ల ఉన్న ప్రేమ ఏమిటో చెప్పడానికి ఈ ఉదంతం చాలు.  అతని పిల్లలు కూడా అతన్ని చూడడానికి, అతనితో సమయం గడపడానికీ ఎంతో ఆసక్తి చూపేవారు. అది చాలు వారు అతన్ని ఎంత ప్రేమిస్తున్నారో చెప్పడానికి.  అతను ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో అతను తన ఇద్దరు కుమారులను ఎంత ప్రేమిస్తున్నాడొ వివరంగా రాశాడు, ఒకానొక చోట ఆమె (అతని భార్య) పిల్లలను సరిగా చూసుకోవడం లేదని కూడా  ప్రస్తావించాడు.  తన పిల్లలిద్దరినీ ఆ విధంగా తనతో పాటు తీసుకెల్లడానికి  అతను ఎంత మానసిక వేధనను అనుభవించాడో చెప్పడం కష్టం.  బహుషా సమాజం మగవారి పట్ల (తన పట్ల) చూపించిన నిర్లక్షానికి, తిరస్కారానికీ మానసికంగా కృంగిపోయి, అతని ఇద్దరు కుమారుల భవిశ్యత్తు కూడా ఇంతకంటే గొప్పగా ఉండబోదని భావించినా భావించి ఉండొచ్చు. ఈ సమాజము మగవారి పట్ల న్యాయబద్దంగా వ్యవహరిస్తుంది అన్న నమ్మకం అతను కోల్పోయి ఉండవచ్చు.

గురుప్రసాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నా మితృలలో ఒకరు … “నీకు తెలుసా, ఇక్కడ జరిగింది రెండు హత్యలూ, ఒక ఆత్మహత్య కాదు, మూడు హత్యలు” అని చెప్పినప్పుడు నా నోట మాట రాలేదు. నిజంగానే అక్కడ జరిగినవి మూడు హత్యలు.  ఈ పురుష వ్యతిరేక సమాజం, స్త్రీవాదులూ, పోలీసులూ,  న్యాయవ్యవస్థ అంతా కలిసి గురుప్రసాద్‌ను బలితీసుకున్నాయి, దానితో పాటుగా అతని ఇద్దరి పిల్ల హత్యలకూ కారణమయ్యాయి.  ఇప్పుడు సానుభూతి చూపించిన స్త్రీవాదులే, ఆపిల్లలు బతికి ఉండుంటే, వారు పెరిగి పెద్దైన తరువాత వారిపై ఎటువంటి దయాదాక్షిణ్యాలు చూపించి ఉండేవారు కాదు. వారిని ఈ పురుష వ్యతిరేక సమాజం, పురుష వ్యతిరేక చట్టాలు మానసికంగా నిర్వీర్యులను చేసి ఉండేవి.

గురుప్రసాద్ విషయములో నీతి సూక్తులు చెబుతూ తీర్పులివ్వడం చాలా సులభం.  కానీ,  ఆ ఆ కోరికను అణచివేసుకుని, ఒక సామాన్య మగవాడికి,  తప్పుడు ఆరోపణలను, తప్పుడు క్రిమినల్ కేసులనూ, దాని వలన కలిగే మానసిక, శారిరక క్షోభనూ ఎదుర్కోవడం ఎంత కష్టమో గ్రహించాలి. మరీ ముఖ్యంగా, ఆ కేసులు పెట్టి, అతనికి అటువంటి పరిస్థితి కలగడానికి కారణం తన జీవిత భాగస్వామి అయితే భరించడం మరింత కష్టం.  ఈ కేసులు పెట్టిన తరువాత, వాటి విచారణలు దీర్గకాలం సాగుతాయి, ఆ విచారణలలో అతను తాను అమాయకుడని నిరూపించుకోవాలి. అదెంత కష్టమో అన్నది ఆలోచించాలి.  ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వేల మంది మగవారు చంపాలనో, ఆత్మహత్య చేసుకోవాలనో ఆలోచిస్తారు. కానీ, కొద్ది మంది మాత్రమే అలా చేస్తారు.  సాధారణ పరిస్థితులలో అయితే, తమ శ్రమనూ, శక్తి సామర్ధ్యాలనూ, కృషినీ, మేధో సంపత్తినీ దేశం కోసం వినియోగించేవారు,  ఈ 498A కారణంగా, దారుణ జీవితాన్ని గడుపుతూ, రోజూ చస్తూ బతుకుతున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీగారు, మాడిసన్ స్క్వేర్ గార్డెనులో ఉపన్యసిస్తూ, దేశములోని ఉపయోగంలేని,  కాల దోషం పట్టిన,  అర్థరహితమైన చట్టాలను, సాధారణ పౌరుల జీవితాలను కష్టతరం చేస్తూ, వారికి తమ పూర్తి సామర్ధ్యాలతో పనిచేసే అవకాశాన్ని లేకుండా చేస్తున్న చట్టాలను రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన 498A, గృహహింస నిరోధక చట్టం మరియూ నిరర్ధక వరకట్న వ్యతిరేక చట్టం లాంటి చట్టాలను తొలగిస్తే బావుండేది.

ఇంగ్లీషు పాలకులు తమకు తాము సేవ చేసుకుంటూ, భారత సామాజిక నిర్మానాన్ని నాషనం చేస్తూ, సాధారణ పౌరులకు ఇబ్బందులు కలిగించే లీగల్ సిస్టము బహుమానంగా ఇవ్వడం జరిగింది. తరువాతి 66 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ, దానీ మితృలైన వామపక్ష పార్టీలూ మరిన్ని చట్టాలను చేసి సమస్యను మరింతగా పెంచి పెద్దవి చేసి, కొత్త సమస్యలను సృష్టించాయే తప్ప, ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోయాయి. చట్టాన్ని గౌరవించి జీవించే గురుప్రసాద్ వంటి సాధారణ పౌరుడు, ఈ తరహా దురాగతాలకు పాల్పడుతున్నాడూ అంటే దానికి  మునుపటి ప్రభుత్వాలు, స్త్రీవాదులూ, శాసన కర్తలూ, పోలీసులూ, న్యాయవ్యవస్థ  కారణం.

గురుప్రసాద్ ఉదంతం ఈ తరహా సంఘటనలలో మొదటిది కాదు. కానీ, ఇటువంటి సంఘఠనలు భవిశ్యత్తులో మరిన్ని జరగకుండా ఉండాలి అంటే,  కుటుంబ విషయాలలో,  ప్రభుత్వాల జోక్యానికీ, వ్యక్తిగత, కుటుంబ బంధాలలను క్రిమినలైజ్ చేసే చర్యలకూ అడ్డుకట్ట వేయాలి. మేమేమీ అరాచకం రాజ్యమేలే, చట్టాలు లేని సమాజాన్ని కోరుకోవడం లేదు. కానీ, వీలైనన్ని తక్కువ చట్టాలుండడమే మంచిదని చెబుతున్నాం.  దానికోసం మొదట రద్దుచేయాల్సిన చట్టం 498A. దానికోసం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెర్రితలలు వేస్తున్న స్త్రీవాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి.

Advertisements
Published in: on October 26, 2014 at 8:42 pm  Comments (12)  
Tags: , ,

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2014/10/26/%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d/trackback/

RSS feed for comments on this post.

12 Comments

 1. కాలేజి లెక్చరర్ గురుప్రసాద్ చెడ్డవాడు కాకపోవచ్చును.అతని ఆత్మహత్యకు తగిన కారణాలు ఉండవచ్చును.కాని ఎట్టి పరిస్థితిలోనైనా ఇద్దరు పిల్లలనీ చంపడాన్ని ఎలా సమర్థిస్తాము?

  Like

 2. Blank post. Pls check and publish it again

  Like

 3. After his suicide, all think he is only correct. but we have to listen the version of his wife. please check her interview in sakshi.. Iddaru pillalni champi suicide cheskune vadu naa drushtilo oka psycho.. i agree 498A is being misused. nut in this case… nijalu devudikeruka..

  Like

 4. ఆ ఇంటర్వును ఎవరైనా నమ్ముతారా? 498ఏ చట్టం కోరుకొని లాబి చేసేవారు మీడీయాలో కుకప్ చేసిన ఇంటర్వు లా ఉంది. అంత బయాస్డ్ గా ఉంది.

  Like

 5. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య అనే న్యూస్ రెగ్యులర్‌గా పేపర్లో వస్తూనే ఉంటుంది. ఆమె అత్మహత్యకి ఏ కారణమైనా ఉండొచ్చు, అభంశుభం ఎరుగని పిల్లల్ని చంపేహక్కు ఎవరిచ్చారు అని మనమెవ్వరం అడగం. ఎందుకంటే ఆమెకు అంతకంటే ఆప్షన్ లేదనె విధంగా మీడియా రాస్తుంది, మనమూ అదే నమ్ముతాం. ఈ కొత్త చట్టాలు సగటు మగవాడికీ అంతకంటే ఆప్షన్ లేకుండా చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించం. కొందరు మగవాళ్ళు హక్కులు చలాయిస్తున్నారని, మిగతా అందరు మగవాళ్ళకి ప్రాథమిక హక్కులు నిరాకరిస్తున్నారు. ఆ చలాయించుకునే మగవాళ్ళని ఏం పీకలేరు మళ్ళీ. మెత్తగా ఉండేవాళ్ళనే మొత్తుదామని.

  Like

 6. కారణాలు ఏమైనప్పటికీ , గురుప్రసాద్ చేసిన పని అత్యంత హేయమైనది.
  ప్రతి ప్రాణం విలువైనదే ! గురుప్రసాద్ ప్రాణం, ఆయన ద్వారా పుట్టిన ,అభం శుభం తెలియని పిల్లల ప్రాణం కూడా ! అట్లాగే, భారత దేశం లో నిత్యం ( గృహ హింస ద్వారా ) మరణిస్తున్న స్త్రీల ప్రాణం కూడా ! ఆ పరిణామాలకు బాధ్యత , భార్యా భర్త లిద్దరిదీ ! సమాజానిదీ కూడా !
  విపరీతమైన ఆత్మ న్యూనతా భావం తో ,’ తన తో పాటుగా , తన పిల్లలు కూడా ఈ లోకం లో ఉండకూడదు’ ! అనుకునే
  ఆలోచన , మానవులలోని రాక్షస ప్రవృత్తి ని బహిర్గతం చేస్తుంది !
  ఇక చట్టాలు మార్చడం అనే విషయం ఇప్పుడు అప్రస్తుతం ! ఎందుకంటే , భారత దేశం లో గృహ హింస వల్ల , అనేక విధాలు గా నష్ట పోతున్నదీ , ప్రాణాలు కోల్పోతున్నవారిలో కనీసం 95 శాతం మంది స్త్రీలే ! ( ప్రత్యక్షం గా పురుషుల ద్వారానూ , పరోక్షం గా ఆత్మ హత్యల ద్వారానూ ) స్త్రీలే ! ఈ క్రింది వార్త చూడండి !

  National Crime Records Bureau reveal that a crime against a woman is committed every three minutes, a woman is raped every 29 minutes, a dowry death occurs every 77 minutes, and one case of cruelty committed by either the husband or relative of the husband occurs every nine minutes.[3] This all occurs despite the fact that women in India are legally protected from domestic abuse under the Protection of Women from Domestic Violence Act.[3]

  పాజిటివ్ దృక్పధం తో వివాహం చేసుకున్నా కూడా ! అకస్మాత్తు గా మరణం సంభవిస్తేఏమవుతుందో నని , ముందుగానే జీవిత భీమా చేసుకున్నట్టు, ప్రతి జంటా , ఇట్లాంటి కుటుంబ ఉపద్రవాలను కూడా, ఏ రకం గా పరిష్కరించుకోవాలో , ముందు గానే సంభాషించు కుంటే , ఉపయోగం ఎంతగానో ఉంటుంది, బలవన్మర ణాలూ , హత్యలతో పరిష్కారం చేసుకోకుండా ! ఒక వేళ, వారు తెలియని వయసు లో ఉన్నా కూడా , వారి వారి తలిదండ్రులు , వారిని కూర్చోబెట్టి , ఆ క్లిష్ట విషయాలు , ముందే చర్చించుకుంటే ఉత్తమం , కేవలం కట్నాలు ,కానుకల మాటలతో , విషాలు చిమ్ముకో కుండా !

  Like

 7. వాస్తవమేంటంటే National Crime Records Bureau చెప్పే వార్షిక గణాంకాల్నిలోతుగా విశ్లేషించినప్పుడు దేశంలో నానా రకాల హింసలకి గురవుతున్నవారిలో 66 శాతం మంది మగవాళ్ళేనని తెలుస్తుంది. కానీ మీడియా సృష్టించిన పురుషద్వేష వాతావరనంలో మనమీ సంగతి గుర్తించలేకపోతున్నాం. ఒప్పుకోలేకపోతున్నాం. ఎవరో ఒకరి పక్షాన పక్షపాత పూరితంగా చట్టాలు చేయడం మానేసి అందరినీ మానవతావాద దృక్పథంతో సమానంగా చూసే చట్టాలు రానంతవరకూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తెలుగులో మానవతావాదం మీద వస్తున్న బ్లాగు ఒకటే ఉంది. ఆసక్తి గలవారు చదవండి. అది చదివితే మన వ్యవస్థలో ఉన్న లోపమేంటనేది బోధపడుతుంది.

  http://the-andhra-humanist.blogspot.in

  Like

 8. @M.V.Ramanarao
  గురుప్రసాద్ పిల్లలను చంపడాన్ని సమర్ధించమని చెప్పడం లేదు కదండి? అతన్ని అటువంటి దురాగతానికి పురికొల్పిన పరిస్థితులు ఏవిటో గమనించి దాని నిర్మూలనకు చర్యలు తీసుకోమని కదా చెబుతున్నది? చిన్న పిల్లలను చంపడం దారూణం. అది గురుప్రసాద్ అయినా సరే మరి ఎవరైనా సరే. ఆర్టికలులో కూడా, గురుప్రసాద్‌కు పిల్లలపై ఉన్న ప్రేమను స్పష్టంగానే వివరించడం జరిగింది. ఈ ఆర్టికలు పేరు కూడా “సామాన్య మగవాడిని నేరస్తునిగా మారుస్తున్న చట్టాలను రద్దుచేయాలి” అని. అంటే, అతను నేరస్తుడు అన్న విషయం చెప్పకనే చెప్పారు కదా, ఈ ఆర్టికలు రాసిన రచయిత్రికూడా?

  @telugodu
  మీరు ప్రస్తావించినది మరో ఆలోచించాల్సిన కోణం. సహజంగా ఒక నేరం పురుషులు చేసినప్పుడు ఒక రకంగా, స్త్రీలు చేసినప్పుడు మరో రకంగా స్పందించడం సమాజములో జరిగేదే. దీని గురించి మరింత విపులంగా మరొక టపాలో వివరిస్తాను.

  Like

 9. @SriRam
  లేదండి. నేను మీరు కామెంటు రాసిన తరువాత మల్లీ చెక్ చేశాను. నాకు అంతా కనిపిస్తూనే ఉంది. బహుషా మీ బ్రౌజరులో ఏదైనా సమస్య ఉందేమో ఒక సారి చుడండి.

  @Pavan
  ఇద్దరు పిల్లలను చంపడం అనేది సమర్ధించాల్సిన విషయం కాదని నేనూ (ఈ వ్యాసం రాసిన రచయిత్రి కూడా)ఒప్పుకుంటాను. కానీ, ఇక్కడ మిరు ఆలోచించాల్సింది అది మాత్రమే కాదు. అతన్ని అటువంటి దురాగతానికి పురికొల్పిన పరిస్థితులు. ఒక సాధారణమీన వ్యక్తి, ఒక గౌరవనీయమైన వృత్తిలో ఉన్న వ్యక్తి, తన పిల్లలను ప్రేమించే వ్యక్తి అలా ఎందుకు ప్రవర్తించాడు? ఆ విషయాన్ని చెప్పడనికే ఈ ఆర్టికలు అంతే కానీ, చిన్న పిల్లల హత్యను సమర్ధించడానికి కాదు. ఇంకో విషయం సాక్షిలో వచ్చిన ఇంటర్వ్యూను మీరు నమ్మినట్లైతే అతను సూసైడ్ నోట్ లో రాసినదాన్ని ఇతరులు నమ్మడములో తప్పులేదు కదా? నిజానికి ఆ సూసైడ్ నోటే ఎక్కువ నమ్మదగ్గది, ఆ ఇంటర్వ్యూ కాదు.

  @Purna
  నాదీ మీ అభిప్రాయమే, ఆ ఇంటార్వ్యూ పూర్తిగా బయాస్డుగా ఉంది. తండ్రి మంచి వాడు కాదు అనో లేక పోతే అతను పిల్లలనో, భార్యనో హింసించే వాడనో కోర్టులు నమ్మితే, పిల్లలను చూసేందుకు విజిటేషన్ హక్కులు అతనికి లభించడం దుర్లభమయ్యుండేది.

  Like

 10. @Sudhakar
  గురుప్రసాద్ చేసిన పనిని నేనూ సమర్ధించడం లేదండి కానీ “కారణాలేమైనప్పటీకీ” అన్న మీ మాటను నేను అంగీకరించలేను. కారణాలు ఏమిటి అనేవి చాలా ముఖ్యం కదా? ఒక అత్యాచారం ఎందుకు జరిగింది అంటే .. దానికి “పురుషాదిఖ్యత” అనో లేకపోతే “స్త్రీల అణచివేత” ధోరణి అనో సమాధానం వస్తుంది. “కారణాలు ఏమైనప్పటికీ” అనే మాటా అక్కద రాదు కదా? ఎందుకంటే, కారణాలు ఏమిటి అనేది ముఖ్యం కాబట్టి. మరలాంటప్పుడు ఇక్కడ మాత్రం “కారణాలు ఏమైనప్పటికీ” అనడం ఎందుకు??

  //ఇక చట్టాలు మార్చడం అనే విషయం ఇప్పుడు అప్రస్తుతం ! ఎందుకంటే , భారత దేశం లో గృహ హింస వల్ల , అనేక విధాలు గా నష్ట పోతున్నదీ , ప్రాణాలు కోల్పోతున్నవారిలో కనీసం 95 శాతం మంది స్త్రీలే //

  కారణం ఒక చట్టం దురుపయోగం అవ్వడం అని ఇంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు, వాటిని మార్చాలసిన వసరం లేదు అని ఎలా అనగలరు? మరో విషయం, గృహహింస వలన ప్రాణాలు కోల్పోతున్నది 95% స్త్రీలే అన్నది నిజం కాదు. అసలు ఈ 95% అన్న గణాంకం ఎక్కడి నుండి తెచ్చారో, వాటికి సంబందించిన ఆధారాలు ఇవ్వగలరా? గృహహింస వంటివి తీవ్రమైన విషయాలు. వాటిలో ఇటువంటి నిరాధారమైన గణాంకాలకు చోటివ్వకండి.

  ఇక NCRB డేటా అనేది కేవలం పోలీసు స్టేషన్లో నమోదు అయిన కేసులను మాత్రమే తెలియజేస్తుంది తప్ప, అంద్జులో నిజాలు ఎన్ని, తప్పుడు కేసులు ఎన్ని అనే విషయాన్ని తెలియజేయదు. ఒక్క విజయావాడలోనే, నమోదైన గృహహింస కేసులలో 75% కేసులు తప్పుడు కేసులే అని విజయవాడ పోలీసు కమీషనరే ఆంగీకరించారు , ఇటీవల. 498A కేసులు, గృహహింస కేసులు విపరీతంగా దురుపయోగమవుతున్నాయని కోర్టులు ఎప్పటికప్పుడు తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన నిర్భయ యాక్టు కూడా విపరీతంగా దురుపయోగం అవుతోందని కోర్టులు కూడా చెబుతున్నాయి. వాటన్న్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా, కేవలం NCRBలో నమోదైన లెక్కల ఆధారంగా ప్రతీ నిమిషానికీ ఇంత మంది స్త్రీలు అణచివేతకు గురవౌతున్నారనో, లేదా అత్యాచారాలకు గురవుతున్నారనో ఒక అభిప్రాయానికి రావడం సరికాదు. అవన్నీ స్త్రీవాదులు చేసే ప్రాపగోండాలో భాగాలు. వాటిని చూసి మోసపోకండి.

  పెళ్ళీకి ముందే ఎవరూ విడిపోవాలని కోరుకోరు. ఆడైనా, మగైనా సుఖంగా కాపురం చేద్దామనే పెళ్ళీల్లు చేసుకుంటారు. కాకపోతే, అబ్బాయి ఫలానా హోదాలో ఉండాలని, బోలెడంత ఆస్థి పరుడయ్యి ఉండలనీ, మంచి జీతం వచ్చే ఉధ్యోగం ఉండాలని అమ్మాయిలు కోరుకోవడం, అమ్మాయి విషయములో అబ్బాయిలకు కూడా అనేక కోరికలుండడం జరుగుతోంది. అసలు పెళ్ళీ అనేదే ఫక్తు వ్యాపార ఒప్పందములా జరుగుతోంది. ఆ వ్యాపార ఒప్పందాలు పోయి పెల్లికి “ప్రేమే” పునాది కావాలని మేము కూడా మనస్పూర్తిగానే కోరుకుంటున్నాము. కానీ, అలా జరిగేంత వరకూ జాగ్రత్తలు ఇరువురూ తీసుకోవాల్సిందే. ఆ జాగ్రత్తలో భాగంగానే 498Aలాంటి విపరీతంగా దురుపయోగమయ్యే చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటున్నాము.

  @శ్రీతెలుగు,
  Well said. NCRB గణాంకాల గురించి సుధాకర్ గారికి ఇచ్చిన సమాధానం ఒక సారి చూడండి.
  ఆంధ్రా హ్యూమనిస్టు గారి బ్లాగును, పరిచయం చేసినదుకు ధన్యవాదాలు.

  Like

 11. తెలుగు లో రాసిన అక్షారాలు నాకు కానపడటం లేదండి. IE9 బ్రౌజర్ వాడుతున్నాను. ఇక నుంచి ఎవరైనా ఆదర్శపురుషులు మీ బ్లాగు లో వాదించటానికి వస్తే వాళ్లకో నమస్కారం పెట్టండి. 95% ఎందుకు 99.99% మహిళలు భారతదేశం లో గృహ హింస కు గురౌతున్నారు అని అంటే చేయగలిగింది ఎమి లేదు.
  ఆరునెలల క్రితం మాండోలిన్ శ్రీనివాస్ బెంగుళురు సత్యసాయి బాబా వైట్ ఫీల్డ్ ఆశ్రమం లో చాలా మంచి పోగ్రాం ఇచ్చాడు. మా ఇంట్లోవాళ్లందరు కచేరి ని విని ఎంతో ఆనందించాము. ఆయన జీవితంలో పదిహేను సంవత్సరాలకు పైగా, పైకి చెప్పుకోలేని ఎంతో బాధను అనుభవించాడు అని చనిపోయిన తరువాత విషయం తెలిసింది. దైవభక్తి,ఆధ్యత్మికత ఉన్న వాళ్లకే కష్టాలు భరించటం. తలకు మించిన భారమౌతుంది. ఇంటా బయట సమస్యలతో మగవాళ్లు ఎక్కువ కాలం జీవించలేరు.
  I found a couple of news items which talked about his marriage, which took place in 1994, and fell apart in 1997, following which he fought a legal battle for 15 long years to obtain a divorce. The news articles mentioned that Mandolin Srinivas was subject to “mental cruelty” at the hands of his wife, which was the foundation for the divorce litigation, which eventually concluded in the Supreme Court in 2012. There were references about Srinivas’ wife threatening to use the Indian Penal Code (IPC) and the Dowry Prohibition Act to ensure that he would be sent to prison for at least one day.

  I do not wish to delve into the rest of the allegations by and counter allegations against a departed soul, but what stood out was the fact that for a good 15 years of his life prior to his demise, Mandolin Srinivas was dealing with unpleasantness in marriage, inability to know and build a relationship with his son, and the resultant bitter legal battle.

  http://ibnlive.in.com/news/srinivas-the-low-notes-that-he-kept-away-from-mandolin-and-music/501016-45.html

  Like


Comments are closed.

%d bloggers like this: