ఫుట్యాంగ్ కథలు – పరిచయం

అనగనగా ఒక రాజు .. ఆయన పేరు వీరాధి వీర వర్మ. సుబ్బారావుది ముక్కు సూటి మనస్థత్వం. రాంబాబుకి ముక్కు మీద కోపం. సుబ్బమ్మది అందమైన ముఖం. శ్వేతకి పొగరెక్కువ. సీత అనుకువ గలిగిన అమ్మాయి.

ఇలా ప్రతీ కథలో కొన్ని క్యారక్టర్లూ, వాటికి కొన్ని లక్షణాలూ ఉంటాయి. అవి అవలక్షణాలు కావచ్చు, ఉత్తమ లక్షణాలు కావచ్చు. మనం కథల్ని గమనిస్తే, రచయిత ఏదో ఒక క్యారక్టర్ను హీరోను చేయడమో, విలన్ను చేయడమో, మరికొంత సాడిజాన్ని ప్రదర్శించి జోకర్ను చేయడమో చేస్తూనే ఉంటారు.

అలా రచయితలు హీరోలు చేసిన క్యారక్టర్ల పేర్లు చూసుకుంటే ధీరజ్, నీరజ్, అభిమన్యు, ఈశ్వర్, శివ లాంటి పేర్లు .. ఆ పేర్లలో కాస్త గంభీరత్వం, కాస్త శౌర్యం ఉట్టిపడేలానో లేకపోతె కనీసం కాస్త డీసెంటుగా అనిపించే పేర్లు పెట్టడం జరుగుతుంది.

అదే విలన్ కయితే ఫణి భూషన్ రావ్, శేషగిరి రావ్, సర్పభూషణ్ రావ్ లాంటి పేర్లు బాగానే పెడతారు. మన రచయితలకి పాము జాతులంటే బాగా ద్వేషమనుకుంటా ! అఫ్‌కోర్స్, ఇవే కాదు ఇంకా చాలా రకాల పేర్లు పెడతారనుకోండి !! మొత్తానికి విలన్ల పేర్లు వారి కౄరత్వాన్ని సూచించేలా ఉండేలా చూసుకుంటారు.

ఇక వీరందరికంటే బాదాకరమైన పేర్లు కొన్ని ఉన్నాయి. సుబ్బారావ్, రాంబాబు. నాకు ఈ పేర్లు పెట్టుకున్న వారి మీద ఏతరహా వ్యతిరేక భావమూ లేదు. కానీ, మన రచయితలంతా కలిసి ఈ పేర్ల మీద కక్ష కట్టేశారు. అమాయకపు క్యారక్టర్లకైనా, తింగరి క్యారక్టర్లకైనా, కాస్త హాస్యాన్ని పండించే క్యారక్టర్లకైనా ఈ పేర్లు పెట్టడం బాగానే చేస్తారు.

ఈ రచయితల పుణ్యమా అని సుబ్బారావ్, రాంబాబు అనే పేర్లు బాగా పలుచనైపోయాయి. ఒకానొక సినిమాలో అయితే, “నా పేరు సుబ్బారావ్” అని చెప్పగానే, ఆ పేర్లు ఇంకా పేడుతున్నారా? అని ప్రశ్నించేస్తాడు ఒక హీరో. అలా ఉంది పరిస్థితి.

అదీ కాక, పాఠకులకి/ ప్రేక్షకులకి కూడా పేర్లు పాత్రోచితంగా పెడితే బావుంటుంది అనిపిస్తుంది అని గట్టి నమ్మకం. ఉదాహరణకి, ఒకానొక జఠిలమైన కేసును సాల్వు చేయడానికి సీ.బి.ఐ, స్ట్రిక్ట్ ఆఫీసర్ పుల్లారావును నియమించింది అని కథలో రాస్తే పాఠకులకి అంతగా నచ్చకపోవచ్చు. అఫ్ కోర్స్, ఈ పేర్లు ఏమి పెట్టినా కథలో, కథనములో విషయం ఉంటే బాగానే ఉంటుంది అనుకోండి. కానీ, ఈ పేర్లు కేకు మీద ఐసింగులాగా పనిచేస్తాయి. పాత్రోచితమైన పేర్లు కథకు కొంత అందాన్ని ఇస్తాయి అన్నది కాదనలేని వాస్తవం.

ఇలా, పేర్లగురించి ఆలోచించిన తరువాత, నేను రాయబోయే కథలలో ప్రధాన పాత్రలకి, ఒక కొత్త పేరు పెట్టడం బెటర్ అనిపించింది. ఎందుకంటే, నా ప్రధాన పాత్రలన్నీ నెగటివ్ షేడ్స్ ఉన్నవే. ఆ నెగటివ్ షేడ్స్ … ట్రాఫిక్ సిగ్నల్సును జంప్ చేయడం దగ్గర్నుండి.. ఘరణా మోసాలు, స్కాములుల వరకూ ఏవైనా కావచ్చు. అలాంటి పాత్రలకు ఏదో ఒకపేరు పెట్టడం కన్నా.. ఒక ఫిక్సుడు నేం పెట్టడం బావుంటుంది అనిపించి, ఒక పేరుకి ఫిక్సయ్యాను.

ఆ పేరే “ఫుట్యాంగ్” (Fu-TyA-ng).

ఫుట్యాంగ్, స్త్రీ కావచ్చు – పురుషుడు కావచ్చు, ఎవ్వరైనా కావచ్చు. గుర్తించాల్సీన విషయం ఏమిటంటే.. కథలో “ఫుట్యాంగ్” అనే పేరు కనపడగానే అతను/ ఆమె మన ప్రధాన పాత్ర అని ఫిక్సై పోవచ్చన్న మాట !

ప్రస్తుతానికైతే ఫుట్యాంగ్ గురించి ఈ పరిచయం చాలు అనిపిస్తోంది. ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే ఈ పొస్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటాను.

ఇంకో విషయం ఈ బ్లాగు కేవలం కథలకోసమే కాదు. కొన్ని సీరియస్ ఆర్టికల్సుకు వేదికగా కాబోతోంది కాబట్టి, ఇది కేవలం కథల బ్లాగు అని అనుకోకండి. త్వరలో పోస్టుతో కలుస్తాను.

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2015/05/30/%e0%b0%ab%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9a%e0%b0%af%e0%b0%82-2/trackback/

RSS feed for comments on this post.

2 Comments

  1. మీరు భలే వ్రాస్తున్నారు ! పాపం! మా వారిపేరు రామ్మోహన్,హైదరాబాద్ లో రొమాంటిక్ గానే పిలుస్తారు.గోదావరి జిల్లాకెళితే మాత్రం “రాంబాబే” అని పిలుస్తారు.ఆయనకి ఫొటోగ్రఫీ పిచ్చి ఉంది.ఒక్కో ఫోటో కోసం గంట నిలబెడతారు.నేను కెమెరామాన్ గంగతో రాంబాబు అని పిలుస్తాను.డైలాగ్స్ కూడా అలాగే మాట్లాడతారు.గోదారోళ్ళతో గెలవలేమండీ,ఏదో…కృష్ణా ఆడవాళ్ళు కాస్త గడుసువాళ్ళం కాబట్టి బ్రతికిపోతున్నాను.ఫుట్యాంగ్ అంటే అర్ధం ఏమిటి ?

    Like

  2. నీహారిక గారూ,నాక్కూడా తెలీదండి. అసలు ఫుట్యాంగ్ అనే పేరు పెట్టడానికి కారణం … ఆ పేరు గల వ్యక్తి ఎవరూ ఉండరు అన్న ఫీలింగుతో, నేనొక మంచి పేరుకు నెగటివ్ పనులకు వాడుకోవడం లేదు అనే తృప్తికోసం. మీరే చూడండి, సుబ్బారావ్ అనే పేరును రచయితలు ఎలా చెడగొట్టారో !

    Like


Comments are closed.

%d bloggers like this: