స్వలింగ సంపర్కాన్ని “ఖురాన్ – బైబిల్ – గీత” ఆమోదించాయా !?

కూల్, మీ ఆవేశం నాకు అర్థమయ్యింది.  అసలు గీతలో స్వలింగ సంపర్కం గురించిన ప్రస్తావన ఎక్కడుంది, బైబిలులో ఎక్కడుంది,  ఖురాలులో ఎక్కడుందో చూపించు, లేకపోతే నువ్వు అయిపోయావ్ ఈరోజు ! అనే ఫీలింగుతో మీరు ఇక్కడికి వచ్చుంటే మాత్రం, అలా ఓ గ్లాసు మంచి నీళ్ళు తాగి రిలాక్సవ్వండి.  ఇక్కడ విషయం వేరే !!

ఈ పోస్టును నేను ధార్మిక గురువు ముస్టాఖ్ అహ్మద్ అలియాస్ M.A అభిలాష్ గారు రాసిన ఈ పోస్టు ఆధారంగా రాస్తున్నాను.

గీతా,బైబిల్,ఖురాన్ శాస్త్రాల ప్రకారం : దైవేతరుల ఆరాధన ఆథ్యాత్మిక వ్యభిచారమా?

ఈ పోస్టులో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలూ,  మరికొన్ని తర్కాలూ చెప్పారు. కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు.  ముందుగా ఆ ఆసక్తి కరమైన వ్యాఖ్యలూ, తర్కాలూ చూద్దాం.

చూశారుగా ఖురాను, బైబిలు,  గీత ఇవన్నీ, ధార్మిక గురువు ముస్తాఖ్ అహ్మద్ గారి వచనాల ప్రకారం,  దేవుడు భక్తులకు భర్త అనితెలుపుతున్నాయి.  భర్త అంటే …  A lord, master, prince, ruler. ఏలిక లాంటి అర్థాలు కూడా ఉన్నాయి. కానీ, అవేమీ మనం తీసుకోకూడదు. భర్త అంటే కేవలం తాళి కట్టిన భర్త.  జీవిత భాగస్వామి నుండి భర్త ఏవేమి ఆశిస్తాడో అవన్నీ దేవుడు మన దగ్గరనుండి ఆశిస్తాడు. ఉదా: పాతివ్రత్యం లాంటివి అన్నమాట.

మనం కనుక ఈ పాత్రివ్రత్యాన్ని కాదని వేరే దేవుళ్ళను కొలిచామా .. మనం ఏకంగా ఆధ్యాత్మిక వ్యభిచారులమై పోతాము.   ధార్మిక గురువు ముస్టాఖ్ అహ్మద్ గారి ప్రకారం మనం, ఖురాన్, బైబిల్, గీత ఇదే విషయాన్ని చెబుతున్నాయి…!

చూశారుగా ! సరే ఇప్పుడు విషయానికి వద్దాం. 

జనాభాలో ఆడా, మగా ఇద్దరూ ఉంటారు.  ఆడవారికి భగవంతుడు భర్త అంటే తప్పులేదు. మరి మగవారికి కూడా దేవుడు భర్త అనడమే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం కదా ! అంటే ఇక్కడ మనకు క్లియరుగా అర్థమవుతోంది ఏమిటి?

దేవుడు మగ – మగ మధ్య సంబంధాలను అంగీకరిస్తున్నాడనేగా?  ఒక మగాడు మరో మగాడికి భర్తగా ఉండొచ్చు అనే కదా ? ‘గే’ సంబంధాలను, ధార్మిక గురువు ముస్టాఖ్ అహ్మద్ గారి ప్రవచనాల ప్రకారం, ఖురాన్, బైబిల్, గీత ఆమోదించినట్టేగా !!

ఇంకో విషయం మగవారు ఒక స్త్రీని పెళ్ళి చేసుకోవచ్చు. ఖురాన్, బైబిల్, గీత అన్నింటిలో పెళ్ళి అనేది దేవుని  ఆదేశాల ప్రకారం చేసుకోవచ్చు.  పెళ్ళి చేసుకోవడం తప్పుకాదు.

అంటే, మగవారు దేవున్ని తమ భర్తగా భావిస్తూ,  మరొక స్త్రీకి భర్తగా ఉండొచ్చు. అంటే ఈ పవిత్ర గ్రంధాల ప్రకారం మగవారు “ద్విలైంగిక సంబంధాలను అనగా బై సెక్సువాలిటీ” ని కూడా కలిగి ఉండవచ్చు. 

ఇదంతా కేవలం ధార్మిక గురు ముస్టాఖ్ అహ్మద్ గారి ప్రవచనాల ప్రకారం అని మరువ కూడదు మీరు.  అంతే కానీ, ఖురానులో – బైబిలులో – గీతలో నిజంగా అలా ఎక్కడ రాసి ఉందో చూపించు అని నా కాలరట్టుకుంటానంటే కుదరదు, ఇప్పుడే చెబుతున్నాను.

కాకపోతే, ధార్మిక గురువు గారు మరో మాట కూడా అన్నారు.  భగవంతుడు భక్తునికి “భర్త” అయితే, భక్తుడు “భార్య” అవుతాడని. కాకపోతే, దీన్ని మనం అంగీకరించాల్సిన పనిలేదు.  ఎందుకంటే, ఖురాన్ – బైబిల్ – గీత లలో ఎక్కడైనా దేవుడు .. ” ఓ భక్తుడా, నీవు నాకు భార్యవు” అని చెప్పాడేమో చూపించమనండి. ఎక్కడ చెప్పినా … “భగవంతుడు” భక్తునికి “భర్త” అని మాత్రమే చెప్పియున్నారు.  ఎందుకు??

ఎందుకంటే, భక్తులలో ఆడా, మగా ఇద్దరూ ఉండునని భగవంతునికి తెలియును కనుక  ఆయన  భక్తులని “మీరు నా భార్యలు అని”  ఎక్కడా చెప్పలేదు.  కాబట్టి భగవంతుని దృష్టిలో, స్వలింగ సంపర్కం తప్పు కాదు. 

“జీవిత పరియంత సవాలు” (LIFE TIME CHALLENGE) :

ముస్టాఖ్ అహ్మద్ గారు, ఇది మీకు మేము వేసే “జీవిత పరియంత సవాలు” (LIFE TIME CHALLENGE)!!  పవిత్ర గ్రంధాలైన ఖురాన్ – బైబిలు – గీత లలో దేవుడు భక్తులు తమకు “భార్యలు” అని ఎక్కడైనా చెప్పి ఉన్నారేమో తెలపండి.  లేదంటే, స్వలింగ సంపర్కం, మీరు చేసిన వాదనల ప్రకారం, ఆమోద యోగ్యమే అని అంగీకరించండి.

P.S: ఒక వేల  ఖురాన్ – బైబిలు – గీతలలో భగవంతుడు “భక్తులు నాకు భార్యలు” అని తెలిపి నట్లు ఎవరైనా నిరూపిస్తే  ఏమవుతుంది?  ఏమవుతుంది …  భక్తులలో స్త్రీలు, పురుషులూ ఇరువురూ ఉంటారు కాబట్టి … పురుషులను “భార్యలు” అన్నారంటే .. వారికి లింగ మార్పిడి జరిగింది అని అర్థం. అంటే … అవి “లింగ మార్పిడి”ని అనగా Transexualsని సమర్ధిస్తున్నాయి అని అర్థం.  అంతే !!  ఏదైతేనేం, పవిత్ర గ్రంధాలన్నీ LGBT హక్కులను సమర్ధించడం ఆహ్వానించదగ్గ పరిణామమే కదూ !!

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2015/06/30/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%96%e0%b1%81%e0%b0%b0/trackback/

RSS feed for comments on this post.

5 Comments

 1. గౌరవనీయులైన శుక్రాచార్య గారికి నమస్కారాలు!మీరు అసలు విషయము నుండి ప్రజల దృష్టిని మళ్ళించటానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలకు అర్థం అయిపోతుంది. దానికి ప్రబల గుర్తు…దేవుడు తన “భక్తు”లకు “భర్త” అన్న విషయాన్ని ధర్మశాస్త్రాల “మూలం” (TEXT) లోని వాక్యాలను “ఆధార సహితం” (WITH REFFERENCE) గా చూపినప్పటికీ మీరు వ్యంగ్యంగా- “ధార్మిక గురువు ముస్తాఖ్ అహ్మద్ గారి వచనాల ప్రకారం” అని అంటున్నారు. ఇది ఎంతటి అన్యాయమో మీ అంతరాత్మకు తెలియనిది కాదు! ప్రజలు కూడా దీనిని గుర్తించకపోరు! ఇంకా, ఒక వ్యక్తి పరాయి స్త్రీని ఉద్దేశించి “అమ్మా!” అని పిలిస్తే ఆమె ఎంతటి ఆజ్ఞానురాలు అయినప్పటికీ, అతడిని ఉద్దేశించి- “ఏరా నీ తండ్రితో నాకు రంకు కడుతున్నావా?” అని ప్రశ్నించదు కదా శుక్రాచార్యా గారూ! అతడు తన్ను ఆవిధంగా పిలవటంలోని ఆంతర్యం తన పట్ల అతనికి ఉన్న “అపార గౌరవం!” అని ఆమె గుర్తిస్తుంది. అలాగే తనతో వ్యభిచార పూర్వకమైన అనగా కలుషితమైన అస్వచ్ఛమైన సంబంధం కలిగి ఉండవద్దు అని సర్వేశ్వరుడు ఆజ్ఞాపించటంలోని ఆంతర్యం- పతివ్రతా పూర్వకమైన అనగా కలుషితం కాని స్వచ్ఛమైన సంబంధం కలిగి ఉండమన్నదే కాని, తమ నీచాతి నీచమైన అత్యంత నికృష్ట సిద్ధాంతాలను బలపరచుకోవటానికి ఆ సర్వేశ్వరునితో రంకులు కట్టటానికి కాదు కదా శుక్రాచార్యా గారూ!“దైవేతరుల ఆరాధన అధ్యాత్మిక వ్యభిచారము” అన్న విషయాన్ని గీతా-బైబిలు-ఖురాన్ శాస్త్రాల వాక్యాలను నేను “మూలం” (TEXT) లోని వాక్యాలను “ఆధార సహితం” (WITH REFFERENCE) గా చూపినప్పటికీ మీరు వ్యంగ్యంగా- “ధార్మిక గురువు ముస్తాఖ్ అహ్మద్ గారి వచనాల ప్రకారం” అని అంటున్నారు. అది తప్పో ఒప్పో మీకు తెలియాలంటే- “పురుషుడు” అనగా “మగవాడు” అని మాత్రమే అర్థం వస్తుందా శుక్రాచార్యా గారూ! మరి అలాగైతే- “Saavithri told to Raajesh about the crime of prakaash.” అన్న వచనమునకు సంబంధించి వ్యాకరణ పరిభాషాలో “ప్రథమ పురుషం”లో ఉన్నది ఎవరని ప్రశ్నిస్తే కనీస భాషా పరిజ్ఞానం ఉన్న వారవరైనా, “Saavithri” అని సమాధానం ఇస్తారు. అయితే “Saavithri” అంటే “స్త్రీ” కదా! అటువంటప్పుడు ఆమె “పురుషుడు” ఎలా అవుతుంది? అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే- “ప్రథమ పురుషం” అంటే ఇక్కడ “ప్రథమ మగవాడు” అని కాదు… “ప్రథమ వ్యక్తి” అనే అర్థం వస్తుంది నాయనా!!” అని మీరు సమాధానం ఇస్తారు కదా శుక్రాచార్యా గారూ! ఈ విషయం మీకు తెలిసి కూడా వ్యంగ్యంగా- “ధార్మిక గురువు ముస్తాఖ్ అహ్మద్ గారి వచనాల ప్రకారం” అని “పురుషులు” అయిన భక్తులకు “పురుషుడు” అయిన సర్వేశ్వరుడు “భర్త” అయ్యాడోహోయ్! కనుక “స్వలింగ సంపర్కం” ధార్మిక గురువు ముస్తాఖ్ అహ్మద్ గారి వచనాల ప్రకారం ధర్మబద్ధమే కదా! అని హడావిడి చేయటం మీలాంటి పెద్దలకు ఎంతవరకు సమంజసం? “దేవుడు లింగాతీతుడు” అన్నది మీకు తెలుసు కదా శుక్రాచార్యా గారూ! మీ లాంటి విజ్ఞులకు ఆ విధమైన అల్పమైన వ్యాఖ్యానాలు చేయటం ఏమాత్రమూ శోభించదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? సర్వేశ్వరుడు అలాంటి పద ప్రయోగాలను చేసింది, విషయాన్ని మానవ ఇంగితానికి అందించటానికే తప్ప వాటిని అక్షరార్ధంలో తీసుకొని ఎదుటి వారిని అభాసు పాలు చేసి ఆనందించు కోవటానికో లేక అమాయకులైన తమ అనుచరులను మాయ చేయటానికో కాదన్నది మనలోని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.మీరు “అభిలాష్” అనే నా కలం పేరు తప్పించి కేవలం “ముస్తాఖ్ అహ్మద్” అని మాత్రమే పేర్కొనటంలోని ఆంతర్యం ఏమిటి? ఈ ఏకేశ్వర వాదన ముస్లిములకు మాత్రమే చెందినది మన హిందువులకు చెందినది కాదు. కనుక దాన్ని మీరు పట్టించుకోవలసిన అవసరం లేదు అనే సందేశాన్ని విగ్రహారాధకులలో లీలామాత్రంగా పంపించటమేకదా! అయితే ఒకప్పటి ప్రజలు- “ఎవడు చెబుతున్నాడు” అన్న దానిని బట్టి విషయాన్ని తీసుకొనేవారు. కానీ ఈనాటి ప్రజలు “ఏమి చెబుతున్నాడు” అన్న దానిని బట్టి విషయాన్ని తీసుకుంటున్నారన్న విషయాన్ని మీరు గుర్తించాలి. కనుక మీ ఆ ప్రయత్నం వృథా ప్రయాసే అన్నది గనించి, విషయాన్ని హేతువు ఆధారంగా లేక ధర్మశాస్త్రాల ఆధారంగా మాటలాడే ప్రయత్నం చేయగలరు. దీని వలన మీకూ-మాకూ-మనందరికీ లాభదాయకం కాగలదు!

  Like

 2. “అన్నా నీకో దండమే! అందరి తరపునా నేను వకాల్తా పుచ్చుకోలేను కానీ, జెనరలుగా విషయం చెప్పగలను. చాలా మంది స్వలింగ సంపర్కుల హక్కులను సమర్ధిస్తున్నది వాళ్ళు స్వలింగ సంపర్కులు అయ్యుండబట్టి కాదు. తమ తోటి ప్రజల హక్కులను గౌరవించాలన్న చిన్న ఫీలింగ్ తోటి. నా వరకు నేను.. ప్రపంచములోని అమ్మాయిలందరూ చచ్చిపోయి, కేవలం మగాళ్ళు మాత్రమే మిగిలిన పరిస్థితి వచ్చినా .. హోమో సెక్సు జోలికి మాత్రం పోను” అని మీరు July 4, 2015 at 9:45 PM సమయమున MARXIST HEGELIAN గారికి గట్టిగా ప్రమాణం చేసి ఉన్నారు. మీరు ఆయన గారికి ఆ ప్రమాణం చేయటానికి గల కారణం- మీ దృష్టిలో “హోమో సెక్సు” హీనాతి హీనం, నీచాతి నీచం కావటమే కదా! అయితే ఆ ప్రమాణానికి మీరు కట్టుబడి ఉండగలరని నాకైతే మీపై పూర్తిగా నమ్మకం ఉంది. అయినా ఆ దుష్క్రియపై మరల కుండా మీ మనస్సును ఆ దేవాది దేవుడైన సర్వేశ్వరుడూ మిమ్మల్ని కాపాడాలని నేను మనసారా మీ గురించి ప్రార్ధిస్తున్నాను.శుక్రాచార్యగారూ మీ దృష్టిలో “హోమో సెక్సు” హీనాతి హీనం, నీచాతి నీచం అయినప్పటికీ దానికి పాల్పడే ఇతరులను ఎందుకు సమర్ధిస్తున్నారు? అని ప్రశ్నిస్తే- “తమ తోటి ప్రజల హక్కులను గౌరవించాలన్న చిన్న ఫీలింగ్ తోటి!!” అన్నది మీ సమాధానం!!! మిత్రులు జైగారి సమాధానమైతే-The statement “I disagree with everything he says but will defend to my last breath his right to say it” summarizes the concept.ప్రస్తుతం మనం మాటలాడుకుంటున్నది “right to do” గురించే గాని “right to say” గురించి కాదన్నది గమనించాలి.ఇక్కడ మీరిద్దరూ కలసి ఆ దుర్మార్గపు నీచత్వాన్ని ఖండించే వారికి ఎదుటి వారి బాధల పట్ల ఎలాంటి “ఫీలింగు” లేని వారిగా ఇంకా ఎదుటి వారికి తమ అభిప్రాయాను ప్రకటించే అర్హతను ఇవ్వని వారీగా ఒక వైపు చెబుతూ మరో వైపు తామే అలాంటి గొప్ప స్పందనలను కలిగి ఉన్నట్లు చాటుకుంటున్నారు!పై రెండు విషయాలను మీకంటే ఎక్కువగా మేము కలిగి ఉన్నాము. అయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకే ఒక్క విషయం. అదేమిటంటే- మీరు చెబుతున్న “స్వేచ్ఛ” పరిమితులతో కూడినదా? లేక విచ్చలవిడి “స్వేచ్ఛ?” అన్నదే! ఒకవేళ పరిమితులతో కూడినడైతే దానికి ప్రతిపాధిక ఏమిటి? విచ్చలవిడి “స్వేచ్ఛ” అయితే అది ఆచరణాత్మకంగా ఎలా సాధ్యం? అన్నది మీరు మాకు వివరంగా చెప్పాలి. దయచేసి, శుక్రాచార్యాగారు, జైగారూ ఈ భావజాలం కలిగి ఉన్న ఇతర మిత్రులు దీని విషయములో తప్పించుకొనే ప్రయత్నం చేయరని ప్రగాఢంగా ఆశిస్తున్నాము.

  Like

 3. @ముష్టాఖ్ అహ్మద్ గారూ, మీరు రాసిన పోస్టు అక్కడే ఉంది. నేను రాసిన పోస్టూ ఇక్కడే ఉంది. రెండింటినీ చదివిన ప్రజలు, ఎవరు ఏపనిచేస్తున్నారో సులభంగానే గ్రహించగలరు. దేవుడు భక్తుడికి భర్త వంటి వాడు అని గ్రంధాలు చెప్పి ఉండొచ్చు. కానీ, ఆ భర్త అంటే అర్థం భార్యా – భర్త బంధములోని భర్తా లేక .. ఏలిక, సర్వేశ్వరుడు, అధిపతి లాంటి అర్థాన్ని ఇచ్చే భర్తా ? మీరు భర్త అంటే అర్థం సర్వేశ్వరుడు అని చెప్పి ఉంటే, పవిత్ర గ్రంధాలలోని వాఖ్యలు చెప్పారు అనుకుని ఉండేవాన్ని. కానీ, దీనికి మీ సొంత అర్థాలను ఇచ్చారు. భర్త అంటే భార్యా – భర్తలలోని భర్త, కాబట్టి పాతివ్రత్యం ఉండాలి అన్నట్లుగా రాశారు. అందుకే, నేను ముష్టాఖ్ అహ్మద్ గారి ప్రవచనాల ప్రకారం అని ఈ వెటకారం పోస్టూ రాసాను. ఈ పోస్టు దేనికింద ట్యాగ్ చేయబడిందో మీరు గమనిస్తే.. అందులో మీకు “వ్యంగ్యం” “Satire” అన్న ట్యాగ్‌లు కనపడతాయి. అంటే దీన్ని నేను వ్యగ్యరూపములోనే వివరించాను. మీరు, దేవుడు భక్తునికి భర్త కాబట్టి, భక్తుడు దేవుని “భార్య” అని కూడా చెప్పి, తరువాత పాతివ్రత్యం గురించి మాట్లాడి, వేరే దేవుళ్ళను పూజించడం ఆ పాతివ్రత్యాన్ని తప్పడం, ఆధ్యాత్మికంగా వ్యభిరంచడం అని .. పిచ్చి రాతలు రాశారు. మీమీద నాకు గౌరవముంది. కానీ, ఇటువంటి రాతలను నేను అంగీకరించబోను. అది మీరు రాసినా సరే, ఎవరు రాసినా సరే..! భర్త, భార్య, పాత్రివ్రత్యం, వ్యభిచారం అనే పదాలను అంత గొప్పగా వాడిన మీరు, ఇప్పుడు మాత్రం నేను వాటిని వేరే అర్థములో వాడాను అనడములో అర్థం లేదు. నిజానికి కొన్ని కోట్ల మందిని మీరు అవమానించారు. మీకే హక్కుందండీ ఇలాంటి పిచ్చి రాతలు రాయడానికి? మీ ధర్మములో ఏకేశ్వర ఆరాధన ఉండొచ్చు కాక, దాన్ని అందరూ ఆమోదించాలనీ హూంకరించడానికి, అలా చేయని వారిని వ్యభిచరిస్తున్నారు అనడానికి ఎలా సాహసించారు? నోటికి ఏదొస్తే అది అనేయడమేనా? మీరు పవిత్ర గ్రంధాలలోని వ్యాఖ్యలనే తెచ్చి రాస్తున్నారు అనుకున్నా, ఆ వ్యాఖ్యల అర్థాలు మాత్రం మీరు మీకు నచ్చినట్లుగా, ఇతరులను కించ పరిచేట్లుగా రాస్తున్నారు. దానితో, ఈ వెటకారాలు చేయవలసి వచ్చిందని గమనించండి. //తమ నీచాతి నీచమైన అత్యంత నికృష్ట సిద్ధాంతాలను బలపరచుకోవటానికి ఆ సర్వేశ్వరునితో రంకులు కట్టటానికి కాదు కదా శుక్రాచార్యా గారూ!// మొదట అటువంటి పని చేసింది మీరే ! మీకు నచ్చని బహుదేవతారాధనను ఖండించడానికి మీరు తీవ్ర పదజాలాన్ని ఎన్నుకున్నారు. దానికి కౌంటారుగా నేను భావజాలాన్ని ఎన్నుకున్నాను. నేను చేసింది తప్పు అని అనుకుంటే, దానికి కారణం మాత్రం మీరే !! ఒక స్త్రీని అమ్మా అని పిలిస్తే ఆమె తనను గౌరవిస్తున్నాడు అనుకుంటుంది. కానీ, దాని తరువాట, నేను నీకు కొడుకుని కాబట్టి, నా తండ్రి నీకు భర్త అని ఆమెతో అని, నీవు ఇంకొకర్ని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి నీవు “వ్యభిచరించావు” అనే సిద్దాంతాల్ని ప్రతిపాదిస్తే .. అక్కడికక్కడే నరికేస్తుంది. మీరు, రాసిన ఆర్టికల్ ఈకోవకు చెందినదే ముష్టాఖ్ అహ్మద్ గారూ ! అందుకే ఇలా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది.

  Like

 4. //మీరు ఆయన గారికి ఆ ప్రమాణం చేయటానికి గల కారణం- మీ దృష్టిలో “హోమో సెక్సు” హీనాతి హీనం, నీచాతి నీచం కావటమే కదా!//కాదు. హోమో సెక్స్ అనేది నాకు నచ్చదు కాబట్టి. అలా అని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇతరుల మీద రుద్దడం తప్పు. అందుకే, నేను హోమో సెక్సు జోలికి వెల్లను, స్వలింగ సంపర్కం ఇష్టమై ఆచరించే వారిది తప్పని చెప్పను. ఇదే నేను చెప్పాలనుకున్నది. అది కూడా ఆయన, హోమోసెక్సును సమర్ధించేవారు.. హోమో సెక్సువల్స్ అయ్యుండాలనీ లేదా అవకాశం వస్తే అవ్వాలనీ చెప్పాడు. దానికి కౌంటరుగా ఈ కామెంట్ రాయడం జరిగింది. ఇక గొట్టి ముక్కల గారు చెప్పింది కూడా సమంజసమే. ఆయన చెప్పింది, అభిప్రాయానికే కాదు హోమో సెక్సులాంటి యాక్టుకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే, Homosexలో తప్పేమీ లేదు. ఇద్దరికి నచ్చి ఏర్పరచుకునే సంపర్కములోకి మతాలు కాలు పెట్టజాలవు. వాటికి ఆ హక్కులేదు. //మీరు చెబుతున్న “స్వేచ్ఛ” పరిమితులతో కూడినదా? లేక విచ్చలవిడి “స్వేచ్ఛ?” అన్నదే! //ఎవరి స్వేచ్ఛకైనా పరిమితులుంటాయి. కానీ, ఆ పరిమితులు మతాలు నిర్ణయించ జాలవు. వాటిని ఈ తరం మనుష్యులు, ఈ తరం భావజాలముతో, ఈ తరం చట్టాలకూ, ఈ తరం పరిస్థితులకు అనుగుణంగా మేము నిర్ణయించుకుంటాం. ఉదాహరణకు ఈ స్వలింగ సంపర్కమే తీసుకోండి. అది మతాల ప్రకారం నీచం. కానీ, మా దృష్టిలో కాదు. ఎందుకంటే, తమ జీవితాన్ని తాము నిర్ణయించుకోగల మానసిక పరిపక్వత కల్గిన ఇద్దరు వ్యక్తులు తీసుకున్న నిర్ణయం అది. దాన్ని మేము వ్యతిరేకించలేము.

  Like

 5. [Edit] mustak ahmad , whats wrong if he tell your name. Meka vanne todelu nuvvu, nilanti jakir naik lu. musugu vesukoni mayacheddamni try chestunnaru

  Ni [Edit] islam prakaram ni alla magavadu kada. mari ippudu lingatitudani enduku toka jadinchav?

  Ni mohammadu [Edit] edi vagite adi devudi vakyalani miru nammite avi migita prapancham nammala?
  Ni [Edit] matam maku avasaram ledu. Get out of India videshiyullara.

  Like


Comments are closed.

%d bloggers like this: