వేదాలలో విగ్రహారాధన – అపోహలు, నిజాలు ! (Repost)

ఆర్యా ముస్టాఖ్ అహ్మద్ (MA అభిలాష్), 

నేను గత టపాలో సర్వేశ్వరుడు “సర్వాంతర్యామి” అని తెలిపే భగాద్గీత శ్లోకమును ఇచ్చియున్నాను. మీరు దానికి సంతుష్టులయ్యే ఉంటారని భావిస్తున్నాను.  ఇక మీరు నాకు ఇచ్చిన సమాధానములోని అంశాలను పరిశీలిద్దాం.

ఈ అంశాల పరిశీలనను నేను రెండు విధాలుగా చేయదలుచుకున్నాను.

 1. ధర్మ శాస్త్రాల ప్రకారం పరిశీలన
 2. సమకాలీన అంశాలను పరిగణలోకి తీసుకుని,  ఇంగిత ఙ్ఞాణముతో చేసే  పరిశీలన.

1. ధర్మ శాస్త్రాల ప్రకారం పరిశీలన :

నన్ను వ్యభిచరించని ప్రేమతో ప్రేమించుచూ వ్యభిచరించని భక్తితో
సేవించుచూ ఎవడు నన్ను బడయ ప్రయత్నించునో (అతడు) చెడు
గుణములనునతిక్రమించును. మరియు అతడు సైతము బ్రహ్మ(పవిత్రుడు)
అగుటకు సమర్ధుడగును.  -14:26 (శ్రీ గీతాయోగము)  

దీనిని బట్టి- గీతాశాస్త్రం ప్రకారం- బహుదైవోపాసన లేక విగ్రహారాధన “అధ్యాత్మిక వ్యభిచారము!” అని అర్థం కావటం లేదా శుక్రా చార్య గారూ! ఈ అధ్యాత్మిక వ్యభిచారులైన వారిగతి ఏం కానుందో ఈ క్రింది శ్లోకములో గమనించగలరు.  

దీనికోసం భగవద్గీత వెదికా. భగవద్గీత లో 14వ చాప్టరు, 26 వ శ్లోకము ఇది 

māḿ ca yo ‘vyabhicāreṇa
bhakti-yogena sevate
sa guṇān samatītyaitān
brahma-bhūyāya kalpate

mām — unto Me; ca — also; yaḥ — a person who; avyabhicāreṇa — without fail; bhaktiyogena — by devotional service; sevate — renders service; saḥ — he; guṇān — the modes of material nature; samatītya — transcending; etān — all these; brahmabhūyāya — elevated to the Brahman platform; kalpate — becomes.

Translation: One who engages in full devotional service, unfailing in all circumstances, at once transcends the modes of material nature and thus comes to the level of Brahman.

Link: http://vedabase.net/bg/14/26/en

దీనిలో మీకు బహుదైవారాధన, విగ్రహారాధన గురించిన విషయం ఏమి కనిపించిందో కాస్త వివరిస్తారా ముస్టాఖ్ అహ్మద్ (MA అభిలాష్) గారూ? ఇదే విషయాన్నే మీ బ్లాగులో Jai Gottimukkala గారు కూడా అడిగారు. మీరు దానికి సమాధానం ఇవ్వలేదు. భగవద్గీత గురించి ఏదైనా చెప్పాలనుకుంటే.. Authentic Source శ్లోకాలు తీసుకుని చెప్పండి.

ఇక మరో శ్లోకానికి వద్దాం.

ఆ పరమసత్త ఈ జగత్తును ఎంతో ఆక్రమించుకొనియున్నది. దానికి రూపం లేదు,
శోకము లేదు. దీనిని తెలుసుకున్నవారు అమరులవుతారు.ఇతరులందరూ
దు:ఖాన్ని అనుభవించాల్సిందే. శ్వేతాశ్వతరోపనిషత్త్ -3:10

ఈ శ్లోకమొక్కటే కాదు. దాని వెంటనే 3:11 వ శ్లోకం కూడా ఏమి చెబుతుందో ఒక సారి చూడండి మీకే తెలుస్తుంది.  “రూపం లేదు” అని చెప్పడానికి గల కారణమేమిటో.  దీన్ని ఎలా చెప్పవచ్చంటే … నీటికి రూపం లేదు. దాన్ని మనం ఏపాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని అవి సంతరించుకుంటాయి.  అలానే పరమాత్మ కూడా నిరాకారుడు. భక్తుడు ఏరూపములో కొలుచుకుంటే ఆరూపములో కనపడతాడు.  

(Click on image to maximize)


పైన ఇచ్చిన ఇమేజుల్లో 3:10 మరియూ 3:11 శ్లోకాలున్నాయి. వాటిలో 3:11 (2వ ఇమేజులోనిది) శ్లోకం తాత్పర్యం, వాటికి ఆ పుస్తక రయచిత ఇచ్చిన వివరణ చూడండి.

” Therefore, that Devine Lord, being allpervading, omnipresent and benevolent, dwells in the hearts of all beings, and makes use of all faces, heads and necks in this world.

 [Notes — It is noteworthy that this Mantra, speaking of divine immanence, comes immediatley after the previous one, which depicts the Supreme as the Absolute, far beyond all relations. The idea is that God is both transcendent and immanent. This beautiful synthesis of the conceptions of the Personal and the Impersonal, of the Transcendent and the Immanent, is a characteristic feature of this Upanisad.]

1. Therefore — Because He is formless, all – pervading, etc., He can take any form, and be present anywhere and everywhere, according to the wish of the devotee.  

2. Benevolent — If He did not graciously dwell in the hearts of all beings, and guide their senses, thoughts and actions, it would not have been possible for man to realize Him, by his own unaided effort. 

3. Makes use of etc. — To bring about the evolution of the Souls, and ultimately bring them to the goal of liberation (Mukti).] 

అదీ అసలు విషయం.  మీరేమో నిరాకారుడు కాబట్టి,  విగ్రహారాధన మహాపాపం అని చెప్పారు. కానీ అక్కడ ఉద్దేశ్యం మాత్రం వేరేగా ఉంది. రెండవ పాయింటు చెప్పేదేమిటంటే, అతను నిరాకారుడు, సర్వాంతర్యామి కాబట్టే, ఏ ఆకారానికైన్నైనా తీసుకోగలడు, ఎక్కడైనా ఉండగలడు.

సహజంగా ఈ వేదాలూ, భగవద్గీత వీటన్నింటిలో ఏదో ఒక శ్లోకం తీసుకుని  మీకు నచ్చింది మీరు రాసుకుంటారు. సహజంగా ఇలాంటి పనులే చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ, పూర్తిగా అవగాహణ ఉన్న వారు వాటిని వివరిస్తే గాని మనకు అందులోని తత్వం బోధపడదు.

ఇక మరో శ్లోకానికి వద్దాం. 

ఎవరైతే ప్రాకృతిక వస్తువులను (గాలి,నీరు మొ//వాటిని) ఉపాసిస్తారో
 వారు చీకటి (నరకం)లో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి (సృష్టితాలు –
 మానవునిచేత తయారయ్యే వస్తువులను,బొమ్మలను) ఉపాసిస్తారో వారు
 మరింత అంధకారంలోకి ప్రవేశిస్తారు. -యజుర్వేదం 40:9

అసలు యజుర్వేదములో పై శ్లోకం ఏమని చెబుతుంది. సంభూతి, అసంభూతి అంటే ఏమిటి? అసలు శ్లోకం ఏమిటి?

యజుర్వేదం 40 చాప్టరు : 

Mantra – 9
अन्धं तमः प्रविशन्ति येसंभूतीमुपसते |
ततो भूय ऽ इव ते तमो य ऽ उ संभुत्याः रताः ||

Translation: Those people enter into darkness, who worships only “Asambhuti”, and those too enters into darkness who worship only “Sambhuti”

ఇది అసలు అర్థం. ఇక్కడే అర్థం అయ్యుంటుంది మీకు ఆ శ్లోకం యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటో ! పోనీ తరువాతి శ్లోకాలు ఏమి చెబుతాయో అదీ చూద్దాం.

Mantra-10
अन्य देवाहुः सम्भवादन्यदाहुरसम्भावात् |
इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ||

Translation: We have heard from that Devata, who said the above (40:9) to us, that the effect of worshiping the “Sambhuti” has a different effect then worshiping the “Asambhuti”.

Mantra-11
संभूतिं  च विनाशं च यस्त द्वेदोभय सह |
विनाशेन मृत्युं तीर्त्वा संभूत्यामृतमश्नुते ||

Translation: Hence know the art of “Sambhuti” as well as the “Vinash”. With worshiping the art of Vinash, you can win over the death, and by worshiping the art of Sambhuti you can become immortal

సింపులుగా చెప్పాలంటే …

మంత్ర 9: కేవలం సంభూతిని కానీ, కేవలం అసంభూతిని కానీ పూజించకూడదు.
మంత్ర 10: సంభూతిని పూజించడం వలన కలిగే ఫలితాలు, అసంభూతిని పూజించడం వలన కలిగే ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి. 
మంత్ర 11: కాబట్టి సంభూతినీ, అసంభూతినీ / వినాష్ కలిపి పూజించండి.

“సంభూతి”ని పూజించడం వలన ఒక ఫలితం, “అసంభూతిని” పూజించడం వలన మరో ఫలితం ఉంటుందని 10వ శ్లోకం చెబుతుంది. ఇక 11వ శ్లోకం అయితే “సంభూతి”ని ఆరాధించడం వలన Immortalగా ఉంటాము అని చెబుతోంది. ఇక్కడ వినాష్ అనేది “అసంభూతి”కి పర్యాయపదంగా ఉపయోగించారని భావిస్తున్నారు కొంత మంది. అది అయినా కాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు 9వ శ్లోకం అర్థం ఏమిటి? బహుషా వారి ఉద్దేశ్యం, కేవలం “సంభూతి”ని కానీ, కేవలం “అసంభూతి”ని కానీ పూజించడం వలన ఫలితంలేదు అనేకదా??

ఈ లింకులో ఒక వ్యక్తి దీన్ని బాగా వర్ణించాదు చూడండి..

Link : http://akhilapadhiblogs.blogspot.in/2012/08/andhatama-pravishanti-ye-asambhuti.html 

ఇతను దాన్ని సరిగ్గా అనువాదం చేయలేదు అని మీరనుకుంటే.. ఇక్కడ కూడా చూడండి. వేరేవాల్లు అనువాదం చేశారు..

Link : http://sacred-texts.com/hin/wyv/wyvbk40.htm 

సంస్కృత పదాలకు చాలా అర్థాలుంటాయి. వాటిని Contextని భట్టి తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక మంత్రాన్ని తీసుకుని అర్థం మనకు నచ్చినట్లు తీసుకోకూడదు. ఆ చాప్టర్ మొత్తం తీసుకుని, ఆచాప్టర్ ఏమి చెబుతుంది అని మొత్తంగా ఆకలింపు చేసుకోవాలి. ఆపని చేయకుండా మీరైనా, నేనైనా మనం మన వాదాలను నిరూపించుకోవడం కోసం వాటిని వాడుకోరాదు.

ఈ సంభూతి అంటే మానవ నిర్మితాలనీ, అసంభూతి అంటే ప్రకృతిలోని వస్తువులనీ (సూర్యుడు, గాలి, అగ్ని గట్రా) మీరు అంటున్నారు. కానీ, చాలా మంది వాటికి మరో అర్థాన్ని ఇచ్చారు. కొందరు సంభూతి అంటే Pattern అని చెప్పడం నేను చూశాను. వాటి అర్థాలు ఏవైనా “సంభూతిని” పూజించడం వలన Immortalగా ఉంటామని చెబుతోంది కదా మరో శ్లోకం ! అది ఎలా మర్చిపోయారు??

మీలాంటి వారంతా చేసే పని ఒక్కటే.. ఏవో నాలుగు శ్లోకాలు ఏరుకుని, వాతికీ మీకు నచ్చిన అర్థాలు ఇచ్చుకుని, మీ మత సూక్తులకు అనుగుణంగా వాటిని రాసుకుని, ప్రస్తుతం హిందువులు చేసే పనులు తప్పు అని నిరూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇక మీరు ఇచ్చిన యోగ శిఖ ఉపనిషద్ లోని శ్లోకానికి వద్దాం …

విషయమును ధ్యానించు పురుషుని యొక్క మనస్సు విషయమందే
రమించును. నన్ను (సర్వేశ్వరుని) స్మరించుట వాని చిత్తము నా (సర్వేశ్వరుని)
యందే లీనమగును. యోగశిఖోపనిషత్ 3:6

ఈ యోగ శ్లోకం కొరకు నేను చాలా ప్రయత్నించాను.  ఇది దొరకలేదు. ఎవరైనా యోగ శిఖోపనిషద్ అనువాదం వివరంగా దొరికితే చూపించగలరు.  ఎందుకంటే.. ఇక్కడ విషయము అంటే విగ్రహము అని అనుకోవడానికి వీలులేదు. దానికి తోడు యోగ శిఖోపనిషద్‌ను కొంత మంది ఇంగ్లీషులోకి అనువదించారు. అందులో మూడవ చాప్టరులో ఈ తరహా అర్థం వచ్చే వ్యాఖ్యలు ఏమీ కనపడలేదు.

అసలు యోగ శిఖోపనిషద్ లో 3 చాప్టరు 6 శ్లోకం ఇది.

अकारादिक्शकारान्तान्यक्शराणि समीरयेत्‌।
अक्शरेभ्यः पदानि स्युः पदेभ्यो वाक्यसंभवः॥ ६॥

akārādikśakārāntānyakśarāṇi samīrayet |
akśarebhyaḥ padāni syuḥ padebhyo vākyasaṁbhavaḥ || 6|| 

Link:  http://hatharaja.blogspot.in/2011/02/yoga-shikha-upanishad.html#more

మూడవ చాప్టరు మొత్తానికి ఆ పేజీలో ఇచ్చిన అనువాదం …

That great ever living Nadha (sound) is called Sabhda Brahman. It is the strength residing in the Mooladhara. Para is the foundation for its own self and is of the form of Bindhu. That Nadha coming out of Parashakthi (similar to  the germ coming out of the seed) is called Pasyanthi (we see). The Yogis who are able to see using the Pasyanthi Shakthi, understand that it is the whole world. That power produces sound like a rain starting from the heart. Hey Lord of Lords, there it is called Madhyama. It is called Vaikari when it merges in the sound form with Prana and exists in the throat and jaw. It produces all the alphabets from Aa to Ksha. From alphabet words arise and from words rise the sentences and from them all the Vedas and Mantras. This Goddess Saraswathi lives in the cave of intelligence in all beings. In meditation when will power melts, you can reach this Para Thathwa.

ఈ మొత్తం అనువాదములో, అభిలాష్ గారు చెప్పిన అర్థం వచ్చే శ్లోకమే కనిపించడం లేదు. ఆ శ్లోకాన్ని చదివిన తరువాత నేను గ్రహించినది ఏమిటంటే …
akārādikśakārāntānyakśarāṇi = akārādi + kśa kārā + ntāny + akśarāṇi = (may be) “అ” నుండి “క్ష” అక్షరం వరకూ 
samīrayet = ?
akśarebhyaḥ = (may be) ఏదో అక్షరాల గురించి చెపుతున్నారు
padāni = ?
syuḥ  = ?
padebhyo  = (may be) పదాల గురించి చెబుతున్నారు
vākyasaṁbhavaḥ = vākya  + saṁbhavaḥ = (may be) వాఖ్యాల గురించి మాట్లాడుతున్నారు.
పైన ఉన్న వాటిని భట్టి, ఈ శ్లోకం .. పైన ఇచ్చిన అనువాదములోని ఈ వాఖ్యమును వివరిచే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను …  

It produces all the alphabets from Aa to Ksha. From alphabet words arise and from words rise the sentences and from them all the Vedas and Mantras.

( ఎనీ వే, ఇదంతా కేవలం నా ఊహాగానం మాత్రమే. ఈ శ్లోకాన్ని ఎవరైనా సంస్కృతం తెలిసిన వారు అర్థాన్ని తెలుపగలరు ) 
చూశారుగా ముస్టాఖ్ అహ్మద్ గారూ, మీరు ఇచ్చిన శ్లోకాలలో కొన్ని శ్లోకాలు తప్పు. మరికొన్ని అర్థాలు తప్పు. వీటిని ఉపయోగించి మీరు విగ్రహారాధన గురించి, బహుదైవోపాసన గురించి మీరు అభిప్రాయాలు ఎలా ఇస్తున్నారు? 
ఇప్పటితో అయిపోలేదు. మీరు రాశిన పోస్టులో మరికొన్ని విషయాల గురించి తరువాతి టపాలలో వివరిస్తాను !
Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2015/07/03/%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%85%e0%b0%aa%e0%b1%8b/trackback/

RSS feed for comments on this post.

7 Comments

 1. మిత్రులు శుక్రాచార్యగారికి నమస్కారాలు!శాస్త్రీయ చర్చలో ధర్మగ్రంధాల “మూలము” (TEXT) నే ప్రామాణికముగా తీసికోవాలి. ఆ తరువాత అనువాదాన్నీ కొంతవరకు తీసుకోవచ్చు. “మూలము” (TEXT) తో ఘర్షించే వ్యాక్యానాలు ఏమాత్రమూ ప్రామాణికం కాజాలవన్నది మనలో ప్రతీఒక్కరూ గుర్తిచాలి శుక్రాచార్య గారూ!ఇక, పైన మీరు ఇచ్చిన వివరణ అంతా వ్యాక్యాన పూర్వకమైనదే కానీ, “మూలము” (TEXT) నుకు చెడినది కాదు! మీరు గానీ, ఇతరులు గానీ తప్పుడు వ్యాక్యానాలతో తప్పుడు విగ్రహారాధనను సమర్ధించుకోవాలే తప్ప విగ్రహారాధన ధర్మబద్ధమే అనటానికి వాంగ్మూలం (STATEMENT) రూపంలో ఒక్కగాని ఒక్క మంత్రం గాని, శ్లోకం గాని ఇప్పుడే కాదు ఎప్పటికీ చూపలేరన్నది మీ కొరకు ఒక కఠోరమైన సత్యం. తమ అసత్య విగ్రహారాధనను సత్యమని ధర్మ శాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల ద్వారా నీరూపించటానికి ప్రయత్నించే వారు అది- హిందూ-క్రైస్తవ-ముస్లిం లేక ఏ వర్గానికి చెందిన వారైనా సరే చివరికి ప్రజల మధ్య అభాసు పాలు కాక తప్పదు. ఈ క్రింది మంత్రం గురించి విగ్రహారాధన సమర్ధకులు ఏమంటారు?కొందరు పండితులై ఉన్ననూ నా మాయచేత మోహితమైన చిత్తము కలవారై, అంతటనిండియున్న ఆత్మానగునన్ను పొందజాలక కేవలము ఉదరమును (పొట్టను) నింపుకొనుటకై కాకుయవలే అచ్చటచ్చట సంచరించుచున్నారు. యతి (భక్తుడు) శిలామయములను, లోహమయములను, మణిమయములను, మృత్తికామయములను అగు విగ్రహములను పూజించుట పునర్జన్మ భోగకరి కావున అది కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షకామియగు యతి (భక్తుడు) తన హృదయ స్థితుడగు పరమాత్మనే పూజింపవలయును గాని బాహ్య అర్చనాను చేయరాదు. –మైత్రేయోపనిషద్ 2:26, 27ఈ విధముగా ఏకేశ్వరోపాసనే చేయాలి. ఏవిధమైన విగ్రహారాధననూ చేయరాదు. అన్న విషయాన్ని “మేము” అంటే “నేను” కాదు. హిందూ-క్రైస్తవ-ముస్లిం తదితర వర్గాలకు చెందిన ఏకేశ్వరోపాసకులం! ధర్మ విరుద్ధ విగ్రహారాధనన చేసే మీకు, ఎవరో పండితులు చేసిన వ్యాఖ్యానాలను కాక, ధర్మ శాస్త్రాల “మూలము” (TEXT) ద్వారానే కాక, వాంగ్మూలం (STATEMENT) రూపంలోనూ చూపిస్తున్నామన్నది మీరు గ్రహించాలి. ఈ విధమైన ఆధార సహిత “వివరణ”ను “విమర్శ” అని అంటారా? భక్తులను స్వేచ్చాపరులుగా వివేచనాపరులుగా మలచే (కొందరు దుష్టబుద్ధిగాల పండితులచే ఉద్దేశ పూర్వకంగా దాచేసిన) వైదిక సమాచారాన్ని సర్వసామాన్యం చేయటం దుష్ప్రచారమా? శుక్రాచార్య గారూ! మా ఈ ప్రశ్నలకు పాఠకులు న్యాయంగా సమాధానం ఇవ్వాలి!

  Like

 2. మితృలు అభిలాష్ గారికి నమస్కారం,//ఇక, పైన మీరు ఇచ్చిన వివరణ అంతా వ్యాక్యాన పూర్వకమైనదే కానీ, “మూలము” (TEXT) నుకు చెడినది కాదు! //నేను చాలా నయం, మీరైతే ఏకంగా శ్లోకాలనే మార్చేశారు. యోగషిఖోపనిషద్ లో ఆ శ్లోకం మీకు ఎక్కడ దొరికిందో చెప్పగలరా? పైన నేను యోగ షిఖోపనిషద్ లోని శ్లోకం యధాతధంగా ఇచ్చాను, ఏ సంస్కృత పండితుని దగ్గరకు వెల్లి మీరు దాన్ని అనువదిస్తారో మీ ఇష్టం. దాని నుండి మీరు మీ ఆర్టికలులో కోట్ చేసిన అర్థం ఎలా వస్తుందో చూపించండి చాలు ! ఇక వ్యాఖ్యాణాలు అన్నవి గాలిలోంచి తీసినవి కావు. ఆయా శ్లోకాల అర్థాలను విడమరిచి చెప్పినవి మాత్రమే. ఉదాహరణకు..”There is no God, other than Allah. There is no prophet other than Mahammad” అనే వాఖ్యమును తీసుకోండి. కొంత మంది ఏమి చేస్తారంటే.. There is no god అనే వ్యాఖ్యాన్ని పట్టుకుని, ఖురాన్ దేవుడు లేడు అని చెప్పింది అంటారు. దాన్ని చదివి ఖురాన్ చదివిన వారు మొత్తం వాఖ్యమంతా ఇచ్చి, There is no god అంటే అర్థం దేవుడు లేడని కాదు, వాక్యం పూర్తిగా చూడండి అని చెబుతారు. నేను ప్రస్తుతం చేసిన పని కూడా అదే. మీరు ఏదో ఒక శ్లోకం తీసుకుని దేవుడు నిరాకారుడు అని చెప్పారు. నేను దాని తరువాత వచ్చిన శ్లోకాన్ని కూడా చూపించి, నిరాకారుడే కానీ, makes use of all faces, heads and necks in this world అని చెప్పారు చూడండి అని చెబుతాను. దాన్ని మీకు ఇంకాస్త సులువుగా అర్థమవ్వడానికి.. ఆయన నిరాకారుడు కాబట్టే, ఏరూపములోకి అయినా రాగలడు అని చెబుతాను. అంతే తప్ప నేను శ్లోకాలను వక్రీకరించడం లేదు. పైన ఇచ్చిన శ్లోకాలను ఏ సంస్కృత పండితుడి దగ్గరకు వెలతారో మీ ఇష్టం, వెల్లి నేను చెప్పినది తప్పని నిరూపించండి. అంతే కానీ, నాపై అనవసర నిందారోపణలు చేయకండి. హిందూ మతములో విగ్రహాన్ని పూజించకు అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం లేదు. నిరాకారుడు అని చెప్పిన వెంటనే .. దానికి వివరణ కుడా ఇచ్చుకున్నారు. ఏదో ఒక శ్లోకాన్ని Randomగా ఎంచుకుని, విగ్రహారాధన మహా పాపమని ఇస్లాం ప్రవచనాలకు హిందు ధర్మాన్ని తోడుగా తీసుకోవాలనుకుంటున్న వారే అభాసుపాలవుతున్నారు తప్ప మరేమీ కాదు.

  Like

 3. హిందూ మతములో విగ్రహాన్ని పూజించకు అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం లేదు. నిరాకారుడు అని చెప్పిన వెంటనే .. దానికి వివరణ కుడా ఇచ్చుకున్నారు. ఏదో ఒక శ్లోకాన్ని Randomగా ఎంచుకుని, విగ్రహారాధన మహా పాపమని ఇస్లాం ప్రవచనాలకు హిందు ధర్మాన్ని తోడుగా తీసుకోవాలనుకుంటున్న వారే అభాసుపాలవుతున్నారు తప్ప మరేమీ కాదు.మిత్రులు శుక్రాచార్యా గారికి నమస్కారాలు.నా వివరాలపై మీరు ఓపికగా స్పందిస్తున్నందు ధన్యవాదాలు. మీరూ, నేనూ, మనమందరమూ గుర్తించవలసిన ప్రాథమిక విషయము ఒకటి ఉంది. అదేమిటంటే- ‘సర్వమానవుల ఇహ-పర సాఫల్య ధర్మ మార్గం ఒక్కటే, దానిని ఈ పుడమిపై ఉన్న సకల దేశాలలోని ప్రజలకు అందించిన మహనీయుడు కూడా ఒక్కడే. ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు! అందుకే మనం ఆయన పట్ల గల గౌరవ భావముతో “కృష్ణంవందే జగద్గురుం” అంటాము. దీనిని బట్టి- ఆయనే ఓం ప్రథంలో మన వైదిక శాస్త్రాలు ప్రబోధించాడు. ఆ తరువాత గీతాశాస్త్రమును ప్రబోధించాడు. దానికి ముందు, తరువాత అటు యూదులలో మోషేకు, “తోరా” (ధర్మశాస్త్రము)ను యేసుకు “ఇంజీలు” (సువార్త) ను ఇటు అరబ్బు దేశంలో ముహమ్మదుకు “కుర్’ఆన్” (నిత్యపారాయణ గ్రంధము)ను ఇచ్చినదీ ఆ పరమాత్ముడే! (గీతాశాస్త్రం 4:1-3) అందుకే ఆయన “జగద్గురువు” అయ్యారు. పరమాత్ముడు “జగద్గురువు” అన్నది అంగీకరిస్తే, మా హిందూశాస్త్రాలు, మీ ఖురాను, వారి బైబిలు వంటి వేర్పాటు వాదాన్ని సృష్టించే పద ప్రయోగాలను మీరు వదలుకోవాలి. లేదంటే- పరమాత్ముడు “జగద్గురువు” కాదు, “భరత్గురువు” మాత్రమే అని ఒప్పుకోవాలి. ఈ రెండిటిలో ఏదో ఒక విషయం తేల్చి చెప్పండి.//హిందూ మతములో విగ్రహాన్ని పూజించకు అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం లేదు// అని మీరు అంటున్నారు. అయితే, “హిందూ మతములో విగ్రహాన్ని పూజించుకో వచ్చు” అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం ఏమైనా ఉందా శుక్రాచార్య గారూ? ఉంటే చూపించండి!ఇక, మీరు చూపే ఏ శ్లోకమూ మీ విగ్రహారాదనను సమర్ధించదు. పైగా //ఏదో ఒక శ్లోకాన్ని Randomగా ఎంచుకుని, విగ్రహారాధన మహా పాపమని ఇస్లాం ప్రవచనాలకు హిందు ధర్మాన్ని తోడుగా తీసుకోవాలనుకుంటున్నారు// అని మాకు తప్పు పడుతున్నారు. మరి మీరేమన్నా భగవద్గీతలోని 701 శ్లోకాలను Randomగా ఎంచుకుని, “విగ్రహారాధన మహా పుణ్యం” మని నిరూపిస్తున్నారా శుక్రాచార్య గారూ?మీరు మరొక వివరణ ఇస్తూ, 12:1 వ శ్లోకంలో, పరమాత్ముడైన మిమ్మల్ని ఉపాసించేవారు యోగము (ధర్మము) ను సరైన రీతిలో ఎరిగినవాడా? లేక ఇంద్రియములకు గోచరమూకాని అక్షరపరబ్రహ్మను ఉపాసించేవారు యోగము (ధర్మము) ను సరైన రీతిలో ఎరిగినవాడా? అన్న ఆర్జనుని ప్రశ్నకు సమాధానముగా- “నన్ను ఎవరు ఉపాసించూచున్నారో వారు ఉత్తములని నా అభిప్రాయము” అని పరమాత్ములు శెలవిచ్చారు. ఇదిగో దీనిని బట్టి మా విగ్రహారాధన సరైనదే! అని మీరు తీర్మానించేశారు. ఆ విషయానికీ నిన్నా మొన్నా మొదలెట్టిన అజ్ఞానపూరితమైన శాస్త్రవిరుద్ధమైన విగ్రహారాధనకు అసలు సంబంధం ఏమిటి? శ్రీరాముడి తరువాత కాలములోని మన మహనీయులుగానీ శ్రీకృష్ణుని తరువాత కాలములోని మన మహనీయులుగానీ మీ ఈ శాస్త్రవిరుద్ధ విగ్రహారాధన చేసినట్లు చరిత్రలో ఎక్కడైనా ఒక్క ఆధారాన్ని చూపగలరా శుక్రాచార్య గారూ? శాస్త్రవిరుద్ధమైన విగ్రహారాధనను సమర్ధించుకొనే కంగారులోపడి 12:5 వ శ్లోకాన్ని మీరు గమనించ లేదు. అందులో చెప్పబడుతుందేమిటో గమనించగలరు. అవ్యక్త (నిర్గుణ) అక్షరపరబ్రహ్మము నందు ఆసక్తిగల మనస్సుగల వారికి (బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగుణోపాసకులకంటే) ప్రయాస చాల అధికముగ నుండును. ఏలయనిన, నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానముగాలవారిచేత అతికష్టముగా పొందబడుచున్నది. -12:5సాగుణోపాసన ఇంద్రియ నిగ్రహములేని దేహాభిమానముగాల వారి కొరకు అదికూడా తాత్కాలికంగా మాత్రమే అని వ్యాఖ్యాతలు తెలుపుతున్నారు. ఇంతకూ విగ్రహారాధన ఎవరి కొరకో లేక విగ్రహారాధకులు ఎవరో ఈ క్రింది గమనించగలరు.అజ్ఞానం భావనార్ధాయ ప్రతీమాః ప్రీకల్పితాః అనగా మూఢులకు భావనకై విగ్రహాలు కల్పించబడ్డాయి. -దర్శనోపనిషత్తు4:5మనుషులలో “విషయ అవగాహన పరము”గా రెండు తరగతులుగా ఉంటారు. ఒక వర్గం- “మూర్త ప్రజ్ఞులు” రెండవ వర్గం- “అమూర్త ప్రజ్ఞులు” దీనిని “అజ్ఞాన దశ” మరియు “జ్ఞాన దశ” అని చెప్పవచ్చు.

  Like

 4. ఉదాహరణకు: గణితం నేర్పిస్తున్నప్పుడు రెండులో రెండు కలిపితే ఎంత? అని ప్రశ్నిస్తే, దానిని “అమూర్తం”గా లేక “అభౌతికం”గా ఊహించి చెప్పటం చిన్న పిల్లలకు కష్టం. అందుకే- ఆ చిన్నపిల్లవాని చేతి నాలుగు వేళ్లను లేదంటే అతనికి చొక్కా బొత్తాలను “మూర్తం”గా లేక “భౌతికం”గా చూపి వాటిలో రెండు తీసివేస్తే ఇంకా ఎన్ని ఉన్నాయి? రెండు! ఈ ప్రక్రియ ఎంతకాలం సాగిస్తారు? ప్రాజ్ఞత వచ్చేవరకే. ఆ తరువాత అతని “అమూర్త ప్రజ్ఞ” ఊహాశక్తి పనిచేయటం ప్రారంభం అయిపోతుంది. ఇక అప్పటి నుండి- చేతి వేళ్లు, చొక్కా బొత్తాలు అంటే విగ్రహాలు, ప్రతిమలు వంటివి అతడు ఉపయోగించడు. కాదు, ఉపయోగించకూగాదు! ఒకవేళ ఎవడైనా చేతి వేళ్లు, చొక్కా బొత్తాలతోనే నేను లేఖలు ప్రారంభించాను కనుక నేను అలాగే సాగిపోతాను అన్నా లేక మేము హిందువులు కాబట్టి అలాగే చేసుకుంటాము. మీరు ఫలానా వర్గం వారు కాబట్టి ఆలా చేయ్యరు అని వాదించే వారినే శాస్త్రాలు మూఢులు ఆజ్ఞానులు అని ప్రకటిస్తున్నాయి. దేవతామూర్తులను ఆరాధించే వారిని భగవద్గీత ఎలాపరిగాణిస్తుందో, ఎలాంటి వారు దేవతామూర్తులను ఆరాధిస్తారంటుందో, దేవతామూర్తులను ఆరాధించే వారు పొందుఫలమెట్టిదంటుందో ఈ క్రింది శ్లోకాలలో గమనించగలరు.(కొందరు) తమ యొక్క ప్రకృతిచే ప్రేరేపించబడినవారై విషయాదులండలి కోరికలచే వివేకమునుకోల్పోయి, దేవతారాధన సంబంధమైన ఆ యా నియమములను అవలంబించి ఇతరదేవతలను భజించుచున్నారు. -7:20పై శ్లోకం ప్రకారం- మనోవాంఛాప్రియులైన ఆజ్ఞానులు దేవతారాధన చేస్తారని తెలుస్తుంది. ఇక్కడ దేవతారాధన అజ్ఞానం ఎందుకయ్యిందంటే- ఉదాహరణకు: అక్షర పరబ్రహ్మ వద్ద ఉన్న తరగని “సంపదకు” గుర్తు (ఐకాన్)గా “లక్ష్మి విగ్రహము”ను అలాగే అక్షర పరబ్రహ్మ వద్ద ఉన్న తరగని “జ్ఞానానికి” గుర్తు (ఇకాన్)గా “సరస్వతి విగ్రహము”ను ఇంకా, అక్షర పరబ్రహ్మ వద్ద ఉన్న తరగని “శక్తికి” గుర్తు (ఐకాన్)గా “దుర్గా” లేక “కాళికా” ఇతర విగ్రహమును మన పూర్వీకులు ఏర్పరిచారు. మన సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు అపారమైన సంపద అపారమైన జ్ఞానం అపారమైన శక్తి కలిగి ఉన్నాడు అన్న సమాచారాన్ని ఆ విగ్రహాల (ఐకాన్ల) ద్వారా గ్రహించి, తనకు కావలిసిన సంపద, జ్ఞానం, శక్తి వంటి వాటి కొరకు సర్వోన్నతుడైన సర్వేశ్వరుడినే నేరుగా ప్రత్యక్షముగా ప్రార్ధించుకోవాలి. ఇదీ మన సనాతన వైదిక ధర్మ పూజా విధానం. ఇది ఎంతో హేతుబద్ధం మరియు జ్ఞానయుక్తం కూడా. దానికి విరుద్ధంగా- ప్రదాతను వదిలేసి, ప్రదాత సామర్ధ్యాలను చూపించే విగ్రహాలను (ఐకాన్లను) అర్ధించటం అహేతూకం అజ్ఞానం. అందుకే దేవతారాధన చేసే వారిని- హృతాజ్ఞానాః అనగా “జ్ఞానం దొంగలించబడినవారు!” నిజమే వారి జ్ఞానాన్ని దోపిడీ దారులైన పండితులు దొంగలించేశారు కదా! ఈ క్రింది శ్లోకాన్ని గమనించగలరు. అల్పబుద్ధి కలిగిన వారియొక్క ఆ ఫలము నాశవంతమై ఉన్నది. (ఎందుకంటే) దేవతలను పూజించువారు దేవతలచేపోందుచున్నారు. నా భక్తులు నన్నే పొందుచున్నారు. -7:23ఇక, దేవతారాధన కారణంగా బుద్ధిహీనులైన వారు పొందే ఫలం వారికి ఏమైనా లాభదాయకం అవుతుందా? అని శాస్త్రాన్ని ప్రశ్నిస్తే- అది నాశనవంతమై పోతుందని సమాదానం ఇస్తుంది. కనుక సురాచార్యాగారూ! మీరూ మీ అనుయాయులూ సృష్టి పూజ, విగ్రహారాధన, మూఢ విశ్వాసాలతో కలుషితమైపోయిన కాల్పనిక హిందూధర్మాన్ని వదిలేసి, సర్వోన్నతుడైన సృష్టికర్తనే ఆరాధించే ఏకేశ్వరవాద, జ్ఞానయుక్త స్వచ్చ వైదిక ధర్మాన్ని స్వీకరించండి. తథాస్తు ఓం తత్ సత్.

  Like

 5. M.A. ABHILASH28 July 2015 at 01:05నా వివరాలపై మీరు ఓపికగా స్పందిస్తున్నందు ధన్యవాదాలు. మీరూ, నేనూ, మనమందరమూ గుర్తించవలసిన ప్రాథమిక విషయము ఒకటి ఉంది. అదేమిటంటే- ‘సర్వమానవుల ఇహ-పర సాఫల్య ధర్మ మార్గం ఒక్కటే, దానిని ఈ పుడమిపై ఉన్న సకల దేశాలలోని ప్రజలకు అందించిన మహనీయుడు కూడా ఒక్కడే. ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు! haribabu:తాతకి దగ్గులు నేర్పడమంటే ఇదేనా:-)తమరు ముస్లిం మతాన్ని ప్రచారం చేస్తున్నారా?హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నారా?మీరు హిందువులకి హిందువూల మతగ్రంధాల్లోని రహస్యాల్ని విప్పి చేప్పాలసిన అవస్రం లేదండీ!మీ మతంలో ఏముందో మీరు చెప్పుకోండి,నో ప్రాబ్లెం.కానీ “మీ మతంలో ఉన్నవి మీకు తెలియదు.నేను చెప్తాను వినండి,మీ మతగ్రంధాల నిండా ఉన్నది మా మత బోధనలే!” అని చెప్పడం అతితెలివి అవుంతుందని నేను భావిస్తున్నాను!ఇండైరెక్టుగా మీ మతబోధనలకూ మా మతబోధనలకూ పోలికలు చూపించి మమ్మల్ని బుట్టలో వెయ్యడం,పోలికల్ని చూసి మురిసిపోయిన్ వాళ్ళని మెల్లగా మీ మతంలోకి లాక్కుని మీ మతస్థుల సంఖ్యని పెంచుకోవడం అనేది మీ వ్యూహంగా కనబడుతున్నది.లేకపోతే ఏమితండీ “పత్రం,పుష్పం,ఫలం ,తోయం” అని చెప్తున్న శ్లోకంలో అవన్నీ నిరాకార మూర్తికి ఎవరన్నా ఇస్తారా?దేశమంతటా ఇన్నిన్వేఅల దేవాలయాలు నిర్మిచినది వేదంలో ఏముందో తెలియని అజ్ఞానులా!వ్యక్తుల్నీ,జ్ఞ్బానాల్నీ,సుఖాల్నీ,ఆహారాల్నీ,పూజలనీ,అన్నింతినీ మూడురజ్=కాలుగా విభజించి శ్రవణం,కీర్తనం,పొజనం లాంతి 12 రకాల విధానాల్ని చెప్తూ భాగవతంలో ఒక్కో రకమయిన అర్చామార్గానికీ ఒక్కో భక్తుదిని ఆదర్శంగా నిలబెడితే మీరొచ్చి వాళ్ళు చెప్పినా అసరే అవన్నీ తప్పు నేను చెప్తున్నాను వినడి అంతే ఏమితో తెలుసా,వారి నందర్నీ అవమానించదమే!మేము అంత గట్టిగా పాటించనై ఎవరఓ ఒక దయాననదని ఉదాహరణగా చెప్ప్పి ఏమి ఉపయోగం? పద్మనాభుడు,హయగ్రీవుడు -అనే ఇద్దరు దేవుళ్ళకీ అర్చామూర్తుల లక్షణాలని నిరదెశిస్తూ ప్రతిమాశాస్త్రం ఉంది!ఆలయాలౌ నిర్మించే శిల్పులు ప్రత్యేఅకంగా ఉంటారు – వారిని స్థపతు;ఉ అంటారు.ఎవరు బడితే వాళ్లకి అర్చామూర్తుల్ని చెక్కనివ్వరు.అవన్నీ వేదం పట్ల గౌరవం లేని నాస్తికులు చేసినవా?చాలు!మీ మతం గురించి మీకు తెలిసినవి ఎన్నయినా చెప్పుకోండి,వినేవాళ్ళు వింటారు,మీ మతంలో చేరితే చేరుతారు – మా మతంలో మాకు తెలియని తప్పులు వెదకడానికి మీరెవరండీ,నాకు తెలియకడుగుతాను!

  Like

 6. ఇక్కడేదో అగ్నిమీళే జరుగుతోంది కానీ ఖచ్చితం గా అగ్గి బుగ్గవుతుందా అన్నదే తేలడం లేదు 🙂 చాలా గౌరవం గా 'రాచు'కుంటున్నారు ! ఏమో కాల మహిమ ! నిరాకారుడు ఏమి ఆకారము చూపించు నో అదియున్నూ చూచెదము !జిలేబి

  Like

 7. చిచ్చరపిడుగుతో “రాచు”కొను అభిలాష సా-మాన్యులకు దక్క సామాన్యుల కుండదు గదా:-)

  Like


Comments are closed.

%d bloggers like this: