హిందూ మతములో విగ్రహారాధన – అపోహలు, నిజాలు ! ( Repost )

ఆర్యా అభిలాష్ (ముస్తాఖ్ అహ్మద్), మీరు ఎంతో ప్రేమతో మాకు చేయుచున్న ఆధ్యాత్మిక సేవలకు సంతశించితిమి. కానీ, ఇక్కడ వస్తున్న చిక్కేమిటంటే.. మీ అఙ్ఞానమును ఇతరుల మీద రుద్దడం క్షంతవ్యం కాని నేరం. మీరు చేయుచున్న పని యేమిటొ చెప్పుదునా? మీ మతాన్ని ప్రామాణికముగా తిసుకుని పక్క మతాలను, వారి విశ్వాశాలను కించపరుస్తూ మీరు రాస్తారు. మీవాడే అయిన గోపాల శర్మగారు (అసలు పేరు అహమ్మదో, మహమ్మదో అయ్యుంటుంది) ఆహా .. ఏమి రాశారు మీరు. మీరు గొప్పవారు సుమండీ అని పొగుడుతూ కామెంట్లు రాస్తూ.. పరస్పరం ఒకరి వీపు మరొకరు గోక్కొంటు ఉంటారు.

కాకపోతే మీలాంటివారు గమనించ వలసినది ఏమిటంటే, మీలాంటి వారిని చిన్నప్పటినుండి చూసీ, చూసి .. అలవాటు పడ్డమేము, ధర్మము పేరుతో మీరు చేసే కామెడీని చూసి నవ్వుకుని వదిలివేయుచున్నామే కానీ మరొకటి కాదని గ్రహింపలేకున్నారు.

ముస్తాఖ్ అహ్మద్ గారూ, నేను రాసిన కామెంటు ఇక్కడ చూడండి. అందులో ఉన్న తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు.

భారత దేశము ఒక సెక్యులర్ దేశము. ఒకరి మతాలను మరొకరు కించ పర్చుకోవడం కూడదు. ఒకరి విశ్వాసాన్ని ఒకరు దూషించుకోవడం దాని స్పూర్తికి విరుద్దం. అందుకే మీరు వాచాలత్వముతో, ఇతర మతస్తుల ఆచారాలనూ, నమ్మకాలనూ కించపరుస్తుంటే దానిని వారించడానికి ప్రయత్నించాను.

దానికి మీరు నాది ధర్మం ప్రకారం మహా నేరం అంటు హూంకరించారు. కాకపోతే, ఏ ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు.

ముందుగా నా సమాధానములో నేను చెప్పినది. “దేవుడు సర్వాంతర్యామి అన్నది”. సరే దీనికి నేను మీకు ఏ ఆధారం చూపాలి, వేదాలలో ఉన్న సూక్తా లేక భగవద్గీతలోని సూక్తా లేక సింపుల్ ఇంగిత ఙ్ఞానం చాలు అని చెప్పనా? ఏమండి, ఈ చరాచర సృష్టి మొత్తం భగవంతుడే సృష్టించాదు. భగవద్గీతలో 13:14 లో ఇలా ఉంటుంది..

sarvataḥ pāṇi-pādaṁ tat
sarvato ’kṣi-śiro-mukham
sarvataḥ śrutimal loke
sarvam āvṛtya tiṣṭhati

Translation: Everywhere are His hands and legs, His eyes, heads and faces, and He has ears everywhere. In this way the Supersoul exists, pervading everything.

Link: http://www.vedabase.com/en/bg/13/14

మక్కీకి మక్కీ కాకుండా తాత్పర్యాన్ని తీసుకుంటే .. ఆయన ఈ సృష్టిలో ప్రతీ చోటా ఉన్నాడు అని అర్థమొస్తుంది. నిజానికి భగవద్గీత మొత్తం ఇదే చెబుతుంది. ఆయన లేని ప్రదేశమంటూ లేదని. పోయి చదువుకోండి. మీరూ, మీ దయానంద సరస్వతీ.

మీరు నేను చెప్పినదాన్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు…

//శుక్రా చార్య గారూ! మీరు- “విగ్రహాలను పూజించటం తప్పా? దేవుడికి ఒక రూపము ఇవ్వటం అనేది మానవుల ఇష్టం” అని తీర్మానించేశారు. ధార్మికముగా మీరు చేసిన ఆ తీర్మానం చాలా తీవ్రమైన నేరము. అదే విషయాన్ని వేదం నుండో, ఏ ఉపనిషద్ నుండో, గీతాశాస్త్రం నుండో కనీసం ఒక్క మంత్రమో, శ్లోకమో పేర్కొని ఉంటే మీ తీర్మానం సత్యమయ్యేది!//

ఆర్యా .. పైన ఇచ్చిన శ్లోకము చాలునా? ఇంకా కావాలా? దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఒక రాయిలో మాత్రం ఆయన ఉండడా? ఆరాయికి మేము ఒక రూపాన్నిచ్చింది ఆయనను గురించి వేదాలలోనూ, పురాణాలలోనూ ఇచ్చిన వర్ణనల ఆధారంగానే. (పురాణాలకు మూలం వేదాలే).

మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. వివేకానందుడు ఒక రాజు వద్దకు వెలతాడు. ఆయన, వివేకానందుడితో ఇలానే విగ్రహారాధన మహా పాపం అని వాదిస్టాదు. అప్పుడు వివేకానందుడు, ఆ రాజు సేవకున్ని, ఆరాజు యొక్క చిత్ర పఠం మీద ఉమ్మేయమని కోరతాడు. దానికి ఆ సేవకుడు, ఆపని నేను చేయలేను అంటాడు. ఎందుకు అంటే, అందులో ఉన్నది మా రాజుగారు అంటాడు. దానీ వివేకానందుడు.. అక్కడున్నది మీరాజు గారు కాదు, కేవలం ఒక చెక్క ముక్క, కాగితము అంతే కదా అని ప్రశ్నిస్తాడు. తరువాత తానే అసలు విషయం చెబుతాడు. అది బొమ్మే అయినప్పటికీ, అది మీ రాజుగారిని గుర్తుకు తెస్తుంది. అందుకే నువ్వు దాన్ని అవమానించవు. విగ్రహాలు కూడా అంతే, అని చెబుతాడు.

ఇక్కడ హిందువులు విగ్రహాలను పూజిస్తారా అంటే.. లేదు అనే చెప్పాలి. ఎందుకంటే, అక్కడ మేము పూజించేది విగ్రహాన్ని కాదు. అందులోని దైవ స్వరూపాన్ని. It’s not a Idol worship, it’s a Deity worship.

రాయాల్సినది ఇంకా చాలా ఉన్నది. ప్రస్తుతానికి ఆపుతున్నాను. త్వరలో మరో పోస్టుతొ వస్తాను.

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2015/07/03/%e0%b0%b9%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%82-%e0%b0%ae%e0%b0%a4%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8/trackback/

RSS feed for comments on this post.

13 Comments

 1. @శుక్రా చార్య :గూగుల్ క్రోం పుణ్యమా అంటూ నాకు సదరు దావా సైటు దర్శన భాగ్యం కుదరడం లేదు. దయానంద సరస్వతి గారు విగ్రహారాధన ద్వారా మోక్షం రాదు కనుక అనవసరం అన్నారు. విగ్రహారాధన మహా పాపం (షిర్క్) అని నమ్మే ఇస్లాం మతానికి ఈ వాదన ఎందుకు తట్టలేదు? నేను అడిగితె జవాబు రాలేదు.Idol worship if indulged is unnecessary & useless in Arya Samaj view. This is not the same as the Islamic view of equating shirk with a mortal sin that guarantees hell.

  Like

 2. Meeru Chala baga Chepparu..

  Like

 3. Thank you 🙂

  Like

 4. @Jai Gottimukkala,అయితే మీరు మాంచి రసపట్టులో ఉన్న ఘట్టాలు మిస్సయ్యారన్న మాట. శ్రీమాన్ గోపాల శర్మ గారు, ముస్టాఖ్ అహమ్మద్ గారి ఙ్ఞానానికి, ఆయన సత్యశీలతకు, స్థితప్రఙ్ఞకూ ముచ్చట చెంది ఇక మీదటనుండి ఆయనకు డాలు వలే ఉంటారట (ముస్టాఖ్ అహ్మద్ గారు కత్తి). //గోపాల్ శర్మJune 25, 2015 at 3:13 AMమీరన్నట్టు అభిలాష్ గారు… మహాసంగ్రామ్ జరగవలిసినదే! భ్రష్టుపట్టిన సనాతన థర్మాన్ని పరిశుభ్రం చేయవలసినదే! మీరు ఒక ముస్లిమై యుండి స్వచ్చమైన థర్మ స్థాపన కొరకు సలుపుతున్న కృషి ఎంతో కొనియాడవలసినదై యున్నది. పరమేశ్వరుణ్ణితో మమేకమైనవాడికి పెద్ద,నిమ్నజాతులని,అధమ జాతులని యుండదు. అటువలనే మత వైరములు, జాతి విద్వేషములు యుండవు.స్థితప్రజ్ఞుడి లక్షణములు ఇటులనే యుండును.మీరు అందులకు తగినవారు. మీలో మిగతా ముస్లిముల వలె మత పిచ్చి లేకుండుటయు మీ స్థితప్రజ్ఞతకు గొప్ప సూచన.అదియే మీ మత విశాలతకు కారణమైయున్నది. మీరు ఈ సైట్ ద్వారా ఎప్పుడో మహాసంగ్రామము ప్రారంభించియుండిరి. ఇప్పటికే ఎంతో మంది జ్ఞాన ఖడ్గమునకు కుప్పకూలియున్నారు.యుంటిరి. పరమేశ్వరానుగ్రహం వలన నేనును మీకు డాలునై యుందును ఆర్యా! సత్యమునకు లోబడిన మనిషిని ఆదుకొనుట వైధిక థర్మము.అసత్యమునకు లొంగిపోయిన మనిషిని ఆశ్రయించుట అసుర థర్మము. నేను ఎప్పటికీ సనాతనవాదినే.//మరో చోట, ధార్మిక గురువు ముస్టాఖ్ అహ్మద్ అలియాస్ M.A Abhilash గారు హిందూ మతములో రంజాన్ మాసములో ముస్లిములు పాటించు ఉపవాసాలు అంతర్భాగమని వాకృచ్చారు, త్వరలో తాను పరిశోధనాత్మక వ్యాసము రాయుచున్నారని వార్తను అఖిల కోటి ప్రజలకు విన్నవించారు. దానికి గోపాల శర్మగారు ఆశ్చర్యచకితులై .. పెట్టిన కామెంటు..//గోపాల్ శర్మJune 25, 2015 at 2:22 AMరంజాన్ గూర్చి మిగతా మత గ్రంధాలలో పేర్కొనబడి యున్నదా? చాలా ఆశ్చర్యము గొలుపుచున్నది. ఏది,ఏమైనప్పటికి కొన్ని థార్మిక విధులు అన్ని మతాలలోనూ చాలా కలవడం సహజం. ఉదాహరణకు ఇస్లాం విధులూ, వైధిక విధులూ మిళితమై యుండడము మనము గమనించవచ్చును. అయితే మీరు రంజాన్ గూర్చి మిగతా మత గ్రంధములలో ఏవిధముగా తెలియుజేయుదురో తెలుసుకొనుటకు జిజ్ఞాస కలిగియుంటిని.//

  Like

 5. గూగుల్ క్రోం సదరు సైట్ అటాక్ చేయోచ్చు కాబట్టి అక్కడికి తీసుకువెళ్లనని మొరాయించింది కనుక ప్రస్తుత కామెడీ మిస్ అవక తప్పడం లేదు. You made my day by sharing these wonderful insights.రేపో మర్నాడో ఫలానా హిందూ గ్రంధంలో రోజుకు అయిదు సార్లు కాబా వైపు తిరిగి ప్రార్తనలు చేయాలని ఉండనే విషయం కూడా వారు కనుక్కోక మానరు. మీకు అది చదివే అదృష్టం ఉంది కనుక నాబోటి దురదృష్టవంతులకు తెలిపితే మా జన్మ కూడా ధాన్యం అవుతుంది 🙂

  Like

 6. This comment has been removed by a blog administrator.

  Like

 7. @విశేషజ్ఞ గారూ, కామెంటు అంత ఆశ్లీలంగా లేకపోయినా, నాకెందుకో సబబుగా అనిపించక డిలీట్ చేశాను. మరోలా భావించకండి.

  Like

 8. Jai Gottimukkala Garu, I also faced the same problem but changed the settings (Google Chrome). But only one problem that some times even nude ads open (own computer and if any children uses it is not suggestible).

  Like

 9. This comment has been removed by the author.

  Like

 10. ప్రస్తుతం కొన్ని కారణాల వలన కొన్నిసార్లు ఈ మేగజైన్ గూగుల్ క్రోమ్ లో OPEN కావడం లేదు. దయచేసి ప్రియమైన బ్లాగు వీక్షకులు Firefox లేక ఇతర వాటిల్లో ఏ ఇబ్బంది లేకుండా చక్కగా Open చేసుకోవచ్చని మనవి.

  Like

 11. గౌరవనీయులైన శుక్రాచార్యా గారికి నమస్కారాలు.నా రచనలను మీరు పూర్తిగా గమనించలేదో లేక వక్రీకరిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అలా అన్నందుకు నన్ను మన్నించగలరు.“ఆర్యా అభిలాష్ (ముస్తాఖ్ అహ్మద్), మీరు ఎంతో ప్రేమతో మాకు చేయుచున్న ఆధ్యాత్మిక సేవలకు సంతశించితిమి.” అని ఒక వైపు చెబుతూనే మరోవైపు- “కానీ, ఇక్కడ వస్తున్న చిక్కేమిటంటే.. మీ అఙ్ఞానమును ఇతరుల మీద రుద్దడం క్షంతవ్యం కాని నేరం” అని అంటున్నారు. దీనిని పాఠకులు ఎలా అర్థం చేసుకోవాలి?“మీరు చేయుచున్న పని యేమిటొ చెప్పుదునా? మీ మతాన్ని ప్రామాణికముగా తిసుకుని పక్క మతాలను, వారి విశ్వాశాలను కించపరుస్తూ మీరు రాస్తారు” అని నా గురించి మీరు అంటున్నారు. మీరు చెప్పిందే నిజమైతే- నేను ధర్మశాస్త్రాలను ఉటంకిస్తున్నప్పుడు- వరస క్రమములో ముందు ఖురాను గ్రంధాన్ని పేర్కొని తరువాత బైబిలును, భగవత్ గీతను పేర్కొనే వాడిని. కాని, నా రచనలలో అలాంటి క్రమాన్ని ఎప్పుడూ ఎక్కడా చూపలేరు! నేను ఎల్లప్పుడూ హిందూ శాస్త్రాలను ప్రామాణీకముగా తీసుకొని ఒక సిద్ధాంతాన్ని ప్రస్తావించి, దానికి అనుగుణమైన ఆధారాలను బైబిలు, ఖురాను గరంధాల నుండి ఇస్తున్నాను. ఈ విషయాన్ని చూచి కూడా- “మీ మతాన్ని ప్రామాణికముగా తీసుకుంటున్నారు” అని చెప్పటం మీకు ఎంతవరకు న్యాయం శుక్రాచార్యగారూ? కావాలంటే- మా రచనలను మరొకసారి పరిశీలనగా చూడగలరు.ఇక, మీరు చూపిన 13:14 వ గీతా శాస్త్ర శ్లోకంలో “విగ్రహారాధన శాస్త్రబద్ధం” అనటానికి ఎలాంటి ఆధారమూ లేదు. అందులో సర్వేశ్వరుడు సర్వవ్యాపి అని మాత్రమే ఉంది. అటువంటప్పుడు ఇక, విగ్రహం పెట్టవలసిన పనేమిటి? మీ కాల్పనిక విగ్రహారాధనను సమర్ధించుకోవటానికి ఏశ్లోకాలనైతే మీరు చూపిస్తున్నారో అవి ప్రోక్తం చేయబడి ఐదు వేల సంవత్సరాలయ్యింది. అప్పటి నుండి గత నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం వరకు మీ విగ్రహారాధన మన హిందూ దేశములో ఎందుకు లేదు? మన పవిత్ర సనాతన ధర్మంలో ఈ అపవిత్ర విగ్రహారాధన ప్రవేశపెట్టింది ఆన్యులు అయిన జైనులు. అది ఈరోజు మన ధర్మానికి గొడ్డలి పెట్టుగా మాయని మచ్చగా పరిణమించింది. హిందువుల మతాంత్రీకరణకు ఈ అపవిత్ర విగ్రహారాధనే ప్రధాన కారణంగా నిలిచింది.ఈశ్వర ధ్యానం ఎలా చేయాలో ఎలా చేయకూడదో హిందూ శాస్త్రాలు ఖరాఖండీగా, చాలాస్పష్టంగా తెలుపుతున్న విషయాన్ని ఈ క్రింది గమనించగలరు.శివుడు (సర్వేశ్వరుడు) దేహమందుండగా, మూఢుడు తీర్ధమందు, దానమందు, జపమందు, యజ్ఞమందు కాష్ఠమందు, పాషాణమందు (విగ్రహమందు), సర్వేశ్వరుని చూచును. లోపలనున్న నన్ను (సర్వేశ్వరుని) వదలి బయటనున్న శివుని యెవడు సేవించునో వాడు చేతిలో (అన్నం) ముద్దను వదలి, మోచేతిని నాకినట్లే. యోగులు సర్వేశ్వరుని ఆత్మయందే చూతురు. ప్రతిమ (విగ్రహము) లందు కాదు. – దర్శోపనిషత్ 4:5పై మత్రం ద్వారా విగ్రహారాధకులు మూఢులు అని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఏకేశ్వరారాధకులు యోగూలు అని సర్వోన్నతుడైన సర్వేశ్వరుడే స్వయంగా ప్రకటిస్తున్నాడు. అటువంటప్పుడు మీరు ఈ విగ్రహారాధనను ఎలా సమర్ధించగలుగుతున్నారు శుక్రాచార్యగారూ!? మన హిందూ దేశ వైదికధర్మానికి ఈ అపవిత్ర విగ్రహారాధనకు అసలు సంబంధం ఏమిటి?

  Like

 12. @M.A ABHILASH,అభిలాష్ గారు, దేవుడు సర్వవ్యాప్తి కాబట్టి విగ్రహాలతో పనేమిటి అంటున్నారు. కానీ, విగ్రహాలలో మాత్రం ఎందుకు ఉండడు అని నేను అంటున్నాను. నేను మీ సైటులో మొదట రాసిన కామెంటు పూర్తిగా ఇదే టపాలో ఇచ్చాను చూడండి (See the Image in this post). అందులో నేను స్పష్టంగా చెప్పింది … “దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన విగ్రహములో మాత్రం ఎందుకు ఉండదు, ఆయన విగ్రహములో ఉన్నప్పుడూ మేము విగ్రహాన్ని ఎందుకు పూజించకూడాదు” అని. విగ్రహమెందుకు అంటే.. అది మా ఇష్టం, దాని వలన మాకు దగ్గర తనం పెరుగుతుంది .. మనుషులు నిరాకారాన్ని ఊహించుకోవడం కన్నా ఒక ఆకారాన్ని ఊహించుకోవడానికి ఇష్టపడతారు అనే అర్థం వచ్చేలా కూడా చెప్పాను. అంతే కాదు నిజానికి మేము విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకున్నా, రాయికి కాక ఆ విగ్రహములోని దేవున్నే (Deity Worship) పూజిస్తాం. కాబట్టి తప్పులేదు అనిచెప్పాను. సర్వాంతయామి అయిన వాడు విగ్రహములో ఎందుకు ఉండడో మీరు నాకింకా చెప్పలేదు !! ఇంకో విషయం ఈ ధర్మోపనిషధ్ 4:5 ఏ వేదములో ఉందో కూడ కాస్త చెబుతారా? ఎందుకంటే, మీరు కోట్ చేసిన చాలా శ్లోకాలు తప్పుగా అర్థం చేసుకున్న వారు రాసినవే !!//ఏశ్లోకాలనైతే మీరు చూపిస్తున్నారో అవి ప్రోక్తం చేయబడి ఐదు వేల సంవత్సరాలయ్యింది. అప్పటి నుండి గత నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం వరకు మీ విగ్రహారాధన మన హిందూ దేశములో ఎందుకు లేదు? మన పవిత్ర సనాతన ధర్మంలో ఈ అపవిత్ర విగ్రహారాధన ప్రవేశపెట్టింది ఆన్యులు అయిన జైనులు. //సో, మీరు ధర్మ శాస్త్రాలను వదిలి చరిత్రకు వచ్చారు. పర్వాలేదు. నేను మరొక పోస్టులో చెప్పాను. నేను మొదట విగ్రహారాధన ధర్మశాస్త్రాల ప్రకారం ఏవిధంగా కరక్టో చెప్పి, తరువాత… కామన్ సెన్స్ (ఇంగిత ఙ్ఞానం ) ప్రకారం విగ్రహారాధన ఎందుకు సమర్ధనీయమో చెబుతాను అని. కాకపోతే, నేను కాస్త బిజీగా ఉండడం వలన అనుకున్నంత వేగంగా రాయలేకపోతున్నాను. తప్పక మీ ప్రశ్నకు కామన్ సెన్స్ ప్రకారం సమాధానం ఇస్తాను.

  Like

 13. గతంలో నా పేరు మీద కూడా వారొక టపా కాట్టడం మాలిక ద్వారా గమనించాను. కాని క్రోం మొరాయించడం వల్ల అక్కడ వైరస్‌లు దాగున్నాయని కనుగొని అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు మాని వేశాను.

  Like


Comments are closed.

%d bloggers like this: