బాహుబలి – ఇంగిత ఙ్ఞాణం బలి !!

(స్వలింగ సంపర్కం / సంపర్కుల పై మీ అభిప్రాయం తెలుపగలరు. పోల్ బ్లాగ్ సైడ్‌బార్‌లో ఉంది.)

భళిరా భళి బాహుబలి
కాదంటివా నువ్వు బలి
భరింపరాని అభిమానుల లొల్లి
విసిగివేసారిన జనులనిరి “హౌ సిల్లీ !”

బాహుబలి సినిమా టీజర్లూ, ట్రైలర్లూ వచ్చినప్పటినుండి ఒక లొల్లి మొదలైంది. ఎవడైనా పొరపాటున ఆ సినిమా ట్రైలరో, టీజరో బాలేదన్నాడా ఇక వాడికి మూడిందీ నాలిగిందీ అన్నమాటే ! తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెలుతున్న సినిమాని, తెలుగు సినిమా సత్తా చాటుతున్న సినిమాని పట్టుకుని అంత మాటంటావా? రాజమౌళి శక్తి సామర్ధ్యాలను కించపరుస్తావా, ఠాట్ ! నువ్వెంత, నీ బతుకెంత, కనీసం ఒక్క చిన్న షార్ట్ ఫిలిం తీయగలవా? ఒక చిన్న యాడ్ తీయగలవా? కెమెరా పట్టుకోవడం కూడా సరిగా చేతకాని ప్రతీవోడూ రివ్యూలు రాసేవాడే, సినిమాలో తప్పులెతికేవాడే అంటూ విపరీతమైన దాడులు. నవ్వొచ్చేది, కాస్త కోపం కూడా వచ్చేది.

ఇప్పుడు అలా అలా ముఖ పుస్తకం ముందేసుకుని చూస్తూ ఉంటే ఒకానొక మేధావి గారి వ్యాఖ్యలు కనపడ్డాయి. అబ్బో, ఏమని చెప్పుదు అయ్యవారి మేధావితనం, బాహుబలి సినిమా బాలేదన్న వాడికి సినిమా చూడ్డమే రాదంట. ఒక సారి మీరూ చదివి తరించండి

చూచితిరి కదా, బాహుబలి సినిమా బాలేదు అనేవాల్లు, రాజమౌళి ఆఫీసుకు వెల్లాలట. అక్కడ రాజమౌళికి గారికి, సినిమా తీయడం ఎలానో, కత్తి తిప్పడం ఎలానో చెప్పాలట. అసలు సెకండ్ పార్ట్ వారే తీయాలట. ఎంత వెటకారమో కదా !

నాక్కొన్ని చిన్న చిన్న సందేహాలున్నాయి. వాటిని ఒకసారి పరిశీలించండి …

 • సారువాడు ఒక హోటలుకు వెల్లాడనే అనుకుందాం. మాంచి మషాల దోశ ఆర్డరిచ్చాడు. స్నేహితున్ని అడిగితే, ఊర్లో ఉన్న బెస్టు హోటల్ ఇదే అని చెప్పాడు. ఈ హోటల్లో చెఫ్ గారు, దోశెలేయడములో చేయి తిరిగిన పనిమంతుడని, కాలుతిరిగిన కష్టమర్లు అనేక మంది చెప్పగా విన్నాడు. కానీ, తీరా దోశె చూస్తే మాడిపోయి ఉంది, ఉప్పులేదు, చట్నీ రుచిగా లేదు. దానితో చిరాకొచ్చింది. అప్పుడు అయ్యవారు ఏమిచేస్తారు ? ఛీ, ఇన్నాల్ల నాబతుకులో నేనెప్పుడైనా దేశెలేశానా? కనీసం దోసె పిండి కలపడమన్నా నాకొచ్చా, చట్నీలో మిరపకాయలు ఎన్ని వేయాలో తెలుసునా? తెలీదు కాబట్టి నోరుమూసుకుని బిల్లు కట్టి వెలతాను అని అనుకుంటాడా?  అయ్యవారి చెత్త లాజిక్కు ప్రకారం అలానే కదా అనుకోవాలి మరి?

 • అయ్యవారు కట్టింగ్ చేయించుకుందామని బార్బర్ షాపుకెల్లారు. షాపు అద్దాలతో, లోపల ఏసీ తో బ్రహ్మాండంగా ఉంది. తలని బార్బరు చేతిలో పెట్టిన తరువాత, తలమీద అండమాన్ దీవులు, ఆస్ట్రేలియా మ్యాపులు ఏర్పరచాడు. షేవింగు చేసేప్పుడు మొహమ్మీద, ఏ కత్తియుద్దాన్నైతే మనల్ని రాజమౌళి ఆఫీసుకు వెల్లి అక్కడివారికి నేర్పమన్నాడో, అదే కత్తి యుద్దాన్ని బార్బరు ఈయనగారి మొహం మీద చేశాడు. అప్పుడేం చేయాలి? కత్తెరపట్టుకొని కరక్టుగా కట్ చేయడం రాదు కదా, కనీసం షేవింగుకూడా ఒక్కగాటు పడకుండా నేను చేసుకోలేను కదా, మరి బార్బరును ఏమని అనగలను అనుకుని, డబ్బులిచ్చేసి రక్తం ఓడుతున్న గడ్డము, చెంపలతో బయటికి వచ్చేయగల ఔధార్యం అయ్యవారి కుందా ? ఎందుకంటే, అయ్యవారి థియరీ ప్రకారం అలానే ఉండాలి మరి !

 • ఇప్పుడు అయ్యవారు డాక్టరు దగ్గరకి వెల్లాడు. పన్ను పీకమంటే, డాక్టరుగారు కాస్తా కన్ను పీకేశాడు. అప్పుడుకూడా అయ్యవారి థియరీ ప్రకారం, ఆపరేషన్ మనం ఎప్పుడైనా చేశామా? అసలు ఇంజెక్షన్ వేయడమన్నా మనకు వచ్చా. స్కాల్పెల్ పట్టుకోవడమన్నా మనకు వచ్చా అని ఆలోచించి నోరు మూసుకుని, ఒక చేతిలో పీకిన కన్ను పట్టుకుని, మరో చేత్తో డబ్బులు కట్టి బయటకి రావాలి. అయ్యవారైతే అలానే చెస్తారు.

అలా కాకుండా, గట్టిగా రియాక్టయితే, వారికి మషాలా దోశ తినడం రానట్టు. అసలు మాడిపోయిన మసాలా దోశ తిని, అది రుచిగా ఉంది అని ఫీలవ్వడం ఒక ఆర్టు. అలా ఫీలవ్వగలిగితేనే అయ్యవారికి మసాలా దోశ తినడం వచ్చినట్టు. అంతేనా ఆ దిక్కుమాలిన మాడిపోయిన మషాలా దోసె వేసిన చెఫ్ ను చూసి ప్రౌడుగా ఫీలవ్వడం అనేది ఇంకా పెద్ద ఆర్టు. బార్బరు, డాక్టరు విషయములో కూడా షేం టు షేం ఫీలింగ్స్. ప్రౌడ్‌గా ఫీలవ్వాలి లేదంటే అయ్యవారికి క్షురకర్మ చేయించుకోవడం, ఆపరేషన్ చేయించుకోవడం రానట్టే.

ఇలాంటి వారు గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు కొన్ని ..!

 •  ప్రజలందరూ సినిమా డబ్బులు పెట్టి చూస్తున్నారు. ఈ సినిమా అయితే దారుణంగా వందలూ, వేలూ పెట్టి చూశారని వినికిడి. USలో అయితే, దాదాపుగా 50 డాలర్ల వరకూ వెల్లిందట ఒక టికెట్. డబ్బులు పెట్టి ఒక సినిమా చూసి అది బాలేకపోతే బాలేదనే అంటారు ఎవరైనా. దానికి సినిమా తీయడం అతనికి వచ్చుండక్కర్లేదు. కనీసం షార్ట్ ఫిలిం అయినా తీసే సత్తా అతనికి ఉండక్కర్లేదు.

 • రాజమౌలి సినిమా జనాల ప్రయోజన కోసం, ఒక ఆదర్శముతో, జనోద్దరణ కోసం తీయలేదు. ఇది ఫక్తు కమర్షియల్ సినిమా. ప్రజల ఎంటర్‌టైన్‌మెంటు కోసం సినిమా, అంతే కానీ దర్శకునికోసమో, హీరోల కోసమో ప్రజలు కాదు. అది గుర్తుంచుకోవాలి.

 • ప్రతీ ఒక్కరూ ఒక్కో పని చేస్తూ ఉంటారు. సాఫ్టువేరు జీవులు ప్రోగ్రాములు రాస్తారు. దర్శకులు సినిమాలు తీస్తారు, ఇలా ఎవరి పని వారు చేస్తూ ఉంటారు. ఆపని బాగలేదని ఎవరికైనా అనిపిస్తే నిర్మొహమాటంగా వారిని విమర్శించొచ్చు. ఇప్పుడు, ATM సరిగ్గా పనిచేయకపోతే, Out of order అని కనిపిస్తే బ్యాంకోల్లను తిడతాం. IRCTC వెబ్ సైట్ సరిగ్గా పనిచేయకపోతే ప్రోగ్రాం రాసిన సాఫ్టువేరోల్లని తిడతాం. దానికి మనకు ప్రోగ్రమింగ్ తెలిసి ఉండక్కర్లేదు. జీవితములో ఒక్కలైన్ ప్రోగ్రామింగ్ కోడ్ రాయని వాల్లు కూడా ఆ సర్వీసులని విమర్శించొచ్చు. ఎవరి పని వారు సరిగ్గా చేయకపోతే, ఆయా వ్యక్తులకు విమర్శలు తప్పవు.

అంతే కానీ, విమర్శించగానే అతనికి సినిమా చూడడం రాదు. తీయడం అంతకన్నా రాదు, మీరే వెల్లి బాహుబలి సెకండ్ పార్ట్ తీయండి లాంటి కామెడీ డయిలాగులు చెప్పకూడదు.

ఈ చెత్తంతా దురభిమానుల వల్లే వస్తోంది. ఈ దురభిమానులు సినిమా రిలీజు అవ్వగానే దాన్ని భుజాల మీద మోసే పని చేపడతారు. లేదా అది తమ అభిమాన హీరో సినిమా కాకపోతే దుష్ప్రచారం మొదలు పెడతారు, మెచ్యూరిటీ అనేది లేకుండా హీనమైన దుర్భాషలకు దిగుతూ ఉంటారు. ఇదో క్యాన్సరులా తయారయ్యింది. సినిమాలను ప్రేక్షకులలా చూడండి. నచ్చితే సినిమా చూడాలి. లేకపోతే వదిలేయాలి. అంతేకానీ, ఈ హీరో వర్షిప్పులు, కొత్తగా దర్శకుడి వర్షిప్పులూ అవసరమా ? కాస్త ఎదగండి !

లేదు మేము ఇలానే ఉంటాం అంటే.. మీ ఖర్మ. కాకపోతే, పబ్లిక్ న్యూసెన్స్ చేయకండి. మీ పిచ్చి అభిమానాన్ని సమాజం భరించగలదేమో కానీ పబ్లిక్ న్యూసెన్సును మాత్రం కాదు అని గుర్తుపెట్టుకోండి. నా అభిప్రాయం వరకూ దక్షిన భారత చిత్ర పరిశ్రమకి పట్టిన చీడ దురభిమానులు.

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2015/07/15/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b9%e0%b1%81%e0%b0%ac%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%87%e0%b0%82%e0%b0%97%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%99%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%a3%e0%b0%82-%e0%b0%ac%e0%b0%b2%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

10 Comments

 1. I agree with you upto 100%. But it is not correct to criticize Baahubali in every aspect. Every production has got its plusses and minuses in equal measure. Some people criticize Baahubali because they complain that the movie is not upto the level of hype created. But a notable point is – if we go back down the memory-lane, the production team did not create any hype. It was created by media. The team has in fact been very secretive and silent about the movie. In my observation, Baahubali is an excellent movie but for the following shortcomings:1. A weak and too familiar storyline2. Prabhas' voice which should have been more loud and assertive3. Some of the scenes – the relevance of which is questionable – like a snow avalanche and Kalakeyas' attack. (But the battle scenes are impressive, no doubt) 4. The inexplicable preference of Queen Sivagami for Amarendra Bahubali over her own biological son Bhallala Deva.

  Like

 2. @Marripoodi Mahojas,I agree with you. It's not that I don't like this movie. I like this movie, I must say that. The problem is I can't say, it's flawless and even little bit boring at some point of time. I am the one who don't mind to express my feelings, no matter how controversial they are. These created some troubles to me. Actually first paragraph of my article is my own experience. After I saw the trailer of this movie, because of the expectations I have on this movie, I am bit skeptical about some scenes and graphic work. I openly expressed them. You know what happened next.. I am accused of maligning the movie and threatened with some unspeakable words in general public. Why this nonsense? Do these people think we should not give our opinion on a movie? How pathetic it is ! Even now, I admire this movie, at the same I don't mind criticizing it for it's flaws and of course the attitude of some fans.

  Like

 3. Sure,you can criticise Bahubali movie for its flaws and deficiencies,while at the same time admire and appreciate its good points.

  Like

 4. I am not sure, if my earlier comment had been posted. I can't agree more on your view points. Valid arguments. Can I share this on FB wall?

  Like

 5. @Varunudu,Hi, this blog don't have comment moderation and I didn't find any comment in spam folder. So, I don't know what happened to your comment ! Sure, you can share it in any social media platform including your FB timeline.

  Like

 6. Thank you Sukraachaarya Gaaru.Sambandham leka poyinaa aasakti meeda adugutunnaa.. Sukraachaaryudu Raakshasa Guruvu kadaa – aa peeru pettukonnaarenti? Curious to know 🙂

  Like

 7. @Varunudu,Ha ha.. you see, Idiot, Pokiri, Desamuduru, Julayi .. if all these names can be good for a movie, why not Sukracharya – The Rakshas guru is good for a blogger !Hope you got it 🙂

  Like

 8. రాక్షసుడు అంటే రక్షించేవాడు లేదా రక్షించుకొనేవాడు అని అర్ధం. అసాలామాటకొస్తే తాగుబోతులందరూ దేవుళ్ళైతే, తాగనివారు రాక్షసులు. ('సుర' అంటే ఆల్కహాల్ కాదని చెప్పకండి. సురాపానం చేత సకల పుణ్యాలూ లుప్తమవుతాయన్న శాపం ఎందుకో చెప్పాల్సుంటుంది మీరప్పుడు).

  Like

 9. Sukracharya taught political science to Bhisma, he is demon teacher but good in nature. Sukra represents harmonious relationship,love,wealth and artistic talents. Sukra is important planet in horoscope (May-June), Shukra Dasha active for 20 years, believed to give more wealth, fortune and luxury to a person's life if they have Shukra positioned well in their horoscope.

  Like

 10. meeto okasaari maatlaadaali naamilku mee number pampagalaraa?durgeswara@gmail.com

  Like


Comments are closed.

%d bloggers like this: