కొన్ని రోజుల క్రితం నా బ్లాగును వర్డ్ ప్రెస్ కు మార్చాను. దాన్ని కూడలిలో అప్డేట్ చేయమని కూడలి వారికి మెయిల్ పెట్టాను. మెయిల్ పెట్టిన వెంటనే … We will get back to you అంటూ ఒక మెయిల్ కినిగే నుండి వస్తుంది. కానీ, వారు దాని తరువాత అసలు రెస్పాండ్ అవ్వలేదు. ఇది వరకు కూడా ఇలానే జరిగింది. కూడలి వారు యాక్టివుగా లేరా లేక ఇది కేవలం వ్యక్తులను భట్టి, వ్యక్తిగత అంశాలను భట్టీ ఉంటుందా !?
ఒక వేల కూడల్ వారికి పార్షియాలిటీ లేకుండా సేవలందించడం ఇష్టం లేకపోతే అది డైరెక్టుగా చెప్పొచ్చు. మీ బ్లాగును మేము అనుమతించము అని. అలా కాకుండా మరేదైనా సాంకేతిక కారణం అయితే ఆ విషయం తెలియజేయవచ్చు ! ఒక వేల వారికి తీరిక లేకపోతే మాత్రం, వారు కూడలి బాధ్యతలు మరొకరికి అందించడం మంచిదని నా అభిప్రాయం.
నా బ్లాగు మాలికలో రాదు. నాకు మాలిక నిర్వాహకులకూ ఉన్న కొన్ని వ్యక్తిగత విభేదాల వల్ల నేను మాలికలో నా బ్లాగు చేర్చమని అడగడం మానుకున్నా ! ఇక కూడలి వారు కూడా ఏదో ఒకటి తెలియజేస్తే సంతోషితాను !!
Edit:(13-12-2015) ప్రస్తుతం నా బ్లాగు మాలికలో కూడా వస్తోంది. నా బ్లాగును చేర్చినందుకు మాలిక వారికి నెసర్లు.
Like this:
Like Loading...
Related
The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2015/12/12/%e0%b0%95%e0%b1%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%97%e0%b1%86-%e0%b0%9f%e0%b1%80%e0%b0%ae%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%8f%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d/trackback/
RSS feed for comments on this post.
ఏమయిపోయారు ? రాక్షస గురువు లేక ఎంటర్టైన్మెంట్ మిస్సవుతున్నాం. దేవతల ఆగడాలు మితిమీరుతున్నాయి.
LikeLike
నీహారిక గారూ,ఇక్కడే ఉన్నానండి. కాకపోతే వేరే పనుల్లో కాస్త బిజీగా ఉండడం వల్ల కొత్త టపాలు వేయడం కుదరలేదు. మళ్ళీ మొదలెట్టాం కదా ! రాక్షసులకు పునర్వైభవాన్ని తీసుకొచ్చేద్దాం 🙂
LikeLike