సర్దార్ గబ్బర్ సింగ్ – దేవిశ్రీ కాపీ కింగ్ !

సర్దార్ గబ్బర్ సింగ్ అడియో రిలీజ్ చూశా ! అందులో అప్పుడప్పుడు కొన్ని పాటలు వినిపించారు. అందులో ఒక పాట లక్ష్మీ రాయ్‌తో ఉంది. ఆపాట వినగానే నాకు ఓ హిందీ పాట గుర్తుకు వచ్చింది. ప్రస్తుతం కొంత మంది నెటిజనులు కూడా అది కాపీ అనేస్తున్నారు.

కానీ, కొంత మంది అంటున్నట్టు అది షారుఖ్ ఖాన్ “మై హూ నా” సినిమాలోని పాటకు కాపీ కాదు.అప్పుడెప్పుడో వచ్చిన అమితాబ్ బచ్చన్ సినిమా “లావారిస్” సినిమాలోని “అప్నీ తొ జైసే తైసే” పాటకు కాపీ. దాని సంగీతం ఆనంద్‌జీ- కళ్యాన్ జీ. ఈ పాటని 4:25 నిమిషాల దగ్గరనుండి వినండి.

ఈ పాటను చాలా మందే తరువాత కాపీ కొట్టారు. ఇంచు మించు ఇదే ట్యూనుతో, మ్యూజిక్కుతో అక్షయ్ కుమార్ హీరో వచ్చిన హౌస్ ఫుల్‌లో కూడా ఉంటుంది.

మొదటి సారి హిందీలోకి డైరెక్టుగా ఎంట్రీ ఇవ్వబోతున్న గబ్బర్ సింగ్,  సినిమా టైటిలుతో పాటు, ఒక పాటను కూడా అమితాబ్ బచ్చన్ కి చెందిన ఒక మూవీది వాడుకుంటున్నాడన్న మాట.  ఇది సక్సెస్ అవుతుందో బెడిసికొడుతుందో మరి.. !

ట్రైలర్ మాత్రం చీదేసింది.  వీల్లు క్రియేట్ చేసిన గ్రామం, దాని కోసం వీరేసిన సెట్స్,  విలన్,డయిలాగ్స్ … అంతా పరమ నాసీ రకంగా ఉన్నాయి. దీనికోసమా రెండేళ్ళు వెయిట్ చేసింది అనిపించేట్టుగా ఉంది ట్రైలర్ మాత్రం.  పవన్ కళ్యాన్ మనకు ముద్దు కానీ హిందీ వాల్లకు కాదు.  ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయడం నిజంగానే సాహసం అనిపిస్తోంది … ఆ ట్రైలర్ చూసిన తరువాత.  ఏమో సినిమా బాగుంటే చెప్పలేం కానీ, లేకపోతే … ఈ సినిమా బాలీవుడ్డుకు కాదు,  భోజ్‌పురి  సినిమాకు పంపించడం బెటర్. అక్కడ ఇలాంటి క్వాలిటీ ఉన్న మూవీలే తయారవుతాయి మరి !!

పవన్ కళ్యాన్ సినిమాలో వేలు, కాలే కాదు ఏకంగా హెడ్డు కూడా పెట్టాడని టాక్. మరో జానీ సినిమా చూస్తామో ఏమో అని ఇక్కడ డవుటు కొడుతోంది నాకు !

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2016/03/22/%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%97%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5/trackback/

RSS feed for comments on this post.

One Comment

  1. DSP music is waste.

    Like


Comments are closed.

%d bloggers like this: