దళితులారా పల్లెలు వీడండి !!

ఫేసుబుక్కులో ఒకానొత మితృని పోస్టు ఇది.  పల్లెలంటే చాలా ఇష్టం కొంత మందికి. కానీ, చాలా మంది దళితులకు పల్లెలంటే అసహ్యం.  తన భావాలను చక్కగా వ్యక్తపరిచాడు అతను. ఈ మొత్తం “కవిత” లాంటి పోస్టులో అతను పల్లెటూళ్ళను దుయ్యబట్టిన తీరు, కులవృత్తులను ఏకి పారేసిన తీరు నాకు బాగా నచ్చింది.  అతను రాసిన దానిలో కొంత భాగాన్ని నేను తీసేశాను. వాటివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అని నా ఫీలింగ్.

ఎవరయ్యా “పల్లెలు పట్టుకొమ్మలు “తొక్కా
తోలు అన్నది ……..

దలితులారా రండీ పల్లెలను వీడండి ,
ఆ కూలీ ఏదో పట్టణములో దొరుకుతుంది ,
దొరక్క పోయినా పస్తులు ఉండండి కానీ
పల్లెల్లో ఉండొద్దూ .

పల్లెటూరు లో కుల గజ్జి ఎక్కువ.
నువ్ ఎంతటి బిల్డింగ్ కట్టుకున్న
నిన్ను ఆ మాదిగ ఇళ్ళు ,మాలోని ఇళ్ళు అంటారు ,
కాబట్టి దలితులారా ఎట్టీ పరిస్తితుల్లో కూడా పల్లెల్లో
ఉండొద్దూ పట్టణాలకు వలస రండీ

దలితులారా మాల,మాదిగ వాడలు వీడండి ,
మాదిగ డప్పులు కాల బెట్టండి ,
మాకోద్దు ఈ కుల వ్రుత్తు లు అని గిరాటు
వేసి గ్రామ పంచాయితీ లా ముఖాన కొట్టండి .
గ్రామ సుంకరీ ,పాలేరు పనిని బంద్ చేసి
మాలలారా పట్టణాలకు వలస రండీ .

దలితులారా పట్టణాల్లో చదవండి ,
మీ పిల్లల్ని కాన్వెంట్ లో చదివించండి.
అసలు ఏమున్నది అని మనకు ఊర్లల్లో పని
ఎట్టీ పరిస్తితుల్లో పల్లెలకు పయనం కావద్దు .

పల్లెలు గురిచి కథలు రాయడం ,కవితలు చెప్పడం ,
పల్లె సౌందర్యం అంటూ వల్లె వేయడం అంతా కుట్ర ,
ఈ విషయములో మనము అయ్యో అనాల్సింది లేదు ,
పల్లె కన్నీరు పెడితే ఏంటి ,మనకు అవసరమే లేదు,
కుల వ్రుత్తులు నాశనము కావాలి ,
ఏ వ్రుత్తి అయిన ఎవడైనా చేయోఛు అని నినదిద్దాం రండీ

ముఖ్యంగా మాదిగ సోదరులు ,
కుల వృత్తులు ద్వంసం చేద్దాం రండీ ,
కులాలతో పెనవేసుకుని ఉన్న ఆ పల్లెల్లో ఉండేది ఎందుకు ,
అదే కూలీ మనకు పట్టణంలో పుష్కలం ,
ఇంకా కుల గజ్జి లేని వ్యవస్థ కదా ……

దలితులారా రండీ పట్టణాల కు తరలి రండీ
మనకు ఏమున్నయి అక్కడ.అగ్రకులాలకు ఊడిగం చేయడం తప్పా .
దొర దగ్గరా ,అగ్రకులపోని దగ్గర పని చేసి
చేతులు కట్టుకుంటే గానీ జీతం ఇవ్వని నీచ
సంస్కృతి ఈ పల్లెలది

పల్లెటూరులు లేక పోతే వ్యవసాయం లేక పోతే ఎలా బ్రతుకుతారు అంటారేమో ,
మాకోద్దు ఆ బువ్వ ,మాకు బువ్వ కన్నా
ఆత్మాభిమానం ముఖ్యం ,మా బిడ్డలు పల్లెల్లో
రైతులుగా ఎవ్వరూ లేరు ఉన్నా వారు ఊరికి
ఒక్కరు కూడ ఉండరు .

రైతుల గురించీ మొసలి కన్నీరు కారుస్తున్న వారు
రైతు కూలీల గురించీ మాట్లాడరు .
దళితులు రైతులు కారు, రైతులతో మాకు సంబందం లేదు ,
ఎందుకంటే మా బిడ్డలు రైతు కూలీలే

రైతులకు ఇఛే రాయితీలు మనకు వర్తించవు ,
ప్రభుత్వం రాయితీ లూ ఇవ్వాలి అని అడిగే సంఘాలు
అన్నీ కూడా అగ్రకులాల కు లాభం కోసమూ ,అడుగుతారు ప్రభుత్వాలు చేస్తాయి .

నా అభిప్రాయం :

పల్లెలంటే సాహిత్యం ప్రకారం, నిర్మలమైన మన్సులు, స్వచ్ఛమైన ఆప్యాయతానురాగాలు ఉండే ప్రదేశాలు.  సినిమాల్లో పల్లెటూరి హీరో గారు జాతరలో ఉట్టి కొట్టి,  మీసం మెలేసి మగతనం అంటే ఏమిటి, పల్లెటూళ్ళు ఎంత గొప్పవి అనే కాన్సెప్టు మీద ఇంట్రొడక్షన్ సాంగ్  పాడడమో లేదా హీరోయిన్ అమాయకంగా, బుజ్జి మేకపిల్లను మెడలో వేసుకుని, చెరుకుగడ తింటూ, పొలాల గట్ల మీద నలుగురు పిల్లలని వెంటేసుకుని ఫస్ట్ సాంగ్  పాడడమో చూపిస్తారు.  కానీ పల్లెలంటేనే మహా చిరాకు పడే బ్యాచ్ ఒకటుంది.  పల్లెలకు రమ్మంటే ఛి ఛీ అనేవారు వీరు.  అలా అని, వీరికి పల్లెటూళ్ళంటే చులకన కాదు, పల్లెలకే వీళ్ళంటే చులకన. ఎవరైనా కొత్తవారు కనపడితే,  మన కులమేంటి అనో మన ఏంటోళ్ళం అనో  అడగని పళ్ళెటూళ్ళు ఒకప్పుడు అయితే లేవు. ఇప్పుడేమన్నా కాస్త మార్పు వచ్చిందేమో తెలీదు.

ఇంకోకటి కులవృత్తులు. కులవృత్తులు అనగానే మహా పవిత్రమైనవి అని చెప్పడం కూడా చాలా సార్లు మనం చూసే ఉంటాం.  కే.విశ్వనాథ్ గారు తీసిన స్వయం కృషి సినిమాలో “చిరంజీవి” చెప్పులు కుట్టునే వృత్తివాడు.  అతను ఎదిగి, ఒక గొప్ప బిజినెస్ మ్యాన్‌గా మారిన తరువాత కూడా ఒకానొక సందర్భములో మనసు బాగోలేనప్పుడు … తన ఆఫీసులోని ఒక సీక్రెట్ రూములోకి వెల్లి తాను దైవములా పూజించే చెప్పు ముందు కూర్చుని (దేవుని విగ్రహములా పెట్టి ఉంటుందక్కడ) … ఒక కొత్త చెప్పు అప్పటికప్పుడు కుట్టేస్తాడు.

అంటే అక్కడ, ఎంత ఎదిగినా తన కుల వృత్తిని దైవముగా భావిస్తున్నాడు అని చెప్పడం దర్శకుని ఉద్దేశ్యం కావచ్చు. మనసు బాలేనప్పుడు భగవధ్యానములో గడిపితే కలిగే మానసిక ప్రశాంతత, దైవములాంటి తన వృత్తిని చేసినా కలుగుతుంది అని చెప్పడం కావచ్చు. కే. విశ్వనాథ్ గారి ఉద్దేశాన్ని శంకించడం కాదు కానీ, నాకు ఆ సీను అస్సలు నచ్చలేదు. (ఆయనది ఖచ్ఛితంగా సదుద్దేశమే అయ్యుంటుంది, ఆయన సినిమాలలో ఇతర వృత్తుల వారిని చిన్న చూపు చూడడం ఉండదు). ఏం అంత గొప్పపని అని దాన్ని అంత గౌరవంగా చూసుకోవాలి ? కొన్ని కులాల వారికి ఇంకా దారుణమైన వృత్తులు కుల వృత్తులుగా వచ్చాయి. వేశ్యా వృత్తి కావచ్చు,  మ్యాన్యువలుగా మరుగుదొడ్లను శుబ్రం చేయడం కావచ్చు. మరి వారంతా ఇలానే తమ కుల వృత్తి పవిత్రమైనదని దాన్ని పూజించుకోవాలా ? అనే ప్రశ్న వచ్చేది.

కులవృత్తులు కొంత మందికి సమాజములో గౌరవాన్ని ఇస్తే, మరికొంత మంది ఊర్లోకి కూడా రానివ్వకుండా, ఊరిబయటే ఉంచేశాయి.  కడుపునిండినోడు ఎన్నైనా చెపుతాడు.  ఏ వృత్తి అయినా నిబద్దతతో చేస్తే నువ్వు గొప్పోడివే అని కథలు, కాకరకాయలు బోలెడన్ని చెబుతారు.  కానీ కొన్ని వృత్తులు చేసేవాడికి తెలుస్తుంది బాధ.  కొన్ని తరాల పాటు తమకు దక్కిన ఏకైక రిజర్వేషన్ “కుల వృత్తి”, తాము వదులుకోవాలనుకున్నా సమాజం ఒప్పుకోక బలవంతంగా రుద్దిన వృత్తి.  (Of course, they are few exceptions, just to prove a point). ఎవడిక్కావాలి ఆ బోడి కులవృత్తి !!

కులవృత్తి క్రింద కొందరు  అందరూ మొక్కే వారవుతారు, ఇంకోకాయన రాజ్యాన్ని ఏలేవారవుతారు.  ఇంకోకాయన పెద్దవ్యాపారి అవుతాడు.  మరి కొందరు కనీసం వ్యవసాయం చేసుకునేవారు అవుతారు. మరికొందరు మాత్రం ఊరుబయట నివాసం తప్ప వేరే గతిలేని వారవుతారు. ఇదంతా జన్మతః వస్తుంది. నీకు వేరే ఆప్షన్ లేదు. ఇది అన్యాయం కదా అంటే … ఓ పెద్దమనిషి నాకిచ్చిన సమాధానం ఏంటిరా అంటే… “మేమేమన్నా సుఖంగా అనుభవిస్తున్నామా, కష్టపడుతున్నాం కదా … రాజ్యాన్ని ఏలడం అనేది పెద్ద బాధ్యత ఆ బాద్యతను మేము నెరవేర్చలేదా, అదేమన్నా ఊరికే వస్తుందా అన్నాడు”.

ఈయనగారొక్కరే కష్టపడుతున్నాడా ? అందరూ కష్టపడుతున్నారు కదా ! మరి ఆ లెక్కన అందరికీ గొప్ప గౌరవం దొరకాలి కదా ? ఇంకా చెప్పాలి అంటే అందరూ చేయడానికి అసహ్యించుకునే పనులను చేసే వారికి ఇంకా ఎక్కువ గౌరవమో, పారితోషికమో దక్కాలి.  అమెరికాలో చెత్త తీసుకెల్లడానికి వచ్చే  వారి జీతం … చాలా ఎక్కువట.  గౌరవం లేకపోయినా … అలాంటి పని వారు చేస్తున్నందుకు డబ్బులన్నా బాగా ముడుతున్నాయన్న మాట. కానీ,  ఈ కులవృత్తిలో దొరికేది మాత్రం బొచ్చె మాత్రమే !  దానికి తోడు అంటరాని తనం బోనస్.

అయినా, ఆ గడుసుతనమేమిటో అర్థం కాదు, కొందరిని కొన్ని వృత్తులకు బలవంతంగా అంకితం చేసి, తాము మాత్రం గౌరవప్రధమైన వృత్తులు చేసుకుంటూ, ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ …  మేము మాత్రం కష్టపడడం లేదా అనడం !  అది అంత కష్టంగా ఉంటే ..  తమ వృత్తిని దళితులకిచ్చి, దళితులకి ఆ కష్టమైన వృత్తేదో ఇచ్చి చూడచ్చు కదా !  సరిగ్గా చేయలేరు అంటారా ? అదీ చూద్దాం… ఒక సారి ఆ అవకాశమిస్తే కదా, సరిగ్గా చేయలేరో లేదో తెలిసేది ! ఇవ్వకుండానే తీర్పివ్వడనికి నువ్వెవడు ? అనాలనిపిస్తుంది. అందుకే తొక్కలో కులవృత్తులు వదిలేసి, నాశనం చేసేసి, వ్యక్తి అర్హతకు తగినట్టు, శక్తికి తగినట్టు పనులు దొరికే వ్యవస్థే కావాలి అనేది. అప్పుడు కూడా ఇలాంటి వృత్తులు ఎవరో ఒకరు చేస్తారు. కానీ, అది వారి అర్హతలను భట్టి, శక్తియుక్తులను భట్టి వచ్చిందే కానీ, కులాన్ని భట్టి జన్మతః వచ్చింది కాదు. అదీ కాక అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవృత్తిని మానేసి వేరే వృత్తిని ఎన్నుకునే స్వేచ్చ ఉంటుంది, ఇది చాలా కీలకం.

ఇక, పట్టణాలలో కుల పిచ్చి తక్కువ అని కాదు. ఎక్కువే కానీ, అక్కడ ఉన్న సౌలభ్యమేఅంటే .. చాలా వరకూ ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతారు.  పక్కవాడి విషయాలలో వేలుపెట్టడం బాగా తక్కువ.  దళితులకు అదే వరంగా మారుతుంది ! అందుకే పనిమాలిన భూలోక స్వర్గాలైన “పల్లెలను” వదిలి, చక్కా పట్నం వచ్చేయండి అనేది !

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2016/04/22/%e0%b0%a6%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%80%e0%b0%a1%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

3 Comments

 1. నిజం సోదరా!

  ఈ సోకాల్డు కులవృత్తులూ అవీ సినిమాలో చూపించుకోడానికి romanticise చెయ్యబడతాయేతప్ప ఇంకెందుకూ అవి పనికిరావు. కుండలుచేయడానికి కుమ్మరే కానఖ్ఖర్లేదు. కుమ్మర కులంలో పుట్టిన ఖర్మానికి వాడు కుండలు చెయ్యడానికే వాడి జీవితాన్ని అంకితం చెయ్యఖ్ఖర్లేదు. అసలా మాటకొస్తే ఎంత మంది బేమ్మలు పౌరోహిత్యాన్ని వీడి ఇతర వృత్తుల్లో స్థిరపడలేదు?

  Like

 2. exactly bro,
  నాకైతే ఈ కులవృత్తులు అస్సలు నచ్చవు. దానికితోడు వీటిని మహా పవిత్రమైన వృత్తులు అనే భావన అస్సలు నచ్చదు. ప్రస్తుతం చాలా మంది తమ కుల వృత్తులను వదిలేసి ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చాలా మంది బ్రాహ్మణులు కూడా తమ కులవృత్తికి అంకితం అవ్వకుండా వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కాకపోతే కొంత మంది తమ కులవృత్తిని కూడా చేస్తున్నారు వారిలొ. నాకు తెలిసిన కొంత మంది పురోహితులకు అది పార్ట్ టైం మాత్రమే ! సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అది వారి ఇష్టం అందులో కాదనేది ఏమీలేదు. కానీ, కులవృత్తిని మరువకూడదు, నువ్వు ఖచ్ఛితంగా దాన్ని గౌరవించాలి అనో, వాటిని రొమాంటిసైజ్ చేయడానికో చేసే ప్రయత్నాలను నేను నిర్మొహమాటంగా వ్యతిరేకిస్తా !

  సినిమాలలో ఇంకో దరిద్రం కూడా ఉంటుంది. శ్రీమాన్ పెదరాయుడుగారు తర తరాలుగా తీర్పులు చెప్పే వంశానికి చెందినవారు ! వారి వంశం, వారి కథా అబ్బో … ! తరతరాలుగా తీర్పులు చెప్పడమేంటి ధరిద్రంగా.. ! ఏం చెత్త సినిమాలివి అనిపిస్తుంది. ఇలాంటి చెత్త సినిమాలు మన బానిస మనస్థత్వానికి ప్రతిరూపాలు అనిపిస్తుంది. ఒకడు నాయకుడైతాడు. అతని పేరు చెప్పుకుని, కొడుకులు, కూతుర్లు, బంధువులు అందరూ నాయకులే. ఇక మీదట నాయకత్వం అంటే ఆఫ్యామిలీ నుండేరావాలి. ఇదో ధరిద్రం.

  బయట కొన్ని డయిలాగులు, “నాయుడంటే నాయకుడు”, “పుట్టించేవాడు బ్రహ్మ, పాలించే వాడు కమ్మ”. “కాపు కాసే వాడే కాపు”, “కమతం ఉన్న వాడు కమ్మ” ! బయటకి రండ్రాబాబూ ఈ చెత్తా చెదారం నుండి అంటే ఏదో ఒకరకంగా వాటిని సమర్ధించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవి. నాయుడు అంటే నాయకుడు అన్నారు కదా, నాయుడ్లందరూ నాయకులేనా ? పాలించే వాడు కమ్మ అన్నారు కదా … దేశాన్ని పాలించిన వారిలో ఎంత మంది కమ్మలు ఉన్నారు ? పోనీ మిగతాకులాల వారు వీటికి పనికిరారా ? ఏదో పిచ్చి డయిలాగులు, పిచ్చి ఉద్రేకాలు. వాటిని సొమ్ముచేసుకోవడానికి సినిమా యాక్టర్లు !!

  Like

 3. వాస్తవాలు మీరు గమనించినదాని కంటే కొంచెం వేగం గా మారుతున్నాయి. నేనింకా నెల కోసారి మా ఊరికెళ్ళివస్తాను. కుల వృత్తులు పల్లెటూర్లలో మరణశయ్య పై ఉన్నాయి. కూలికి దొరికే వారు చాలా తక్కువైపోయారు. కమతం ఉండటం(నౌకరు గా ఉండటం) అనేది చరిత్ర లో కలిసి పోయింది. వ్యవసాయం నష్ట భూఇష్టమైపోయింది. వ్యవసాయం చేయించే రైతుకంటే, వాడి పొలం లో కూలి చేసే వాడికే ఎక్కువ కిట్టుబాటు అవుతుంది. ఒకప్పుడు కింది కులాల వారు పై వారిని “తమరు”, “బాబయ్యా” అనే వారు. ఇప్పుడు “నువ్వు” అనే అంటున్నారు. కులాల్లో ఏమీ లేదు..”పైసా మే పరమాత్మా హై”, అనే విషయం కింది వారికీ పై వారికీ అందరికీ అర్ధం అవుతోంది”. రూపాయి లేందిదే ఎవడూ ఎవడికీ పలకడు. రూపాయి ఉంటే ఎవడు ఎవడికైనా పలుకుతాడు.కింది కులాల వారు పై కులాల నుంచీ భూములు కొంటున్నారు. పై కులాల వారు అమ్ముకొంటున్నారు. పై కులాల వారు ఇంకా తమ కులం గురించీ..ఆ కులపు నాయకుడి గురించీ గర్వం గానే ఉన్నారు. కానీ అది జాలిపడాల్సిన గర్వం. అందువలన ప్రాక్టికల్ గా ఏమీ ఉపయోగం ఉండదు. ఈ విషయం కింది కులాల వారికీ అర్ధమయ్యి పైకులాల బడాయిని లైట్ గా తీఎసుకొంటున్నారు. ఇన్సెక్యూర్ గా ఫీలవటం లేదు. ఒక్కోసారి పంచ్ లు వేసి నవ్వుకొంటున్నారు. ఇక ఒక వడ్రంగికీ, ఒక తాపీ పని వారికీ పల్లెటూళ్ళోనే ఎక్కువ చెల్లించాల్సివస్తోంది. పట్టణాలలో economy of scale వర్తించి పల్లెల కంటే కొద్దిగా తక్కువ అవుతుంది. ఇదంతా మరీ పెద్ద పెద్ద భూస్వాములు లేని మధ్య కోస్తా ఊరిలో . మరి సీమ లో , తెలంగాణ లో ఎలా ఉందో తెలియదు.
  ఒక్కోసారి పల్లెల్లో ఉండటం వలన కొన్ని పైకి కనపడనటువంటి సున్నితమైన అంశాల లో లాభం ఉంటుంది. మా నాన్న గారి(వ. 83 సం||) కి care taker గా ఒక ఎస్ సీ వర్గానికి చెందిన మధ్య వయసు వ్యక్తి సేవలను ఉపయోగించుకొంటున్నాము. అతను తన కుటుంబం తో హైదరాబాదు లోని అపార్ట్మెంట్లలో వాచ్మేన్ గా ఆరేడేళ్ళు పనిచేసి, తిరిగి ఊరు వచ్చేశాడు. ఊళ్ళో అతనికి నేను ఇప్పుడు, హైదరాబాదు లో అతనికి వచ్చే దాని కంటే ఎక్కెవే చెల్లిస్తున్నాను. అసలు విషయం అది కాదు. అతనిని నేను, “ఏం ఎంకటేసూ, అయిద్రాబాదు నుంచీ ఎందుకొచ్చేశావ్?”, అని అడిగితే, “ఎండ పొడ చూడ్డారని, కాలవా రేవూ చూద్దారనీ బెంగేసి వచ్చేశా”, అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎండకోసం,రేవూ కాలవా కోసం నేను ఆ పని చేయలేక పోయాను.

  Like


Comments are closed.

%d bloggers like this: