“ఓలా క్యాబ్” రేప్ కల్చర్ – నచ్చనిదంతా రేప్ కల్చరే మరి !

“రేప్” అనే పదం, “రేప్ కల్చర్” అనే మాట ప్రస్తుతం కొంత మంది ఉపయోగిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. రేప్ అంటే ఏమిటి ? అనేదానికి మన చట్టం దగ్గర ఒక నిర్వచనం ఉంది.  మరి ఈ “రేప్ కల్చర్” అంటే ఏమిటి? దానికి మాత్రం నిర్వచనాలేంలేవు. నోరున్నోళ్ళు ఏది చెబితే అదే “రేప్ కల్చర్” అన్న మాట.

వాణిజ్య ప్రకఠనలు (యాడ్స్) రూపొందించేవారు ఇక మీదట “ఫెమినిష్టులందరి”  మనోభావాలనూ దృష్టిలో పెట్టుకుని యాడ్స్ రూపొందించాలి, తప్పదు. బహుషా ప్రతీ యాడ్ కంపెనీ, యాడ్ కాన్సెప్ట్ రూపొందించడం దగ్గరనుండి తుది యాడ్ వచ్చేవరకూ ఫెమినిష్టులను సంప్రదించాలేమో ! లేకపోతే వారు, ఏదో ఒక యాడును సెక్సిస్ట్ అనేయగలరు. అంతటితో ఆగితే పర్వాలేదు. ఏకంగా ఆ యాడ్ “రేప్ కల్చర్” కు ప్రతీక అనేయగలరు. అంతేనా, రోడ్డెక్కి దీనికి వ్యతిరేకంగా పోరాడాలి అని తోటి ఫెమినిస్టులను రెచ్చగొట్టేయగలరు కూడానూ !!

ఇదంతా చెప్పడానికి కారణం, ఇటీవలే “ఓలా క్యాబ్” వాడు “ఓలా మైక్రో” కాన్సెప్టుతో ఇటీవల చేసిన వాణిజ్య ప్రకఠన.  ఆ వాణిజ్య ప్రకఠన, ఒక ప్రియుడి అవస్థను చూపిస్తుంది. ప్రియురాలితో షాపింగుకు వెల్లిన అతగాడు … ప్రియురాలు “బేబీ” అంటూ అడిగిన ప్రతీదానికీ డబ్బులు చెల్లించుకుంటు వెలతాడు అన్న మాట.  అలా  ఆ ప్రియురాలు ఒక కిలో మీటర్ నడిచి షాపింగ్ చేసేసరికి అతనికి ఖర్చు “525 రూపాయలు” అయ్యిందట.   దానితో ప్రియుడుగారు  “నా ప్రియురాలు కిలో మీటరుకు 525 రూపాయలు తీసుకుంటుంది, అదే ఓలా మైక్రో మాత్రం కిలో మీటరుకు 6 రూపాయలు మాత్రమే తీసుకుంటుంది” అని చెప్తాడు.  వెంటనే, “ఓలా యాప్ డవున్లోడ్ చేసుకోండి,  క్యాబ్ బుక్ చేయండి” అని యాడ్ ముగించేస్తారు.

అబ్బాయిలు రొటీనుగా చేసే కంప్లైంట్ ఇది.  నా ప్రియురాలు షాపింగ్ ఎక్కువ చేస్తుందనో లేక నా భార్య షాపింగ్ ఎక్కువ చేస్తుందనో వచ్చే కంప్లైంట్లు కొత్తవేం కావు.  కానీ, వాటికి ఇప్పుడు కొంత మంది ఫెమినిస్టులు ఇస్తున్న రియాక్షన్లు మాత్రం మరీ కొత్తగా ఉన్నాయి. కొత్తగా ఉండడం తప్పేం కాదు కానీ, అవి మరీ అసంబద్దంగా ఉండకూడదు.   ఇప్పుడు ఆ యాడ్ ఇక్కడ చూడండి.

ఇదే తరహా యాడ్ ఒకటి చిన్న పిల్లాడి మీద కూడా ఉంది.  అందులో తండ్రి పిల్లాడిని షాపింగుకు తీసుకెలతాడు. వాడు కూడా ఇలానే అటు ఇటూ లాక్కెలుతూ షాపింగ్ చేయిస్తాడు. అప్పుడు తండ్రి … ” నా కొడుకు కిలోమీటరుకు 125 రూపాయలు తీసుకుంటాడు, కానీ ఓలా మైక్రో కిలోమీటరుకు కేవలం 6రూపాయలు మాత్రమే తీసుకుంటుంది” అని చెప్తాడు.  ఆ యాడ్ ఇక్కడ చూడొచ్చు.

క్యూట్ గా ఉంది కదా !  ఇందులో పెద్దగా అభ్యంతరం పెట్టడానికి ఏమీలేదు. చిన్న పిల్లలు అలా షాపింగుకు వెల్లినప్పుడు ఖర్చుపెట్టించడం కామనే.  యాడులో దాన్ని కాస్తంత క్యూటుగా చూపించాడు.  ఒక చిన్న పిల్లోడిని పెట్టినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ, అదే పని ఒకమ్మాయిని పెట్టి, యాడ్ తీయగానే “ఫెమినిస్టు” లోకం ఒక్కసారిగా భగ్గుమంది.  ఠాట్ ఎంత ధైర్యం వీడికి,  సర్వస్వతంత్రురాలైన ఆధునిక స్త్రీని పట్టుకుని ఇన్నేసి మాటలంటాడా ? అసలు అంత అవమానకరంగా తీస్తాడా ? వాడికి ఎన్ని గుండెలు అని అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు.

అంతటితో ఆగలేదు. ఒకానొక ఫెమినిస్టుగారయితే ఒకడుగు ముందుకేసి, ఈ యాడ్ రేప్ కల్చరుకు ప్రతీక అని,  దీన్ని నిరసించడానికి తాను ఆత్మహత్య చేసుకుని,  తన ఆత్మహత్యకు కారణం “ఓలా క్యాబ్” వాడే అని సూసైడ్ నోట్ రాసి మరీ చస్తానని హెచ్చరించేసింది.  కావాలంటే ట్విట్టరులో ట్వీటిన వీటిని చూడండి ..

యాడ్ కొంచెం  అఫెన్సివుగా ఉంది అనుకోవడములో తప్పులేదు.  కొంత మందికి ఇది హాస్యం అనిపించవచ్చు, మరికొంత మందికి అనిపించకపోవచ్చు.  ఎవరి లిమిటేషన్లు వారికి ఉంటాయెప్పుడు. కానీ, మరీ ఒక యాడును పట్టుకొని “రేప్ కల్చర్” అనడం ఏమిటి ? ఆవిడగారికి ఇందులో “రేప్ కల్చర్” ఏవిధంగా కంపడింది.  చిన్న పిల్లాడితో తీసినప్పుడు క్యూట్‌గా అనిపించింది, ఒకమ్మాయిని పెట్టి తీయగానే “రేప్ కల్చర్” ఎలా అయ్యింది ?  రేప్ అనే పదాన్ని, రేప్ కల్చర్ అనే పదాన్ని వీరు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా, ఇతరుల భావ ప్రకఠన స్వేచ్ఛను హరించేస్తున్నారా ? అన్న అనుమానాలు రాకుండా ఉండవ్.

సహజంగానే, కార్పొరేట్ కంపెనీలు ప్రజల సెంటిమెంట్లపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించే వాటిని తొలగిస్తుంటాయి. దానితో, యూట్యూబునుండి ప్రస్తుతం ఈ యాడ్ తొలగించడమైంది.  అంటే.. ఓలా క్యాబ్ వాడి అకౌంటులో లేదు లెండి.  దాన్ని వేరే యూజర్లు యూట్యూబులో ఉంచేశారు. నేను పైన మీకిచ్చిన లింకు కూడా అలా వేరే ఎవరో యూజర్ యూట్యూబులోకి ఎక్కించినదే !

మరొక అంశమేమిటంటే, ఇదే యాడ్ మగవారిపైన సెటైరులా తీసి ఉంటే ఏమయ్యుండేది ? ఎమీ అయ్యుండేది కాదు. అంతా సరదాగా ఉంది అనేవారు. ఒక్కరు కంప్లైంట్ చేసుండేవారు కాదు. నమ్మకం లేదా .. సరే, అమూల్ వాడి “బాడి వార్మర్ యాడ్” చూడండి.  ఒకానొక భర్తగారు భార్య, పిల్లాడిని వెంటేసుకుని షాపింగుకు వెలతాడు.  శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ఇవ్వమని అడుగుతాడు.  అక్కడున్న సేల్స్ మన్, “అమూల్ బాడీ వార్మర్” తీసుకొచ్చి చూపిస్తాడు.  భర్తగారేమో,  ఇదా … ఇంత పల్చని ఈ దుస్తులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయా అని నవ్వుతాడు. అంతే … ఆ దుస్తులకున్న చేతులు, ఆ భర్తగారికి ఆ చెంపా, ఈ చెంపా వాయించేస్తాయి.  పల్చగానే ఉంది కానీ .. ఇందులో వేడి చాలా ఉంది (Patla hai magar … garmi bahut hai) అని ఒప్పుకుంటాడు. భర్తగారికి దెబ్బకి ఒల్లు వేడెక్కిపోతుంది అన్నమాట. పక్కనున్న భార్య గారు, అబ్బో అద్బుతం ఇవే తీసుకుందాం అని ఆ దుస్తులే తీసుకుంటుంది.  మీరు ఈ యాడ్ ను ఇక్కడ చూడొచ్చు …

ఇప్పుడు చెప్పండి. పైన ఉన్న యాడ్లలో ఏది ధరిద్రంగా ఉంది ? ఒకయాడులో కేవలం మాటలు మాత్రమే ఉంటాయి, అవి ఫన్నీగానే ఉంటాయి. మరొక యాడులో ఏకంగా చెంప పగలగొట్టడం ఉంటుంది. అఫ్ కోర్స్, అది కుడా ఫన్నీగానే తీసాడనుకోండి. కానీ, ఫిజికలుగా కొట్టడం ఫన్నీ అనిపించడం కొంచెం కష్టం, మాటలతో పోలిస్తే !  అయినా మగవారు ఎవ్వరూ ఈ యాడ్ గురించి కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు నేను రాస్తున్నది కూడా ఉదాహరణగా చూపడానికే తప్ప అదేదో అఫెన్సివ్ యాడ్ అని, దాన్ని తొలగించాలనీ చెప్పడానికి కాదు.  ఇంతకన్నా దరిద్రమైన దిక్కుమాలిన యాడ్లు, ఫెమినిజం స్పూర్తితో అనేకం వచ్చాయి.  వాటి గురించి నోరుకూడా మెదపని ఫెమినిస్టులు, వారిని అంటిపెట్టుకుని ఉండే మగ పతివ్రతలు !

ఇదేమీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండేం కాదు. ఒక సంఘఠన మగవారికి జరిగినప్పుడు “ఆ దానిదేముంది అనడం”, అదే ఆడవారికి జరగగానే … ” ఏమిటీ అన్యాయం, దారుణం” అని చొక్కాలు చించుకునేవాల్లూ ఎప్పుడు ఉండనే ఉన్నారు.  2003లో “డేవిడ్ అండ్ గోలియత్” అనే కంపెనీ “Boys are stupid, throw rocks at them” అనే స్లోగనుతో టీ- షర్ట్స్  విడుదల చేసింది.  అది దారుణంగా ఉందనీ, చిన్న పిల్లల పట్ల హింసను ప్రేరేపించే విధంగా ఉందనీ,  ఫాదర్స్ రైట్స్ కోసం పోరాడే ఒకానొక రేడియో వ్యాఖ్యాత అభ్యంతరం తెలిపాడు.

BoysAreStupid

అది అక్కడ ఫెమినిస్టులకు ఏమాత్రం రుచించలేదు.  ఒక మగాధముడు, నోరు తెరిచి మాట్లాడడమా అన్నట్లుగా అతనిపై విరుచుకు పడిపోయారు. ఆ టి-షర్టులకు బాగానే పబ్లిసిటీ కల్పించారు. కొంత మంది స్త్రీవాదులు ఆ టి-షర్టును అదే పనిగా కొనుగోలు చేశారనికూడా విన్నా ! దానితో, ఆ టీ షర్ట్ సేల్స్ బాగా పెరిగాయి కూడా !   తరువాత, ఈదే టైటిలుతో ఒక పుస్తకం కూడా వచ్చింది.  పైన ఇచ్చిన ఇమేజు ఆ పుస్తకం యొక్క కవర్ పేజీదే !!

ఇలాంటివి చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే … “మగవారిపై హింస” అనేది సొసైటీలో ఆమోదింపబడింది. కేవలం స్త్రీలపై హింస మాత్రమే నేరముగా చూడబడుతోంది.  మగాడ్ని కావాలంటే, కొట్టొచ్చు, తిట్టొచ్చు, అతనితో హీనంగా ప్రవర్తించొచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ, ఆడవారి విషయములో మాత్రం సమాజం రోజు రోజుకూ అతి సున్నితంగా మారిపోతోంది అని.  దీన్నే బేసిగ్గా మేము “మేల్ డిస్పోజబులిటీ” అంటూ ఉంటాం. ఇదే కాదు, ఇంకా చాలా అంశాలున్నాయి ఇందులో.  మగవారు ఆలోచనలు, వారి భావాలు, వారి గౌరవం, హక్కులు అనేవి కేవలం ఆప్షనల్ మాత్రమే ! అవే స్త్రీల విషయానికి వస్తే అవన్నీ మాండేటరీ !   కొంత మంది గడుసు వాల్లు దీన్నే మేల్ డామినేటెడ్ సొసైటీ అంటూ ఉంటారు. అంటే,  బాధలు ఎక్కువగా మగవారే పడతారని మనం అర్థం చేసుకోవాలన్న మాట.

మొదటి పేరాలో చెప్పుకున్నట్టు, రేప్ కల్చర్ అంటే ఏమిటి ? కొంత మంది నోరున్నోళ్ళు ఏమి చెబితే అదే రేప్ కల్చర్. ఆ పదాలను ఉపయోగించుకుని వీరు ఎదుటివారిని బ్లాక్ మెయిల్ చేసేస్తారు, భయపెట్టేస్తారు. అంతకన్నా దారుణమైనవి మగవారిపై జరిగినా అస్సలు పట్టించుకోరు.

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2016/04/26/%e0%b0%93%e0%b0%b2%e0%b0%be-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%87%e0%b0%aa%e0%b1%8d-%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%9a/trackback/

RSS feed for comments on this post.

One Comment


Comments are closed.

%d bloggers like this: