రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం స్పూర్తి కొనసాగుతుందా ..!?

రంగనాయకమ్మ రాసిన విషవృక్షం గురించి, పురుష హక్కుల కోసం పోరాడేవారు రాస్తున్న రచణల గురించి ఇది వరకే “ద్రౌపది – మొదటి ఫెమినిస్ట్” అనే టపాలో మాట్లాడుకుంటున్నాం కదా ! దానికి కొనసాగింపే ఈ టపా ! అదే కాదు, పురుష హక్కుల కార్యకర్తలు తరచుగా పురాణాలపై తమ వ్యతిరేకతను తెలియజేస్తూనే ఉన్నారు. అసలు వారు ఏమి చెబుతున్నారో ఇక్కడ చూడోచ్చు …

Ramayana – The root cause of sexism against men?

ramayana_ashley_van_haeften_flickr

నిజానికి మన భారతీయులకోసం రాసింది కాదు. అంతర్జాతీయ పాఠకుల కోసం రాసింది కాబట్టి, కొన్ని కొన్ని వ్యాఖ్యలు పొందుపరచాల్సి వచ్చింది. ఉదాహరణకు, రాముడు రాజు కొడుకు. ఆయన భార్య పేరు సీత లాంటివి. మనకు అంత డిటైల్డుగా చెప్పనవసరంలేదు.

రామాయణం – ఓ రక్షకుల కథ

రామాయణము ఒక రక్షకుల కథ. అందులో చాలా పాత్రలు సీతను రక్షించడం అనే పనిలోనే ఉంటాయి లేదా ఇంకో స్త్రీని రక్షించడానికే ప్రయత్నిస్తుంటాయి. మగవాడి కనీస లక్షణం ప్రొటెక్టర్ (రక్షకుడు)” గా ఉండడం అని ఈ రామాయణము నూరిపోస్తుంది.

రావణుడు సీతను అపహరించాలనుకునేది ఎందుకు? తన చెల్లెలు శూర్పనఖకు జరిగిన పరాభవానికి ప్రతీకారంగానే కదా ? అంటే రావణుడు ఇక్కడ శూర్పనఖకు రక్షకునిగా తన బాధ్యత నిర్వర్తించడానికి ప్రయత్నించాడు. ఆమెకు అవమానం జరిగితే ప్రతీకారం చేయాలనుకున్నాడు.

రావణుడు, మారీచున్ని బంగారు జింకగా మారి సీతను ఆకర్శించమని పంపిస్తాడు. సీత రామున్ని ఆ బంగారు జింకను తీసుకురమ్మని కోరుతుంది. ఇక్కడ రాముడు సీత కోరికను తీర్చడానికి పూనుకుంటాడు. అంటే ఇక్కడ రాముడు “ప్రొవైడర్ (పోషకుడు)” పాత్రని పోషించడానికి పూనుకున్నాడు. ఒకసారి రాముడు సీతను వదిలి వెల్లగానే సీతను రక్షించే బాధ్యత లక్ష్మణుడు తీసుకుంటాడు.

(అంటే ఇక్కడ మగవానిగా రాముడు ప్రొటెక్టర్ & ప్రొవైడర్ [రక్షకుడు & పోషకుడు] అనే బాధ్యతలను నిర్వర్తించడం మనం గమనించవచ్చు).

ఒక్కసారి మారీచుడు సీతను, లక్ష్మణున్ని మోసపుచ్చిన తరువాత, సీత లక్ష్మణున్ని రాముడిని రక్షించడానికి వెల్లమంటుంది. ఎందుకంటే, తనను లక్ష్మణునికన్నా ఎక్కువగా రాముడే ప్రొటెక్ట్ చేయగలడు కాబట్టి, అతన్ని రక్షించడానికి లక్ష్మణున్ని వెల్లమంటుంది.

కానీ లక్ష్మణుడు సీతను అలా వదిలివెల్లలేడు. అతను ప్రొటెక్టర్ రోల్‌ని పోషించక తప్పదు. కాబట్టి, ఆమెను రక్షించే ఉద్దేశముతో “లక్ష్మణ రేఖ”ను గీసి వెలతాడు. ఆ రేఖలోకి ఎవ్వరూ రావడానికి వీలులేదు. కానీ, వెలుపలికి వెల్లవచ్చు.

రావణుడు యాచకుడి రూపములో సీతను భిక్ష అర్థించగానే సీత “లక్ష్మణ రేఖ”ను దాటి బయటకి వస్తుంది. అంతే ఇక్కడ సీత చాలా తెలివితక్కువగా ప్రవర్తిస్తుంది.

అప్పుడు రావణుడు సీతను అపహరించి లంక వైపు తీసుకు వెల్లడానికి ప్రయత్నిస్తాడు. ఈ మార్గమధ్యమములో జఠాయువు అనే ముసలి పక్షి ప్రొటెక్టర్‌గా (రక్షకుడు) మారి సీతను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పనిలో అది తన ప్రాణాలను కూడా కోల్పోతుంది.

ఇంకో సంఘఠనలో హనుమంతుడు కూడా సీతను తన వీపు మీద మోసుకుని వెలతానని చెబుతాడు. ఇక్కడ అతను కూడా ఈ ప్రొటెక్టర్ రోల్ పోషించడానికే ప్రయత్నిస్తాడు. కానీ, సీత తిరస్కరిస్తుంది.

రావణుడు కూడా సీతకు రక్షకునిలానే వ్యవహరించాడా?
————————————–

ఇక్కడ రావణుడు కూడా సీతకు రక్షకునిలాగానే వ్యవహించాడు. నిజానికి రావణుడు సీతను వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఆమెను అశొక వనములో బందిస్తాడు. కానీ, ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవడానికి ప్రయత్నించడు. రావణుడు ఆమె అనుమతి కోసమే ఎదురుచూస్తాడు. అంటే ఇక్కడ రావణుడు, సీతను రాముడి మనుషులకు దొరక్కుందా కాపడానికి ప్రయత్నిస్తూ, ఆమె అంగీకారముకోసం ఎదురుచూస్తాడు. అంటే దాదాపుగా ఇక్కడ రావణుడు కూడా సీతకు ప్రొటెక్టరుగానే పనిచేశాడని చెప్పొచ్చు.

రామాయణములో ఎందుకు ఇంత మంది ప్రొటెక్టర్లు ఉన్నారు ?
———————————-

రామాయణములో చాలా మంది ప్రొటెక్టర్లు ఉన్నారు ఎందుకు ? రచయిత ఆ గ్రంధాన్ని అలా ఎందుకు రాశాడు ? ఎందుకంటే, అప్పుడున్న సమాజములో జెండర్ రోల్స్ ప్రకారం మగవాడు స్త్రీకి ప్రొటెక్టరుగానూ, ప్రొవైడరుగానూ ఉండాలని స్పష్టంగా నిర్దేశించబడింది. అలా సమాజములో ఈ జెండర్ రోల్స్‌ని ఆ గ్రంధములో కూడా పొందు పరిచాడు రచయిత.

ప్రస్తుత సమాజములో కూడా ఈ టైపులో స్పష్టమైన జెండర్ రోల్స్ ఉన్నాయి. కాకపోతే, ప్రస్తుతం స్త్రీలకు ఏదైనా ఒక విధిని ఖచ్ఛితంగా నిర్వర్తించాలని శాశించడం నేరం అవుతుంది. మగవారు వారిని ఫలానా పని చేయాల్సిందే అని బలవంతం చేస్తే అది గృహహింస కేసు అవుతుంది. కానీ, మగవారి విషయములో మాత్రం ఇది నిజం కాదు. మగవారు ఇప్పటికి కూడా రామాయణములో చెప్పబడినట్టు ప్రొటెక్టరుగా ప్రొవైడరుగా తమ విధులు చచ్చినట్టు నిర్వర్తించాల్సిందే.

ప్రస్తుతం మగవారు + ఆడవారు ఇద్దరూ, మగవారు రామునిలాగా ప్రొటెక్టర్ & ప్రొవైడర్ రోలును ఖచ్ఛితంగా పాటించాలని విశ్వసిస్తున్నారు. వీరు మగవారికి శతృవులు. అతి దారుణమైన కౄరమైన శతృవులు. నిజం చెప్పాలంటే, ప్రస్తుత సమాజములో మగవారు రామునిలా ఉండాలని కోరుకోవడం కన్నా పెద్ద సెక్సిజం ఇంకోటి ఉండదు.

అంతే కాకుండా, మగవారు రామునిలాగా ప్రొటెక్టర్‌గా జీవించకుంటే వారిని “మగవాడు” కాదు అని వెక్కిరించడం చూడొచ్చు. ఇది మగవారిలో ప్రొటెక్టర్ సిండ్రోంను ఏర్పరుస్తోంది. ఈ ప్రొటెక్టర్ సిండ్రోమే ప్రస్తుతం ప్రపంచములో చాలా రకాల హింసకు కారణం అవుతోంది.

కాస్త ఒరిజినల్ రామాయణాన్ని చదివితే, పైన రాసింది అయినా, రంగనాయకమ్మ రాసిన విషవృక్షమైనా  అసంబద్దంగా అనిపించక మానదు.

రామాయణ విషవృక్షాన్ని విమర్శించినవాల్లంతా దాదాపుగా అన్నమాట ఒక్కటే. అప్పుడెప్పుడో జరిగిన రామాయణం, అప్పటి సాంఘిక పరిస్థితులకు, ధర్మానికీ అనుగుణంగా ఉంటుంది. దాన్ని పట్టుకుని, ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్క్సిజమూ, ఫెమినిజమూ దృక్పదాలతో విశ్లేషన చేయడమేమిటీ? ఈకాలం సిద్దాంతాలకు అనుగుణంగాలేవని నిందించడమేమిటి అని. పైన పురుషహక్కుల కార్యకర్తలు రాసిన ఆర్టికల్ కూడా ఇవే ప్రశ్నలే వర్తిస్తాయి. కొంత మంది పవిత్రంగా భావించే వాటిని కించపరచడమెందుకు ? అని !!

కారణం ప్రజలే ! ఇప్పుడంటే లేదు కానీ, ఒకప్పుడు స్త్రీలకు “సీత పాతివ్రత్యం” ఆదర్శం. సీతను రాముడు అగ్నిప్రవేశం చేయమంటాడు. అగ్నిప్రవేశం చేస్తుందేకానీ, రామున్ని శంకించదు. రాముడు సీతను అడవిలో వదిలేయమంటాడు, అయినా సీతమ్మ అవన్నీ భరిస్తుంది.

ప్రజలు రాముడు ఇటువంటి పనులు చేసినా రామున్ని వెనకేసుకు వచ్చేవారు. ఈ కథ, సమాజములో స్త్రీల చుట్టూ ఒక సాంప్రదాయ సంకెళ్ళను ఏర్పరచింది. భార్యను తిట్టినా, కొట్టినా, అనుమానించి అవమానించినా ఆ భార్య సీతలా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలే కానీ తిరగబడకూడదు. అదే సమయములో భర్త తన భార్య మీద అనుమానం వస్తే ఆమెను పరీక్షించవచ్చు. సరే, స్త్రీ సీతలా ఉంటే … పురుషుడు రాముడిలా ఉంటాడా ? అది కూడా జరగలేదు.

 విషయం ఏమిటంటే, బలవంతులకు నీతులు వర్తించవు. బలహీనుల మీదే నీతులు అమలవుతాయ్. అదే అతి పెద్ద సమస్య !!

ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ వాదుల అభ్యంతరాన్ని పరిశీలిద్దాం !

అప్పుడెప్పుడో జరిగిన ఇతిహాసాలను, అప్పటి సామాజిక పరిస్థితులకు అనుకూలంగా రాసిన వాటిని, ఇప్పటి సమాజములోని నీతులతో, నియమాలతో ఎలా పోలుస్తారు ? ఎలా వాటిని జడ్జ్ చేస్తారు అని !

ఇలా పురాణాలను వ్యతిరేకిస్తూ రాసేవారు, ఎప్పుడో జరిగిన రామయణాన్ని, ప్రస్తుత సమాజములో భిన్న పరిస్థుతుల మధ్య, ధర్మాల మధ్య బ్రతుకున్న స్త్రీల మీద మాత్రం ఎలా రుద్దుతారని రివర్సులో ప్రశ్నించేశారు.

రంగనాయకమ్మ ఏమిచేసిందంటే … ఆపాత సిద్దాంతాలనూ, ఆచారాలనూ ఈకాలం స్త్రీల మీద రుద్దడాన్ని వ్యతిరేకించింది, ఎదిరిస్తూ వీరంతా ఫాలో అవ్వమని చెప్పే రామాయణాన్ని, ఇప్పటి పరిస్థితులకు, సిద్దాంతాలకూ, ధర్మాల ప్రాతిపధికన “రామాయణవిషవృక్షాన్ని” రాసేసింది, She turned the tables !

అలా రామాయాణాన్ని వ్యతిరేకించడం వలన వారు సాధించింది ఏముంది ? అని ప్రశ్నించుకుంటే … చాలా ఉంది అని చెప్పాల్సి వస్తుంది ! ఇప్పుడు మగానుభావులెవరూ స్త్రీకి సీత ఆదర్శం అనడం లేదు. స్త్రీ సీతలా ఉండాలని ఎవ్వరూ చెప్పడం లేదు ! ప్రస్తుతం స్త్రీల ఆదర్శం వేరే !!

రాముడు చేసినట్టు నువ్వు చేస్తే, గృహహింస కింద లోపలేస్తారు. అంతే కాదు, రాముడు సీతను అడవికి పంపాడు … కానీ, ప్రస్తుతం గృహహింస చట్టం ప్రకారం అడవికెల్లే బాధ రాముడిదే కానీ సీతది కాదు. స్త్రీని ఆమె “వైవాహిక గృహం” (Matrimonial House) నుండి బయటకు పంపడం నేరం. కానీ, స్త్రీ కావాలంటే… తనను భర్త వేధిస్తున్నాడని చెప్పి, తన సొంత ఇంటిలోనుండి మగవాన్ని బయటకి పంపించొచ్చు !! పొరపాటున మగవాడు ఆ ఇంటికి ఇంకా EMIలు గట్రా కడుతూ ఉంటే… అతను బయట వేరే అద్దె ఇల్లు తీసుకొని, ఆ ఇంటికి అద్దె చెల్లిస్తూ, తనను తరిమేసిన ఇంటికి EMIలు కడుతూ బ్రతకాలి. అంతే కాదు మగవాన్ని తన ఇంటి దరిదాపులకి రాకుండా చేయొచ్చు. వస్తే జైలు శిక్ష గ్యారంటీ ! అంటే ప్రస్తుతం అడవికెల్లేది రాముడేగానీ, సీత కాదు !!

ఇంత మార్పు ఎలా వచ్చింది ? మన సాంప్రదాయ వాదులు, పెద్దలు, పండితులూ సింపులుగా ఒప్పేసుకున్నారా ? లేదు. కొంత మంది పోరాడి, స్త్రీలు “రామాయణం” చేసే బ్రెయిన్ వాష్ నుండి బయటకి వచ్చేలా చేయగలిగారు. అందులో భాగంగా అనేక కథలు, కవితలు, నాటకాలు, సినిమాలు … ఇలా ఏ సాహిత్యం పడితే ఆ సాహిత్యములో తమ తిరుగుబాటును చొప్పించారు. “ఎందుకు ? మాకు మాత్రమే ఎందుకు ?” అంటు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఒక్క సారి ఆడవారు ఆ “రామాయణం” అనే బ్రెయిన్ వాష్ నుండి బయటకి రాగానే … మిగిలినవన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోయాయి. (ఇక్కడ రామాయణం అంటే రామాయణం అనే కాదు, ఈ తరహా రాతలన్నీ ! మనుధర్మముతో సహా !!)

అంటే జరిగింది ఏమిటంటే … ఆడదంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటు కట్టుబాట్లనూ నీతులనూ చెప్పి, వారిని కట్టేయడానికి ప్రయత్నించిన సంప్రదాయ వాదుల్నీ, పెద్దరికం వెలగబెట్టే పెద్దల్ని … చేపను గరుకు రాయి మీద వేసి తోమి పొలుసులు పీకినట్టు, చాకలి వాడు మైల పడ్డ దుస్తుల్ని బండకేసి బాదినట్టు … విరగబాదిన తరువాత ఇవన్నీ జరిగాయి !!

అంతా బాగానే ఉంది ! ఆడవారు వ్యతిరేకించారు సరే, మరి పురుష హక్కుల కార్యకర్తలు రామున్ని వ్యతిరేకించడానికి కారణం ఏమిటి ? పైన మనం చెప్పుకున్న దాన్ని భట్టి చూస్తే రామాయణం అనేది పూర్తిగా పురుష పక్షపాతముతో కూడుకున్నది కదా ! దాన్ని సమర్ధించాల్సింది పోనిచ్చి వారెందుకు వ్యతిరేకిస్తున్నారు ?? వెల్, ఇది మరో టపాలో చెబుతాను..! ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది ఈ టపా !!

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2016/05/09/%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e0%b0%95%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%b5%e0%b1%83%e0%b0%95/trackback/

RSS feed for comments on this post.

One Comment

  1. కామెంట్లన్నీ దాచేశారా కనిపించక పోతే మాకెలా తెలుస్తుంది స్పందనలు తెలియాలి కదా మీకెందుకంత భయం బై ద వే కొన్ని విషయాలు స్పష్ఠంగా లేవు సుమా…..

    Liked by 1 person


Comments are closed.

%d bloggers like this: