మీలో స్కర్ట్ ధరించేంత మగతనం ఉందా !?

Update: ప్రస్తుతం పిల్లలు జెండర్ న్యూట్రల్ యూనిఫార్మ్ వేసుకోవచ్చట. ప్రస్తుతం ఉన్న యూనిఫారంలు ట్రాన్స్‌జెండర్‌లకు ఇబ్బందులు కల్గిస్తున్నాయని అందుకే జెండర్ న్యూట్రల్ యూనిఫార్మ్ ప్రవేశ పెట్టాయట స్కూల్లు. (వార్త ) దీని ప్రకారం అబ్బాయిలు స్కర్టు వేసుకోవచ్చు, అమ్మాయిలు ట్రౌసర్లు వేసుకోవచ్చు !

ఇందులో తప్పేముంది అంటారా ?వెల్, పైకి చూడడానికి ఎంతో గొప్పగా అనిపించే ఈ చర్యను కాస్త నిశితంగా పరిశీలిస్తే అందులో ఉన్న ఒక “కమ్యూనిష్టు పైత్యం” గమనించ వచ్చు !  అదేంటో తెలియాలంటే … గత సంవత్సరం నేను రాసిన ఈ టపాను మళ్ళీ ఒక సారి చదవండి !

 ————————————————

కూల్, మీ ప్రయత్నాలు విరమించుకోండి (నా మీద విరుచుకు పడడం లాంటివన్న మాట :-P). ఈ ప్రశ్న నాది కాదు.  కొన్ని పేపర్లలో మగవారిని ఉద్దేశించి రాసిన ఆర్టికల్సు ఇవి.  విషయమేమిటంటే … మగవారు ఆడవారిలా డ్రస్సులు వేసుకోవడం. సరదాగా ఈచాయా చిత్రమును చూడండి !

Andrej_Pejic_at_MICHALSKY_StyleNite

ఇక్కడున్న వారు అమ్మాయి కాదు అబ్బాయి ! ఇదో ఫ్యాషన్ షో. దీనికే యూనిసెక్స్ (Unisex) ఫ్యాషన్ పేరు కూడా పెట్టారు.ఈ “ముద్దుగుమ్మడు” పేరు ఆండ్రెజా పెజిక్ (Andreja Pejić).  అమ్మాయిగా పుట్టి, అబ్బాయిగా మారిన వ్యక్తి ! ఆ “ముద్దుగుమ్మడు” గురించి ఇక్కడ చదవొచ్చు.

Link : https://en.wikipedia.org/wiki/Andreja_Peji%C4%87

ఇప్పుడు మనం కొన్ని పేపర్లలో వచ్చిన ఆర్టికల్స్ చూద్దాం …

 

మన “భాజీ రావ్” రనవీర్ సింఘ్,  “ఫాస్ట్ అండ్ ఫ్యురియస్” వాన్ డీజిల్,  ” “300, గ్రీకు యోధుడు” గెరాల్డ్ బట్లర్ వంటి వారు చక్కగా స్కర్టులేసుకుని ఎలా ఫోజిచ్చారో ! రెండో వార్తలో … స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని పెంపొందించడానికి కొంత మంది మగవారు ఇలా స్కర్ట్ వేసుకుని ఫోజులు కూడా ఇచ్చారు. ఎంత భావ దారిద్ర్యమో కదా ! సమానత్వాన్ని సాధించాలంటే ఇలా ఆడవారి దుస్తులు వేసుకోక తప్పదా … !

ఇక పాశ్చాత్య దేశాల పత్రికలైతే వీటిని తెగ ప్రచారం చేస్తూ ఉంటాయి.  ఈ కింది చాయాచిత్రాలను చూడండి …

 

పైన ఉన్నది కూడా అమ్మాయికాదు, అబ్బాయే !  ఈ పన్నెండేల్ల కుర్రాడికి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అమ్మాయిలేమో ఎంచక్కా స్కర్టుల్లోకి మారిపోతూ ఉంటే తాను మాత్రం ఆ గొట్టాం ప్యాంట్లు వేసుకుని, చమటలు కక్కడం ఇష్టం లేదట. ఆవాతావరణములో అలాంటి ప్యాంట్లు వేసుకుంటే, ఏకాగ్రత కుదరక సరిగా చదవలేడట ! ఈ పన్నెండేల్ల వయసులో అబ్బాయికి ఎన్ని గొప్ప విషయాలు తెలిశాయి ! దీని గురించి వార్త చక్కగా ఇక్కడ చదువుకోండి…

Link: http://www.dailymail.co.uk/news/article-1385492/Chris-Whitehead-wears-skirt-school-protest-uniform-rule.html

మరో చోట,  వేసవిలో కూడా తమను షార్ట్‌స్ వేసుకోనివ్వడం లేదని అలిగిన కొంత మంది కుర్రాళ్ళు తమ నిరసనను ఈ విధంగా స్కర్ట్‌స్ వేసుకోవడం ద్వారా తెలిపారు.

అమ్మాయిలేమో ఎంచక్కా స్కర్ట్స్ వేసుకోవచ్చు, అబ్బాయిలు మాత్రం ఎంత వేడిగా ఉన్నా గొట్టాం ప్యాంట్లు వేసుకోవాలా ? మేము షార్ట్స్ ఎందుకు వేసుకోకూడదు అనేది వారి వాదన. స్కూలు అబ్బాయిలు షార్ట్స్ వేసుకోవడం నిషేదించింది కానీ స్కర్ట్స్ మీద ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. దానితో వారు అలా తమ నిరసనను తెలియ జేశారన్న మాట ! దాని గురించి ఇక్కడ చదువుకోండి …

Link: http://www.medicaldaily.com/welsh-boys-wear-skirts-school-protesting-no-shorts-policy-during-heat-how-long-until-school-uniforms

ఇలాంటి నిరసనే “స్వీడన్”్‌లో కూడా జరిగింది. అక్కడ ట్రైన్ డ్రైవర్లు కొంత మంది ఇలా షార్ట్స్ వేసుకోనివ్వడం లేదని స్కర్ట్స్ వేసుకున్నారు !   డ్రైవర్లు ప్యాంట్లుకానీ, స్కర్ట్స్ కానీ వేసుకోవచ్చు కానీ షార్ట్స్ కాదు. వేడిని తట్టుకోవడానికి మేము వేసుకుంటున్నాం అన్నది వారి మాట !

ఇక ఫ్యాషన్ షోలలో అయితే ఒకటే మెరుపులు !  స్కర్టులు  భీకరమైన డ్రెస్సులు ధరించిన మగ మోడల్లు తెగ హడావిడి చేసేస్తారు. మీడియాలో Real men wear skirts అని హెడ్డింగులు పెట్టి ఊదరగొట్టేయడాలు కామన్ !

 

ఆ తతంగమేమిటో ఒక సారి ఇక్కడ చూసుకోండి …
Link : http://junkee.com/sucked-in-guys-this-is-pretty-much-what-youll-be-wearing-this-year/27379

ఇదేనా మన దేశములో కొంత మంది అబ్బాయిలు ఇలాంటి వెరైటీ డ్రెస్సు వేసుకున్న తీయించుకున్న ఫొటో ఒకటి కొన్ని రోజులు నెట్లో హల్చల్ చేసింది ! Why should girls have all the fun అనే క్యాప్షనుతో !

ఫన్నీగా ఉంది కదా .. కుర్రోళ్ళు కేక ఫోజులిచ్చారు. క్రియేటివిటీ అదిరింది !!

ఇవన్నీ కాకుండా మా “బీయింగ్ హ్యూమన్”, “భజరంగి భాయిజాన్”, సల్మాన్ అయితే ఇలాంటి స్కర్టులు గట్రా ఎప్పుడో వేసేశాడు ఒక సాంగులో .. 😛 ఈ పాటలో 2:45 టైం దగ్గర, 3:20 టైం దగ్గర ఒక సారి గమనించండి… సల్మాన్ భాయికి షర్టూ ఫ్యాంటూ వేసుకోవడమంటే భలే చిరాకు అని గమనించగలరు 😛

సరే, ఇప్పుడు ఇవన్నీ వదిలేసి కాస్త సీరియసుగా మాట్లాడుకుందాం …

మగవారు స్కర్టు లాంటివి,  ఆడవారి డ్రెస్సులాంటి డ్రెస్సులు వేసుకోవడం కొత్తేం కాదు. స్కాటిష్ మగవారు “కిల్ట్ (Kilt)” అనే సాంప్రదాయ దుస్తులు ధరించేవారు.  ఇవి వారి సాంప్రదాయ దుస్తులు అనేది మనం మర్చిపోకూడదు ..!

 

 

ఫిజి దేశములో అయితే పోలీసులు, చివరకి ఆర్మీ వాల్లు కూడా ఈ స్కర్ట్స్ వేసుకుంటారు. దీన్నే “సులు (Sulu)” అంటారక్కడ.

కింద బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న పోలీసులని చూశారుగా ! భలే ఉన్నారుగా దొంగలను పట్టుకోవడానికి ఎలా పరిగెడతారో ఏమో మరి ??

ఇదే కాక, ఫిజీ దీవుల్లోని గ్రామములో అయితే ఆదివారం ఖచ్ఛితంగా ఈ Sulu వేసుకోవాలని మత పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం పవిత్రమైనది అట. ఆరోజు ప్రభువును సేవించుకోవడానికే తప్ప మరే పనులూ చేయకూడదని లేదంటే దేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని  ఆ  అదేశాలు జారీ చేశారు అక్కడ. ఆ వార్తను ఇక్కడ చూడండి …

Link:  http://www.heraldsun.com.au/news/tiny-fijian-island-bans-mens-pants-on-sundays/story-e6frf7jo-1225763255884

ఒకానొక వెబ్‌సైటులో చెప్పిన దాని ప్రకారం అక్కడ మగవారు ఈ Sulu వేసుకోవడమే కాదు, తల్లో పూలు కూడా పెట్టుకుంటారట !

If you see two men, wearing skirts and with flowers in their hair, holding hands in the street, do not assume they are gay. They are not called skirts, by the way – they are sulus. For work and formal occasions they are mainly plain grey, brown or blue. At home or informally, they may wear more colourful designs. If your children are going to go to school there, the boys may have a choice of wearing shorts, long trousers or sulus. Before they go they will probably swear an oath that they will never wear a sulu to school. After about a week they will change their mind.

Link: http://www.blue-oceans.com/ohana/fiji_expat.html

వీల్లే కాదు “సమోవ (Samoa)”  ఆనే దేశములో కూడా పోలీసులు స్కర్ట్స్ వేసుకుంటారు.

 

వీరేకాదు “అల్బేనియన్” సైనికులు కూడా ఇలా స్కర్టులాంటి దుస్తులని వేసుకునే వారు. దాని పేరు “ఫుస్టానెల్లా (Fustanella)”.  ఈ తరహా దుస్తులు దాదాపుగా చాలా మంది రాజులు వేసుకునే వల్లనుకుంటా !

 

 

అక్కడెక్కడికో ఎందుకు మన భారతదేశానికి వద్దాం ! రాజులు ఒకప్పుడు వేసుకున్న దుస్తులు కాస్త పంజాబీ డ్రెస్సుల్లా ఉండేవా కాదా !

 

 

రాజులను వదిలేసి ఈ కాలానికి వస్తే ఇప్పటికీ పల్లెల్లో మగవాల్లు లుంగీలు కట్టడం కామనే కదా !  లుంగీ పైకెత్తి కట్టి పనులకు వెల్లే మగవారు కోకొల్లలు !  తమిళనాడు అంటేనే లుంగీ గుర్తుకు వస్తుంది కొంత మందికి, ఇది దాదాపుగా ఆడవారి డ్రెస్‌ను పోలి ఉండేదే కదా … కిందికి దించితే చీర, పైకి ఎత్తి కడితే స్కర్టూ…  🙂 😛

సడనుగా జనాలందరూ ఇలా స్కర్టుల మీద ఎందుకు పడ్డారంటారు ? ఒకరేమో, ఇది ఫ్యాషన్ అంటారు. మరొకరేమో నిరసన అంటారు. పన్నెండేల్ల కుర్రాళ్ళకు నిరసన తెలియ జేయాలని ఎందుకు అనిపించింది ? అది పేపర్లో అంత ప్రముఖంగా ఎలా రాగలిగింది ? సెలబ్రిటీలను మొదలుకొని, సినిమా హీరోల వరకూ ఎందుకు వాటిని ధరిస్తున్నారు ?  “మీరు స్కర్టులు వెసుకోగల మగతనం కలవారా”  అనే పిచ్చి ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, అవి మీడియాలో ఎందుకు వస్తున్నాయి ?

అబ్బో దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. దాని కన్నా పెద్ద సిద్దాంతం ఉంది. సదరు “జెండర్” అనేది సామాజిక నిర్మాణం అంటే (తెలుగులో సోషియల్ కన్‌స్ట్రక్ట్) అని స్త్రీవాద, వామపక్ష వాద మేధావుల ఉవాచ. ఆ ఉవాచలేవో ఉవాచించి ఊరుకోరుకదా వారు ! దాన్ని సమాజం మీద ప్రయోగిస్తారు. ఆ ప్రయోగములో భాగమే ఇదంతా అని మా డౌటనుమానం !

మగవారు ప్యాంటూ షర్టూ ఎందుకు వేసుకోవాలి, ఆడవారు స్కర్టులు మాత్రమే ఎందుకు వేసుకోవాలి. మగవారు స్కర్టులు వేసుకుంటే తప్పేమిటి ? ఇలాంటి ప్రశ్నలు వేసి ఊరుకోక, మగవారిని చేత కూడా ఇలాంటివి వేయించాలని కంకణం కట్టుకున్నారన్న మాట.

స్త్రీవాదులు,  వామపక్ష వాదులూ ఇలాంటివి అనుకున్న తరువాత, వారు దాన్ని లోపాయకారిగా పత్రికలలో,  ప్రసార మాధ్యమాలలో,  సీరియల్లలో, నవల్లలో ఒకటేమిటి ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా వాడేస్తారు. వాల్లకు నిధులు కూడా బ్రహ్మాండంగా ఉండడముతో కొన్నింటిని స్పాన్సర్ కూడా చేసేస్తారు. ఎవరో ఒక స్త్రీవాద, వామపక్ష ఫ్యాషన్ డిజైనర్ల చేత ఇలాంటి డ్రస్సులు మగ మోడల్లకు వేసి ర్యాంపుపై పిల్లినడకలు నడిపించేస్తారు.

సెలబ్రిటీల చేత, మరికొంత మంది సినిమా వాల్ల చేత ఇలాంటి దుస్తులు వేయించి … చూశారా ఇదో కొత్త ఫ్యాషన్ అని ఊదరగొడతారు.  ఒక్కసారి ఫ్రాన్సులోనో, అమెరికాలోనో కొంత మంది సెలబ్రిటీలు ఈ పనులు చేయగానే మన దేశీయ అనుకరణ పిల్లులు (అనగా తెలుగులో కాపీ క్యాట్స్) దాన్ని ఫాలో అయిపోతారు. ఇక్కడున్న స్త్రీవాద, వామపక్ష వాద మేధావులు కూడా పత్రికలలో మీలో వీటిని ధరించేంత మగతనం ఉందా? మీలో ఆ ఆదర్శ భావాలు, అభ్యుదయ భావాలూ ఉన్నాయా అని పేపర్లలో తెగ ఆర్టికల్సు రాసేస్తారు !

మీకు నమ్మకం లేదా ?  నేను మరీ వారి మీద నిందలు వేస్తున్నాను అని మీ ఫీలింగా అయితే ఒక సారి యూనిసెక్స్ Unisex ఫ్యాషన్ మీద వచ్చిన ఈ ఆర్టికల్ ఒక సారి చదవండి.  సదరు భావజాలం పట్టువదలని విక్రమార్కునిలా, నిరాశ చెందని ఘజనీలా ఎన్ని దండయాత్రలు చేసిందో ఇప్పటి వరకూ మీకే తెలుస్తుంది.

A Brief History of Unisex Fashion

సో, నేను చెప్పొచ్చేదేమంటే … మగవారు స్కర్టు వేసుకోవడం తప్పు కాదు. అలా అని అది వేసుకునే దమ్ము ఉందా, Are you enough man to wear it అనో రెచ్చగొట్టేట్టు మాట్లాడడమూ మంచిది కాదు.  ఒక్కో దేశములో ఒక్కో సంస్కృతికి తగ్గట్టుగా వస్త్రధారణ ఉంటుంది.  కొన్ని చోట్ల మగవారు స్కర్టులు బ్రహ్మాండంగా వేసుకుంటారు. మరోచోట వేసుకోవాడానికి ఇష్టపడరు. మగవారు స్కర్టు వేసుకోవడం “స్త్రీ – పురుషుల” సమానత్వానికి ఏవిధంగానూ దోహద పడదు. పైపెచ్చు, అది కేవలం వెక్కిరించినట్టుగా మాత్రమే ఉంటుంది.  పైగా జెండర్ అనేది సమాజ నిర్మితం కాదు, బయోలాజికల్.  కాబట్టి,  ఈ యూనిసెక్స్ ఫ్యాషన్లు లాంటి పిచ్చి పనులు దాన్ని మార్చలేవు.  అనవసరంగా మీ అయోమయముతో ప్రజల్ని అయోమయానికి గురిచేయకండి.

ఒక వేల మగవారు స్కర్టు వేసుకోవాలని అనిపించి వేసుకుంటే, నేను పూర్తిగా సమర్ధిస్తా !  మగవారి దుస్తులు మగవారి ఇష్టం. కానీ, ఈ తరహాలో “స్కర్టు వేసుకునేంత మగతనం ఉందా?” అనో, నిజమైన మగవారు స్కర్టులు వేసుకుంటారు అనో తిరోగమన వాదాలు చేయదలిస్తే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తా !

నాకు సంబందించినంత వరకూ …

Yes, I am man enough to wear skirts but I don’t wear it to prove that stupid “Man thing”.
Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2016/06/17/%e0%b0%ae%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%a7%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%87%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ae%e0%b0%97/trackback/

RSS feed for comments on this post.

5 Comments

 1. బ్రతికించారు :p

  Like

 2. కానీ మీరు ఇక్కడ వేసిన ఫోటోలు మాత్రం జనాల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి:-)కొంచెం వెరైటీ దురదున్న మగంగులు చూస్తే రెచ్చిపోయి తొడగడం ఖాయం:-(

  Like

 3. @నీహారికహ హ.. ఎంత కాలం? మహా అయితే ఒక ఐదేళ్ళు లేదా పదేళ్ళూ అందరం బలికాక తప్పదు, చూస్తూ ఉండండి .. అబ్బాయిలు స్కర్టులు, మాక్సీలూ వేసుకుని తిరుగుతారు 🙂

  Like

 4. @Haribabu Suranenii,ఎంతైనా ఫ్యాషన్ డిజైనర్లు డిజైన్ చేసినవి కదా, అలానే ఉంటాయి :-)కాకపోతే పైన చెప్పిన వాటిలో స్కాటిష్ మగవారు ధరించే కిల్ట్ కు బాగా డిమాండ్ ఉండేదట. ఇప్పటికి కూడా దాన్ని కొనాలంటే బాగా కర్చు పెట్టాలి. అయినా కొంత మంది కొనే వారున్నారు 🙂

  Like


Comments are closed.

%d bloggers like this: