హిందూ మతంపై జకీర్ నాయక్, అతని శిష్యుల హాస్యాస్పద దాడి !

Update: బంగ్లాదేశ్‌లో జరిగిన తీవ్రవాద దాడుల తరువాత ఒక పేరు బయటకి వచింది. అదే “జకీర్ నాయిక్”.  అతను టెర్రరిస్టులను ప్రోత్సహించే విధంగా ప్రసంగాలు చేశాడని కొంత మంది, కాదని కొంత మంది అంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, అతని మీద అనుమానం ఉన్నట్టు మేము చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ, జకీర్ నాయక్ ప్రసంగాలు అతివాదానికి దగ్గరగానే ఉంటున్నాయి.

ఇతర మతాలను నిందించడం, వారిని తప్పులు పట్టడం, ఇస్లాములో కూడా కాస్త భిన్న అభిప్రాయాలు ఉన్నవారిని ముస్లిములు కాదనడం వంటివి ఆయన ప్రసంగాలలో మనం చూడొచ్చు. ప్రస్తుతం NIA జకీర్ నాయక్ ప్రసంగాల పరిశీలిస్తోంది. ప్రభుత్వం కూడా సీరియసుగానే తీసుకుంటోంది. ఆయన నడుపుతున్న “పీస్ టీవీ”కి ఇండియాలో అనుమతులు లేవని, దాన్ని ప్రసారం చేయడం నేరమని తేల్చింది.

ఇది వరకు నేను జకీర్ నాయక్ మీద రాసిన రెండు ఆర్టీల్లు మళ్ళీ  ప్రచురిస్తున్నాను చూడండి !!


Posted on July 12, 2015 at 9:22 am

ప్రస్తుతం మనం బ్లాగులో ఒక వింత వాదనను చూస్తున్నాం. హిందూ మతములో అసలు విగ్రహారాధనేలేదని, బహుదేవతారాధన మహాపాపమని, ఇంకొంచెం ముందుకు వెల్లి అది ఆధ్యాత్మిక వ్యభిచారమనీ తేల్చేస్తున్నారు. దానికి వారు చూపిస్తున్న సాక్షాలు కూడా వేదాలు, అందులోని ఉపనిషత్తులూ, భగవద్గీతనే. అఫ్ కోర్స్, అవన్నీ కేవలం వక్రీకరణలూ, అర్థసత్యాలేలెండి.

అసలు వీరి ముఖ్య ఉద్దేశ్యమేమిటి? ఎందుకు ప్రస్తుతం వీరు హిందూ మతములో కేవలం ఏకేశ్వరోపాసన మాత్రమే ఉందనీ, విగ్రహారాధన పూర్తిగా నిషిద్దమనీ ప్రచారం చేస్తున్నారు ? దీనికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. వారి ముఖ్య ఉద్దేశ్యమేదో మనం సులువుగానే చెప్పేయొచ్చు. తమ మతమే గొప్పదనీ అన్ని మతాలవారూ అనుకుంటారు. అలానే వీరూ అనుకుంటున్నారు. కాకపోతే కొన్ని మతాల వారు ఇతర మతాలలోని వారిని మత మార్పిడుల ద్వారా తమ మతములోనికి చేర్చుకోవాలని అనుకుంటారు. మరికొందరు అవేమీ పట్టించుకోకుండా వదిలేస్తారు. భారత దేశం అనేది మత మార్పిల్లకు ఎప్పటునుండో వేదికగా మారింది.

ఈ మతమార్పిడికి ఒక్కోక్కరు ఒక్కోపద్దతిని ఎంచుకుంటూ ఉంటారు. కొంత మంది, హిందూ దేవుళ్ళు మహిమలేని వారనీ, వారు దెయ్యాలనీ, వారు ఇతరులను చంపమని బోధిస్తారనీ, దేవాయలయాల మీద కూడా ఈతరహా శిల్పాలే ఉంటాయని, తమ దేవుడు మాత్రమే ప్రేమను పంచే దేవుడని, ప్రజలందరికోసం ఆయన రక్తాన్ని చిందించాడనీ, మనందరి కోసం కూడా ఆయన రక్తాన్ని ఇదివరకే చిందించాడనీ భరోసా ఇచ్చేస్తూ, తమ మతములోని రమ్మని ఆహ్వానించడం చూడొచ్చు. మరికొంత మంది అయితే ఎవరికైనా కళ్ళూ, కాళ్ళూ పోయుంటే వారిని, స్టేజి మీదకి రప్పించేసి, వ్యాధులేమన్నా ఉంటే నయం చేసి పంపేస్తూ ఉంటారు. ఆపని వారు ఎలా చేస్తారు అని తెలుసుకోలేనంత అమాయకులు ఇక్కడ ఎవరూలేరనుకోండి. కాకపోతే అదొక పద్దతి. ఇలా ఎవరి పద్దతులు వారికుంటాయి.

ఇప్పుడు నేను చెబుతున్న పద్దతి పాటించేవారు చేసేదేమంటే, దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయన మనందరికీ దేవుడు, మన పవిత్ర గ్రంధాలన్నీ ఇవే విషయాన్నే చెప్పాయి అని చెబుతారు. నిజానికి ఇందులో వ్యతిరేకించాల్సింది ఏమీలేదు. దేవుడు ఎవ్వరికైనా ఒక్కడే అంటే ఎలా తప్పు పట్టగలం చెప్పండి? కానీ, అక్కడితో ఆగరుగా వీరు. దేవుడు ఒక్కడే, ఆయనకు రూపం లేదు కావాలంటే మీ వేదాలలో కూడా ఇదే చెప్పబడి ఉంది అని చెబుతారు. అంతటితో ఆగక, ఆ సిద్దాంతాన్ని బేస్‌గా చేసుకుని, మనం దేవుడు అనుకుంటున్న కృష్ణుడు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు గట్రా దేవతలంతా నిజానికి దేవుళ్ళు కాదని, వారిని ఆరాధించడం ఆధ్యాత్మిక వ్యభిచారమనీ తేల్చేస్తారు. ఎందుకంటే, దేవునికి రూపంలేదు అని వేదాలు చెప్పాయి (అని వీరు చెబుతున్నారు). మరి ఈ దేవుల్లందరికీ ఏదో ఒక రూపం ఉంది. కాబట్టి వీళ్ళు దేవుళ్ళు కాదనీ, మహా అయితే దేవుడు పంపిన దూతలయ్యుండొచ్చనేది వీరి బ్రహ్మాండమైన థియరీ.

ఇక్కడ విషయం ఏమిటంటే, వీరి మతం, ఇస్లాం ప్రకారం కూడా దేవుడు ఒక్కడే. విగ్రహారాధన నిషిద్దం. వారి మతం ప్రకారం దేవుడు ఇదివరకు ఎంతో మంది ప్రవక్తలను పంపించి ఉన్నాడు. వారిలో మహమ్మద్ ప్రవక్త చివరి వాడు. ఆయన తరువాత ఇంకెవరూ రాలేదు. అలానే దేవుడు అనేక గ్రంధాలను ఇచ్చియున్నాడు. ఖురాన్ చివరిది (ఈ విషయం నేను అనుకుంటున్నది. ఖురానులో అలా ఉందో లేదో నాకు ప్రస్తుతం అయితే తెలీదు). మన వేదాలలో, ఆమాటకొస్తే అన్ని పవిత్ర గ్రంధాలలో దేవుడుగా చెప్పబడుతున్న “నిరాకార శక్తి” అల్లాహ్ నే. ఈపుస్తకాలన్నీ అల్లాహ్ గురించే వివరించాయి అని ఖురానులోని సూక్తులూ, బైబిలులోని సూక్తులూ, భగవద్గీత, వేదాలలోని సూక్తులూ ఒకచోట చేర్చి అందంగా, ప్రేమగా విశదీకరికరిస్తారు … ఏమని విశదీకరిస్తారంటే, దేవుడు అల్లాహ్ మాత్రమేనని, దేవుళ్ళు అని మనం అనుకుంటున్న వారంతా కేవలం అల్లాహ్ దూతలు మాత్రమేనని.

ఈ గొప్ప ఫిలాసఫీలో భాగంగానే, మొదటగా వీరు హిందూ మతమూ, ఇస్లామూ, క్రిష్టియానిటీ ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయనీ, గీత బైబిలు ఖురానూ అన్నీ మన ఉమ్మడి గ్రంధాలనీ ప్రేమను కురిపిస్తారు. కానీ, ఆయా పవిత్ర గ్రంధాల ప్రకారం మనం నిరాకారుడైన దేవుడిని మాత్రమే ఆరాధించాలని మనకు తెలియజేస్తారు. అలా ఆరాధించకపోతే, అది ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుందని నిందలు కూడా వేస్తారు. నరకానికీ, చీకట్లలోకి ఎక్కడికెక్కడికో పోతారని తెలియజేస్తారు. శ్రీ కృష్ణుడూ, రాముడూ, శివుడు, వినాయకుడు వీల్లంతా దేవుల్లు కాదనీ, వారిని పూజించాల్సిన అవసరం లేదనీ, నిరాకార బ్రహ్మన్‌ను మాత్రమే పూజించాలనీ “మన మత గ్రంధాల ప్రకారమే” ప్రూవ్‌చేసి, మనల్ని ప్రేమతో అంగీకరింపజేస్తారన్న మాట.

తరువాత, మా దేవుడు, మీదేవుడూ ఒక్కడే, మీ గ్రంధాలన్నీ పాత గ్రంధాలు, కొత్త నిబంధనలతో దేవుడు పంపించిన మా పవిత్ర గ్రంధం ప్రకారం మీరుకూడా నడుచుకోండి అని మనకు సేం టు సేం ప్రేమను కంటిన్యూ చేస్తూ తెలియపరచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, వీరు మన మీద బోలెడంత ప్రేమ కురిపిస్తారు. కానీ, ఆ ప్రేమ మన ఆచారాల్నీ, పద్దతులనీ గౌరవించడానికి కాదు, వాటిని వదిలేసి వారి మత గ్రంధాల ప్రకారం, ప్రోఫెట్ చెప్పినదాని ప్రకారం మనం నడుచుకునేలా చేయడానికి మాత్రమే అని నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా !

ఈ తరహా బోధనలు, ఉపన్యాసాలూ ఇవ్వడములో జకీర్ నాయక్ అనే ధార్మిక గురువు బాగా పేరుగడించాడు. తన అర్ధ ఙ్ఞాణముతో, స్ట్రీట్ స్మార్ట్ యాటిట్యూడుతో, భగవద్గీత, వేదాలలోని శ్లోకాలను వక్రీకరించడమో లేదా సగం శ్లోకాలను మాత్రమే తీసుకుని వచ్చి తన ఎజెండాను ప్రచారం చేయడములోను బాగా పేరుగడించాడు. కొంత మంది ఆయనతో చర్చకు దిగగానే ఆయన వారిని మాట్లాడనివ్వడు. తానే అన్నీ మాట్లాడేస్తాడు, ఇంతలోనే పక్కలో ఉన్న నిర్వాహకులు లేదా వాలంటీర్లు చర్చిద్దామని చూసిన వ్యక్తిని పక్కకు తీసుకొని వెలతారు. జకీర్ నాయక్ వేదాలలోనుండి, భగవద్గీతనుండి కోట్ చేసిన అనేక శ్లోకాలను, అంతర్జాలములో చూడొచ్చు. వాటికి కౌంటరుగా అనేక మంది, జకీర్ నాయక్ కోట్ చేసిన శ్లోకాలన్నీ  ఉద్దేశపూర్వకముగా వక్రించినవేనని నిరూపించడం కూడా మనం చూడొచ్చు.

జకీర్ నాయక్‌ను, ఒకానొక అమ్మాయి ప్రశ్నిస్తే ఆయన చిరాకు పడ్డాడో చూడండి. ఆయన భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చూపించి అది బహుదేవతారాధనా, విగ్రహారాధనను చేయవద్దని చెబుతోందని చెబుతున్నాడు. నిజానికి ఆశ్లోకం అర్థం అది కానేకాదు. ఈ విడియో చూడండి .. మీకే తెలుస్తుంది.

ప్రశ్న అడిగిన అమ్మాయి ఎంతో వినయంగా, సంస్కారవంతంగా అడిగితే ఈయన మహా చిరాకుకా, అహంకార ధోరణిలో సమాధానం ఇవ్వడం చూడొచ్చు. ఈ విడియోలోనే, జకీర్ నాయక్ కోట్ చేసిన శ్లోకాల అర్థం వివరించడం జరిగింది. ఒక సారి వీడియో చూడండి.  అదీ కాక భగవద్గీతలోనే “నిరాకార భ్రహ్మన్”ను కొలవడం కష్టమని, దానికి బదులు తననే కొలమని సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెబుతాడు. మరి ఈయనకి ఆ శ్లోకం కనిపించలేదా? స్ట్రీట్ స్మార్ట్ యాటిట్యూడ్‌ను ప్రదర్శించి, ఏదో ఒక శ్లోకాన్ని ర్యాండముగా తీసుకుని, దాని అర్థాన్ని వక్రీకరించో, ఆ శ్లోకాన్ని వాడిన కాంటెక్స్‌ట్‌ను వదిలేసి తనకు అనుకూలమైన రీతిలో దాన్ని ఉపయోగించుకొని, తానో మేధావినని ఆయన ఇతరులను భ్రమింపజేస్తూ ఉంటాడు.ఆ భగవద్గీత శ్లోకాల గురించి నేను రాసిన పోస్టు చదవండి.

భగవద్గీతలో “విగ్రహారాధన” మేలని చెప్పడం జరిగిందా !? వేదాల ప్రకారం దేవునికి రూపం ఉందా !?

ఇంతేకాదు, ఈయన గురించి NDTV వార్తలలో కూడా చెప్పడం జరిగింది. అనేక మంది ముస్లిం స్కాలర్లు కూడా ఈయన చెప్పే విషయాల్ని విభేదించారు. కొంత మంది ఈయనకు వ్యతిరేకంతా “ఫత్వా” కూడా జారీ చేశారు.

శ్రీ జకీర్ నాయక్‌గారు ఒసామా బిన్ లాడెన్ అభిమానికూడా అనిచెప్పొచ్చు. ఆయన ప్రకారం ఒసామా బిన్ లాడెన్, ఇస్లాం శతృవులపై పోరాడుతున్నాడు. అవసరమైతే ప్రతీ ముస్లిం ఒసామా బిన్ లాడెన్‌లా మారాలని ప్రవచిస్తున్నారు. చాలా మంది సెక్యులరిస్టులు కూడా ఇతన్ని వ్యతిరేకించారు. వారు చెప్పేదేమిటంటే, హిందూత్వ అతివాదులు ఏవిధంగా ప్రమాధకరమైన వారో, జకీర్ నాయక్ కూడా అటువంటీ వాడేనని ఒకావిడ ఆ ప్రోగ్రాములోనే చెప్పడం మనం గమనించవచ్చు. NDTVలో వచ్చిన ఆ ప్రోగ్రం ఇక్కడ చూడండి.

కాకపోతే, ఇంటర్నెట్లో ఈయన శిశ్యులు చాలామందే ఉన్నారు. ఈయన అడుగుజాడలలోనే ఆయన శిశ్యులు చాలా మంది నడుస్తున్నారు. ఏ ఆన్‌లైన్ ఫోరముకు వెల్లినా వాల్లు ప్రత్యక్షమై జకీర్ నాయక్ కోట్ చేసిన కొన్ని అర్ధ “శ్లోకాలని” కోట్ చేసి, హిందూ మతం బహుదేవతారాధననూ, విగ్రహారాధననూ నిషేధిచిందని నిరూపించడానికి నానా ప్రయాసా పడుతూ ఉంటారు.

ఇంకో విషయం, జకీర నాయక్ గారి వచనాల ప్రకారం హిందూ – ముస్లిముల మధ్య ఐక్యత రావాలంటే, హిందువులు బహుదేవతారాధనను వదిలేయాలి, విగ్రహారాధనను వదిలేయాలి. అప్పుడు వారు ఎంతో ప్రేమతో హిందువులను దగ్గరకి తీసుకుంటారు. అఫ్ కోర్స్, దాని తరువాత హిందువులు అల్లాహ్‌ను దేవుడు అని అంగీకరించాలేమో !ఈ తరహా కండీషన్లతో కూడిన ప్రేమ మనకు అవసరమా ? ఈ తరహా కండీషన్లతో కూడిన సఖ్యత అవసరమా ? వీరు సఖ్యతగా, ప్రేమగా ఉండాలంటే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, నిజానికి వీరు తెలిచిన తలుపునే పదే పదే తడుతున్నారు. కానీ, ఆ ద్వారం నుండి వీరు లోపలికి రావాలంటే మాత్రం మా సాంప్రదాయాలనూ, మా ఆచారాలనూ, మా విధానాలను గౌరవించాల్సి ఉంటుంది. వీరు పాటించక్కర్లేదు, గౌరవిస్తే చాలు, అలానే మేము కూడా వారి విధానాలనూ గౌరవిస్తాం, పాటించము. మనుషులుగా మనం ఈ మాత్రం మెచ్యూరిటీ సాధించాల్సిందే.

పోనీ, హిందువులు వారు చెప్పినవిధంగానే ఏకేస్వరోపాసన చేస్తూ, విగ్రహారాధనను ఖండిస్తే, ఐక్యత ఉంటుందా? లేదు. ఎందుకంటే, ముస్లిములలోనే ఐక్యతలేదు. ఇరాక్ – ఇరాన్, పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ ఇలా ప్రపంచములో అనేక చోట్ల ముస్లిములు ముస్లిములే కొట్టుకుంటు ఉంటారు. దేవుడు ఒక్కడే, పవిత్ర గ్రంధం ఒక్కటే అయినా ఐక్యతలేదు. మరి ఇప్పుడు హిందువులు తమ విధానం మార్చుకుంటే మాత్రం ఐక్యత వస్తుందా? మనిషి ఎదగనంతవరకూ ఐక్యత రాదు. ఐక్యతకు కావలసింది అందరూ ఒకే విధానాన్నీ, మతాన్నీ పాటించడం కాదు, వివిధ విధానాల పట్ల, మతాల పట్లా సహనం. అదే ఐక్యతను తెస్తుంది. అదిలేనంతవరకూ ఐక్యత రాదు.

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2016/07/09/%e0%b0%b9%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%82-%e0%b0%ae%e0%b0%a4%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9c%e0%b0%95%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e0%b0%95%e0%b1%8d-%e0%b0%85/trackback/

RSS feed for comments on this post.

5 Comments

  1. ఇప్పుడు నెట్ ప్రపమ్చం కదా . ఈశక్తులు ఇక్కద బలంగా పనిచేస్తున్నాయి. హైందవభావజాలం ఉన్నవారు కాస్త బద్దకం వదిలించుకుని ఏంజరుగుతుందో చూడాలి. తమస్పందనలు అనేకవేికలపై వ్యక్తం చేయాలి.

    Like

  2. This comment has been removed by the author.

    Like

  3. మీరు ఒకటి అర్ధం చేసుకోవాలి. జాకీర్ నాయక్ ఒక బఫూన్ అన్నదాన్ని ఘనతవహించిన ఇస్లామీయ మత గురువులే చెబుతున్నారు (కొంచెం గూగులించండి). ఇలాంటి mediocre జనాలు మనదేశంలో పాపులర్ ఎందుకౌతారంటే, మన ఫాలోయర్లకి అటు సాయిస్నూ, ఇటు వాళ్ళ సొంతమతమూ అర్ధమై ఛావదు. వీళ్ళకి సంస్కృత ఫాసినేషన్ ఒకటుండి చస్తుంది. దాంతో వీళ్ళు చదివిన శ్లోకాలని వీళ్ళకి అర్ధమైన మరియు అనువైన రీతిన అనువదించుకొని “పుడింగుల్లాగా ఎచ్చులుపోతుంటారు”. ఇలాంతి ఎచ్చులుకోరోళ్ళమీద మీరు మరీ సీరియస్‌గా రియాక్టవుతున్నాను ఆచార్య. కొంచెం వెటకారాన్ని, వ్యంగ్యాని కలిపి రియాక్టవ్వంద్డి. వీళ్ళు తలలని ఎక్కడపెట్టుకోవాలో తెలియక సతమతమౌతారు.దుర్గేశ్వర లాంటివాళ్ల భావాలు మీమీద పడనివ్వకండి. వీళ్ళు హిందూమతంలోని జాకీర్ నాయక్‌లు

    Like

  4. అందరూ ఒకే మతాన్ని,ఒకే విధానాన్ని పాటించడం కష్టం.ఎవరయినా ఒకే మతం కోసం,ఒకే విధానం కోసం ప్రయత్నిస్తున్నారు అంటే వారు దేవుళ్ళే !అసాధ్యమైన కలలు కనవచ్చు కానీ ఆచరణ లో సాధ్యం కానిదేమీ లేదు.రిజర్వేషన్ల గోల ఉండదు కదండీ ? రిజర్వేషన్లు పోతాయంటే విగ్రహారాధన మానేస్తే పోయేదేముంది ?

    Like

  5. neehaarikaరిజర్వేషన్లు పోతాయంటే విగ్రహారాధన మానేస్తే పోయేదేముంది ?haribabuవిగ్రహారాధన మానేస్తే గడ్డం పెరుగుతుంది,గోక్కోలేక చావాలి – ఎందుకొచ్చిన గోల?!

    Like


Comments are closed.