ఫాదర్స్ డే – కొన్ని చిత్రాలు, ఒక విడియో, – ఒక గొడవ !!


Update: ఫాదర్స్ డే సందర్భంగా పాత టపానే మళ్ళీ ఒక సారి !  అన్నట్టు, ఈ టపాలో ప్రస్తావించిన గొడవలో ఎలాంటి మార్పూలేదు. ఆ రచ్చ అలా కొన సాగుతూనే ఉంది. సో, ఈ పోస్టు ఈరోజు కూడా  అర్థవంతమైనదే !


Happy Father’s Day to All.

ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని మంచి కొటేషన్లు,  ఫొటోలు, విడియోలు చూశాను.  అలానె ఒక గొడవ కూడా చూశాను. ముందుగా ఆ మంచి చిత్రాలు, విడియోలూ మీకోసం.

హృదయానికి హత్తుకొనే ఒక విడియో

ఇప్పుడు గొడవకు వద్దాం.

ఏంజెల్ సాఫ్ట్ అనే కంపెనీ, ఫాదర్స్ డే సంధర్భాన్ని పురష్కరించుకొని ఒక వాణిజ్య ప్రకఠనను రూపొందించింది. ఆ ప్రకఠనలో అది.. “Happy Father’s Day, Mom” అని చెప్పింది. అంతే ఒక్కసారిగా తండ్రుల హక్కుల కోసం పోరాడుతున్నవారు బగ్గుమన్నారు.  ఇందులో తప్పేముంది అంటారా? ముందు ఆ విడియో చూడండి, తప్పుందో లేదో తరువాత చెబుదురు..!

అదీ విషయం. ఆ విడియో చేసింది ఏమిటంటే, ఫాదర్స్ డే రోజు “Single Mothers” ని పొగుడుతూ, తండ్రులను ఎత్తిపొడిచే ప్రయత్నం చేశారు.  సింగిల్ మదర్స్, తమ పిల్లలను కష్ట పడి పెంచుతున్నారని చెబితే అందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏమీలేదు.  కానీ, దానికి “ఫాదర్స్ డే” ను వేదికగా చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది వారి పాయింట్.  మదర్స్ డే ఎలానూ ఉండనే ఉంది. దాన్ని ఎవరూ హైజాక్ చేయడం లేదు కదా? అంతగా వారికి ఒక ప్రత్యేక దినం కావాలంటే.. “సింగిల్ మదర్స్ డే” అని ఒక కొత్త రోజును క్రియేట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు. “ఫాదర్స్ డే” రోజు తండ్రులను కించ పరిచేలా మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నది వారి వాదన.

కొంత మంది తండ్రులు, కేవలం జన్మను మాత్రమే ఇస్తారు. తరువాత తండ్రిగా తమ బాధ్యతలు నిర్వర్తించరు. అది నిజమే. కానీ, “ఫాదర్స్ డే” అనేది అలాంటి వారికోసం ఏర్పాటు చేసింది కాదు. అనేక మంది తండ్రులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఈ “ఫాదర్స్ డే”ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాన్ని, విషతుల్యం చేయాల్సిన అవసరం లేదు, అన్నది వారి వాదన.

నాకైతే వారి వాదన సబబుగానె అనిపిస్తోంది. సింగిల్ మదర్స్కు వ్యతిరేకంగా మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. Leave Father’s Day, Have your own day అని చెప్పడం మాత్రమే వారి ఉద్దేశ్యం, నా ఉద్ద్దేశ్యం.

Source:
‘Happy Father’s Day, Mom!’ Angel Soft Ad Causes Unexpected Outrage: Justified?

Published in: on June 19, 2016 at 9:00 am  Comments (2)