పుష్పక విమానం – నా ఫేస్‌బుక్ పేజీ !


బ్లాగుల్లో రాస్తే ఆ సుఖమే వేరు. మనకు కావలసింది, కావల్సినట్టు రాసుకోవచ్చు. కానీ, ఈ మధ్య ఫేసుబుక్కే ఎక్కువగా వాడుతున్నారు అంతా ! బ్లాగులు నిదానంగా తమ ప్రభను కోల్పోతున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే… నేనూ మార్గదర్శిలో చేఅరా ఒక ఫేసుబుక్కు పేజీ ఓపన్ చేశా 😀

పుష్పక విమానం – ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా, మాట్లాడుకోవడానికి ఇంకో టాపిక్ ఎప్పుడూ ఉంటుంది !

వీలైతే ఒక లుక్కేయండి. దాన్ని రెగ్యులరుగా అప్‌డేట్ చేయడం నాకు ప్రస్తుతం కుదరని పనే అయినా, చాలా మంది జాయిన్ అయ్యే వకాశం ఉంది కాబట్టి.. కొంత కాలానికి రెగ్యులరుగా అప్‌డేట్స్ పెడుతూ ముందుకు సాగుతామని మాత్రం చెప్పగలను. దాదాపుగా అది ఒక మ్యాగజైనులా నడపాలన్నది నా కోరిక. త్వరలో దాన్ని పూర్తి స్థాయిలో .. నడపగలిగే శక్తి సామర్ధ్యాలూ సమీకరిస్తానని చెప్పగలను !

ఇప్పటివరకూ రాసిన అన్ని టపాలూ … 

Advertisements
Published in: on February 2, 2017 at 3:02 pm  Comments (2)  
Tags:

“పార్లమెంట్” వద్ద పురుష హక్కుల కార్యకర్తల ఆందోళన … ఫొటోలు, ట్వీట్లు..!!


 IrBM – Irretrievable breakdown of marriage – అంటే, వివాహం బంధం ఇక ఎంతమాత్రం కొనసాగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి వస్తే విడాకులు ఇచ్చేయడం తప్పు కాదు అన్నది ప్రస్తుతం హిందూ వివాహ చట్టములో చేస్తున్న మార్పు. ఇది వరకు అలాంటి పరిస్థితి లేదు. అది మంచిదేగా అంటారా? అక్కడే ఉంది అసలు మెలిక. విడాకులు తీసుకోవచ్చు అని ఊరుకోవడములేదు. విడాకుల తరువాత స్త్రీకి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండడానికి ఆవిడకు భరణం ఇవ్వాలి అంటున్నారు. అది న్యాయమైన డిమాండే. నిజానికి మనకు ఈ భరణానికి సంబందించిన చట్టం ఉంది. దాని ద్వారా మరియూ DV Act ద్వారా కూడా స్త్రీ భరణం కోరవచ్చు. పురుషుడు చెల్లించాల్సిందే. కానీ, ఇప్పుడు ఇవన్నీ కాదు, భార్యకు భర్త ఆస్థిలో వాటా ఇవ్వాలి అంటున్నారు. అదీ అసలు చిక్కు.

ఇక్కడ భర్త ఆస్థి అంటే, మగాడు పెళ్ళైన తరువాత సంపాదించినది + పెళ్ళికాక మునుపు సంపాదించినది + అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్థితో కలిపి అని గ్రహించగలరు. అతని ఆస్థుల విలువ ఎంతో ఈ విధంగా లెక్క వేసి దానిలో భార్యకు వాటా ఇవ్వడం జరుగుతుంది.

కాకపోతే అది 50% కానక్కర్లేదు. కోర్టులో జడ్జీలు వాటా ఎంత అనేది నిర్ణయిస్తారు. సాధారణంగా అది 50%కి తగ్గదు. ఇంకో విషయం ఏమిటంటే, పిల్లలు ఉంటే ఎలానూ వారి సమ్రక్షణ తల్లికే వెలుతుంది కాబట్టి, వారి పోషణ నిమిత్తం కూడా భర్త డబ్బు చెల్లించాల్సి రావచ్చు. అంతా కలిపి 70 – 80% ఆస్థి అలా పోయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అంటే నీ ఆస్థి మీద నీ హక్కులు 30% నుండి 50% మాత్రమే. ఈ IrBM గురించి తెలీని వారికోసం, దాని గురించి వివరిస్తూ 125 సెకండ్ల వీడీయో ఒకటి పురుష హక్కుల కార్యకర్తలు రూపొందించారు. అది చూడండి.

ప్రపంచములో చాలా దేశాలలో ఇలాంటీ చట్టాలున్నాయని స్త్రీవాదులు ఎంతో చాకచక్యంగా అబద్దాలు అల్లుతున్నారు కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ ఆస్థుల పంపకాలప్పుడు కేవలం మగవారి ఆస్థిని మాత్రమే పంచుతారు. అంటే స్త్రీలకున్న ఆస్థిని ఈ పంపకాల సమయములో పరిగణలోకి తీసుకోరు. స్త్రీల ఆస్థిమీద మగవారికి ఎలాంటి హక్కూ ఉండదు. ఇలాంటి తింగర చట్టం మాత్రం ప్రపంచములో ఎక్కడాలేదు. ఏదైనా ఉంటే,కేవలం మగవాడు, పెళ్ళైన తరువాత సంపాదించిన ఆస్థిలో మాత్రమే వాటాలుంటాయి. అది కూడా స్త్రీ పురుషుల ఇరువురి ఆస్థులనూ పరిగణలోకి తీసుకునే పంపకాలు జరుగుతాయి. వివిధ దేశాలలో విడాకుల తరువాత ఆస్థి ఎలా పంచబడుతుందో కంపేర్ చేస్తూ ఓ పురుష హక్కుల కార్యక్త రాసిన బ్లాగు పోస్టు చూడండి..!!

A Comparative analysis of property division on divorce in different countries

హిందూ వివాహ చట్టానికి చేయబోతున్న సవరణలో ఇంకో బోనస్ కూడా ఉందండోయ్. అదే “నో ఫాల్ట్ డైవోర్స్” అనగా ఎలాంటి తప్పూ లేకపోయినా, ఇరువురి అంగీకారం లేకపోయినా ఎవరో ఒకరు మాకు విడాకులు కావాలని అడగవచ్చు. ఇరువురూ అలా కోరవచ్చా అంటే అవును, భార్యా భర్తలిరువురిలో ఎవ్వరైనా నో-ఫాల్ట్ డైవోర్స్ కింద విడాకులు కోరవచ్చు. చూడడానికి సమానత్వాన్ని పాటించినట్లు కనపడుతోంది కదా? ఇక్కడున్న మరో మెలిక ఏమిటంటే, నో-ఫాల్ట్ డైవోర్స్ కింద స్త్రీ  విడాకులు కోరితే పురుషుడు దాన్ని వ్యతిరేకించలేడు, చచ్చినట్టు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవాల్సిందే. కానీ, పురుషుడు కోరితే మాత్రం స్త్రీ దాన్ని వ్యతిరేకించవచ్చు. విడాకుల తరువాత తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి అన్న సాకును చూపి. అందుకే ఇచట్టానికి వ్యతిరేకంగా అనేక మంది పురుష హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. బోలెడన్ని ధర్నాలు చేశారు. ప్రస్తుతం ఈ చట్టానికి సంబందించిన బిల్లు పార్లమెంటులో ఆమోదానికి న్యాయ శాఖా మంత్రి కపిల్ సిబాల్ ప్రవేశపెట్టారు. ఒకసారి ఇది ఆమోదం పొందితే ఇక అంతే సంగతులు చిత్తగించవలయును. అదన్న మాట. ఈబిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టగానే ఢిళ్ళీలోని పురుష హక్కుల కార్యకర్తలు ఏకంగా పార్లమెంటు ఎదురుగానే తమ నిరసనను తెలియ జేశారు. ఈరోజు ఉదయం 11:00లకు పురుష హక్కుల కార్యకర్తలు చేస్తున్న నిరసనకు చెందిన ఫోటోలు కొన్ని… (ఈ బిల్లుగురించి చర్చకు వస్తోంది అని తెలుసుకున్న వెంటనే, అప్పటికప్పుడు ఢిల్లీలో ఉన్న కొద్ది పాటి కార్యకర్తలు మాత్రమే అక్కడికి వెల్లారు)

10671394_750413115030239_7269213070903409282_n 1175409_10153216276120221_1640376295_n 1174809_10153216134835221_1812386045_n 1014226_10153216149635221_1685920966_n 994911_10153216137815221_1221207032_n 556339_10153216272680221_918656359_n 182392_10153216164025221_1151571258_n 993995_10153216133835221_1816902624_n

ఇవే కాదు పురుష హక్కుల కార్యకర్తలు అనేక మంది ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కు సాధనాల ద్వారా అనేకమంది ఎం.పీలకు, వార్తా ఛానల్లకు, జర్నలిస్టులకు ఇంకా అనేక మంది ప్రముఖులకూ ఈ చట్టాల గురించి వివరిస్తూ వాటినిపై అవగాహన తీసుకురావడానికి కృషిచేస్తూ, దానికి వ్యతిరేకంగా చేసే పోరాటములో సహాయం చేయమని అబ్యర్తిస్తూ ఉన్నారు. అదే కాకుండా ట్విట్టరులో ఉండే ఫెమినిస్టులతో వీరు సాగించే పోరు కూడా వీరి చర్యలలో భాగంగా ఉంటుంది. మీరు ఈ చట్టం గురించి చేసిన ట్వీట్లనన్నింటినీ చదవాలనుకుంటే ” #IrBM ” అని ట్విట్టర్ సైట్లోని సెర్చులో టైప్ చేసి, సెర్చ్ కొట్టండి.(చాలా ట్వీట్లు వస్తాయి, అన్ని చదవడం అంటే చాలా టైం పడుతుంది, కానీ ముఖ్యమైనవి చూడవచ్చు, ఒక అవగాహనకు రావచ్చు).

498A దుర్వినియోగం, సేవ్ ఇండియన్ ఫ్యామిలీపై సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం


సాక్షిలో 498A దుర్వినియోగం పై వచ్చిన ఈ వార్తను ఇక్కడ ఇస్తున్నాను.  సహజంగానే 498A దుర్వినియోగం అనే టాపిక్కు రాగానే అన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి, ఇవే కాదు కదా..? అనో, స్త్రీలకు ఉన్న ఏకైక రక్షణ చట్టం ఇదే అనో, మనది పురుషాదిఖ్య సమాజం కాబట్టి, ఈ చట్టం ఉండాల్సిందే లాంటి మాటలు ఎదురవుతూ ఉంటాయి.  ఈ వార్తలో కూడా కొంత మంది అలాంటి అభిప్రాయాలను వెలుబుచ్చడం జరిగింది. వాటిపై నా వివరణను వార్త కింద ఇచ్చాను చూడండి … 

81376933799_625x300ఎవరికి చుట్టం !

హైదరాబాద్‌ : ఎక్కడ    : అసెంబ్లీ పక్కన పబ్లిక్‌గార్డెన్స్
 ఎప్పుడు    : ఆదివారం, ఉదయం 9గంటలకు
 ఏమిటి    : కొందరు మగవాళ్ల సమావేశం
 ఎందుకు    : కుటుంబ వ్యవస్థను కాపాడడం కోసం
 ఎలా    : సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా…… ఈవారం జనహితంలో
 
పబ్లిక్ గార్డెన్స్ గేట్ లోపలికి అడుగుపెట్టాక…ఎడమచేతివైపు ఓ వంద అడుగులు వేస్తే….చింతచెట్లకింద ఓ యాభైమంది మగవాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిమధ్యలో ఓ పెద్దాయన నిలబడి తన బాధలు చెప్పుకుంటున్నాడు. ‘‘మా కోడలు మామీద 498ఎ కేసు పెడతానంటోంది. తనకి మా కొడుకుతో ఇబ్బందులుంటే….కాటికి కాళ్లు చాచుకున్న మేం బలవ్వాలా…అంటూ మొదలుపెట్టాడు’’ అతను చెప్పిన సమస్యలన్నీ విన్నాక అక్కడ కూర్చున్న వాళ్లలో ఒకతను లేచి ఆ పెద్దాయనకి సలహాలిచ్చాడు. ‘‘మీ అబ్బాయిని, కోడల్ని కూర్చోబెట్టి మంచిగా మాట్లాడండి. మీ అబ్బాయి తప్పుంటే సరిచేసుకోడానికి, అతని ప్రవర్తన మార్చుకోడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మీ కోడలి బాధల్ని కూడా విని ఆమెని సమస్యల్ని నుంచి బయటపడేయడానిక్కూడా మీరే చొరవ తీసుకోండి. మీ కోడలైనా, కూతురైనా ఒక్కసారి పోలీస్‌స్టేషన్ గుమ్మం తొక్కితే ఒకటి కాదు, రెండు కాదు.. మూడు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి.’’ అంటూ సలహా ఇచ్చాడు. అసలు ఎవరు వీళ్లంతా? ఎందుకు అక్కడికి వచ్చారో చూద్దాం…
 
 ‘‘ఎంత శక్తిమంతమైన చట్టాలున్నా… ఇంకా చాలామంది మహిళలు గృహహింసకు బలైపోతూనే ఉన్నారు. కట్నాల వేధింపులు, అనుమానంతో వేధించే భర్తలు చట్టాల్ని లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటివారిపై 498 ఎ సెక్షన్ కేసు పెడితే వారికి న్యాయం జరుగుతుంది. అలాకాకుండా… జీతం చేతికివ్వలేదని, తల్లిదండ్రుల్ని చూడమన్నాడని, చెప్పిన మాట వినలేదని పంతాలకు పోయి క్షణికావేశంలో ఈ చట్టాన్ని ఆశ్రయించడం మన దేశ కుటుంబ వ్యవస్థని అవమానపరచడమే’’ అంటూ తమ పోరాటం గురించి పరిచయం చేసుకున్నారు.  
 
 ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పబ్లిక్‌గార్డెన్స్‌లో మీట్ అయ్యే ఈ బృందం…‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్)’ సభ్యులు. ముందుగా వీరంతా సెక్షన్ 498 ఎ బాధితులు. వీరంతా కలిసి ఈ సెక్షన్ దుర్వినియోగం కాకుండా కృషిచేస్తూ కుటుంబ వ్యవస్థని రక్షించడంకోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. సిఫ్ సభ్యుడు ఫెరాజ్ మాట్లాడుతూ…‘‘మహిళలపై వేధింపుల్ని అరికట్టాలన్న ఉద్దేశంతో పుట్టిన ఈ చట్టం చిన్న చిన్న ఇగోలకు కూడా పరిఆసరాగా మారడం చాలా దారుణం. ఏదో చిన్న గొడవకి 498 ఎ సెక్షన్ కింద కేసు వేసి కుటుంబాన్ని సర్వనాశం చేసుకుంటున్న మహిళలసంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
 
 కుటుంబం విలువైంది…
 ‘‘మన దేశంలో అన్నింటికన్నా బలమైంది, విలువైంది కుటుంబమే. మహిళైనా, పురుషుడైనా కుటుంబం లేకుండా ప్రశాంతంగా బతకలేరు. క్షణికావేశంలో కుటుంబాన్ని కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు కారణాలలో 498 ఎ సెక్షన్ దుర్వినియోగం కూడా ఒకటి. రకరకాల కారణాల వల్ల భర్త నుంచి విడిపోవాలనుకుంటున్న కొందరు మహిళలు నేరుగా విడాకులకు దరఖాస్తు చేసుకోకుండా… ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. పోనీ భర్తమీద కేసు వేసి ఊరుకుంటున్నారా… అంటే … కాదు, అతనితోపాటు తనకు కోపం ఉన్న అందరి పేర్లని రాసేస్తున్నారు. అత్త, మామ, ఆడపడచు, మరిది, బావ… అంటూ ఓ ఐదారు మందిని రోడ్డుకి ఈడుస్తున్నారు. దీనివల్ల ఆమెకొరిగేదేమీ ఉండదు. కొన్నాళ్ల తర్వాత ‘అనవసరంగా తొందరపడ్డానే’ అని బాధపడేవాళ్లూ ఉన్నారు.
 
ఏ మహిళైనా 498 ఎ సెక్షన్‌కింద కేసు నమోదు చేస్తే భర ్తని వెంటనే అరెస్టు చేస్తారు. ఆ తర్వాత… మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా పోలీసులు నిర్దాక్షిణ్యంగా సెల్‌లో పడేస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న ఆడపడుచుని కూడా అరెస్టు చేయించారు. భర్త తప్పుచేస్తే అతనిమీద కేసు పెట్టాలి. అంతేకాని రక్తసంబంధీకులైన పాపానికి ఎక్కడో దేశం దాటిపోయినవాళ్లమీద కేసులు పెట్టి వారి కుటుంబాల్ని బజారుకీడ్చే హక్కు ఈమెకి ఎవరిచ్చారు? పెళ్లిచేసి నా బతుకు నాశనం చేశారనే అమ్మాయిలెంత మంది ఉన్నారో, అందులో పదోవంతు అబ్బాయిలు కూడా తమ జీవితభాగస్వాములతో ఇంచుమించు ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఎన్నోవిషయాల్లో ఎంతో పురోగమిస్తున్న మనం మన చట్టాలకు మగవాళ్ల సంక్షేమం ఎందుకు పట్టదో అర్థం కావట్లేదు. అందుకే ఎనిమిదేళ్ల క్రితం ముంబయిలో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ వెలిసింది’’ అని చెప్పారు సిఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్ అలీ షా.
 
 దేశవ్యాప్తంగా…
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సంస్థలో 13, 500 మంది సభ్యులున్నారు. స్వచ్ఛందంగా పనిచేస్తున్నవారు ఇంతకు మూడింతలున్నారు. వీరి పోరాటం 498 ఎ చట్టం దుర్వినియోగం మీద మాత్రమే కాదు… ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ కన్నబిడ్డలతో గడిపే అవకాశాన్ని కోల్పోతున్న మగవారి కోసం కూడా. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిఫ్ సభ్యులు ఉన్నారు. మొన్నటివరకూ 498ఎ సెక్షన్‌కింద కేసు పెడితే వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. రెండేళ్లక్రితం ట్యాంక్‌బండ్‌పై మేం చేసిన పోరాట ఫలితంగా మన రాష్ర్ట హైకోర్టు కేసుని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది. కాని, ఏం లాభం… కొందరు మహిళలు కేసు పెట్టి వెనక్కి తీసుకోడానికి బేరాలాడుతున్నారు.
 
భార్యాభర్తలమధ్య మధ్యవర్తుల పేరుతో పుట్టుకొచ్చే కొందరు పెద్దలు మరీ అన్యాయంగా డబ్బు సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు. దీనివల్ల వివాహవ్యవస్థ పైనే విరక్తి పుడుతోంది. ఇదిగో…ఇక్కడ ఉన్నవారిలో ఓ పదిమంది విదేశాల్లో స్థిరపడ్డవాళ్లున్నారు. ఈ కేసు పుణ్యాన అక్కడ ఉద్యోగం ఊడగొట్టుకుని ఇక్కడకొచ్చి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ల భార్యలేమో ఉద్యోగాలు చేసుకుంటూ వీళ్లదగ్గర పోషణకు డబ్బులు తీసుకుంటూ హాయిగా బతికేస్తున్నారు. ఇక్కడ మా ఉద్దేశ్యం వీళ్లంతా మంచివారు, వీరి భార్యలు చెడ్డవారు అని కాదు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవడం ఎందుకు…అని!’’ అంటూ తన వాదనని వివరించారు మరో సభ్యుడు.
 
 కుటుంబం కోసం…
 మా పోరాటం మగవారికోసం కాదు…కుటుంబ సంక్షేమం కోసం అంటోన్న ఈ సంస్థ  కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఉచిత కౌన్సిలింగ్‌లు కూడా ఇస్తోంది. లోక్ అదాలత్ కింద న్యాయ సేవా సదన్‌లో ప్రీ ప్రివెన్షన్ కౌన్సిలింగ్‌లో పాల్గొంటోంది. కుటుంబంలో ఎవరితోనైనా సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా లోక్ అదాలత్‌ని ఆశ్రయిస్తే అక్కడ అధికారులు సమస్య పరిష్కారానికి సహకరిస్తారు. ఇలాంటి సంస్థల్ని ఆశ్రయించి కుటుంబాలను పదికాలలపాటు పచ్చగా ఉండేలా చూసుకోకుండా పోలీసుల్ని ఆశ్రయించి పొరపాటు చేస్తున్న మహిళలు కళ్లు తెరవాలని కోరుకుంటున్నారు సిఫ్ బృందం. 498ఎ చట్టం విలువైంది. శక్తిమంతమైన ఆయుధం. అయితే ఆ ఆయుధాన్ని జాగ్రత్తగా వాడాలి కాని దుర్వినియోగం చేయకూడదు. వందమంది నేరస్థులు తప్పించుకున్నా పరవాలేదు కాని… ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అన్న మన న్యాయశాస్త్ర సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని, హింసకు గురవుతున్న మహిళలకు రక్షణకవచంలా ఉన్న ఈ చట్టం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడదాం.
 
 – భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 ఇదొక్కటే కాదు…
 మన దేశంలో ఒక్క మహిళా చట్టాలే కాదు అన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు  పోరాడి తెచ్చుకున్న చట్టాలివి. భర్త కొట్టినా, బాధ్యతగా ప్రవర్తించకపోయినా, అనుమానించినా… ఎలాంటి ఇబ్బంది అయినా వాటి నుంచి బయటపడడానికి నేటి మహిళలకి  498 సెక్షన్ ఒక్కటే దిక్కు. సమస్య చిన్నదయినా, పెద్దదయినా తట్టుకునే శక్తిలేనప్పుడు ఎవ్వరూ తనకు తోడుగా నిలబడనపుడు ఆ మహిళ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం 498. ఆడ, మగ భేదాలు పక్కనపెడితే ఎవరికి అన్యాయం జరిగిందో కేసు విచారణ చేస్తేగాని చెప్పలేం.
 – నిశ్చల సిద్దారెడ్డి, ఎడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్
 
 దుర్వినియోగం పెరుగుతోంది…
 రక్షణగా ఉపయోగపడాల్సిన చట్టాన్ని అవగాహన లేకుండా, క్షణికావేశంతో దుర్వినియోగం చేస్తున్నవారి సంఖ్య నిజంగానే పెరుగుతోంది. వాస్తవం చెప్పాలంటే నిజంగా హింసకు గురవుతున్న మహిళలు నేరాల్ని రుజువుచేయడంలో విఫలమై ఇబ్బందులు పడుతుంటే… తమ స్వార్థాలకు కేసులు పెట్టి జీవితాల్ని నాశనం చేసున్న మహిళలు కూడా మన కళ్లముందే ఉన్నారు. భార్యా, భర్త సంగతేమోగాని మధ్యలో పెద్దలు, మధ్యవర్తులు బాగుపడిపోతున్నారన్నది కూడా వాస్తవం!
 – పుణ్యవతి, ఐద్వా సంఘం ఉపాధ్యక్షురాలు

Note:  సహజంగా,  పత్రికలలో వచ్చే వార్తలను కొంత కాలం పాటు ఆర్కైవ్స్ లో ఉంచుతారు.  పరిమితి దాటిన తరువాత అది తొలగించ బడుతుంది.  అందుకని మాత్రమే ఆ వార్తను ఇక్కడ యధాతధంగా ప్రచురిస్తున్నాను.  ఇప్పటికే, దీని ఈ-పేపరులో ఈ వార్త కనిపించడం లేదు.  అసలు వార్త, చదవాలనుకుంటే ఈ లంకెను నొక్కండి. కిందిచ్చిన లంకెను నొక్కంది.

ఎవరికి చుట్టం!

నా వివరణ: అన్ని చట్టాలు దుర్వినియోగ మవుతున్నాయి ఇదొక్కటే కాదు అనే వాదన హాస్యాస్పదం. ఆమాటకొస్తే అన్యాయాలు అందరికీ జరుగుతున్నాయి మహిళలకొక్కరికే కాదు, మరి ఈ ప్రత్యేక చట్టాలు ఎందుకు? అధికంగా ఆత్మహత్యలు చేసుకునేది మగవారు, అధిక మరణాలు మగవారివే, స్వల్ప జీవిత కాలం మగవారిదే, అన్ని రకాల నేరాలలో బాధితులు అధికంగా మగవారే. దానికి తోడు ప్రస్తుతం గృహహింస నిరోధక చట్టం కూడా అమలులోకి వచ్చింది అలాంటప్పుడు ఈ 489Aలాంటి చట్టం ఇంకోటి ఎందుకు?

ఇదే విషయం మీద ఇదివరకే నేను రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవండి.

498A చట్టం దుర్వినియోగాన్ని సీరియస్ గా తీసుకోవడం ఎందుకు?

ఈ ఆర్టికలులో నన్ను అత్యంత ఆశ్చర్యపరచిన అంశం ఏమిటంటే, ఐద్వా సంఘం ఉపాధ్యక్షురాలు ఈ చట్టం దుర్వినియోగ మవుతోందని ఒప్పుకోవడం. వారు ఒప్పుకుంటేనే చట్టం దుర్వినియోగం అవుతున్నట్టుగా నేను భావిస్తాననో లేక వారు ఒప్పుకోవడం అవసరమనో కాదు నా ఉద్దేశ్యం. సుప్రీం కోర్టు వారు ఈ చట్ట దుర్వినియోగం “లీగల్ టెర్రరిజం”గా మారింది అని ఘాటుగా స్పందించినా, లెక్కలేనన్ని సార్లు కోర్టులు ఈ దుర్వినియోగం గురించి మాట్లాడినా, ఇప్పటి వరకు అన్నిరకాల మీడియాలలో (పత్రిక, టెలివిజన్) దీని దుర్వినియోగ తీవ్రతను కళ్ళకు కట్టినట్టు చెప్పినా, చివరకు పార్లమెంటులోనే ప్రజాప్రథినిధులు ఈ చట్టం దుర్వినియోగం జరుగుతోందని అంగీకరించినా, ఒకప్పటి రాష్ట్రపతి “ప్రతిభా పాటిల్” తన ప్రసంగములో దీని గురించి ప్రస్తావించినా కూడా 498A దుర్వినియోగమవుతోందని ఒప్పుకోని వారిలో ఐద్వా సంఘం ఒకరు. అలాంటిది, ప్రస్తుతం వారిలో ఒకరు దుర్వినియోగాలు పెరుగుతున్నాయి చెప్పడం, నేను చూసినంత వరకూ ఇదే మొదటి సారి.

మన బ్లాగుల్లో కూడా మగవారిపై చట్టాల దుర్వినియోగాలు పెరుగుతూ అమాయకులను బలిచేస్తున్నాయి అంటే, కుంటి సాకులు చెప్పేవారు చాలా మందే ఉన్నారు. న్యాయం పొందడం అందరి హక్కు అని మరిచి 18వ శతాబ్దంనాటి “తలతిక్క” సిద్దాంతాలను వల్లె వేసే “తలతిక్క” జనాలు (ఒకప్పుడు వీటి దుర్వినియోగం గురించి అడిగితే వారు నన్నన్న మాటలే కాబట్టి, తిరిగి అప్పగించడానికి వెనుకాడడం లేదని మనవి) బాగానే ఉన్నారు. ఆ సిద్దాంతాలను వదిలి, సమాజాన్ని చూడమని ఈ సంధర్భంగా వారికి నా విఙ్ఞప్తి.

కండక్టరుపై చేయి చేసుకున్న మహిళా టెక్కీ, 15 రోజుల జ్యుడిషియల్ కష్టడీ..!!


స్వాతి నిగం అనే అమ్మాయి అసెంచూర్‌లో (Accenture) సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది.  బెంగుళూరులో సిటీ బస్సెక్కింది (వోల్వో). చార్జీ ఎందుకు 25 రూపాయలు వసూలు చేస్తున్నారు అని అడగడముతో మొదలైన గొడవ, అమ్మాయి దగ్గర సరైన చిల్లర లేకపోవడం దాకా వచ్చింది. కండక్టరు మినిమం 10 రూపాయలు కట్టి తరువాతి స్టాపులో దిగమని చెప్పాడు. ఆ అమ్మాయి దానికి ఒప్పుకోలేదు. తరువాత బస్ కండక్టర్ కన్నడలో మాట్లాడడం మొదలు పెట్టాడు. అమ్మాయి తనను తిడుతున్నాడు అనుకొని అతని చెంప మీద బలంగానే కొట్టింది. తరువాత గోర్లతో మొహం మీదనే రక్కింది. దెబ్బ చెవి దగ్గర తగలడముతో కండక్టరుకు కాసేపు వినపడడములో సమస్య తలెత్తింది అని తరువాత పరీక్ష చేసిన డాక్టర్లు చెబుతున్నారు. గొడవ గమనించిన డ్రైవర్ బస్సు డోర్లు మూసేసి HAL పోలీస్ స్టేషనుకు తీసుకెల్లాడు.

ఇద్దరి వాదనలు విన్న తరువాత, ఇంకో నలుగురు ప్రయాణీకులనూ విచారించిన తరువాత, ఆమె మీద ప్రభుత్వ ఉధ్యోగిపై దాడి చేసింది అని కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు.  జడ్జి ఆమెకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండు విధించాడు. ఇంకా శిక్ష పడలేదు, కేవలం విచారణ మాత్రమే జరుగుతోంది.  నేరం రుజువైతే (99% ఛాన్సుంది అనిపిస్తోంది నాకు) ఎంత పెద్ద శిక్ష పడుతుందో ..??

దీన్నేమనాలో నా కర్థం కావడం లేదు. తలరాత అనా? లేక దురదృష్టం అనా? బస్సులో కండక్టర్ల ప్రవర్తన కొన్నిసార్లు దురుసుగానే ఉంటుంది.  ఆ విషయములో నేనా అమ్మాయికి సానుభూతినే తెలుపుతాను. కానీ, ఆ అమ్మాయి చేయిచేసుకోవడం మాత్రం సమర్ధించలేను. సాధారణ మగవాడి మీద చేయి చేసుకునుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో గానీ, అతను ప్రభుత్వ ఉధ్యోగి కావడముతో సీను రివర్సయ్యింది.

మన సినిమాలలో,  నవల్లలో అన్నింటిలో ఇలా చేయి చేసుకునే ఆడవారిని దుర్గలుగానో, ఝాన్సీలుగానో చిత్రీకరించడానికి అలవాటు పడ్డాం మనం. అన్యాయమే జరిగినా, పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడమో లేక మాట్లాడడమో మానేసి, దురుసుగా చేయి చేసుకుంటే ఒక్కోసారి ఫలితాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి ఈ ఘఠనే ఉదాహరణ.  అసలు ఎవడన్నా తప్పు చేశాడు అనగానే వీధిలోనే తీర్పులిచ్చేసి, అక్కడే వారిని కొట్టడం మానుకుంటే బాగుంటుంది కదా?

ఈ వీధి తీర్పులు మగవారిపట్ల అధికంగానే జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మాయి చేత్తో సరిపెట్టింది. మరికొన్ని చోట్ల కాలి చెప్పుల దాకా కూడా వెలతాయి. నేను ఇటువంటి వాటిని పూర్తిగా వ్యతిరెకిస్తాను. చెప్పులతో కొట్టడం, బయట స్తంబానికి కట్టేసి, బట్టలూడదీసి కొట్టడం లాంటి ఘఠనలు మగవారి విషయములో ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఇంతా జరిగిన తరువాత కూడా, కేసు మగవారి మీదనే ఉంటుంది. అంత దారుణంగా కొట్టిన ఆడవారి మీద ఉండదు. ఈ వీధి తీర్పులకు వ్యతిరేకంగా మగవారు పోరాడాలి అనిపిస్తుంది. అన్నింటికన్నా ముందు, సినిమాలలో హీరోలు కాస్త హీరోయిజం కూడా తగ్గించుకోవాలి అనిపిస్తుంది.

15 రోజుల జైలు జీవితం, తరువాత ఎంత శిక్ష పడుతుందో చెప్పలేం. ఆ అమ్మాయి రెండు రోజుల పటు ఏడుస్తూనే ఉందట అన్నం కూడా తినకుండా. ప్రస్తుతం ఎవరైనా జాలి పడడం తప్ప ఏమిచేయగలరు?? ఆమె బయటికి రాగానే అతని మీద కేసు పెడతాం అని ఆమె స్నేహితులు అంటున్నారు. కానీ, తోటి ప్రయాణీకుల వాఙ్ఞ్మూలం కూడా ఆమెకు వ్యతిరేకంగానే ఉన్న విషయం వారు మరిచిపోతున్నారు. బుద్దిగా పెద్దలను పిలిచి రాజీ ప్రయత్నాలు చేసుకుంటే మంచిదని నాకనిపిస్తోంది.

Source: Woman techie slaps BMTC conductor, lands in judicial custody

మగవారిపై పెరుగుతున్న యాసిడ్ దాడులు..!!


యాసిడ్ దాడి అనగానే మనకు ప్రేమోన్మాదులు అమ్మాయిలపై చేసే దాడులే కనిపిస్తాయి. కానీ, మనం ఒక విషయాన్ని మరిచిపోతూ ఉంటాం. యాసిడ్ అనేది ఎవరిపై జల్లినా ప్రభావం ఒకేలా ఉంటుంది అని. చాలా చోట్ల అనేక మంది స్త్రీలు మగవారిపై కూడా యాసిడ్ దాడులు చేయడం జరిగింది.

ప్రస్తుతం ఢిల్లీలో అలాంటి ఘఠనే జరిగింది. రబీనా అనే 24 సంవత్సరాల స్త్రీ, 22 సంవత్సరాల నసీరుద్దీనుపై యాసిడ్‌తో దాడి చేసింది. ఈ సంఘఠన ఢిల్లీలోని గోఖల్పూరులో జరిగింది. రబీనా, ఆమె చెల్లెలు చాందో, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కలిసి నసీరుద్దీను బలప్రయోగముతో లొంగ దీసుకున్నారు. తరువాత యాసిడ్‌తో దాడి చేశారు. [1]

ఇలాంటి ఘఠనలు అనేకం జరిగాయి, వాటిలో కొన్ని..!!

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వివాహిత స్త్రీ కొంత కాలం మొహిత్ అనే యువకునితో వైవాహికేతర సంబంధం కలిగి ఉండేది. అతను తన కుమార్తెలను తప్పుడు దృష్టితో చూస్తున్నాడు అని భావించి అతనిపై యాసిడుతో దాడి చేసింది. కానీ, అతను చెప్పేదేమంటే, అతను ఆమెకు 10,000 రూపాయలు ఇచ్చాడు. తిరిగి ఇవ్వమని అడిగినందుకే తాను అలా చేసింది అని చెబుతున్నాడు. ఇద్దరిలో ఎవరి వాదం నిజం అయినా యాసిడ్ దాడిచేయడం ఘోరం. [2]

డిల్లీకి చెందిన 24 సంవత్సరాల ఆర్తీ దీక్షిత్ అనే ఆవిడ, తన ప్రియుడు, 25 సంవత్సరాల వినీత్ కుమార్‌పై యాసిడ్ దాడికి తెగబడింది. తనను కాదని మరొక స్త్రీని వివాహం చేసుకోబోతున్నాడన్న అక్కసుతో ఆమె ఈ దాడికి పూనుకుంది. అతని శరీరముపై 45% కాలిన కాలిన గాయాలున్నాయి. (45% burns). [3]

భత్కలులో జరిగిన మరో సంఘఠనలో జెస్సీ కోనికల్ అనే స్త్రీ, 38 సంవత్సరాల బెన్నీ జోసెఫ్‌పై యాసిడుతో దాడి చేసింది. ఈ దాడిలో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు, అతని పరిస్థితి విషయమంగా తయారయ్యిందని ఆవార్త చెబుతోంది. జెస్సికా కొంకల్‌కు ఒక షాపు ఉంది, అందులోని గుడ్లను జోసెఫ్ పెంపుడు కుక్క తినేసిందంటూ ఆమె ఆ కుక్కకు విషం ఇచ్చి చంపేసింది. అంతే కాదు ఇరుగుపొరుగు వారు కావడముతో ఇద్దరికీ ఒకేలేన్ ఉండేది. ఆలేన్లోనికి జోసెఫ్‌ను అతనికి చెందినవారినీ రావొద్దని ఆర్డర్ వేసింది. కానీ, ఒకరోజు జోసెఫ్ తిరిగివస్తున్నప్పుడు, చెట్టువెనుకల దాక్కుని ఉన్న జెస్సీ మరో వ్యక్తి సహాయముతో జోసెఫ్‌పై బలప్రయోగం చేసి అతని మీద యాసిడ్‌తో దాడిచేసింది. [4]

ఇవేకాదు, స్త్రీలు మరో స్త్రీపై కూడా యాసిడ్ దాడి చేసిన సంఘఠనలున్నాయి..!!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూరులో ఒకావిడ కుటుంబ తగాదాల కారణంగా కన్న తల్లిపైనే యాసిడ్ దాడి చేసింది. ఆస్థితగాదాలే దీనికి కారణం అని చెబుతున్నారు. ఆయువతి మతిస్తిమితం సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు, ఆవిడ మానసిక స్థితిని తెలుసుకునేందుకు పరీక్షల నిమిత్తం పంపారట. కానీ, ఆస్థికోసం పోరాడగలిగినావిడ మతిస్థిమితం లేకుండా పోవడం కాస్త తేడానే. [5]

ముంబైలోని బాంద్రా ప్రాంతములో మరో ఘోర ఘఠన. ఇది కూడా ఆస్తి తగాదాల వల్లనే జరిగింది. నజ్మా జాగిర్దార్ అనే 35 సంవత్సరాల స్త్రీ, తన ముగ్గురి చెల్లల్ల పైనే కాకుండా వారితో పాటు ఉన్న 1సం. వయసున్న పాపపై కూడ యాసిడుతో దాడిచేసింది. తల్లికి చెందిన ఆస్థిని సమానంగా పంచుకున్న తరువాత కూడా నజ్మా తాను పెద్దదాన్ని కాబట్టి మరో 50,000 తనకు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ, ఆమె చెల్లెల్లు అందుకు ఒప్పుకోలేదు. దానితో ఒకరోజు తన భర్తకు ఆరోగ్యం బాలేదని, రక్తపు వాంతులు అవుతున్నాయని చెప్పి పిలిచి, వచ్చిన వారు కాఫీ తాగుతుండగా ఆమె టీనేజీ కొడుకు సడెనుగా యాసిడ్‌తో దాడిచేశాడు. తరువాత నజ్మా కూడా యాసిడుతో దాడీ చేసింది. [6]

చాలా మంది ఏమనుకుంటారంటే, స్త్రీ శారీరకంగా బలహీనురాలు కాబట్టి మగవారిపై దాడిచేయలేదని. కానీ, ఆ శారీరక బలహీనతను అధిగమించడానికి చాలా మార్గాలున్నాయని మర్చిపోతూ ఉంటారు. కేవలం మగవారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారనో లేదా ఆడవారే ఇలాంటి పనులు చేస్తారనో అనుకోకుండా నేరం ఎవరు చేసినా నేరమే అని బాధితులు ఎవ్వరైనా బాధితులే అని వారికి ఉపశమనం లభించేలా చర్యలు తీసుకోవాలని మనం గుర్తించాలి.

References: 

1. Wife throws acid on husband

2. Women throws acid on lover’s face

3. Women throws acid on boyfriend’s face

4.  Bhatkal: Row between neighbours – Woman throws acid on man’s face

5. Daughter throws acid on mother’s face over family dispute

6. Woman throws acid on three siblings over property dispute

పురుష ప్రభుత్వోద్యోగుల పై కొరడా – స్త్రీలపై మాత్రం మౌనం..!!


. ప్రభుత్వ ఉద్యోగుగులకు చాలా నిబంధనలుంటాయి.  ఈ నిబంధనలన్నింటినీ వారు సిసరా వహిస్తేనే వారికి ఉద్యోగ భధ్రత అనే ఫలం దొరుకుతుంది.  కానీ ఆ ఆంక్షలు మగవారు అయినదుకు ఒకలా, స్త్రీలు అయినందుకు మరోలా ఉంటే? దాన్ని వివక్ష అంటారు. నిబంధనలను సిరసా వహించవచ్చు, మరి వివక్ష మాటేమిటి? వాటిని ఎవ్వరైనా ఎందుకు సహించాలి?

ఒక పురుష ప్రభుత్వోద్యోగి  తన భార్యా పిల్లలను నిర్లక్షం చేసినా, వేధించినా  సెంట్రల్ సివిల్ సెర్వీసెస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి.  ఇది కేంద్ర ప్రభుత్వోద్యోగులకూ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకూ ఇరువురికీ వర్తిస్తుంది. కానీ, మహిళల విషయానికి వస్తే మాత్రం నిబంధనలు పక్కకు తప్పుకుంటాయి. ఆమె మీద ఎలాంటి చర్యలూ తీసుకునే అవకాశం లేదు.

సమాచార హక్కు చట్టం అనేది వెలుగులోకి వచ్చిన తరువాత అనేక అపోహలూ, స్త్రీవాదులు చెప్పే అనేక అబద్దాలూ పటాపంచలయ్యాయి. నిజంగానే ఇది ఒక ఆయుధం లాంటిది. ఆ అయుధాన్ని ఉపయోగించి నిజాలు ప్రజలకు తెలియ పరచడానికి కొంత మంది ఉధ్యమకారులు కూడా ఉన్నారు. వారినే సమాచార హక్కు చట్టపు ఉధ్యమకారులు (RTI Activists)  అని పిలుచుకుంటూ ఉంటారు.  498A చట్టం ఏవిధంగా దురుపయోగం అవుతోంది అనేది మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది ఈ చట్టాన్ని ఉపయోగించే. అంత వరకూ 498A  చట్టం దురుపయోగం అవుతోంది అని చెబితే చాలా మంది సో-కాల్డ్ మేధావులూ, ప్రగతి కాముకులూ వాటిని  నిరాధారమైన ఆరోపణలుగా కొట్టి పారేస్తూ వచ్చారు. అంటే వారికి నిజం తెలీక కాదు, నిజాన్ని అంగీకరించే ఉద్దేశ్యం వారికిలేదు అని మాత్రమే మనం ఇక్కడ గమనించాలి.  దురదృష్టమేమిటంటే ఇటీవల వచ్చిన పనిచేసే చోట వేధింపులను నిరోధించే చట్టములో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి సమాచారాన్ని తెలుసుకునే వీలు లేకుండా నిబంధనలను చేర్చారు స్త్రీవాదులు.

ఇక విషయములోనికి వస్తే, కేంద్ర మంత్రివర్గములో పనిచేసే మహిళా ఉద్యోగి కొన్ని కారణాలవలన భర్తనీ, కుటుంభాన్ని వదిలి వెల్లిపోయింది. ఆవిడ భర్త సంబందిత శాఖకు ఈ విషయమై ఫిర్యాదు చేసినా, ఆ శాఖ ఆవిడ మీద ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి వివరణ కోరాడు ఆషిష్ భట్టాచార్య అనే సమాచార హక్కు ఉద్యమకారుడు. ఆయన కోరిన సమాచారానికి పబ్లిక్ సెంట్రల్ ఇంఫర్మేషన్ నుండి అతనికి లభించిన నిబంధనల వివరాలు ఇవి …

“The instructions for proper maintenance of family states that in case a government servant is reported to have acted in a manner unbecoming of a gvoernment servant, for instance, by way of neglectin his wife and family, departmental action can be taken against him on that score. Penalties that may , for good and sufficient reasons, can be imposed on an errant government servan. Further, it has been held that neglect of wife and family in a manner unbecoming of a government servant may be regarded as a good and suffcient reason to justify action being taken against him under this rule”.

ఇందులో పురుషుల గురించి మాత్రమే చెప్పబడి ఉంది. వారు తమ భార్యను కానీ, కుటుంభాన్ని కానీ నిర్లక్షం చేస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు. అతనిపై తీసుకునే చర్యలకు ఆ కారణం చాలు. కానీ, స్త్రీల విషయములో ఎలాంటి వివరణా లేదు. ఇది పాతకాలం నాటి చట్టం, అప్పుడు స్త్రీలు పెద్దగా ఉద్యోగాలు చేసే వారు కాదు కాబట్టి అలా ఉంది అని సరిపెట్టుకున్నా,  ప్రస్తుతం అనేక మంది స్త్రీలు ఉధ్యోగాలు చేస్తున్నారు. వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.  అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇటువంటి నిబంధనలను లింగ భేదం లేకుండా అందరికీ వర్తించేలా రూపొందించ కూడదు? అన్నదే ప్రశ్న.

ఆ మహిళా ఉద్యోగి భర్త ఫిర్యాదు ప్రకారం, అతని 76 సంవత్సరాల తల్లి గుండె జబ్బుతో బాధపడుతోంది.  అతనికీ, అతని భార్యకూ వచ్చిన విభేదాల కారణంగా,  ఆ మహిళా ప్రభుత్వోద్యోగి రెండు CGHS  హెల్త్ కార్డులనూ తీసుకుని వెల్లింది. దానితో అతను సంబందిత శాఖను చర్యలు తీసుకోవలసిందిగా కోరాడు.  తన కార్డును తిరిగి ఇప్పించమని లేదంటే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోమని. కానీ, ఆ శాఖ నిబంధనలు కేవలం పురుషులకోసం చేసినవే కానీ, స్త్రీలకు అటువంటి నిబంధనలు వర్తించని కారణంగా ఎటువంటి చర్యా తీసుకోలేదు.

Source: Disadvantage, male govt servants

P.S: ఈ వార్త నిజానికి, డిసెంబర్ 2010 లో వచ్చింది. నా నమ్మకమేమిటంటె, ఇప్పటికీ ఈ నిబంధనలో ఎలాంటి మార్పూ ఉండదని. కాకపోతే ఎవరైనా నా నమ్మకం తప్పని, ఈ నిబంధన మారి స్త్రీ, పురుషులిరువురికీ ఈ నిబంధన వర్తించేలా సవరణ చేశారని నిరూపిస్తే నేను చాలా సంతోషిస్తాను.

Published in: on August 7, 2013 at 11:46 am  Comments (5)  
Tags: , ,

హిందూ వివాహ చట్టములోని మార్పులను వ్యతిరేకిస్తున్న పురుష హక్కుల సంఘాలు – టైంస్ ఆఫ్ ఇండియా వార్త


గమనిక: ఇది స్వేచ్ఛానువాదం  మాత్రమే. నేను కొన్ని కష్టమైన పదాలనూ, వాఖ్యాలనూ నా సొంత వాటితో రీప్లేస్ చేయడం జరిగింది.

నాగపూర్;  (హిందూ) వివాహ చట్టం బిల్, 2010లో ప్రతిపాదించిన సవరణలను క్యాబినెట్ ఆమోదిచిన విషయం తెలిసిందే.  ఈ బిల్లును పురుష హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఈ కొత్త చట్టం మగవారిని వారి ఆస్థులు పోగొట్టుకునేలా చేయడమే కాదు, ఈచట్టముతో న్యాయస్థానాలకు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టినట్టు అవుతుందని వారు భావిస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న కొత్త చట్టం ప్రకారం, భార్య భర్త  వారసత్వ సంపదతో సహా, అతని మొత్తం ఆస్థిలో భాగాన్ని విడాకుల తరువాత పొందుతుంది.  నెల నెల భర్త భార్యకు చెల్లించాల్సిన భరణం పైనా, అతని ఆస్థిని ఏవిధంగా పంచాలి అన్నదానిపైనా నిర్ణయాలు తీసుకునే అధికారం న్యాయమూర్తులకు లభిస్తుంది.

“వివాహ చట్టములో చేసే ఏ సవరణనైనా,  మిగిలిన అంశాలైన పిల్లల ఉమ్మడి సమ్రక్షణ – పోషణ,  భాగస్వామి కిచ్చే భరణం (ఒకే సారి ఇచ్చేది) లేదా నెలసరి భరణం లాంటి వాటిపై నిజాతీగా, నిక్కచ్ఛిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  మగవాడు తన ఆస్థిని, తన వారసత్వపు ఆస్థినీ పంచిన తరువాత కూడా .. జీవితాంతం భరణాన్ని ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తున్నాడు సేవ్ ఇండియన్ ఫ్యామిలీ నాగపూర్ అధ్యక్షుడు రాజేష్ వకారియా.  ఈ సవరణకు సంబందించిన నిర్ణయాన్ని ప్రభుత్వం అందరితో చర్చించి కాకుండా తొందరపాటుగా తీసుకున్నది అని అతను అభిప్రాయపడుతున్నాడు.

SIFF ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొమ్మని ప్రభుత్వాన్ని కోరుతున్నది అంతే కాదు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలో ఇది చర్చకు రాకూడదని కోరుతున్నది. ఇలాంటివి కాకుండా లింగభేధాలు లేని జెండర్ న్యూట్రల్ చట్టాలు రావాలని, భరణాన్ని లెక్కించేప్పుడు స్త్రీ యొక్క సేవలు ఆ కుటుంభానికి ఎంత ఉపయోగపడ్డాయో, వారు ఎంత కాల వివాహ బంధములో ఉన్నారు అన్నదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నది.

న్యాయమూర్తుల నిర్ణయాలకిచ్చే అపరిమిత విలువ వలన వారు తమకు నచ్చినట్లుగా తీర్పులు చెప్పే అవకాశం కల్పించినట్టవుతుందని, జవాబుదారీ తనం లేకుండా పోతుందని, అవినీతి పెరుగుతుందనీ వాకారియా చెప్పారు.  అంతే కాకుండా ఇలాంటి పక్షపాతముతో కూడుకున్న చట్టాలు చేసే ముందు, స్త్రీలకు తమ తల్లిదండ్రులనుండి వారసత్వ సంపద లభించేలా గట్టి చర్యలు తీసుకుంటే బావుంటుందని వారు తెలియజేశారు.

Source: Changes in new marriage laws opposed by men’s rights group

గాంధీభవన్ వద్ద సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ధర్నా – కొత్త విడాకుల చట్టం పై నిరసన :ఫొటోలు


కాంగ్రెస్ ఆఫీస్ (గాంధీ భవన్) వద్ద సేవ్ ఇండియా ఫ్యామిలీ ఆంధ్ర ప్రదేశ్ విభాగానికి చెందిన యాక్టివిస్టులు మెరుపు ధర్నా నిర్వహించారు.  ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన విడాకుల చట్టమును (హిదూ వివాహ చట్టములో మార్పులు) వారు వ్యతిరేకిస్తూ ఈ ధర్నాను నిర్వహించారు.  ఈ సరికొత్త వివాహ చట్టం వలన మగవారు విడాకుల తరువాత 50% ఆస్థిని భార్యకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆస్థిలో భర్త పెళ్ళిచేసుకున్న తరువాత సంపాదించినదే కాక, పెళ్ళికి ముందు సంపాదించినది, తల్లిదండ్రులద్వారా వారసత్వంగా లభించిన ఆస్థికూడా 50% కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని పురుష హక్కుల సంఘాల వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  కానీ ప్రస్తుతం ప్రభుత్వం చిన్న సవరణ చేసింది. అదేమంటే 50% ఆస్థి అనికాకుందా ఎంత పంచాలి అనందాన్ని కోర్టులు నిర్ణయిస్తాయి.  అంటే 50% కన్నా తక్కువైనా కావొచ్చు, ఎక్కువైనా కావొచ్చు.

దీన్నే IrBM (Irretreavable Breakdown of Marraige) అని కూడా పిలుస్తున్నారు.  అంటే బాగుచేయలేనంతగా వివాహ బంధం విచ్ఛిన్నమైనప్పుడు, ఆబంధములో ఉండాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశ్యముతో చేసిన సవరణ.  ఆపేరు మీదుగా దీన్ని పిలిస్తున్నారు.

ఇందులో అభ్యంతరకరమైనవఏమంటే..

1. భర్త పెళ్ళిచేసుకున్న తరువాత సంపాదించిన దానిలో భార్య తనవంతు సహకారం అందించింది అనుకోవడములో అర్థం ఉంది. కానీ, పెళ్ళి కాక మునుపు మగవాడు సంపాదించిన ఆస్థిని, తాతలనాటి వారసత్వపు ఆస్థిలో భార్య భాగస్వామ్యం ఉంది అన్నట్లుగా ఆమెకు ఆస్థి పంచాల్సి రావడం.

2. ఇందులో భార్య, విడాకులు కావాలంటే తీసుకోవచ్చు. వారిద్దరి మధ్యా ఎటువంటి గొడవా ఉండాల్సిన పనీలేదు. దీన్నే నో-ఫాల్ట్ డైవోర్స్ అంటారు.  దానికి అభ్యంతరం తెలిపే హక్కు మగవాడికి లేదు. కానీ పురుషుడు విడాకులు తీసుకోవాలంటే మాత్రం భార్య అభ్యంతరం తెలుపవచ్చు. ఆర్థికంగా తాను ఇబ్బందులకు గురవుతాను అన్న కారణం చూపి.

3. ఇందులో కేవలం భర్త ఆస్థిని మాత్రమే పరిగణలోఇకి తీసుకుంటారు. అతని ఆస్థి మాత్రమే భార్యా భర్తలిరువురికీ సమానంగా పంచబడుతుంది. కానీ, భార్య ఆస్థిని మాత్రం ఆవిడ ఆస్థిగానే పరిగణించ బడుతుంది, అందులో భర్తకు ఎటువంటి హక్కూ ఉండదు.

ఈ చట్టమే కనుక వస్తే మగవారు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుంది. ఇప్పటికే 498ఏ వంటి చట్టాలు దుర్వినియోగం వల్ల మగవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికితోడు ఇది కూడా కలిస్తే మగవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆలోచించండి. ఒకమ్మాయి ఒకబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత కావచ్చు, కొన్ని నెలల తరువాత కావచ్చు, ఆమెకు అతనితో పడక పోవచ్చు. అప్పుడు ఆమె అతని మీద తప్పుడు 498A కేసును పెట్టి, తరువాత విడాకులకులు కోరుతుంది. మగవాడికి స్త్రీ విడకులు అడిగితే కాదనే హక్కులేదు కాబట్టి చచ్చినట్టు విడాకులకు ఒప్పుకోవాల్సిందే, అతని ఆస్థిలో, అతని తాతల నాటి వారసత్వపు ఆస్థిలో చాలా భాగం కోల్పోవాల్సిందే. అంతా అయ్యాక కూడా 498A చట్టాన్ని అతను మరో 4లేదా 5 సంవత్సరాలు ఎదుర్కోవాల్సిందే. (అంత తొందరగా అవి తేలవు).  

అందుకే ఈ చట్టాన్ని పురుష వ్యతిరేకం అంటూ పురుష సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాదులోని పురుష హక్కుల సంఘం సేవ్ ఇండియన్ ఫ్యామిలీ  దీనికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద మెరుపు ధర్నాకు దిగింది. వాటికి చెందిన ఫోటోలు కొన్ని.

14 13 12 11 10 09 08 07 06 05 04 03 02 01

ఈ చట్టానికి సంబందించి జాతీయ స్థాయిలో వాడివేడిగా చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ మన మీడియా తెలంగాణ గొడవలో పడి దీన్ని పట్టించుకున్నట్టులేదు.  దీని గురించి మరింత సమాచారం కోసం NDTVలో వచ్చిన ఈ చర్చా కార్యక్రమాన్ని చూడండి.

ఆకాలం  నటీమణులలో ఒకరైన పూజా బేడీ స్త్రీవాడుల హిపోక్రసీని కడిగిపారేసిన తీరు నిజంగానే అభినందించ తగ్గ విషయం. ఆమె స్త్రీవాది కాదు, పురుష వాది కూడా కాదు. కేవలం ఇద్దరు పిల్లలకు తల్లి. అదే కాక ఆమె విడాకులు తీసుకున్న సమయములో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది కూడా. కానీ, ఇప్పుడు, ఒక మగ బిడ్డకు, ఒక ఆడబిడ్డకు తల్లిగా ఎంతో బ్యాలన్సుడుగా ఆలోచించి ఆమె మాట్లాడిన తీరు మన ఫెమినిస్టులకు చెంపపెట్టులాంటిది.

జియాఖాన్ ఆత్మహత్య ఒక విధంగా, సయెద్ మక్ధూం ఆత్మహత్య మరో విధంగా … ఎందుకీ వివక్ష??


జియాఖాన్ ఆత్మహత్య ఒక బాధాకరమైన సంఘఠన. ఆమె రాసినట్టుగా చెబుతున్న చివరి ఉత్తరంలో మనకు ఆమె ప్రేమ కనపడుతుంది, ఆవేదన కనపడుతుంది. ఆ ప్రేమను అందుకోలేని వ్యక్తులను మీద జాలి కలుగుతుంది, కోపం కలుగుతుంది. అది సహజం. ఆత్మహత్యలు పిరికి వారు మాత్రమే చేసుకుంటారు, ఆత్మ హత్య దేనికీ పరిష్కారం కాదు లాంటి మాటలన్నీ మనం వినడానికి బాగానే ఉంటాయి. కానీ, ఆ క్షణం, ఆ వ్యక్తి మానసిక పరిస్థితి వీటిని పట్టించుకునే స్థితిలో ఉండదు. అందుకే ఇవి జరుగుతూనే ఉంటాయి.

కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు సమాధానంలేనివిగా మిగిలి పోయాయి. వాటిలోకి వెల్లే ముందు, నేను మీకు మరో ఆత్మ హత్య గురించి చెప్పదలుచుకున్నాను. అది ఒక సాధారణ మగవాడి ఆత్మహత్య. ఓ తండ్రి ఆత్మహత్య. అతను హీరో కాదు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కాదు. ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతని పేరు సయ్యద్ అహ్మద్ మక్ధూం. ఇతను కెనడియన్ పౌరుడు, భారత దేశములో వర్కింగ్ పర్మిట్‌తో ఉండేవాడు. ఇక్కడ పెళ్ళికూడా చేసుకున్నాడు. అతని భార్య పేరు ముస్కాన్. ఆమె ఒక కంపెనీలో హె.ఆర్ గా పని చేసేది.

ఇక్కడ అతని భార్య ముస్కాన్ గురించి కాస్త చెప్పుకోవాలి. ముస్కాన్, మక్ధూంను పెళ్ళి చేసుకోక మునుపే మరో ఇద్దరిని మూడు సార్లు పెళ్ళిచేసుకుంది. ఆపెళ్ళిల్లు వేరే వేరే పేర్లతో చేసుకుంది.

  1. మొదటి వివాహం అస్లం జావీద్ తో 1997లో జరిగింది. అతనికి 1998లోనే విడాకులు ఇచ్చింది. అదికూడా విడాకుల పత్రంపై సంతకం పెట్టకపోతే 498Aకేసులు పెడతానని బెదిరించి విడాకులు తీసుకుంది.
  2. మొదటి భర్త వలన తనకు కలిగిన గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించుకుని, కోరమంగళలో (బెంగులూరులోని కాస్ట్‌లీ లొకాలిటీ) నివసించే ఇంతియాజ్ అహ్మద్ ను పెళ్ళిచేసుకుంది. అది కూడా తన పేరును “అతికా తజీన్” అని మార్చుకుని చేసుకుంది. పేరు మారింది కానీ, గుణం కాదు. రెండో భర్త, ఇంతియాజ్ ను కూడ బెదిరించి అతని వద్దనుండి పెద్ద మొత్తములో డబ్బు, నగలు గుంజుకుని, అతనికి కూడా విడాకులు ఇచ్చింది.
  3. ముచ్చటగా మూడో సారి, తిరిగి తన మొదటి భర్తకే వెల్లింది, “అతికా అసలాం” అని పేరు మార్చుకుంది. కానీ, మొదటి భర్తకు ఆమె అబార్షన్ చేయించుకుని, తమకు పుట్టబోయే బిడ్డను వదిలించుకుంది అని తెలిసిన తరువాత, ఇంటిలో ఉన్న నగలూ, డబ్బుతో … ఆమె, ఆమె కుటుంబం చెన్నైనుండి అదృష్యమైపోయారు. పోతూ, పోతూ అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి మరీ పోయారు. ఈ సారి, ఈ మూడో పెళ్ళికిగానూ, ఆమె చట్టపరంగా విడాకులూ ఇవ్వలేదు, మత పరమైన తలాక్ కానీ ఇవ్వలేదు. ఈ వివాహ బంధం లీగల్‌గా అలానె ఉందని ఆమె మొదటీ మరియూ మూడవ భర్త చెబుతున్నాడు.
  4. తరువాత ఆమె బెంగులూరుకు వచ్చింది. అక్కడ ముస్కాన్ సెహర్ అని పేరు మార్చుకుంది. (ముస్కాన్ జెహర్ అని పెట్టుకునుంటే బాగా సూటయ్యుండేది). షాదీ డాట్ కాం అనే మ్యాట్రిమోనియల్ సైటులో “ఆస్మీన్” అనే పేరుతో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. అక్కడె సయెద్ మక్ధూంను కలుసుకుంది. నాలుగవ పెళ్ళి జరిగింది. ఆమె తను ఇదివరకే పెళ్ళిచేసుకున్నానని, విడాకులు తీసుకున్నానని చెప్పిందే కానీ, మూడు వివాహాలు చేసుకుని, విడాకులు తీసుకుందని చెప్పలేదు. పెళ్ళికూడ సయద్ మక్ధూం కెనడనుండి, ఇండియాకి వచ్చిన రోజుల్లో హడావుడిగా జరిగిపోయింది.

కథ మళ్ళీ మామూలే. డబ్బుకోసం ఆవిడ మక్ధూంను వేధించడం మొదలు పెట్టింది. అంతే కాడు. వారికిపుట్టిన బిడ్డ “సయెద్ రియాన్” ను సరిగా చూసుకోవడం మానేసింది. విడాకులు కోరుతూ, అతను వరకట్నం కోసం వేధిస్తున్నాడు అని తప్పుడు 498A కేసు పెట్టింది. తన బిడ్డను కలవడానికి అతనికి అవకాశం కూడా లేకుండా చేసింది.

ఇక్కడ సయ్యద్ మక్ధూం గురించి కూడా కాస్త చెప్పుకోవాలి. ముస్కాన్ తో వివాహం అతనికి రెండవది. మొదట, కెనడాలో వివాహం చేసుకున్నాడు. అది వీగిపోవడాముతో, ఇండియాలో ముస్కాన్‌ను పెళ్ళిచేసుకున్నాడు. అది కూడా చెడిపోవడముతో మూడో పెళ్ళి చేసుకున్నాడు.

ఏప్రిల్ 5, 2009. గర్భవతి అయిన తన మూడవ భార్యను పుట్టింటికి సాగనంపి, ఇంటికి వచ్చాడు. ఆరోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కొన్ని నిమిషాల ముందు తాను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాను అన్నది తెలియజేస్తూ తన వద్దనున్న మొబైల్‌లో వీడియో రికార్డింగ్ చేశాడు.

ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంటే బోలెడంత సింపతీ చూపించే వారు, అదే పురుషుడు ఆత్మహత్య చేసుకుంటే అతని గురించి ఎంతో హీనంగా మట్లాడుతారు. “మగవాడిలా బతుకు (Be a Man)” అంటూ మట్లాడేవారి దగ్గరనుండి, అతన్ని కించపరుస్తూ వార్తలు ప్రసారం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ, News 9 ఛానెల్ మరికొన్ని పత్రికలు అతనిపై కాస్త సానుభూతిని ప్రదర్శించాయి. అందులో న్యూస్ 9 చేసిన ప్రోగ్రాం చూస్తే, జరిగింది మరింత వివరంగా అర్థమవుతుంది …

పైన విడియోలో అతనికి అతని కొడుకంతే ఎంత ప్రేమ ఉన్నదో వివరంగా అర్థమవుతుంది. న్యూస్ 9 వారు, మక్ధూం విడియోలో రికార్డ్ చేసిన దానికి ఇంగ్లీష్ అనువాదం ఇచ్చారు, నేను దాన్ని ఇక్కడ తెలుగులో ఇస్తున్నాను…

నేను ఈరోజు నా జీవితాన్ని అంతంచేసుకుంటున్నాను. దానికి కారణం నేను దారుణంగా మోసపోవడమే. నేను అనేక హింసలను ఎదుర్కొన్నాను, వాటిని భరించడం ఇక నావల్ల కాదు. ముస్కాన్ సెహర్, ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ నన్ను దారుణంగా మోసం చేశారు. వారు నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేశారు. నా కొడుకే నా జీవితం. వారు నన్ను రోజూ తీవ్రంగా బెదిరించే వారు, నన్ను నా కొడుకునుండి దూరం చేశారు. దీని ప్రభావం నేను చేస్తున్న ఉద్యోగం మీద కూడా పడింది. నేను నా కొడుకు రియాన్ మీద ఉన్న ప్రేమ కారణంగా వీరిని భరించాను. వారు నా దగ్గరనుండి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అంత పెద్ద మొత్తములో డబ్బు తేవడం నాకు సాధ్యమయ్యే పని కాదు. తరువాత వారు నా మీద తప్పుడు వరకట్నం కేసును పెట్టారు. నేను ఏ రోజైతె పోలీసు స్టేషను వెల్లవలసి వచ్చిందో, ఆరోజే నేను సగం చచ్చిపోయాను. దాని తరువాత ప్రతీ రోజు చస్తూనే ఉన్నాను. నా కొడుకు నాకు దూరమవ్వడముతో నేను ప్రతీ నిమిషం నరకం అనుభవించాను. వారిని నేను ప్రాధేయపడ్డాను, నేను బాధపడడం వారు చూశారు. వారి కాళ్ళుపట్టుకుని బ్రతిమాలాను. నా కొడుకును నేను పొందడానికి నేను చేయగలిగిన పనులన్నీ చేశాను.

నేను ఎంత బ్రతిమాలినా వారి హృదయాలు కరగలేదు. తరువాత నేను ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెల్లాను. నా లాయర్, నా ఫీలింగ్సును పట్టించుకోకుండా, ఆ కేసును సాగదీస్తూ వచ్చాడు. ఈ రోజుతో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. “ఈద్” (పండుగ) కూడా వెల్లిపోయింది, నా కొడుకు పుట్టినరోజుకూడా దాటిపోయింది, కానీ నేను మాత్రం నా కొడుకును కలవలేకపోయాను. నాకు కూతురు కూడా పుట్టింది, కానీ నేను ఆమెను ఒక్కసారి కూడా చూడడానికి నోచుకోలేక పోయాను.

ఇప్పటికి దాదాపుగా ఒక నెల రోజుల నుండీ నేను నా భార్యను బ్రతిమాలుతున్నాను. కానీ, ఆమెకు హృదయం లేదు. దేవుని పేరు మీదుగా నేను ఆమెను వేడుకున్నాను, ఈ డర్టీ గేంలోనికి పిల్లలను తీసుకు రావద్దు అని. కానీ, ఆమె అసలు మనిషే కాదు. నేను ఈరోజు నా జీవితాన్ని అంతం చేసుకుంటున్నాను. అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. నా కూతురుని, కొడుకునీ వదిలేసి వెలుతున్నాను. వారిని జాగ్రత్తగా చూసుకోండి.

“నా జీవితం నా కొడుకు కోసమే. నేను మోసగత్తె అయిన నా భార్య చేతిలో మోసపోయాను, ఆమె ఇదివరకే మూడు పెళ్ళిల్లు చేసుకుంది” – ఈ వ్యాఖ్యలు అతని కొడుకుపై అతనికున్న ప్రేమను తెలిపేవే. ఒక్కసారి విడాకులు తీసుకున్న తరువాత, మగవారు పిల్లలకు దూరమవ్వవలసిందే. కస్టడీ ఎవరికి దక్కాలి అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ, సహజంగా అది స్త్రీల పక్షపాతంగానే ఉంటుంది. ఇక్కడ మక్ధూం విషయములో ఇంకా కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. వారి విడాకుల కేసు అప్పటికింకా కోర్టులో నడుస్తూనే ఉంది, కస్టడీ కోసం అతను పోరాటం చేస్తున్నాడు. కానీ, ఆపోరాటం అలా సంవత్సరాలు తీసుకుంటూనే ఉంది. అంతవరకూ, అతను అతని కొడుకును కానీ, కొద్దికాలం క్రితమే పుట్టిన కూతురుని కానీ, చూడడానికి అత్తమామలు నిరాకరించారు.

తన బిడ్డలపై ఉన్న ప్రేమతో CRISP అనే సంస్థలో మెంబర్‌గా కూడా జాయిన్ అయ్యాడు, మక్ధూం. CRISP (Children’s Rights Initiative for Shared Parenting) అనే సంస్థ, తండ్రుల హక్కులకోసం పోరాడుతోంది. ఆ సంస్థ ప్రతినిధి కుమార్ జోగిర్దార్ తో ఇంటర్వ్యూ కూడా పైనిచ్చిన విడియోలలో ఉంది (News 9’s 4th video).

అతను ఆత్మహత్యా విడియోతో పాటు, ఒక ఉత్తరాన్ని కూడా రాశాడు. అందులో, అతను తన కొడుకును చూడడానికి తపిస్తున్నానని, కానీ … అతని అత్తమామలు, భార్య అతన్ని కలవనివ్వడం లేదని ఆవేదన చెందాడు. అతని ఆత్మహత్యకు భార్య, అత్తమామలే కారణమని కూడా పేర్కొన్నాడు. ఆ లేఖలోనే తన కొడుకును ఉద్దేశించి ఒక పద్యం కూడా రాశాడు.

To Ryan,

I Know I am not there,
To tell you the stories
I made for you every night

I Know I am not there,
To sing your song and put
You to sleep

I may not be there to teach
you the prayers
I may not be there to start
Our pillow fights

We may not be sharing the
relaxed weekends
When we massaged and took
long baths together

We may not be together to
enjoy
The excitement bike rides and
buy the candies

every night I lay on our bed
I imagine you holding me
tight

It’s you I love, and of you I
think
If you were here I would give
you a squeez,
And ask if you could give me
one please.

Remember my son, you are
everything to me
you are purpose of my
Life and worship
I shall never give upon you
As you are the one who
Makes me complete

సయెద్ మక్ధూం ఆత్మహత్యకు ముందు ఇచ్చిన రికార్డు చేసిన విడియోని కొంత మంది యూట్యూబులో పెట్టారు. న్యూస్ 9 వారి ప్రోగ్రాం కాకుండా అదే డైరెక్టుగా చూడాలనుకుంటే ఇది చూడండి …

ఇక్కడ సమాధానం లేని ప్రశ్నలేమిటంటే, మగవారు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని తేలికగా కొట్టి పారేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ, ఆడవారు చేసుకుంటే మాత్రమే వారిలో చలనం వస్తుంది. సానుభూతి వెల్లువై పారుతుంది. మక్ధూం ఒక్కడే కాదు, ఇలా ప్రతీ సంవత్సరం 57,000 మంది వివాహిత పురుషులు కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1996 తరువాత ఆత్మహత్యలు 40% పెరిగాయి. ప్రతీ సంవత్సరం 4% శాతం ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అదే జననాల రేటు 1% మాత్రమే. అంటే పుట్టేవారికన్న 4% ఎక్కువ మంది మగవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడవారితో పోల్చుకుంటే ప్రతీ ఒక్క వివాహిత స్త్రీకి, 1.86 (దాదాపుగా రెట్టింపు సంక్యలో) మంది వివాహిత పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా, కొందరు వీటిని పట్టించుకోవడం లేదు. దానికి వారు చెప్పే కారణం, ఇది పురుషాధిఖ్య ప్రపంచమని. కానీ, ప్రతీ రోజూకు పెరుగుతూ పోతున్న వీటిని కేవలం ఆసాకును చూపి పట్టించుకోకుండా ఉండడం వెనుక అనేక రాజకీయ కారణాలున్నాయి. అది ఓటు బ్యాంకు కావచ్చు, లేదా కాలం చెల్లిన “సిద్దాంతాలు” కావచ్చు. కారణమేదైనా, ఈ వివక్షను వారు ఎంతకాలం ఇలా చూపుతూ పోతారు? ఇప్పుడు జియాఖాన్ ఆత్మహత్య చేసుకోవడముతో సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్టు చేశారు. కొంత మంది దాన్ని స్వాగతిస్తున్నారు. మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ, ఇదే విధంగా అనేక మంది కుర్రాళ్ళు ప్రేమలో విఫలమై ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆయా కేసుల్లో అమ్మాయిని అరెస్టు చేయగలరా? చేయరు (ఇది నిజం, చాలా కేసుల్లో నిరూపించ బడింది కూడా). దీనికి అంతం ఎప్పుడు?? ప్రస్తుతం మగవారు కూడా అనేక బాధలు ఎదుర్కొంటున్నారనీ, వారికోసం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందనీఎప్పుడు గ్రహిస్తారు??

ఢిల్లీ విద్యార్థి రేప్, చిత్ర హింసలు, ఫేస్‌బుక్‌లో నగ్నచిత్రాల పొస్ట్..!!


ఢిల్లీలో మరో రేప్.  ఈ సారి బాధితుడు ఒక యువకుడు. అతన్ని అపహరించి, చిత్రహింసలకు గురిచేసి,  అతన్ని రేప్ చేసి, తరువాత అతని మర్మావయవాలపైనా మరియు గాయాలపైనా ఉప్పూ, కారం, లిక్కర్ పోసి హింసించారు. తరువాత అతని నగ్న చిత్రాలను ఫేస్‌బుక్ లో అప్‌లోడ్ చేశారు. ఈ భయానక సంఘటన ఘజియాబాద్‌లోజరిగింది (దాదాపుగా ఢిల్లీలో కలిసిపోయిన ప్రాంతం).

ఈ దారుణానికి వొడిగట్టిన వ్యక్తి ఆ గ్రామ పెద్ద.  బాధితుడు, తన కూతురిని ఫోన్లు చేసి వేధిస్తున్నాడు అన్న అనుమానముతో ఈ గ్రామ పెద్ద ఇటువంటి ఘాతుకానికి ఒడిగట్టు కొన్ని వార్తలు చెబుతున్నాయి. మరికొన్ని మాత్రం బాధితుడు తన కూతురుతో స్నేహంగా ఉండడం ఇష్టం లేకే ఇటువంటి పని చేశాడని చెబుతున్నాయి. రెండింటిలో ఏది నిజమైనా సరే, జరిగింది మాత్రం దారుణం, గర్హనీయం, శిక్షార్హం.

బాధితుడు, గ్రామ పెద్ద కూతురు మధ్య ఉన్న స్నేహం గ్రామ పెద్దకు నచ్చలేదు. తన కూతురితో స్నేహాన్ని మానకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించడం కూడా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాధితుని సోదరుడి మాటల ప్రకారం, బెదిరింపులు ఎదుర్కొన్న తరువాత, అతను[బాధితుడు] గ్రామపెద్ద కూతురుని దూరంగా పెట్టాడు. కానీ, అతని  దురదృష్టవశాత్తూ, ఆమెకు కొంత మంది ఆకతాయిల నుండి అసభ్య ఫోన్ కాల్స్ రావడం జరిగింది. అది బాధితుని పనే అని భావించిన గ్రామ పెద్ద ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

గ్రామ పెద్ద, అతని అనుచరులు మరి కొంతమంది ఆ యువకున్ని, ఈ అసభ్య ఫోన్ కాల్స్ గురించి ఏమాత్రం వివరణ అడగకుండా, కనీసం వాటిని ప్రస్తావించకుండా అపహరించి, ఒక ఫార్మ్ హౌస్ కి తీసుకెల్లి, అక్కడ అతన్ని విపరీతంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారు. వారిలో ఒకతను ఆ యువకున్ని రేప్ చేశాడు (Sodomy). అతని మీదకి కుక్కలను ఉసిగొల్పారు. తరువాత అతని గాయాలపైనా, మర్మావయవాలపైనా ఉప్పు, కారం రాసి, లిక్కర్ పోసి హింసించారు. ఆ యువకుడు తనకూ, అసభ్య ఫోన్ కాల్స్ కు ఎటువంటి సంబంధం లేదని, తనను వదిలేయమని ఎంత ప్రాధేయపడినా వారు కనికరించలేదు. ఈ దారుణమైన ఘఠన సోమవారం చోటు చేసుకుంది.

విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు మంగళవారం ఫాం హౌసుకు వెల్లి అతన్ని విడిపించారు.  గ్రామపెద్ద, బాధితుడిని అతని కుటుంభాన్ని  తీవ్రంగా బెదిరించడం కూడా జరిగింది.  బాదితుని కుటుంబ సభ్యులు గ్రామ పెద్దతో ఢీకొనగలిగే శక్తిలేక అతనితో కాంప్రమైజ్ అవ్వడానికే నిశ్చయించుకున్నారు. కానీ,  ఇది ఇంతటితో ఆగలేదు. ఫేస్‌బుక్కులో ఒక ఫేక్ అకౌంటు క్రియేట్ చేసి, ఆయువకుని నగ్న చిత్రాలను పోస్టు చేయడమే కాదు, చాలా మందికి ఇన్విటేషన్లు పంపడం, అతని స్నేహితులకు ఆఫోటోలు పంపడముతో, ఆయువకుడు దాన్ని భరించ లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానీ, అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నాలను ఆపారు.  చివరకి ఆ యువకుడు బుధవారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి, తనకు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండని కోరడం జరిగింది. వారు అతన్ని వారించి, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పోలీసులు నిందితులపై 323 (punishment for voluntarily causing hurt), 328 (causing hurt by means of poison etc, with intent to commit an offence), 342 (punishment for wrongful confinement), 377 (unnatural offence), 147 (punishment for rioting), 148 (rioting, armed with deadly weapon) , IT Act.  సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మీడియా ధోరణి:  అత్యాచారం జరిగింది యువకుడి మీద కావడముతో మీడియా హైపర్ సెన్సిటివిటీ చూపలేదు సరి కదా కనీస భాధ్యతను కూడా మరిచిందని చెప్పొచ్చు.  మొత్తం ఈ సంఘఠనలో మీడియా బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టూ కనిపిస్తోంది.

1. మొదటగా వారు దీన్ని ఎక్కడా “రేప్” అని మెన్షన్ చేయలేదు. చాలా వరకు వార్తా కథనాలలో “యువకుడి అపహరణ, చిత్రహింసలు, సోడొమి అనే పదాలు వాడారే కానీ, రేప్ అనే పదాన్ని ఎక్కడా వాడకుండా జాగ్రత్త పడ్డారు(ఒకటీ అరా పత్రికలు దీనికి మినహాయింపు). వారు దీన్ని రేప్ గా భావించడం లేదా?  రేప్ బాధితులలో మగవారు కూడా ఉంటారు అనే అంశాన్ని వారు అంగీకరించడం లేదా?

2. రేప్ కేసులలో బాధితురాలు పేరు బహిరంగ పరచకూడదు కానీ మీడియా బాధితుని పేరూ, గ్రామం, కాలేజీ అన్నీ విపులంగా ప్రచురించాయి.  ఫోటో పెట్టడం ఒక్కటే తక్కువ.  ఎందుకంటే అతను పురుషుడు కాబట్టి, అలా ప్రచురించడం చట్ట ప్రకారం ఎటువంటి చిక్కులను తెచ్చిపెట్టడు కాబట్టి. కానీ వారికున్న నిబద్దత ఏమైంది? మగవారిపై జరిగే రేప్ లను చట్టం, మీడియా రేప్‌లుగా గుర్తించదు అనుకున్నా, కనీసం ఆవ్యక్తి ఐడెంటిటీని దాచొచ్చు కదా? గ్రామ పెద్ద యువకుడి నగ్న చిత్రాలను ఫేస్‌బుక్కులో పెట్టి కేవలం కొంత మందికి మాత్రమే తెలియ పరచ గలిగాడు. కానీ, మీడియా మాత్రం  అతని పేరూ, ఊరూ, కాలేజీ ప్రచురించి దేశం మొత్తానికి తెలియ పరిచింది.

ఈ చర్యను వ్యాఖ్యాతలు తీవ్రంగా నిరసించిన తరువాత, కేవలం ఫస్ట్ పోస్ట్ మాత్రమే జరిగిన తప్పిదానికి క్షమాపణలు తెలియ జేసుకుని పేరును తొలగించింది.  మిగిలిన పత్రికలు (టైంస్ ఆఫ్ ఇండియా తో సహా) ఆ పనులు చేయలేదు.

చట్టాల తీరు:  మగవారిపై స్త్రీలు అత్యాచారం చేస్తే (ఇది సంభవమే, చాలా జరిగాయి కూడా) దాన్ని మన చట్టం రేప్‌గా గుర్తించదు. రేప్ చట్టాలలో కేవలం పురుషుడు మాత్రమే దోషి. స్త్రీలను దోషులుగా చట్టం గుర్తించదు. కానీ బాధితుడు మాత్రం స్త్రీ, పురుషులు ఇరువురూ అవ్వొచ్చని ఈ మధ్య చదివినట్టు గుర్తు. మరి పోలీసులు ఎందుకు దీన్ని రేప్ కేసుగా పరిగణించడం లేదో మరి. వారు కేసులు పెట్టిన సెక్షన్లలో దీన్ని అన్ నేచురల్ సెక్స్ కు సంబందించిన సెక్షన్లలో మాత్రమే చేర్చారు.

ఏదేమైనా ఇటువంటి కేసులలో మీడియా, చట్టం రెండూ తమ దృక్పదాన్ని మార్చుకొని, బాధితులకు న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రిఫరెన్సెస్: బాదితుని పేరు ప్రచురించని వాటిని మాత్రమే నేను రిఫరెన్సుగా ఇస్తున్నాను.

1. Another shocker: DU student raped for being friends with a girl

2. Man abducts, strips Delhi University boy

%d bloggers like this: