కట్టుబాట్లు – దురాచారాలు, ఇల్లు – ఎలుకలు, 498A – తలతిక్క వాదాలు, AFSPA ..!!


కొండలరావు గారు ఏర్పాటు చేసిన చర్చా వేదిక ప్రజ – (ప్రశ్న మీదే – జవాబు మీదే) .. బ్లాగులో నేను చేసిన కొన్ని కామెంట్లు ఇవి. వాటిలో కొన్ని, కొంత మందికి నేను ఇవ్వాలనుకుంటున్న సమాధానాలు. అందుకే ఇక్కడ ఉంచుతున్నాను.

కట్టుబాట్లు – దురాచారాలు :

అసలు కట్టుబాట్లు, దురాచారాలు అనేవి ఏమిటి? అవి ఎలా ఉద్బవించాయి? వాటికారణంగా స్త్రీలు ఎందుకు బాధలు పడ్డారు? ఈ కట్టుబాట్లనేవి ఒకప్పటి చట్టాలే. వాటికి కారణం పురుషాధిక్యత కావచ్చు లేక పోతే మతం కావచ్చు. అలాంటి కట్టుబాట్లు (చట్టాలు) రావడానికి కారణమయ్యాయి. కానీ, ప్రస్తుతం ఆ కట్టుబాట్లకు విలువ లేదు. కానీ, సమాజములో ఇంకా కొన్ని మనుగడ సాగిస్తున్నాయి. మరికొన్ని అంతరించి పోయాయి. ఆడపిల్ల చదవకూడదు అనో, స్త్రీలకు స్వాతంత్రము ఉండ కూడదు అనో చేసిన ఒకప్పటి చట్టాలు ఇప్పుడు పాటించాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? లేదు. కొన్ని చోట్ల అవి రుద్దబడుతూ ఉండొచ్చు. కానీ, ఎవరైనా ఎదిరించి నిలబడితే అవి పారిపోతాయి. అంటే కాలితో తంతే పోయేవే కట్టుబాట్లు ప్రస్తుతం.

కానీ, చట్టాలు అలా కాదు. చట్టాలను కాదు అనడానికి వీలు లేదు. ఇష్టమున్న లేకపోయినా వాటిని ఆచరించి తీరాల్సిందే. అంటే మనము ఒక సరికొత్త ప్రపంచజీవన విధానాన్ని (New World Order) చట్టాల ద్వారా నిర్దేశిస్తున్నాము. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. 498A కేసును నిరభ్యంతరంగా దురుపయోగం చేసి మగవాడి మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఫెయిలయిన ప్రతీ వివాహం మగాడికి ఒక నరకముగా మార్చొచ్చు. ఆ వివాహం విచ్చిన్న మవడానికి ఇరువురూ కారణమే అయినా సరే. ఆడది తలుచుకుంటే ఈ పని చేయొచ్చు. దాన్ని మగాడు కాదన్నా ఆగదు, సాక్షాత్తూ సుప్రీము కోర్టే 498A దురుపయోగం లీగల్ టెర్రరిజం గా మారింది అని స్టేట్‌మెంటిచ్చినా మారదు. ప్రెసిడెంటు సైతం అవి భారీగా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పినా ఆగదు.

కొన్ని చోట్ల చట్టాలు అసలు అమలవ్వక పోవచ్చు, లేదా మంచి పవర్‌ఫుల్ పొజిషన్లో ఉన్న వాల్లకు ఏవన్నా వెలుసు బాట్లు దొరికుండొచ్చు. వారి విషయములో కూడా న్యాయ పోరాటం చేస్తే శిక్షలు వేయించొచ్చు. దానికి ఎప్పుడైనా స్కోపు ఉంటుంది.

498A దుర్వినియోగం ఎవరో ఒకరు పెద్ద పదవులలో ఉన్న వారు చెప్పారనో, ఒకరిద్దరు దురుపయోగం అవుతుందని చెప్పారనో .. అందరూ అంటున్నది కాదు. దానికి చెందిన, గణాంకాలూ పురుష హక్కుల కార్యకర్తలు అందరికీ చూపించిన తరువాత, అనేక డిబేట్ల తరువాత మాత్రమే అది నిజమని అంగీకరించడం జరిగింది. ఒక్క సారి యూట్యూబు కెల్లి 498A అని టైప్ చేయండి. ఎన్ని డిబేట్లు కనిపిస్తాయో. అవన్నీ అనేక మహిళా సంఘాలు, పురుష హక్కుల సంఘాలూ అనేక టీ.వీ ఛానల్లలో చేసిన చర్చలే. కనీసం నాలుగైదన్నా డిబేట్లో అవి దురపయోగం అవ్వడం లేదు అని నిరూపిత మయ్యుంటే చూపించండి.

ఒక్కసారి పురుష హక్కుల సంఘాల వాల్లు గణాంకాలు చూపించడం మొదలు పెట్టిన తరువాత న్యూట్రలుగా ఉందే వారంతా అంగీకరించారు. అవి దురుపయోగం అవుతున్నాయని.

ఇల్లు – ఎలుకలు, 498A – తలతిక్క వాదాలు :

ఎలుకలున్నాయని ఇంటిని తగల బెడతామా? దుర్వినియోగం ఉందని చట్టాలు వద్దంటామా అని చెప్పిన వారున్నారు. సరే, ఇంటిని తగల బెట్టా వద్దు, చట్టాలను మార్చావద్దు. దురుపయోగం చేసే వాల్లకు శిక్షలు కూడా అదే చట్టములో చేర్చండి. భయం అనేది ఇరువురికీ ఉండాలి కదా? కానీ, అలా జరగలేదు.

ఎక్కడిదాకానో ఎందుకు ప్రస్తుతం జస్టిస్ వర్మ కమిటీ ఇచ్చిన రిపోర్టు తీసుకోండి. అందులో పనిచేసే చోట మహిళలపై వేదింపులకు చెందిన చట్టములో 14 వ సెక్షన్ను తొలగించడం జరిగింది. అదేమిటో తెలుసా, ఎవరైనా మహిళ ఈచట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఆమెకు ఆయా సంస్థలలో ఉన్న రూల్సుకు అనుగుణంగా శిక్షించాలని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది సెక్సువల్ హరాస్‌మెంట్ చేసిన మగవారికి విధించే శిక్షలతో పోలిస్తే నామ మాత్రం. కానీ, జస్టిస్ వర్మ తన రిపోర్టులో ఈ సెక్షన్ను తొలగించ మని సూచించారు. కారణ మేమిటో తెలుసా? అది ఆయా సంస్థలు దురుపయోగం చేసే అవకాశం ఉందని.

చూశారా? దురుపయోగం చేసి మగవారిని ఇబ్బంది పెడితే, అది పెద్ద విషయం కాదు. ఇల్లు తగలెట్ట కూడదు లాంటి సామెతలు చెబుతారు. అదే దురుపయోగం ఆడవారిపై జరుగుతుంది అని తెలిస్తే అసలు ఆ సెక్షన్నే ఎత్తేస్తారు (అవకాశం ఉందని తెలిస్తే, ఇంక అవ్వలేదండోయ్). దాని బదులు, దురుపయోగం ఎవరు చేసినా శిక్షలు ఉండేలా చట్టాన్ని చేయొచ్చు కదా? దురుపయోగం చేస్తే శిషించ వద్దని మగవారు చెప్పడం లేదే?

అదండీ మన జెండర్ ఈక్వాలిటీ కథ.

—————————————————————————-

విశేషమేమిటంటే, చట్టాలు దుర్వినియోగం అవ్వడం వాటిని రద్దు చేయడనికి ప్రాతిపదిక కాదు అని నీతులు చెప్పిన వారే, , భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA – Armed Forces Special Powers Act) దురుపయోగ మవుతోంది కాబట్టి దాన్ని తీసేయమని చెబుతారు. ఎందుకు? దురుపయోగం అనేది చట్టాలు తీసేయడానికి కారణం కాదు కదా? ఇంట్లో ఎలుకలున్నాయని, ఇల్లు తగలబెట్ట కూడదు కదా? కానీ, వీరు వీటి గురించి ఆలోచించేప్పుడు అలాంటివి అస్సలు ఆలోచించరు. కారణం ?

—————————————————————————-

ఇక చట్టాల గురించి నేను చెప్పాలనుకునేదేమిటంటె.. అవంటే నాకు వ్యతిరేకత లేదు. కేవలం అవి దుర్వినియోగ మయ్యి మరో కొత్తరకం బాదితులను సృష్టించొద్దు అన్న ఉద్దేశ్యం తప్ప. అందుకే నేను చెప్పేది ఏమిటంటె ..

చట్టాలు చేసేప్పుడు మరియూ ఇప్పటి వరకూ ఉన్న చట్టాలలో — “స్త్రీ” లేదా “పురుషుడు” అని ఉన్న చోట్ల “వ్యక్తి” అని, “భార్యా” లేదా “భర్త” ఉన్నచోట “జీవిత భాగ స్వామి” అని చేర్చండి. దీని ఆవశ్యకత ఎక్కడుంటే అక్కడ ఈ నియమాన్ని అనుసరించి చట్టాలు చేయండి. అదే కాదు, దురుపయోగం ఎవ్వరు చేసినా సరే (ఆడైనా, మగైనా మరొకరైనా) శిక్షలు పడే విధంగా ఆ చట్టాలలోనే నిబందనను చేర్చండి.

(Make every law gender neutral. Replace “Man” or “Women” with “Person”, “Husband” or “Wife” with Spouse where ever it is applicable.  And include the clause, such that every misuser punished. This is the standard demand of All Men Organizations)

చట్టాల దుర్వినియోగం ఎందుకు సీరియసుగా తీసుకోవాలో పైన దురాచాలు, కట్టు బాట్లు అనే వాటిలో చెప్పాను. ఈ దురాచాలు – కట్టుబాట్లు అనేవి ఒకప్పటి చట్టాలు. ప్రస్తుతం ఉన్న చట్టాల దురుపయోగం కూడా పట్టించుకోకపోతే ఆ స్థాయికి వెల్లే ప్రమాదముంది. అసమానతలనుండి అసమానతలవైపు ప్రయాణం గా అది మారుతుంది.

సమాజములో కొంత మందికి అన్యాయం జరుగుతోంది అని చెబితే, దానికి కారణం ఏమిటి అని కాకుండా, వారిది ఏ వర్గం (ఏ క్లాసు) అని చూసుకొని అభిప్రాయాలకి రావడం కన్నా ఊరకుండడం మేలు. అదే సమాజానికి గొప్ప మేలు.  అటువంటి సిద్దాంతాల కన్నా, ఎవరికి అన్యాయం జరిగినా చర్యలుండాలనే “తలతిక్కే” మేలేమో కదా?

స్త్రీలంతా మంచివారూ – పురుషులంతా చెడ్డవారూ..!!


ఆడది అంటే బుద్ధిమంతురాలు – మగాడు అంటే దుర్మార్గుడా!?
దుర్మార్గం జరగడానికి ఆడా – మగా అనేదానిని బట్టి కారణం ఉంటుందా?
 బుద్ధి అనేది మనిషికి ఉంటుందా? ఆడకొకతీరు, మగకొక తీరు ఉంటుందా?
 వ్యవస్థను బట్టి బుద్ధి ప్రభావం ఎంతమేరకు ఉంటుంది? 

ఇది కొండల రావు గారు అడిగిన ప్రశ్న. దానికి నేను రాసిన కామెంటు.. టపాగా ఇస్తున్నా అంతే.
====================================

ఒక్కసారి ఈ ప్రశ్న అడిగిన తరువాత .. ఆజన్మ మగ ద్వేషులు కూడా కాదనే సమాధానం చెబుతారు. ఎందుకంటే, పొలిటికల్ కరక్ట్‌నెస్ అనేది ముఖ్యం కాబట్టి. కానీ, మిగిలిన సమయాలలో మాత్రం మగజాతంటేనే దుర్మార్గపు జాతి అన్నట్లుగా స్టేట్మెంట్లిచ్చేస్తారు. అడిగితే మాత్రం, ఇక్కడ మగవారు అన్నది అందరి మగవారినీ కాదు, అలా చేసే వారిని గురించి మాత్రమే అని వివరణ ఇస్తారు. కొన్ని రోజుల తరువాత, వివరణ అడగాలన్న కోరిక మగవారికి ఉండదు,విసిగిపోయుంటారు. దానితో ఇవ్వాల్సిన అవసరం ఆ చెప్పే వారికీ ఉండదు.

అదే ఒక స్త్రీ తప్పు చేసినట్టు తెలిసినరోజు ఆడవాళ్ళంతా ఇలాంటి వారే అనగానే .. వాడ్నో మగ దురహంకార పురుగుని చూసినట్లు చూసేస్తారు. నా ఉద్దేశ్యం ఆడవారంతా అలాంటి వారు కాదు అని చెప్పినాకూడా ఒప్పుకోరు. “ఆడది అంటే …” అని మొదలు పెట్టి ఉపన్యాసం ఎక్కడాపుతారో ఎవ్వరికీ తెలీదు, చివరికి అలా చెప్పేవారిక్కూడా.

దీనివలన చివరికి జరిగేది ఏమంటే, మగవారి గురించి ఎంత చెత్తగా మాట్లాడినా, ఎంత ఘోరమైన అన్యాయం మగవారికి జరిగినా సమాజములో రెస్పాన్సు ఉండదు. అలవాటు పడిపోతుంది సమాజం. అదే ఆడవారి విషయములో హైపర్ సెన్సిటివిటీకి అలవాటు పడిపోతుంది. నిజంగానే తప్పు చేసిన స్త్రీపై కూడా కఠినంగా ప్రవర్తించలేని స్టేజుకి సభ్య సమాజం వెల్లి పోతుంది (ఇక్కడ సభ్య సమాజం అనే పదం అండర్లైన్ చేసుకోండి).

అక్కడి నుండి సినిమా మొదలవుతుంది. మగవారికి ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడని పురుష పుంగవులు, స్త్రీకి జరిగిన అన్యాయానికి మాత్రం గొంతు చించుకోవడం మొదలు పెడతారు. “కారణం క్రిములు ” అని ఏదో అడ్వర్టైజుమెంటులో అన్ని రోగాలకూ కారణం అవే అని చెప్పినట్టు.. దీనికంతటికీ కారణం పురుషాధిక్య ప్రపంచం, పితృస్వామ్య వ్యవస్థ అంటూ పడికట్టు పదాలు మొదలౌతాయి.

ఇలాంటి విషయాలకు కొన్ని ఉదాహరణలు :

  •  మగవాడు ఆడది తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తే కోప్పడడం తప్ప ఏమీ చేయలేడు. అదే ఆడది, చెప్పుతో కొట్టికూడా ఎలాంటి సమస్యలు లేకుండా బయటికి రాగలదు.
  • సినిమాలలో చూసే ఉంటారు. మగవారిని బెల్టు కింద కొట్టడం (Hitting Below The Belt) ఒక హాస్యం. సరదాగా కూడా కొట్టొచ్చు. అదే అమ్మాయిలపై కొన్ని జనరలైజుడు స్టేట్మెంట్లిచ్చినా కూడా అది వారికి జెండర్ సెన్సిటివిటీ ఇష్యూగా తయారవుతుంది. ఫైనలుగా, ఎప్పుడో ఒకప్పుడు బయట జరిగే అత్యాచారాలకు ఇటువంటి సినిమాలే కారణం అవుతున్నాయన్న పేరు కూడా వచ్చేస్తుంది.
  • ఇక సమాజం విషయానికి వస్తే, కొన్నాల్ల క్రితం బెంగలూరులో ఒక స్త్రీ తన బాయ్ ఫ్రెండు మగతనాన్ని తొలగించింది. అతను తనను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోలేదని. ఆమెతో సంబందం నెరిపి, తరువాత పెళ్ళికి ఒప్పుకోలేదు కాబట్టి ఆమె చేసింది సరైనదే అని ఎంత మంది నెటిజన్లు తీర్పిచ్చారో చెప్పలేను. “Well done woman, way to go”, “మంచి పని చేసింది” లాంటి మాటలకు లెక్కేలేదు. అదే రేపుల విషయానికి వస్తే మాత్రం, అది ఏకారణముతో రేప్ చేసినా సరే, రేప్ అనేది ఒక హీనమైన చర్య, మానవ మృగాలు మాత్రమే చేసే చర్య. అసలు దాన్ని ఖడించడానికి కొత్త కొత్త మార్గాలు వెతికి మరీ ఖండించేస్తారు. తప్పు కాదు. అది అవసరమే. కానీ, నేను దీన్ని చెబుతున్నది రేప్ అనే చర్యను ఖండించినదుకు కాదు, మగవారిపై జరిగే అన్యాయాల విషయములో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోరు. కొంత మంది దారుణంగా సపోర్టు కూడ చేస్తారు, దానికోసం చెబుతున్నాను.

ఇది ఇలా ఎందుకు జరుగుతుంది. ప్రతి మనిషిలో ప్రస్తుతం అంతర్గత పురుష ద్వేషం (Internal Misandry) అనేది గూడు కట్టుకుపోయింది. ఆ అంతర్గత పురుష ద్వేషం కారణంగానే స్త్రీలంతా మంచివారు, పురుషులు చెడ్డవారు అన్న భావన కలుగుతోంది.

ఆఫీసుల్లో సెక్సువల్ హరాస్‌మెంట్ పై రాబోతున్న సినిమా ..!!


టైటిలు క్యాచీగా ఉంటుందని ఆఫీసుల్లో సెక్సువల్ హరాస్‌మెంట్ అని పెట్టాను, దాన్ని పనిచేసే చోట అని చదువుకోండి.  పనిచేసే వాల్లందరూ ఆఫీసుకే వెల్లాల్సిన అవసరం లేదు. అన్ని చోట్లా  సెక్సువల్ హరాస్‌మెంట్ ను నిరోధించడానికి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. అది బహుషా రాజ్య సభలో పాసవ్వాల్సి ఉందనుకుంట.  సుప్రీం కోర్టు విషాఖా కేసులో ఇచ్చిన కొన్ని సూచణల ఆధారంగా, ఈ చట్టాన్ని రూపొందించామని చెబుతున్నా, ఇది యాజ్ యూజువలుగా పాశ్చాత్య దేశాలలో ఉన్న చట్టాలనే పోలి ఉంటుంది.

దురదృష్టమేమిటంటే, పాశ్చాత్య దేశాలు, ఆ మాట కొస్తే ఆసియా దేశాలయిన పాకిస్తాను లాంటి దేశాలలో కూడా లేనంటువంటి లోపం ఒకటుంది ఇందులో. అదేమిటంటే, ఇది జెండర్ స్పెసిఫిక్. కేవలం ఆడవారు మాత్రమే బాధితులు.  మగవారు కేవలం నిందితులు మాత్రమే. ఈ చట్టం ప్రపంచములో అన్ని చోట్లా జెండర్ న్యూట్రల్ గా ఉంది. అంటే, సదరు సెక్సువల్ హరాస్‌మెంట్ అనే చట్టం బాధితులుగా ఆడ, మగా ఇద్దరినీ గుర్తిస్తుంది, పాకిస్తానులో చేసిన చట్టం కూడా .. అలానే గుర్తిస్తుంది. మన దేశము తప్ప ..!!

ఇందులో ఇంకా చాలా బోనస్ పాయింట్లున్నాయి.  మరో సారి తీరిగ్గా వాటి గురించి చెబుతా.  ప్రస్తుతానికి,  ఈ సెక్సువల్ హరాస్‌మెంట్ అనే అంశాన్ని, కథాంశముగా తీసుకున్న “ఇన్‌కార్” (తెలుగు అర్థం తిరస్కరణ) ఆనే సినిమా ట్రైలర్ చూడండి.

హెచ్చరిక: ఈ ట్రైలర్, సెన్సార్ అవ్వలేదనుకుంటా. కొన్ని ఘాటు సంభాషణలు ఉన్నాయి. కాకపోతే, అవన్ని హిందీ, ఇంగ్లీషులో ఉన్నాయి కాబట్టి, ఫర్లేదు అనుకుంటే చూడండి. అవి కూడా ఒకటో రెండో అంతే. అయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి ముందే చెబుతున్నా.

ఈ సినిమా రాగానే, రివ్యూ తప్పక రాస్తా..!!

అనగనగా ఒక రోజు — స్టేట్ లీగల్ సర్వీస్ సెంటర్‌లో


ఇది ఒక యదార్థ గాధ. ఫామిలీ కోర్టులు సిఫారసు చేసిన కౌన్సిలింగ్ సెంటర్లలో మగవారిని ఎలా ట్రీట్ చేస్తారో తెలియచెప్పే సంఘఠన. 498A చట్టము బెదిరించడానికి వేధించడానికి ఎలా ఉపయోగించు కుంటారో తెలియ జేసే ఘఠన ఇది. సమాజంలో మగవారిని ATM మెషిన్లలాగా చూసే ధోరణికి అద్దంపట్టే సంఘఠన ఇది.
___________________________________________

498A భార్యతో కౌన్సిలరు : చెప్పమ్మా! నీకేం కావాలి.
498A భార్య : నాకు విడాకులు కావాలి.

బాధిత భర్తతో కౌన్సిలరు : ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్దమేనా లేక కలిసి ఉండాలనుకుంటున్నారా?
బాధిత భర్త : నామీద 498A కేసు ఉన్నంత వరకూ నేను విడాకుల గురించి కానీ, తిరిగి కలిసి జీవించడం గురించి కానీ ఆలోచించలేను.
బాధిత భర్తతో కౌన్సిలరు : ఎందుకు చేయలేరు? ఆవిడ విడాకులు కావాలని అడుగుతోంది గదా? జస్ట్ విడాకులు ఇచ్చేయండి. ఆమె జీవితాన్ని ఆమెను గడపనివ్వండి, మీ జీవితాన్ని మీరు చూసుకోండి. ఆవిడ ఇన్నిరోజులు బాదలు పడుతూ వచ్చింది. ఆవిడని సరిగా చూడలేదని, మీరు ఆమెనుండి ఆశించేవి ఆమోదయోగ్యంగా లేవని చెబుతోంది.
బాధిత భర్త : సర్, ఆమెనుండి నేను అమోదయోగ్యం కాని వేవీ నేను ఆశించలేదు. నేను కేవలం, ఒక సహధర్మచారిగా, సమాన హోదాతో, గౌరభావంతో అమెతో జీవించాలని మాత్రమే అనుకున్నాను.
బాధిత భర్తతో కౌన్సిలరు : మీ భార్య మీతో సమాన హోదాలో ఎలావుంటుంది. నాకు తెలిసినంతవరకూ భార్య గురించి చెబుతాను విను, ఉదయాన్నే లేవగానే, నాకు కొన్ని అవసరాలుంటాయి. టూత్‌పేస్ట్, బ్రష్, కాఫీ, పేపరు, వేడినీల్లు, బట్టలు మరియు టిఫిను ఇలాంటీ అవసరాలు, ఇహ మధ్యాహ్నం.. ఆవిద ఫోను చేస్తే, ” ఎలావున్నావని అడగడం, సాయంత్రం ఇంటికి రాగానే నాకు మల్లి ఆహారం కావాలి, ఇంకా చాలా అవసరాలుంటాయి. మీరు అన్-రీజనబుల్ అని చెప్పడానికి ఇవి చాలవా? ప్రస్తుతం సంభవించిన సంఘఠనల దృష్ట్యా మీరు ఆవిడతో కలిసివుండడం కష్టం అని మీరు ఆమెకు ఉత్తరం రాసారా లేదా?
బాధిత భర్త : అవును సర్, నేను రాశాను.
బాధిత భర్తతో కౌన్సిలరు : ఇంకేం, ఇది ఆవిడ పట్ల హింసే. అదిచాలు ఆవిడకు నీ మీద 498A కేసు పెట్టడానికి.
బాధిత భర్త : సర్, ఆమె చెప్పింది మీరు చాలా విన్నారు. మీరు ఆవిడ ఫిర్యాదును ఒక్కసారి చదవండి. నా పరిస్థితి ఏమిటో మీకు అర్థం అవుతుంది. నిజానికి ఆవిడ చేత, ఆవిడ బంధువుల చేత బాధలు పడింది నేను.
బాధిత భర్తతో కౌన్సిలరు : నో, నేను చదవను. పస్తుతం నీకేం కావాలి అన్నది తప్ప నేను మరేదీ పట్టించుకోదలుచుకోలేదు. మీరు ఆమెకు విడాకులు ఇస్తారా? లేదా?
బాధిత భర్త : సర్, ఇది అన్యాయం ఇప్పటివరకూ జరిగిన దానిపై నావాదనను ఎవ్వరూ వినలేదు. రెండు సంవత్సరాలుగా నేను 498A దిర్విని యోగాన్ని ఎదుర్కొంటున్నాను. బెయిలు షరతు మీద నా పాస్ పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. విదేశంలో నాకు వున్న ఉద్యోగం కూడా పోయింది. నా వీసా స్టేటస్ కూడా నేను కోల్పోయాను. నేను అప్పటి నుండి ఇప్పటి వరకూ నిరుద్యోగిగా ఉండాల్సి వచ్చింది.
బాధిత భర్తతో కౌన్సిలరు : అదంతా ప్రస్తుతం అనవసరం. అదంతా వదిలేయండి. 498Aని కూడా వదిలేయండి. పరస్పరాంగీకారంతో తీసుకొనే విడాకులకు మీరు అంగీకరిస్తే 498Aను తొలగిస్తాం.
బాధిత భర్త : కాని సర్, నాకు తెలిసిన చాలా మంది మగాళ్ళు, విడాకులు బలవంతంగా ఇచ్చిన తరువాతకూడా, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటు తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారు.
బాధిత భర్తతో కౌన్సిలరు : వాటన్నింటి గురించి మీరు ఆందోళన పడకండి. మీరు విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తే, మీమీద 498A కేసును తీసివేస్తాం.
బాధిత భర్త : సర్, ఏ తప్పు చేయక పోయినప్పటికీ, సమాజంలో నేను ఒక నేరస్తుడిగా చిత్రించ బడ్డాను. నేను నా కేసు పోరాడి, నా నిర్ధోషిత్వాన్ని నిరూపించుకో దలుచుకున్నాను.
బాధిత భర్తతో కౌన్సిలరు : చూడు, 498A పెద్ద విషయం కాదు. కానీ, నువ్వు పోరాడితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని బదులు, విడాకులు ఇచ్చేయ్, 498A నుండి విముక్తుడివికా! ఇవన్నీ కోర్టు బయట పరిష్కరించుకోవడమే ఉత్తమం. అంతే కాకుండా, నాకున్న వ్యక్తిగత విలువలనుసారం, హిందూ సమాజం యొక్క విలువలకు కట్టుబడి, నీ భార్యను చక్కగా చూసుకోవాల్సిన భాధ్యత నీ మీదవున్నదని నేను భావిస్తున్నాను. నీకు ఇవ్వగల స్తోమతుంది కాబట్టి, నీ భార్యకు నీవు భరణం కూడా ఇవ్వాలని నేను భావిస్తున్నాను.
బాధిత భర్త : కానీ సర్, పెళ్ళయిన నాటి నుండి, ఆవిడ ద్వారా, ఆవిడ బందువుల ద్వారా హింసలకు గురయింది నేను. విడాకులకు దరఖాస్తు చేసుకుంది కూడా తనే. ఉద్యోగాన్ని కోల్పోయింది నేను, అంతే కాకుండా తప్పుడు 498A కేసును ఎదుర్కొంటుంది కూడా నేనే.
బాధిత భర్తతో కౌన్సిలరు : వాటన్నింటి గురించి నువ్వు అనవసరంగా బాధపడకు. 498A అంత తీవ్రమైంది కాదు.
బాధిత భర్త : కానీ సర్, అది నా పట్ల చాలా తీవ్రంగా వుంది. మా నాన్నగారు చావు బతుకుల మధ్య వున్నప్పుడు తను నాపై కేసు వేసింది. మా నాన్నగారి చివరిచూపులకు కూడా నేను నోచుకోలేకపోయాను. ఆయన అంత్యక్రియలకు కూదా నేను హాజరవ్వలేకపోయాను.
బాధిత భర్తతో కౌన్సిలరు : చూడు, నువ్వు వీటన్నింటినీ వదిలెయ్.

498A భార్యతో కౌన్సిలరు :
మీతో పాటు మీ కుటుంభ సభ్యులు ఎవరైనా వచ్చారా?
498A భార్య : యస్ సర్, నా చెల్లెలు, మిగిలిన వారుకూడా వచ్చారు.
498A భార్యతో కౌన్సిలరు : మీ చెల్లెలిని లోపలికి రమ్మను, మరో సార్ కలిసినప్పుడు ఏమి చేయాలో ఆవిడకు నేను వివరిస్తాను.

బాదిత భర్త : సర్, నా చెల్లెలు కూడా ఇక్కడే వుంది. ఆమెను కూడా లోనికి వచ్చి విననివ్వండి.
బాధిత భర్తతో కౌన్సిలరు : అవసరంలేదు.
బాదిత భర్త : కానీ సర్, ఆమె నా కుటుంభ సభ్యురాలు.
బాధిత భర్తతో కౌన్సిలరు : అవసరంలేదు. ఏది ఏమయినప్పటికీ, చివరికి నిర్ణయం తీసుకోవలసింది నువ్వు.

498A భార్య చెల్లెలితో కౌన్సిలరు : మీరు 498A కేసును వాపసు తీసుకుంటే ఇతను విడాకులు ఇస్తాడు. కాబట్టి ఈసారి వచ్చినప్పుడు, పరస్పరాంగీకార విడాకులకు మీమీ అభ్యర్థనలతో రండి. మల్లీ మనం వారం రోజులలో కలుద్దాం.
_________________________________________________

నేను రాసిన “మగాల్లూ … ఇల్లుకొనడం మానండి” అన్న టపాలోని ఒకవ్యాఖ్యలో, కౌన్సిలింగు గురించి అడగడం జరిగింది. దానికోసమే ఈ టపా. నేను ఈ టపాని చల్లా ఉమగారి ” Fight for Gender Equality” అన్న బ్లాగులోని “A Day at State Legal Services” అన్న టపాను అనువాదం చేస్తూ రాయడం జరిగింది. దాని స్పూర్తికి విఘాతం కలగకుండా నా ప్రయత్నం నేను చేసాను.

Published in: on May 13, 2009 at 4:42 pm  Leave a Comment  

మగాళ్ళూ… ఇల్లు కొనడం మానండి.


ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తను సంపాదించిన దానిమీద హక్కు వుంటుంది. తను కష్టపడి కొనుక్కున్న ఇంటి మీద హక్కు వుంటుంది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇల్లు కట్టు కున్నవాడి కంటే, దాన్ని ఆక్రమించుకొనే వారే అధికం. తాజాగా అలాంటి దురాక్రమణ దారుల జాబితాలో భార్యలు కూడా చేరిపోయారు. నీ ఇల్లును ఎవరైనా దురాక్రమణ దారులు ఆక్రమించుకుంటే చట్టం సహాయంతో దాన్ని తిరిగి పొందొచ్చు. కానీ చట్టమే దురాక్రమణను సహకరించే విదంగా రుపొందిస్తే..?

ఆ చట్టం పేరే, గృహహింస నిరోధక చట్టం. గృహహింస నిరోదక చట్టం అనగానే గృహహింస బాదితులు ఆడవారైనా మగవారైనా వర్తిస్తుందనుకుంటే నువ్వు పిచ్చోడి కిందే లెక్క. ఘనత వహించిన మన శ్రీమతి వాదులు (కాకపోతే తాము స్త్రీ వాదులమని చెప్పుకు తిరుగుతుంటార్లెండి) దృష్టిలో మాత్రం గృహహింస అంటే స్త్రీలపై హింస మాత్రమే. హక్కులు అంటే స్త్రీల హక్కులు మాత్రమే. మగవారు కూడా మనుషులని, వారికి హక్కులుంటాయని వారు చాలా అరుదుగా మాత్రమే అంగీకరిస్తారు. ఆ అరుదుగానైన అది సంభవించాలి అంటే, స్త్రీలు మనకిచ్చినవి (మిగిలించినవి)మాత్రమే మన హక్కులు అని మనం అంగీకరించి, వారు చెప్పినదానికి గంగిరెద్దులా తలూపినప్పుడు మాత్రమే.

ఉదాహరణకి, నువ్వు చచ్చి చెడి ఒక ఇల్లు కట్టుకున్నావని అనుకుందాం. డబ్బులు నీదగ్గర్లేక హోంలోను తీసుకొని, నెల నెలా EMI లు కడుతూ సొంతిల్లు కట్టుకున్నావనుకుందాం. ఆ ఇంటి మీద నీకెంతో అపేక్ష వుండడం సహజం. దాన్ని నీ సొంత బిడ్డలా చూసుకోవడం సహజమే. కానీ నువ్వు స్త్రీలను పూజించే పవిత్ర భారత దేశంలో పుట్టావ్. స్త్రీల హక్కులు మాత్రమే హక్కులు నమ్మే విచిత్ర జీవుల మధ్య బతుకుతున్నావ్. కాబట్టి అది నీ సొంతిల్లు కానట్టే లెక్క. అ రోజు నువ్వు పెళ్ళి చేసుకుంటావ్. అంతా సక్రమంగా వుంటే పర్లేదు. కానీ నీ భార్యతో నీకు గొడవలు వచ్చాయనుకో, నీ ఇల్లు నీకు కాకుండా పోయే పరిస్థితి నీకు దాపురించినట్లె. అలా జరగకుండా వుండాలంటే నీ భార్య చెప్పిన దానికి తానా తందానా అంటు డూ డూ బసవన్నలా తలాడించాలి. అప్పుడు నీ ఇంట్లో నీకు నివాసముండే హక్కును ని భార్య నీకు ముష్టిగా పడేస్తుంది. కాదూ కూడాదు అనో, ఆత్మగౌరవం, సొంత అభిప్రాయాలు లాంటి చెత్త అభిప్రాయాలను నువ్వు కలిగివున్నావో, అంతే సంగతులు. నీ సొంత ఇంటిలోనుండి నిన్ను చట్టం సహాయంతో నిన్ను గెంటేయించే హక్కు నీ భార్యకు గృహహింస చట్టం కల్పిస్తుంది.

కనీసము అలా బతికినా నీ ఇల్లు నీకు నిలబడుతుందా అంటే అదికూడా లేదు. వుదాహరణకు ఒక వ్యక్తి భార్యకు అతనితో వుండడం అసలు ఇష్టంలేదనుకుందాం, అప్పుడు అతన్ని ఎవరూ కాపాడలేరు, తనను హింసిస్తున్నాడు ఒక కేసు పెట్టి, అతను ఇంట్లో వుంటే తన మీద హింస రోజు జరిగే అవకాసం వుందని వాదించి, అతని సొంత ఇంటి నుండి అతన్ని గెంటేయించవచ్చు. అసలు ఆ వ్యక్తి ఆ ప్రాంతములోకి రావడానికి కూడా అవకాశములేకుండ చేయవచ్చు. అంటే ఆ వ్యక్తి భార్యకు ఇష్టముంటేనే, ఆవ్యక్తికి భవిష్యత్తు. వారెవా క్యా జమానా హై. అసలు చట్టం ఇటువంటి అడ్డగోలు అధికారాలను కట్ట బెట్టదని మీరు వాదించొచ్చు. ఏచట్టము ఇలాంటి వాటిని సమర్ధించదు. చట్టాలు మంచి కోసమే చేస్తారు. ఇలా చాలా చెప్పొచ్చు. కానీ, అందులో లొసుగులు మాత్రం చెడ్డ ఉద్దేసంతోనే పూడ్చకుండా వదిలేస్తారు. అలాంటి చట్టాలకు 498A ఒక ఉదాహరణ.

అయితే ఈ గృహహింస చట్టం దాన్ని కూడా దాటేసింది. ఈ చట్టం సక్రమంగా అమలు జరిగినా సరే, అది మగాడి ప్రాధమిక హక్కులకు కూడా భంగం కలిగించగలదు. ఉదాహరణకు, నిన్ను నీ సొంత ఇంటిలోనుండి బయతకు గెంటించడం. భారతదేశములో, నిజానికి ఇల్లు అనేది మగాడి ప్రాపర్టీ కానే కాదు, అది ఎవరు కట్టినా సరే. అది స్త్రీల ప్రాపర్టిగా మారిపోయింది. మరి అలాంటప్పుడూ ఇంత కష్ట పడి మగాడు ఇల్లు కట్టుకోవడం ఎందుకు. ఆ కొనేదేదో ఆడవాల్లనే కొనమని చెప్పండి, వారి స్త్రీ ధనంతో.

ఇంతా చెప్పడం ఎందుకు బాబూ అంటారా, ఢిల్లీ లాంటి నగరాలలో రోజుకు ఎంతమంది భర్తలు తమ సొంత ఇంటి నుండి గెంటివేయ బడుతున్నారో మనకు ఖచ్చితమైన సమాచారం లేదు గానీ( బయటకి రాదు, ఎందుకంతే మన శ్రీమతివాదుల దృష్టిలో అది తప్పుకాదు) చాలా మందే వుంటారని అంచనా. ఇటీవల ముంబాయిలో ఒక భర్త తన సొంత ఇంటినుండి గెంటివేయ బడ్డాడు, అంతేనా ఆ ఇంటికి EMI మాత్రం నెల నెలా అతనే కట్టాలి, తనకు ఇంకోక చిన్న ఇల్లు చూసుకొని దానికి అద్దె అతనే చెల్లించాలి. డబ్బులు వున్నవాడైతే EMI లు కట్టే అవసరం లేకుండానే ఇల్లు కొనుక్కో గలిగేవాడు. అలా జరగలేదంటే అతని అంత ఆస్థిపరుడు కానట్లే, జీతంలో చాలాభాగం EMIకి అద్దెకి చెల్లిస్తూ అతను పడే కష్టాలు మన సిగ్గులేని శ్రీమతి వాదులకి పట్టవు మరి.

ఇంత బాదెందుకండి అన్యోన్యంగా కాపురంచేస్తే ఇలాంటి గొడవలు వుండవు కదా అని అంటారా. ఇందాక నేను ఇది రాస్తున్నప్పుడు నా స్నేహితుడు కూడా ఇలానే అన్నాడు. అతనికి నేను చెప్పింది ఒక్కటె. అందరూ అన్యోన్యంగానే కాపురం చేయాలనుకుంటారు. ఎవరూ కళహాల కాపురం చేయాలనుకోరు. కానీ, పరిస్తుతులు నువ్వు కోరుకున్నట్లుగా వుండవు. స్త్రీలనే ఇల్లు కొనమను ( ఆమె స్త్రీ ధనంతో), అప్పుడు ఆమె అతను ఎంచక్కా అన్యోంగానే వుండొచ్చు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా.

P.S

మొదటి పేరాలో నేను, దురాక్రమణ దారుల జాబితాలో భార్యలు కూడా చేరిపోయారని చెప్పాను. నిజానికది తప్పు మాట ఎందుకంటే, దాన్ని దురాక్రమణగా చట్టం గుర్తించదు. మన శ్రీమతి వాదులైతై దాన్ని ఆవిడ హక్కును సాధించుకోవడం అని ముద్దు పేరును కూడా పెట్టారు. సో నీ ఇల్లును నువ్వు పోగొట్టుకున్నా స్త్రీ తమ హక్కు సాధించుకోవడంలో తోడ్పడ్డావనుకుని సంబర పడి నోరుమూసుకుని కూర్చోవాలి.

హతోస్మి.

Published in: on May 3, 2009 at 4:46 am  Comments (11)  

ఓ మార్కిస్టు ప్రేలాపన — “భార్యాభాదితులు లేరు”.


ఈ మధ్య నేనొక బ్లాగు చదివాను, అందులో ఓ పెద్ద మనిషి “భార్యాభాదితులు” అన్నది కేవలం పురుషాహంకారుల సృష్టి అని సెలవిచ్చారు. నిజమా !!?? భార్యాభాదితులు అన్నది కేవలం మగదురహంకారుల సృష్టా లేక, “భార్యాబాదితులు” వున్నారని ఒప్పుకోక పోవడం పురుషాహంకారుల నైజమా?

స్త్రీలను ఈ విధంగా సమర్ధించే వారు పురుషాహకారులు ఎలా అవుతారని మీ అనుమానమా? ఎందుకు కారండి బాబూ? తామేదో పెద్ద ఆదర్ష పురుషులమని, తమ ఇజం, లోకములోనే అతి గొప్ప ఇజమని భావించే వాల్లను సహజంగా అహంకారులు అంటారు. ఇక పురుషాహంకారానికి వస్తే…

1. ఒక స్త్రీ రాకెట్లో అంతరిక్షాన్ని చేరుకుంది చూడండహో అని చెప్పి, పురుషులూ ఇక మీ అధిపత్యం చెల్లదు సుమా అని ఆదర్షపురుషుల్లా ఫోజులు కొడతారు.

2. అమ్మాయిలు చదువులో అబ్బాయిలను అధిగమిస్తున్నారు, అబ్బాయిలూ మీ అధిపత్యం ఇక చెల్లదు అని గొంతుచించుకుంటారు..

3. అన్ని రంగాలలో స్త్రీలు, మగవారితో పోలిస్తే ఒక అడుగు ముందుకు వేసారని, పురుషులు దీన్ని
ఆమోదించాలని డిమాండులు చేస్తారు.

ఒక స్త్రీ అంతరిక్షానికి వెల్లిందంటే నమ్ముతారు, చదువులో ముందుకు దూసుకెల్లుతోందని నమ్ముతారు కానీ ఒక స్త్రీ పురుషున్ని వేదిస్తోందని చెబితే మాత్రం పాపం వీరు అస్సలు నమ్మరు. స్త్రీలు మగవారితో పోటీ పడి చదవలేరంటే పురుషాహంకారమంటు గగ్గోలు పెట్టే మారాజులు, ఇంత గొప్పగా అన్ని రంగాలలో రానిస్తున్న స్త్రీలు పురుషున్ని భాదించడంలో కూడా రానిచగలరని నమ్మరు. మరి ఇది పురుషాహంకారం కాదా?

స్త్రీలను సమర్ధించినంత మాత్రాన వారు ఆదర్ష పురుషులైపోతారా!!?? అంటే, వీరి దృష్టిలో అవుతారనే చెప్పాలి. అందుకే ఈ ప్రేలాపనలు. అయినా తప్పు వీరిది కాదులెండి మన సాహిత్యానిది, సినిమాలది. కొన్ని సినిమాలలో, హీరోగారు హత్యలు చేస్తాడు, దారిన పోయే అమాయకులను దోచుకుంటాడు, స్మగ్లింగులు చేస్తాడు, ఇన్ని చేసినా అతడు స్త్రీలను మాత్రం గౌరవిస్తాడు, అంతే సదరు హీరోయినుగారు అతగాన్ని నువు హీరోవయ్యా అంటు, ఠపీమని ప్రేమలో పడిపోతుంది.
ఎంత ఎదవైనా దేశ ద్రోహైనా (మాదక ద్రవ్యాలు స్మగ్లింగులు చేసి యువతను చెడగొట్టేవాన్ని అలా అనడమే కరెక్టేమో…) స్త్రీలను సమర్ధిస్తే చాలు వాడు హీరో అని బాగా నూరి పోశారు. దాని ప్రభావమే ఇది.

ఒకపక్క సుప్రీముకోర్టువారు సైతం ఆడవారిని రక్షించడానికి చేసిన చట్టాలు ధుర్వినియోగ మవుతున్నాయని చెబుతున్నారు, ఇది “లిగల్ టెర్రరిజంగా” మారిందని ఘాటుగా స్పందిస్తున్నారు, కానీ మన మహాశయులు మాత్రం స్త్రీలు వేదిస్తున్నారంటే మాత్రం నమ్మరు. వారికంటే వీరికే ఎక్కువ తెలుసు కాబోలు.

ఒకపక్క సాక్షాత్తు ప్రతిభా పాటిలుగారు, జాతీయ మహిలా కమీషను అధ్యక్షులు, స్త్రీశిశు సంక్షేమ శాఖ వారు కూడా ఈ చట్టాలు ధుర్వినియోగమవుతున్నాయని అఫిషియలుగా చెప్పినా సదరు ఆదర్ష పురుషులు దీన్ని చస్తే నమ్మరు. పైపెచ్చు, మనసుకొచ్చింది యెడాపేడా రాసి, జనాలమీద వదిలిన చలంలాంటి రచయితల చచ్చు రచనలను ఉదాహరనగా పేర్కొండం వీరికే చేల్లింది.

ఎప్పుడొ జమానాకాలములో చలం గారు రాసిన నవలను ఇప్పటి సామాజిక పరిస్థితులకు అన్వయించే వీరిని చూస్తుంటే, ఇంకా వీరు అకాలంలోనే తిష్ట వేసుకుని కూర్చున్నారని పించక మానదు. గురువుగారు! కాలం మారింది, అర్జెంటుగా మీరు ఈ కాలానికి వచ్చేయండి. ముందు హిపోక్రసీ అంటే అర్థం తెలుకుని, ఆ తర్వాత ఎవరు హిపోక్రసీతో వున్నారో చెప్పండి.

P.S:
ఈ సోకాల్డు ఆదర్షపురుషులకు నేనిచ్చే సలహా ఒక్కటే, రోజూ పేపరు చదవడం అలవాటు చేసుకోండి. పేపరు చదవడం మంచి అలవాటు దాని, కారణంగా లోక జ్ఞానం పెరుగుతుంది. స్త్రీలు మగవారిని భాదించలేరు అన్న మీ భ్రమా తొలుగుతుంది.

మగాల్లపై అత్యాచారాన్ని “సరదాగా ” తీసుకోవల్సిందేనా…?


హెచ్చరిక : 18 సంవత్సరములు నిండిన వారు మాత్రమే చదవ వలసిందిగా మనవి. నిజానికి TV లొ, దిన పత్రికలలో వచ్చిన వార్తలే, నేనిక్కడ రాసాను. ఐనా సరే చిన్న పిల్లలు (ఒక వేల నిజంగా వాల్లు కూడా చదువుతుంటేనే లెండి), ఈలాంటివి తెలుసుకొని తమ మనసు కష్ట పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు.

మగాల్ల మీద జరిగితే అదేదో చాలా సాధారణ విషయమని, అసలు పట్టించుకోవల్సిన అవసరం లేదని చెబుతున్నారు కొందరు ” మగానుభావులు “. మగాల్లపై అత్యాచారాలు ఎలా జరుగుతాయంటారా? ఇవి చూసి మీరే చెప్పండి, వీటిని ఏమనాలో.

Scene 1: అక్కడొక వ్యాఖ్యాత, అతనికెదురుగా రెండు గ్రూపులు వున్నాయి. ఒక్కో గ్రూపులో నలుగురేసి అమ్మాయిలు వున్నరు. వ్యాఖ్యాత గారు ఒక గ్రూపులోని అమ్మాయిలని ఒక చెత్త ప్రశ్న అడిగారు. వారు దానికి కాసేపాలోచించి సమాధానం చెప్పారు. ఖర్మ కాలి (వాల్లది కాదులేండి. మరి ఎవరిది అంటారా చెబుతా..) అది కాస్తా సరైన సమాధానం కాదు. వ్యాఖ్యాత నవ్వుతూ మరో వైపు చుశాడు. అక్కడ అరుగురో, ఎనిది మందో అబ్బాయిలు సినెమాలో క్లైమాక్సు ఫైటులో విలన్ హీరోకు కావల్సిన వాల్లని కట్టేసినట్లు కాల్లు చేతులు కట్టెసి వున్నాయి. “X” ఆకారంలో నిల్చున్నారు వాల్లు. వారి కాల్ల మధ్య ఒక మిషను వుంది. స్విచ్చు నొక్కితే (బహుషా) దానికున్న ఐరన్ రాడ్ విసురుగా పైకి లేస్తుంది.

ఇంతకీ ఆట ఏమిటంటె, అమ్మాయిలు తప్పు సమాధానం చెప్పిన ప్రతీసారీ వారి గ్రూపులోని అబ్బాయిల కాల్ల మద్య, ఆ రాడ్ విసురుగా తగులుతుంది అన్నమాట. నొప్పిని భరించి అతను నిల్చున్నాడా సరే సరి, లేక చాలు ఆపండి అన్నాడా, ప్రత్యర్ధి గ్రూపువాల్లు గెలుస్తారు.

ఇక్కడ ఇంకో రూలు కూడా వుంది. ఒకవేల అమ్మాయిలు సరైన సమాధానమిచ్చారనుకుందాం, అప్పుడు వాల్లకు తమ ప్రత్యర్ది గ్రూపులో నుండి ఒకవ్యక్తిని ఎన్నుకుంటారు. అతనికి పైన చెప్పిన శిక్ష పడుతుంది.

Game Plan: అమ్మాయిలు తాము నెగ్గిన ప్రతీ సారీ ఒకే వ్యక్తిని ఎన్నుకుంటే, ఎక్కువ సార్లు తినకూడని చోట దెబ్బతిన్న ఆకుర్రాడు, ఆపమని అర్థిస్తాడు. కాబట్టి తాము తొందరగా గెలవచ్చు అని నిర్ణయించుకున్నారు అమ్మాయిలు. ఇప్పుడు అర్ధమైందా కాలేది ఎవరి ఖర్మో !!!

ప్రతీ ప్రశ్నకు అబ్బాయిలలో ఎవరో ఒకరు, దెబ్బలు తినాల్సిందే అలావున్నాయి గేం రూల్సు. ఇక గేము స్టార్ట్ అయ్యింది, అబ్బాయిల అరుపులు, అమ్మాయిల ముసిముసి నవ్వులు వ్యాఖ్యాతల వెకిలి మాటలు, ఇంతేనా కాసేపు తర్వాత అబ్బాయిల ప్యాంటు విప్పించి కేవలం నిక్కరు (లాంటి) మీద నిల్చోబెట్టారు. దెబ్బ కొంచెం బలంగా తగలడానికి. ఇక మిగిలింది మీరే వూహించుకోండి.

ఇది జరిగింది ఎక్కడో ప్రక్క గ్రహంలో కాదు. మన భారత దేశంలోనే, MTV Roadies అనే పిచ్చి ప్రోగ్రాములోని ఒక “సరదా” ( నిర్వాహకుల ద్రుష్టిలో) ఆట.

Scene 2: భగ్న ప్రేమికులు, ఈ మధ్య శృతిమించి తాము ప్రేమించిన వారిమీద దాడులు చేయడం ఈ మధ్య ఎక్కువైపోతోంది. మొన్న వరంగల్ లో జరిగిన ఆసిడ్ దాడి గురించి, దాని పర్యవసానం గురించి అందరికీ తెలుసు. జనాలందరూ దానిని తీవ్రంగా ఖండించారు. బెంగులూరులో మరింత హేయమైన సంఘటన జరిగింది.

తనతో కొన్నేల్లు ప్రేమ వ్యవహారాన్ని వెలగ బెట్టి, వేరే అమ్మాయిని పెల్లి చేసుకుంటున్నాడన్న అక్కసుతో ప్రియురాలు అతన్ని పిలిచి, మత్తు మందు కలిపిన పానీయాన్ని అందించి, తరువాత అతని “పురుషత్వాన్ని” తొలగించింది. మెలకువ వచ్చిన తరువాత, తీవ్ర రక్త స్రావమౌతుండడంతో అసలు విషయం తెలుసుకోని ఆమెనే బ్రతిమాలితే. తెచ్చి ఆసుపత్రిలో వదిలి వెల్లిందంట. సహజంగా ఇటువంటి సందర్భాలలో, అతనీ private part దొరికితే దానిని శస్థ్ర చికిత్స ద్వారా తిరిగి అతికించే వీలుంటుది. దాంతో పోలీసులు అది ఎక్కడ పెట్టావో చెప్పమని ఆమెని అడిగితే ఆమె చెప్పడానికి నిరాకరించింది. ఇప్పుడు అతను శాశ్వతముగా తన శృంగార జీవితాన్ని కోల్పోయాడు. కాన్ని దీన్ని ఖండించే వాల్లు కరువయ్యారు, పైపెచ్చు ఆ స్త్రీని “వీర వనిత” అని, నేటి స్త్రీలకు ఆదర్శమని లేకి మాటలు చెప్పే “మగాను భావులే” ఎక్కువ మంది. ఆసిడ్ పోయడం తప్పు కానీ ఇది మాత్రం తప్పు కాదు మన ఆదర్ష పురుషులకి, కొంతమంది నేటి మహిళలకి.

పైన చెప్పినవి ఆడ వాల్ల మీద జరిగితే, దేశం అట్టుడికి పోయుండేది. మన దేశాన్ని తాలిబాన్ రాజ్యంతో చాలా మంది పోల్చిండెవారు. కొంత మంది, తాలిబాన్ కన్నా ఘోరమని బాదపడి పోయేవారు. మరికొంతమంది ఠంచనుగా సిగ్గుపడిపోయేవారు. కానీ అది జరిగింది మగాల్ల మీద, అందుకే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

ఇలాంటి వాటిని ప్రశ్నిస్తే కొంతమంది, కుక్క మనిషిని కరిచినా, మనిషి కుక్కను కరిచినా ఒకేల చూడలేం కదా అని చెప్పేస్తున్నారు. సామెత బగానే వుంది కానీ మగాల్ల విలువ కుక్కతో సమానమా.. ఈ దేశంలో?

పూర్తి వార్త చదవాలనుకుంటె ఇక్కడ నొక్కండి.
Published in: on February 5, 2009 at 1:34 pm  Comments (3)  

శ్రీరామ సేన చేసింది తప్పా..?


ఇప్పుడు అందరిదీ ఒకే మాట. స్త్రీలను కొట్టడం తప్పు అని, వారికి తాగే హక్కులేదా అని, మగవారు తాగగా లేనిది.. ఆడవారు తాగితే తప్పేంటని, మగవారు తిరగగా లేనిది ఆడావారు తిరిగితే తప్పేంటని. నిజమే, మగవారికి ఒక న్యాయం ఆడవారికి ఒక న్యాయం సమ్మతం కాదు. ఈ విషయాన్ని, ఆదర్షవంతులైన మగవారు, అదర్షవంతుల్లాగా నటించే మగవారు, స్త్రీవాదులు, మహిళా సంఘాలు గొంతెత్తి చెబుతున్నారు. ఇది శుభపరినామమే.

మొన్నామధ్య మెరుగైన సమాజం కోసం ఏర్పడిన TV9 చూస్తున్నప్పుడు, ఒక మహిళామండలి అధ్యక్షురాలు, పబ్బులకి వెల్లడం అశ్లీలంగా వుండే దుస్తులు వేసుకోవడం తప్పైతే, దాన్ని నిరసించే మార్గాలు వేరే వున్నాయని, సంస్కృతి పరిరక్షన పేరుతో స్త్రీలమీద చేయి చేసుకోవడం అనాగరిక చర్య అని అన్నారు. అక్షరలక్షలు విలువ చేసే మాటే అది. కాకపోతే….

సారా కొట్లో తాగుతున్నారని, ఆడవాల్లందరు గుంపులుగా వెల్లి, మగాల్లను కర్రలతో చితక్కొట్టినప్పు, ఈ నీతులన్నీ ఏమయ్యాయబ్బా..? సారా తాగడం నేరం కాదు, నైతికంగా తప్పు అంతే? మరి వారినికొట్టే హక్కు మన నారీ శిరోమణులకు ఎవరిచ్చారబ్బా? వార్తా పత్రికల వారు, TV ఛానెల్ల వారు ఈ విషయాన్ని గొప్పగా చూపిస్తూ, వారిని నేటి స్త్రీలని, ఆదర్ష స్త్రీలని ఎందుకు పొగుడుతారో…? స్త్రీవాదులు, ముఖ్యంగా మగ స్త్రీవాదులు వారిని పొగిదేవిధానం, (వీరి మీద ఆడ స్త్రీవాదులు కొంచెం బెటర్లెండి) చేసె ఓవర్ యాక్షనుకి అంతుండందు. ఎందుకనో…?

ఇంతేనా కొన్ని కొన్ని చోట్ల, బూతు చిత్రాలు ఆడించే సినెమా థియేటర్లకి వెల్లి, అక్కడున్న మగవారందరి మొహాలకి నల్లరంగు పులిమారన్న వార్తలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. కొన్నిచోట్ల కొట్టారని కూడా విన్నాను, ఎందుకబ్బా? ఆడ మగలకి ఇస్టమైతే శృంగారము తప్పు కాదంటారు కొందరు స్త్రీవాదులు. కలిసి తిరగడం, పబ్బుల్లో తాగితందనాలాడడం తప్పుకానప్పుడు, పాపం ఈ అభాగ్యులు చేసినపని తప్పెలా అయ్యిందబ్బా?

కాకపొతే ఈ పనిని అందరూ ఆమొదిస్తారు, పొగుడుతారు, కానీ ఇదే మగాల్లు ఆడవాల్లని కొడితే మహాపరాదం జరిగిందని చెబుతారు. ఇంకా పురుషాధిఖ్య భావజాలం నషించలేదని, మగవాల్లు పురుషాహంకార పందుల్లాగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోస్తారు.

ఇంతేనా, ఈవ్ టీజింగులు చేసే మగవారిని కొన్నిచొట్ల, అండర్‌వేర్‌తో ఊరేగించిన సందర్బాలున్నాయి. వారుచేసేది( ఈవ్ టీజింగ్) తప్పుకాదని ఎవ్వరూ అనరు కానీ, ఈ బట్టలూడదీసి ఊరేగించే ఓవర్ యాక్షను గురించి మాత్రం ఎవ్వరూ ఎందుకు మాట్లాదరెందుకని? తప్పో ఒప్పో, ఈలాంటి ఓవర్ యాక్షను ఆడవాల్లొ, లేదా ఆడవాల్లని సమర్దిస్తూమగవాల్లొ చేసినప్పుడు మాత్రం ఈ అభ్యుధయవాదులు, మానవహక్కుల గురించి ప్రష్నించే వాల్లు ఎక్కడ దాక్కుంటారో ఎవ్వరికీ అర్థం కాదు.

మరి మన నారీ శిరోమణులు చేసేవి తప్పుకానప్పుడు, శ్రీరాం సేన వారు చేసింది తప్పేలా అయ్యింది? అభ్యుదయవాదులకి, మగస్త్రీవాదులకి, అందరికీ నేనుచెప్పేది ఒక్కటే, దయచేసి ఇలాంటి ఓవర్ యాక్షను ఎవరు చేసినా ఖండించడి, ఆడవారైనా సరే, మగవారైనా సరే…

Published in: on February 2, 2009 at 11:04 am  Comments (11)  

భారతావనిలో అంతర్జాతీయ పురుషదినోత్సవం


ఈ సృష్టిలో ఆడామగల మధ్య వున్న బంధం విడదీయరానిది. ఈ నిజాన్ని మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ఈచరాచర సృష్టికి మాతాపితరులుగా పూజింపబడే పార్వతీపరమేశ్వరులు అర్ధనారీశ్వరులు. ఈ అర్ధనారీశ్వరతత్వం ఆడమగల మధ్య వున్న విడదీయరాని బంధానికి ప్రతీక. స్త్రీపురుషులు తమతమ వ్యక్తిత్వాన్ని, ఉనికిని కాపడుకుంటూనే ఒకరిమీద మరొకరు ఆధారపడి వుంటారని చెబుతుంది. స్త్రీపురుషులు ఒకరికి ఒకరు సంపూరకాలని, వారు తమ శక్తిసామర్ధ్యాలని కలిపి, జీవితాన్ని సృష్టించి, పెంచి పోషించడం ద్వారా దీనిని సాధిస్తారని తెలియజెబుతుంది. ఈ పవిత్ర జంట భారతీయులందరికి అదర్శప్రాయమైన జంట.

కానీ కొన్ని శతాబ్దాల కాలంగా పాశ్చాత్యదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న వ్యక్తిశ్రేయోవాదం(individualism) భారతీయ విలువలను, స్త్రీపురుషుల మధ్య సమైక్యతను క్షీణింపజేస్తొంది. ప్రపంచదేశాలు అసూయపడేంత గొప్ప వ్యవస్థ మన వివాహ వ్యవస్థ. కానీ ఈ వ్యక్తిశ్రేయోవాదాన్ని వ్యక్తి స్వాతంత్ర్యంగా భావించడం కారణగా ఈ గొప్ప వ్యవస్థ బీటలు వారింది. అతివాద స్త్రీవాదుల కుటుంబ వ్యతిరేక మరియు పురుష వ్యతిరేక భావాలు స్త్రీపురుషుల మధ్య యుద్దానికి దారితీసాయి. దీనికారణంగా విడాకుల సంఖ్య, తండ్రులకు దూరమైన పిల్లల సంఖ్య, పురుషుల ఆత్మహత్యలు, పురుషులపై హింస మొదలైనవి విపరీతంగా పెరిగాయి. స్త్రీపురుషుల మధ్య సామరస్యాన్ని పెంపొందించి, భారతీయవిలువలను పాటిస్తూ, సమాజంలో సమతౌల్యాన్ని పెంపొందింప చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8 న జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. మహిళళ కోసం ఒక రోజును అంకితమివ్వడమంటే, వారి స్త్రీత్వానికి మరియు వారు సమాజానికి, కుటుంబానికి చేసిన సేవలను గుర్తించడమే.ఇది హర్షించదగిన విషయం.

అదే విధంగా, SFF(Save Family Foundation) వారు మరియు దాని అనుబంద సంస్థలు నవంబరు 19ని అంతర్జాతీయ పురుష దినోత్సవంగా గుర్తించి, మగవారి గౌరవార్ధం దీన్ని జరుపుకోనున్నాయి. ఎంతోమంది తండ్రులు, అన్నలు, భర్తలు, పుత్రులు, మగ స్నేహితులూ మరియు సహోద్యోగులు చేసిన విస్తృత సేవలని,త్యాగాలని… కుటుంబ సంక్షేమానికి, సమాజ శ్రేయస్సుకు, దేశ సౌభాగ్యానికి వారు చేసిన కృషినీ గుర్తిస్తూ, ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది.

ఈ అంతర్జాతీయ పురుషదినోత్సవానికి ఏకాభిప్రాయాన్ని సాధించే పనిలో భాగంగా, SIFF ప్రపంచ వ్యాప్తంగా ప్రచారాన్ని చేపట్టింది. ఆస్ట్రేలియాలోని fatherhood foundation కి చెందిన Mr. Warwick Marsh దీనికి స్పందించారు.వారి కృషి కారణంగా, ఈ సంవత్సరం అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఆస్ట్రేలియా భారతీయులతో చేతులి కలిపింది.

ఈ అంతర్జాతీయ పురుషదినోత్సవం రోజున, ఈ భావాలను ముంబై,కోల్‌కతా,నాగపూర్,లక్నో, బెంగులూరు మరియు హైదరాబాదు పట్టణాలలో, కుటుంబ సంక్షేమానికి పాటు పడే వివిధ సంఘాలు, స్వచ్చంద సంస్థలు ప్రతిబింబింప జేయనున్నాయి.

ఈ సందర్భంగా, ప్రస్తుత సమాజంలో మగవారి స్థితి గతులను సమీక్షించాలని SFF నిర్ణయించింది. అంతేగాక సాటి మనుషులుగా మగవారికి న్యాయంగా దక్కవలసిన రక్షణ, హక్కులపై అవగాహన కల్పించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది.పురుషుల సంక్షేమార్ధం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయావలసిందిగా, భారత ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దీనితోపాటుగా లింగవివక్షా రహితమైన చట్టాలని, విధానాలనూ చేసి స్త్రీపురుషులిరువురూ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని కల్పించాలని కోరింది.

ఈ టపా నేను, Fight for Gender Equality అన్న ఉమా చెల్ల గారి బ్లాగులోని International Men’s Day, 2008 – India అన్న ఆంగ్ల టపాను అనువాదము చేసి రాయడం జరిగింది. ఆంగ్లములోనుండి తెలులోకి అనువాదము కాబట్టి ఉన్నది వున్నట్లుగా తర్జూమా చేయడం కొంచెం కష్టమైనా ఆ టపా స్పూర్తికి ఎటువంటి భంగమూ కలగకుండ రాయడము జరిగింది.ఆమె బ్లాగులోని అసలు టపాను చదవాలంటే ఈ కింద ఇచ్చిన లంకెను నొక్కండి.

International Men’s Day, 2008 – India

ఉమా చెల్లగారు, Save Indian Familyలొ సభ్యురాలు మరియు All India Forgotten Women(AIFW) సంస్థ యొక్క అధ్యక్షురాలు.

Published in: on November 19, 2008 at 9:17 am  Comments (5)  

అంతర్జాతీయ పురుషదినోత్సవం -నవంబరు 19,2008


భరత్ ఒక ప్రతిభావంతుడైన యువకుడు. అనేక ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కొని, కృషితో శాస్త్రవేత్తగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. జంటిల్‌మన్ అనేవాడు స్త్రీలను గౌరవించాలని, వారికి పిల్లలకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలని,కుటుంబ పోషణ సంరక్షణ భాధ్యతలను స్వీకరించాలని, అవసరమైనప్పుడు త్యాగాలను చేయాలని నూరిపోసే పరిసరాలలో పెరిగాడు. దురుదృష్టవశాత్తూ, జంటిల్‌మన్‌లని కొనియాడబడే వాల్లే తరచూ నిందలను మోయాల్సి వుంటుందని, బాధలను,సమాజం యొక్క నిర్లక్ష వైఖరిని భరించాల్సి వుంటుందని… భార్య కౄరత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, భారతీయ శిక్షాస్మృతిలోని 498A పంజాకు చిక్కే వరకూ అతను నమ్మలేదు. చేయని నేరానికి అతను, అతని తల్లిదండ్రులూ, తోడబుట్టినవారూ ఖైదు చేయబడ్డారు. ఉద్యోగాన్ని కోల్పోయి, తన బిడ్డనుండి వేరుపడి, తీవ్ర వేదననూ అనుభవించాల్సి వచ్చింది.భవిష్యత్తు అంధకార బంధురంగా మారడంతో, నిరాశా నిస్పృహలతో చివరికి అతను జీవితాన్నే అంతం చేసుకున్నాడు.అప్పుడు అతని వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. అతని మరణ వార్తను స్థానిక దినపత్రికలు “ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువ శాస్త్రవేత్త ఆత్మహత్య” అని ప్రచురించి చేతులు దులిపేసుకున్నయి.

ఇది భరత్ ఒక్కడి కథ కాదు, జీవితం వికసిస్తున్న సమయంలో ఎటువంటి మాధుర్యాన్ని అనుభవించకుండా తమ జీవితాల్ని అంతం చేసుకున్న వేల మంది మగాళ్ళ గాథ. National Crime Records Bureau (NCRB) గణాంకాల ప్రకారం 2005 మరియు 2006 సంవత్సరాలలోనే వివాహిత స్త్రీల సంఖ్య కన్నా (2005 లో 28,186 మంది మరియు 2006 లో 29,869 మంది) రెండు రెట్లు వివాహిత పురుషులు (2005లో 52,483 మంది మరియు 2006లో 55,452 మంది) శారీక, మానసిక, ఆర్థిక హింసనే కాక, మాటల వల్ల(verbal) కలిగే హింసను తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.

SFF(Save Family Foundation) వారు మరియు దాని అనుభంద సంస్థలు నవంబరు 19ని అంతర్జాతీయ పురుష దినోత్సవంగా గుర్తించి, మగవారి గౌరవార్ధం దీన్ని జరుపుకోనున్నాయి. ఎంతోమంది తండ్రులు, అన్నలు, భర్తలు, పుత్రులు, మగ స్నేహితులూ మరియు సహోద్యోగులు చేసిన విస్తృత సేవలని,త్యాగాలని… కుటుంబ సంక్షేమానికి, సమాజ శ్రేయస్సుకు, దేశ సౌభాగ్యానికి వారు చేసిన కృషినీ గుర్తిస్తూ, ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా, ప్రస్తుత సమాజంలో మగవారి స్థితి గతులను సమీక్షించాలని SFF నిర్ణయించింది. అంతేగాక సాటి మనుషులుగా మగవారికి న్యాయంగా దక్కవలసిన రక్షణ, హక్కులపై అవగాహన కల్పించవలసిన అవసరాన్ని highlight చేయదలచారు.

భారత ప్రభుత్వం వసూలుచేసే పన్నులలో 82% మగవారినుండే వసూలు అవుతుంది, కానీ గత 60 ఏల్లుగా మగవారి సంక్షేమం కొరకు పంచవర్ష ప్రణాలికలలో (budget) ఎటువంటి కేటాయింపులూ జరుపలేదు. పైపెచ్చు, మగవారు చట్టాలలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు, అంతేకాక స్త్రీల సాధికారత పేరుతో మరిన్ని వివక్షా పూరిత చట్టాలను రుపొందించి మగవారి కనీస హక్కులను కూడా తృణీకరించడం జరుగుతోంది.

అనేక వేలమంది మగవారు భారతీయ శిక్షాసృతి 498A, గృహహింస నిరోదక చట్టం, వివాహేతర సంబందాలకు సంబందించిన చట్టం (adultery law), మానభంగాలు,లైంగిక హింస(sexual harassment) నిరొధానికి చేసిన చట్టాలు,విడాకుల చట్టం,భరణానికి సంబందిచిన చట్టం, పిల్ల పోషన మరియు సంరక్షన కొరకు చేసిన చట్టం(maintenance and child custody laws), మొదలైన చట్టాల దుర్వినియోగం కారణంగా జరుగుతున్న legal terrorism కి బలౌతున్నారు.

అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానం ప్రకారం, చట్టం ముందు అందరూ సమనులే, చట్టం ద్వారా వివక్షారహితమైన రక్షణను పొందడే హక్కు అందరికీ వుంది.(“all are equal before the law, and are entitled without any discrimination to equal protection of the law”). భారత రాజ్యాంగములోని 14వ ఆర్టికలు ప్రకారం, భారత దేశంలోని ఏవ్యక్తైనా చట్టం ముందు సమానమే,చట్టం ద్వారా సమాన రక్షణను పౌరులకి ప్రభుత్వం కల్పించాలి.(The State shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India.)అయినప్పటికీ భారత ప్రభుత్వము గృహహింసనుండి గానీ, పనిచేసే చోట ఎదురయ్యే వేధింపులనుండి గానీ మగవారిని రక్షించడానికి ఎటువంటి సదుపాయాలను కల్పించలేదు.

అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానం ప్రకారం నేరం నిరూపించబడే వరకూ ఆవ్యక్తిని నిర్దోషిగా భావించాలే గానీ దోషిగా కాదు(“everyone charged with a penal offence has the right to be presumed innocent until proved guilty according to law”). కానీ స్త్రీల రక్షణకై భారత ప్రభుత్వం చేసిన చట్టాలు మాత్రం, నిరూపించబడే వరకూ ఆ వ్యక్తినిని దోషిగానే పరిగణిస్తాయి. దీనివలన అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానాన్నే కాక భారత రజ్యాంగములోని 20 మరియు 21వ ఆర్టికలును కూడా ఉల్లంఘించడం జరుగింది.

SFF ఈ విషయాలను ప్రజలందరికీ విషదపరచడానికి, వారిలో వీటిమీద సరైన అవగాహన కలిగించడానికి నడుంబిగించింది. అంతేకాక మగవారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా సరైన చర్యలను తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు.

ఈ చర్యలలో భాగంగా, 2007 నవంబరు 19న SFF మరియు దాని అనుబంధ సంస్థల ప్రోద్భలంతో భారత దేశములో మొదటిసారిగా అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఏకాభిప్రాయ సాధనలో భాగంగా SFF ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ప్రచారానికి స్పందించిన ఆస్త్రేలియా, ఈ సంవత్సరము భారతదేశముతో పాటుగా ఈ అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని జరుపుకోనున్నది.

ఈ అంతర్జాతీయ పురుష దినోత్సవము – 2008 సందర్భముగా SFF వారు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నవంబరు 19న మధ్యాహ్నము 1:00గంట నుండి సాయంత్రము 4:00గంటల వరకూ ప్రజలకు, ప్రసార మాధ్యమాలకు, చట్ట రూపకర్తలకు, మరియు భారత ప్రభుత్వానికి తమ వాణిని వినిపించదలచారు. ఈ భావాలను ముంబై,కోల్‌కతా,నాగపూర్,లక్నో, బెంగులూరు మరియు హైదరాబాదు పట్టణాలలో, కుటుంబ సంక్షేమానికి పాటు పడే వివిధ సంఘాలు, స్వచ్చంద సంస్థలు ప్రతిబింబింప జేయనున్నాయి.

ఈ సంధర్భంగా,మారుతున్న సమాజానికి అనుగుణంగా పురుషుల సంక్షేమార్ధం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయావలసిందిగా, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించడమైనది.

దీనితో పాటుగా, భారత ప్రభుత్వానికి SFF వారు తమ అభ్యర్థణలను పూర్తిగా విషదపరచదలిచారు, అవి..

1) కుటుంబాలకి, మగవారికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాను దుర్వినియోగపరిచి చేసె ఉగ్రవాదాన్ని (Legal Terrorism) నివారించాలి. ముఖ్యంగా సెక్షను 498A ను bailable గా మార్చాలి. అంతేకాక దీనిని non-cognizableగా మార్చి, ఎటువంటి సాక్షాధారాలు కానీ, విచారణ గానీ లేకుండా కేవలము ప్రతివాది యొక్క ఫిర్యాదు కారణంగా అరెస్టు చేయడాన్ని ఆపాలి.

2) సివిల్ మరియు క్రిమినల్ చట్టాలు ఆడవారికీ మగవారికీ సమానంగా వర్తించే విధంగా రూపొందిచాలి. ముఖ్యంగా, IPC సెక్షను 498A, గృహహింస నిరోధక చట్టం మరియు వివాహేతర సంబందాలకై చేసిన చట్టాలను, లైంగిక హింసకు సంబందిచిన చట్టాలను, కుటుంబానికి సంబందించిన చట్టాలను(విడాకులు,పిల్లల సంరక్షణ,భరణం లాంటివి)లింగ వివక్షారహితంగా మార్చాలి.

3) వైవాహిక బంధంలో ఏర్పడే కలతలను, సమస్యలను సివిల్ చట్టాల ద్వారా మాత్రమే పరిష్కరించాలి.

4) న్యాయ వ్యవస్థను, ప్రక్రియను దుర్వినియోగపరచే వారిని లింగవివక్ష లేకుండా కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా, IPC సెక్షను 498A మరియు గృహహింస నిరోధక చట్టాలను వ్యక్తిగత కక్షలు తీర్చుకొనుటకు దుర్వినియోగపరిచే వారికి భారీ జరిమానాలు విధించాలి.

5) వివాహ విచ్ఛిన్న సమయంలో తల్లిదండ్రులివురికీ పిల్లల సంరక్షణ బాధ్యతలను అప్పగించాలి(joint custody).

ఈ సందర్భంగా అన్నిరకాల ముద్రణ మరియు ఎలక్త్రానిక్ మాధ్యమాలకు ఈ విషయములో సంఘీభావం ప్రకటించ వలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ టపా నేను, Fight for Gender Equality అన్న ఉమా చెల్ల గారి బ్లాగులోని International Men’s Day – 19 November, 2008 అన్న ఆంగ్ల టపాను అనువాదము చేసి రాయడం జరిగింది. ఆంగ్లములోనుండి తెలులోకి అనువాదము కాబట్టి ఉన్నది వున్నట్లుగా తర్జూమా చేయడం కొంచెం కష్టమైనా ఆ టపా స్పూర్తికి ఎటువంటి భంగమూ కలగకుండ రాయడము జరిగింది.ఆమె బ్లాగులోని అసలు టపాను చదవాలంటే ఈ కింద ఇచ్చిన లంకెను నొక్కండి.

International Men’s Day – 19 November, 2008

ఉమా చెల్లగారు, Save Indian Familyలొ సభ్యురాలు మరియు All India Forgotten Women(AIFW) సంస్థ యొక్క అధ్యక్షురాలు.

Published in: on November 15, 2008 at 9:07 am  Comments (2)