భగవద్గీతలో “విగ్రహారాధన” మేలని చెప్పడం జరిగిందా !? వేదాల ప్రకారం దేవునికి రూపం ఉందా !?


కొంత మంది భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చూపించి, భగవద్గీతలో కృష్ణుడే విగ్రహారాధన మంచిది కాదని, పాపమనీ చెప్పాడని వాదిస్తున్నారు.  అలా వాదించే వారు నిజానికి భగవద్గీతను పూర్తిగా చదవలేదని చెప్పవచ్చు. కృష్ణుడే స్వయంగా, తన రూపములేని స్థితిని కాకుండా, రూపమున్న కృష్ణ అవతారాన్ని  పూజిచమని చెప్పాడా? అంటే అవుననే చెప్పాలి !

భగవద్గీతలో 12వ చాప్టర్ మొత్తం ఇదే చెబుతుంది. 
Link : http://www.vedabase.com/en/bg/12

శ్లోకం 12.1 :   కృష్ణావతారాన్ని పూజించడం లేదా అశరీర రూపుడైన పరబ్రహ్మాన్ని కొలవడం, ఈ రెండింటిలో ఏది ఖచ్ఛితమైన విధానం ? అని అర్జునుడు కృష్ణున్ని అడుగితాడు.

ఇక్కడ, కృష్ణుడు, పరబ్రహ్మా ఇద్దరూ ఒక్కటే.  ఈ విషయాన్ని కృష్ణుడే స్వయంగా చాలా సార్లు చెబుతాడు.  తాను కృష్ణుడి రూపములో అందరికీ కనిపిస్తున్నా తనకు అసలు జననమూ, మరణమూ అనేది లేదని, తాను వీటన్నింటికీ అతీతుడనని చెబుతాడు.  అప్పుడు అర్జునుడి పైన చెప్పిన ప్రశ్న అడుగుతాడు. 

శ్లోకం 12.2:  ఎవరైతే తన కృష్ణ అవతారాన్ని లేదా రూపాన్ని, నిత్యం పూజిస్తారో, తన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు సరైన విధానమును పాటిస్తున్నారు అని చెబుతాడు.

శ్లోకం 12.3 & 12.4 :  అయితే,  రూపములేని పరబ్రహ్మగా, మానవుని ఇంద్రియాలకు (Senses) అందని వానిగా,  ఈ సృష్టినంతా ఆక్రమించుకున్న వానిగా, నిత్య సత్యముగా ఉన్న   నా మరో అంశముపై విశ్వాసం ఉంచి పూజించెదరో వారు కూడా చివరకి నన్ను చేరుకొనెదరు.
Link: http://www.vedabase.com/en/bg/12/3-4

ఈ 12.3 మరియు 12.4 శ్లోకాలను భట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, ఇతర మతస్థులు ముఖ్యముగా అబ్రహామిక్ మతస్తులు చెబుతున్న లక్షణాలున్న దైవ స్వరూపాన్ని( నిరాకార బ్రహ్మన్ ) కొలిచినా చివరకి తనను చేరుతారని శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు.

12.5 :  ఎవరైతే,  నిరాకార స్వరూపాన్ని, అనంత స్వరూపాన్ని పూజిస్తారో వారు మోక్షాన్ని చేరుకోవడం కష్టం అవుతుంది.  ఈ పద్దతిద్వారా మోక్షాన్ని చేరుకోవడం కష్టమవుతుంది.
Link: http://www.vedabase.com/en/bg/12/5

12. 6- 7 :  ఎవరైతే  నన్ను పూజిస్తారో,  తన కర్మలను నాకు అంకితమిచ్చెదరో,  ఎటువంటి నియమోల్లంఘన లేకుండా నన్ను సేవించెదరో,  ఎల్లప్పుడూ నన్నే పూజిస్తూ ఉండెదరో వారికి నేను మోక్షాన్ని ప్రసాదించెందను.

12.8:  నీ మనస్సును, దేవతలకే దేవతనైన (Supreme Godhead) నాయందే లగ్నము చేయుము. దానివలన నీవు నాయందే నివసించెదవు. 

12.5, 12.6, 12.7, 12.8 లను గమనిస్తే  మనకు అర్థమయ్యేది ఏమిటి? భగవద్గీతలో భవానుడు శ్రీ కృష్ణుడు  చెబుతున్నదేమిటంటే, నిరాకారుడు, విశ్వవ్యాప్తి అయినటువంటి దేవుని అంశాన్ని (మన అబ్రహామిక్ మతాలకు చెందిన సోదరులందరూ చెబుతున్న దేవుని స్వరూపము) పూజించడం కష్ట సాధ్యం.  అయినా, వారు అలా కూడా పూజించవచ్చు.  అలా పూజిస్తే కష్టపడి ఆయన్ను చేరుకుంటారు. దీన్నే ఙ్ఞాణయోగం అంటారు.

అలా కాకుందా సులభంగా ఆయన్ను చేరుకోవాలంటే, కృష్ణుడిగా ఆయన్ను పూజించమని చెబుతున్నాడు, స్పష్టంగా. దీనిని భక్తి యోగం అంటారు.

ఇప్పుడర్థమైందా ? భగవద్గీత దేవున్ని ఎలా పూజించమని చెబుతోందో..!  నిరాకార స్వరూపాన్ని పూజించడం కష్టం, నన్ను పూజిచండి అని అంత క్లియరుగా చెప్పిన తరువాత కూడా మన అబ్రహామిక్ మతాలకు చెందిన మితృలు, హిందూ పేర్లు పెట్టుకుని, కపట నాటకాలతో మనకు నీతులు బోదించాలని చూస్తున్నారు.  ఏకంగా కృష్ణుడూ దేవుడు కాదు అనే స్థాయికి వచ్చారు. వారు చెప్పేదేమిటిరా అంటే.. వేదాలలో చెప్పిన దాని ప్రకారం దేవునికి రూపం లేదు కాబట్టి,  మానవ రూపములో వచ్చిన కృష్ణుడు, రాముడు వంటి వారు దేవుళ్ళు కాదు అని.

అయ్యా !  భగవద్గీతలోని శ్లోకాలను ఉపయోగించి,  విగ్రహారాధన, బహుదేవతారాధన పాపమని నిన్న మొన్నటివరకూ తెగ వాదించారు కదా? ఇప్పుడు మీ పప్పులు ఉడకడం లేదు అని తెలుసుకున్న తరువాత కృష్ణుడు మీకు దేవుడులా కనిపించడం లేదా ?

సరే మీకోసం చెబుతాను వినండి.  భగవద్గీతలోని 11 వ అధ్యాయములో కృష్ణుడు,  తన విశ్వరూపాన్ని అర్జునికి చూపించినట్లుగా చెప్పబడుతుంది. దాని ప్రకారం, అర్జునుడు,  మానవరూపములో, సాధారణ నేత్రములతో తన విశ్వరూపాన్ని చూడాలేదు అని .. కృష్ణుడు, అర్జునికి దివ్యనేత్రాలని ప్రసాదిస్తాడు.  తరువాత తన అనంత రూపాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తాడు.  పదకొండవ చాప్టరు చదివితే మీకే తెలుస్తుంది ఈవిషయం. 

Link: http://www.vedabase.com/en/bg/11

అందులోనే, ఈ విధముగా ఆయన్ను చూసే అదృష్టం ఇంత వరకూ ఎవ్వరికీ కలగలేదనీ, దేవతలకి కూడా ఈ రూపాన్ని చూసే అదృష్టం కలగలేదనీ చెబుతాడు కృష్ణుడు.

అర్జునుడు ఆరూపాన్ని చూసి సంతోషించినా, అతనికి భయం కలుగుతుంది. దానితో కృష్ణుడిని వేడుకుంటాడు… తనకు ఇదివరకటి సాధారణ రూపమే చూపమని.

దేవుడు తాను తలుచుకుంటే, మానవులకు కూడా కనిపించగలడు. అవసరమైతే దివ్యనేత్రాలు ప్రసాదించనూ గలడు. అయినా తనను తాను చూపించుకోవడం చేతకాని వారిని దేవుడు అని అనగలమా? అలా చూపడం చేతకాని వారిని “ఫేక్” దేవుల్లు అని మనం చెప్పొచ్చు.

ఇంకో విషయం, కొంత మంది అనుకుంటున్నట్లుగా “నిరాకార బ్రహ్మన్” నుండి కృష్ణుడు రాలేదు. కృష్ణుడి నుండే “నిరాకార బ్రహ్నన్” వచ్చాడు.  అంటే .. కృష్ణుడి మరో అంశమే రూపములేని దేవుడు. భగవద్గీతలో ఇది కూడా చెప్పబడుతుంది, ఈ శ్లోకములో ..

brahmano hi pratisthaham
amrtasyavyayasya ca
sasvatasya ca dharmasya
sukhasyaikantikasya ca
Word for word: 
brahmanah — of the impersonal brahma-jyotir; hi — certainly; pratistha — the rest; aham — I am; amrtasya — of the immortal; avyayasya — of the imperishable; ca — also; sasvatasya — of the eternal; ca — and; dharmasya — of the constitutional position; sukhasya — of happiness; aikantikasya — ultimate; ca — also.
Translation: 
And I am the basis of the impersonal Brahman, which is immortal, imperishable and eternal and is the constitutional position of ultimate happiness.
సింపులుగా చెప్పుకుంటే, నిరాకార బ్రహ్మన్ కు నేనే మూలము అని కృష్ణుడు తేల్చిచెప్పాడు.  
ఇదే కాదు. అత్యంత ముఖ్యమైన ఉపనిషద్ .. శ్రీ ఈషోపనిషద్ కూడా ఇదే విషయాన్నే మనకు చెబుతుంది. 
శ్లోకం 15 : దేవుడికి రూపం ఉంది అని కాకపోతే అది దివ్యమైన తేజస్సుతో కప్పబడి ఉందని, దాన్ని తొలగించి మొహాన్ని చూసే అదృష్టం భక్తులకు కల్గించమని వేడుకోవడం జరుగుతుంది. 

hiranmayena patrena
satyasyapihitam mukham
tat tvam pusann apavrnu
satya-dharmaya drstaye


Word for word: 
hiranmayena — by a golden effulgence; patrena — by a dazzling covering; satyasya — of the Supreme Truth; apihitam — covered; mukham — the face; tat — that covering; tvam — Yourself; pusan — O sustainer; apavrnu — kindly remove; satya — pure; dharmaya — unto the devotee; drstaye — for exhibiting.
Translation: 
O my Lord, sustainer of all that lives, Your real face is covered by Your dazzling effulgence. Kindly remove that covering and exhibit Yourself to Your pure devotee.
శ్లోకం 16 :ఈ శ్లోకం కూడా ఆంతే, తేజస్సుతో కప్పబడి ఉన్న నీ రూపాన్ని చూపే అదృష్టం కల్పించమని వేడుకుంటున్నట్లుగా రాయబడింది.
 
pusann ekarse yama surya prajapatya
vyuha rasmin samuha
tejo yat te rupam kalyana-tamam
tat te pasyami yo ‘sav asau purusah so ‘ham asmi


Word for word: 
pusan — O maintainer; ekarse — the primeval philosopher; yama — the regulating principle; surya — the destination of the suris (great devotees); prajapatya — the well-wisher of the prajapatis (progenitors of mankind); vyuha — kindly remove; rasmin — the rays; samuha — kindly withdraw; tejah — effulgence; yat — so that; te — Your; rupam — form; kalyanatamam — most auspicious; tat — that; te — Your; pasyami — I may see; yah — one who is; asau — like the sun; asau — that; purusah — Personality of Godhead; sah — myself; aham — I; asmi — am.
Translation: 
O my Lord, O primeval philosopher, maintainer of the universe, O regulating principle, destination of the pure devotees, well-wisher of the progenitors of mankind, please remove the effulgence of Your transcendental rays so that I can see Your form of bliss. You are the eternal Supreme Personality of Godhead, like unto the sun, as am I.

ఇప్పుడు చెప్పండబ్బా, భగవద్గీతలోనూ, అత్యంత ముఖ్యమైన ఈషోపనిషద్ లోనూ భగవంతునికి రూపం ఉంది అని క్లియరుగా చెప్పడం  జరిగింది. భగవద్గీతలో అయితే,  నిరాకార బ్రహ్మన్ ను కొలవడం కష్టమవుతుంది కాబట్టి కృష్ణుడినే కొలవమని చెప్పడం జరిగింది. అదీకాక దేవునికి ఒక రూపాన్ని ఇవ్వచు అని మేమంటే .. మాది దార్మికంగా మహా నేరం అని మిడి మిడి ఙ్ఞాణముతో మమ్మల్నే తప్పు పడతారా ? మేము దేవునికి ఒక రూపాన్ని ఇచ్చి కొలవడం తప్పని చెప్పే హక్కు ఎవరికైనా ఎక్కడిది? ఎవరిచ్చారు ?? మేము మా ధర్మ శాస్త్రాల ప్రకారమే నడుచుకుంటున్నాము. ఒకరి అఙ్ఞాణ సలహాలు, అర్థ ఙ్ఞాణ ప్రసంగాలు మాకు అక్కర్లేదు.

ఎవరో కొంత మంది దేవుని తేజస్సును దాటి, దేవుని రూపాన్ని చూడలేని వారు, దేవునికి రూపం లేదని చెప్పి ఉండొచ్చు. అలా చెప్పారంటే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే లెక్క.  దేవునికి రూపం ఉంది.  అఙ్ఞాణముతో చూడలేక, రూపం లేదని చెప్పేవారి మాటలు నమ్మి అనవసరంగా హిందూ దేవుల్లని, విగ్రహారాధనను అవమానించకండి.  అది ధార్మికముగా మహా నేరం చేయడమే. క్షమించరాని పాపానికి ఒడికట్టడమే.

కృష్ణుడే దేవుడు. కృష్ణుడే అందరికన్నా గొప్పదేవుడు.  కృష్ణా హు అక్బర్.

స్వలింగ సంపర్కం – జంతువులతో సంపర్కం !!


స్వలింగ సంపర్కుల హక్కులు అనగానే దాన్ని అడ్డుకోవడానికి వేసే మరో బ్రహ్మాస్త్రం ఈ “జంతురతి”.  స్వలింగ సంపర్కాన్ని ఒప్పుకుంటే, రేపు కొంత మంది జంతురతిని కూడా చట్టబద్దం చేయమంటారు అని ఒక వాదన.

“జంతు రతి” సహజమా ? అది ఎలా? జన్యుపరంగా ఎవరకైనా జంతువులతో రతి చేయాలని ఉంటుందా? ఒక వేలా ఉన్నా కూడా కష్టమే. ఎందుకంటే, జంతువులు తమ అంగీకారాన్ని తెలుపలేవు.  అవి మనస్పూర్తిగా తమ అంగీకరాన్ని తెలిపాయని మనం భావించలేం. కాబట్టి, జంతువులతో రతి నేరమే.  కానీ, స్వలింగ సంపర్కం అలా కాదు,  ఇద్దరు వ్యక్తులు స్పష్టంగా తమ అంగీకరాన్ని తెలుపగలరు. కాబట్టి, వారి మధ్య సంపర్కం తప్పు కాదు అంటున్నారు. జంతువులు తమని చంపి తినమని అంగీకారాన్ని ఇవ్వలేవు కాబట్టే, చాలా మంది మాంసాహారం మానండి అని చెబుతున్నారు. దాన్ని పాటించే వారే లేరు.  కనీసం, జంతువులతో రతినైనా నిషేధించారు అదే సంతోషం.

ఇక, వివాహానికి కావలసిన ప్రధమ అర్హత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడం. పిల్లలను కనగలిగె సామర్ధ్యం ద్వితీయ శ్రేణికి చెందినది మాత్రమే. ఇద్దరికి ఇష్టమైతే,  అవతలి వ్యక్తికి పిల్లలు పుట్టరని తెలిసినా పెళ్ళిచేసుకుంటే,  ఆ వివాహం బేషుగ్గా చెల్లుతుంది. తరువాట కోర్టులో, ఆ కారణం చెప్పి విడాకులు తీసుకోవడం కష్టమవుతుంది కూడా. కాబట్టి, సంతానోత్పత్తి అనేది పెళ్ళికి తప్పని సరి అనో, అదే ప్రాతిపదిక అనో చెప్పడానికి వీలులేదు. సంతానోత్పత్తి పెళ్ళి చేసుకోకుండా కూడా చేయొచ్చు.  అది కూడా తప్పు కాదు. కాకపోతే, ఆ సంతానానికి సంబందించినంత వరకూ పూర్తి బాధ్యత తల్లిదండ్రులిద్దరూ (Biological Parents) తీసుకోవాల్సి ఉంటుంది. సంతానోత్పత్తికే పెళ్ళి అనేది కేవలం సాంప్రదాయ వాదుల అపోహ మాత్రమే. 

మరో సారి నా ప్రశ్న ఏమిటంటే, జంతు రతి అయినా, రక్తసంబందీకుల మధ్య సంపర్కమైనా వీరికి స్వలింగ సంపర్కుల హక్కుల గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకు వస్తోంది అని?  ఏం, సాంప్రదాయ బద్దంగా అమ్మాయి – అబ్బాయి పెళ్ళి చేసుకుంటున్నారు అన్నప్పుడు, వీల్లిద్దరూ పెళ్ళి చేసుకున్నప్పుడు, జంతుల్ని ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు,  రక్తసంబందీకుల మధ్య సంబందం ఎందుకు ఉండకూడదు అని ఎందుకు అనుకోరు ?  Heterosexuals తామే మోరల్లీ సుపీరియర్ అని ఎందుకు అనుకుంటున్నారు ?

ఈ భయంకరమైన వాదాలు,  లాజిక్కులూ చదివేవారికి చిరాకు తెప్పించవచ్చు కానీ ఇదంతా  ఎందుకు జరుగుతోంది?  కేవలం కొంత మంది ఇష్టపూర్వకంగా చేసుకునే సంపర్కాన్ని కాదనడానికి, వారికీ అందరిలా జీవించే హక్కును నిరాకరించడానికి. దాన్ని అడ్డుకోవడానికి, ఒకరేమో ఇన్సెస్ట్ అంటారు, మరొకరేమో జంతురతి అంటారు.  ఒక చిన్న మైనారిటీ గ్రూపుమీద సమాజం కక్ష కట్టడమే ఇదంతా.  నేను స్వలింగ సంపర్కాన్ని సమర్ధీంచడం అభ్యుదయమని చెప్పను. కానీ, ఇతరులకు వారికి ఇష్టమైన రీతిలో జీవించే హక్కును కల్పించమని చెబుతున్నాను అంతే !

కొందరు యుగాంతం వచ్చేస్తోంది కాబట్టే, ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కాకపోతే, ఈ మాటా నేను చిన్నప్పుడు చెడ్డీలేసుకుని తిరిగేప్పటినుండి ఏదో ఒక విషయములో చెబుతూనే ఉన్నారు.  మొన్నా మధ్య 2012 లో యుంగాంతం వస్తుందని ఊదరగొట్టారు. ఏమయింది? ఏమీ కాలేదు. ఇదీ అంతే, స్వలింగ్ సంపర్కాన్ని ఆమ్మోదించినంత మాత్రాన యుగాంతం రాదు.

P.S: ఒకానొక బుద్దిలేని బృహస్పతి, స్వలింగ సంపర్కాన్ని సమర్ధించాలంటే, స్వలింగ సంపర్కం పెట్టుకోవడానికి సంసిద్దతను కలిగి ఉండాలి అని వాకృచ్చాడు. లేదంటే, ఇవన్నీ శుశ్కవాదనలే అంటా ఆయనగారి దృష్టిలో.  ఆయనకు నేనిచ్చిన సమాధానం ఒక్కటే …

చాలా మంది స్వలింగ సంపర్కుల హక్కులను సమర్ధిస్తున్నది వాళ్ళు స్వలింగ సంపర్కులు అయ్యుండబట్టి కాదు. తమ తోటి ప్రజల హక్కులను గౌరవించాలన్న చిన్న ఫీలింగ్ తోటి. నా వరకు నేను.. ప్రపంచములోని అమ్మాయిలందరూ చచ్చిపోయి, కేవలం మగాళ్ళు మాత్రమే మిగిలిన పరిస్థితి వచ్చినా .. హోమో సెక్సు జోలికి మాత్రం పోను. At the same time, ప్రపంచములో అందరూ భయపడుతున్నట్లు Heterosexual రిలేషన్స్ అంతరించి పోయినా, Homosexuals హక్కులను అడ్డుకుంటామంటే వ్యతిరేకించకుండా ఉండలేను. మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. లేదు, హోమోసెక్సువాలిటీని సమర్ధించాలంటే.. ఖచ్ఛితంగా హోమో సెక్సువల్ అయ్యుండాలి లేదంటే.. అవకాశం వస్తే అవ్వాలి అనుకుంటే.. మీ ఇష్టం. ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

వేదాలలో విగ్రహారాధన – అపోహలు, నిజాలు ! (Repost)


ఆర్యా ముస్టాఖ్ అహ్మద్ (MA అభిలాష్), 

నేను గత టపాలో సర్వేశ్వరుడు “సర్వాంతర్యామి” అని తెలిపే భగాద్గీత శ్లోకమును ఇచ్చియున్నాను. మీరు దానికి సంతుష్టులయ్యే ఉంటారని భావిస్తున్నాను.  ఇక మీరు నాకు ఇచ్చిన సమాధానములోని అంశాలను పరిశీలిద్దాం.

ఈ అంశాల పరిశీలనను నేను రెండు విధాలుగా చేయదలుచుకున్నాను.

  1. ధర్మ శాస్త్రాల ప్రకారం పరిశీలన
  2. సమకాలీన అంశాలను పరిగణలోకి తీసుకుని,  ఇంగిత ఙ్ఞాణముతో చేసే  పరిశీలన.

1. ధర్మ శాస్త్రాల ప్రకారం పరిశీలన :

నన్ను వ్యభిచరించని ప్రేమతో ప్రేమించుచూ వ్యభిచరించని భక్తితో
సేవించుచూ ఎవడు నన్ను బడయ ప్రయత్నించునో (అతడు) చెడు
గుణములనునతిక్రమించును. మరియు అతడు సైతము బ్రహ్మ(పవిత్రుడు)
అగుటకు సమర్ధుడగును.  -14:26 (శ్రీ గీతాయోగము)  

దీనిని బట్టి- గీతాశాస్త్రం ప్రకారం- బహుదైవోపాసన లేక విగ్రహారాధన “అధ్యాత్మిక వ్యభిచారము!” అని అర్థం కావటం లేదా శుక్రా చార్య గారూ! ఈ అధ్యాత్మిక వ్యభిచారులైన వారిగతి ఏం కానుందో ఈ క్రింది శ్లోకములో గమనించగలరు.  

దీనికోసం భగవద్గీత వెదికా. భగవద్గీత లో 14వ చాప్టరు, 26 వ శ్లోకము ఇది 

māḿ ca yo ‘vyabhicāreṇa
bhakti-yogena sevate
sa guṇān samatītyaitān
brahma-bhūyāya kalpate

mām — unto Me; ca — also; yaḥ — a person who; avyabhicāreṇa — without fail; bhaktiyogena — by devotional service; sevate — renders service; saḥ — he; guṇān — the modes of material nature; samatītya — transcending; etān — all these; brahmabhūyāya — elevated to the Brahman platform; kalpate — becomes.

Translation: One who engages in full devotional service, unfailing in all circumstances, at once transcends the modes of material nature and thus comes to the level of Brahman.

Link: http://vedabase.net/bg/14/26/en

దీనిలో మీకు బహుదైవారాధన, విగ్రహారాధన గురించిన విషయం ఏమి కనిపించిందో కాస్త వివరిస్తారా ముస్టాఖ్ అహ్మద్ (MA అభిలాష్) గారూ? ఇదే విషయాన్నే మీ బ్లాగులో Jai Gottimukkala గారు కూడా అడిగారు. మీరు దానికి సమాధానం ఇవ్వలేదు. భగవద్గీత గురించి ఏదైనా చెప్పాలనుకుంటే.. Authentic Source శ్లోకాలు తీసుకుని చెప్పండి.

ఇక మరో శ్లోకానికి వద్దాం.

ఆ పరమసత్త ఈ జగత్తును ఎంతో ఆక్రమించుకొనియున్నది. దానికి రూపం లేదు,
శోకము లేదు. దీనిని తెలుసుకున్నవారు అమరులవుతారు.ఇతరులందరూ
దు:ఖాన్ని అనుభవించాల్సిందే. శ్వేతాశ్వతరోపనిషత్త్ -3:10

ఈ శ్లోకమొక్కటే కాదు. దాని వెంటనే 3:11 వ శ్లోకం కూడా ఏమి చెబుతుందో ఒక సారి చూడండి మీకే తెలుస్తుంది.  “రూపం లేదు” అని చెప్పడానికి గల కారణమేమిటో.  దీన్ని ఎలా చెప్పవచ్చంటే … నీటికి రూపం లేదు. దాన్ని మనం ఏపాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని అవి సంతరించుకుంటాయి.  అలానే పరమాత్మ కూడా నిరాకారుడు. భక్తుడు ఏరూపములో కొలుచుకుంటే ఆరూపములో కనపడతాడు.  

(Click on image to maximize)


పైన ఇచ్చిన ఇమేజుల్లో 3:10 మరియూ 3:11 శ్లోకాలున్నాయి. వాటిలో 3:11 (2వ ఇమేజులోనిది) శ్లోకం తాత్పర్యం, వాటికి ఆ పుస్తక రయచిత ఇచ్చిన వివరణ చూడండి.

” Therefore, that Devine Lord, being allpervading, omnipresent and benevolent, dwells in the hearts of all beings, and makes use of all faces, heads and necks in this world.

 [Notes — It is noteworthy that this Mantra, speaking of divine immanence, comes immediatley after the previous one, which depicts the Supreme as the Absolute, far beyond all relations. The idea is that God is both transcendent and immanent. This beautiful synthesis of the conceptions of the Personal and the Impersonal, of the Transcendent and the Immanent, is a characteristic feature of this Upanisad.]

1. Therefore — Because He is formless, all – pervading, etc., He can take any form, and be present anywhere and everywhere, according to the wish of the devotee.  

2. Benevolent — If He did not graciously dwell in the hearts of all beings, and guide their senses, thoughts and actions, it would not have been possible for man to realize Him, by his own unaided effort. 

3. Makes use of etc. — To bring about the evolution of the Souls, and ultimately bring them to the goal of liberation (Mukti).] 

అదీ అసలు విషయం.  మీరేమో నిరాకారుడు కాబట్టి,  విగ్రహారాధన మహాపాపం అని చెప్పారు. కానీ అక్కడ ఉద్దేశ్యం మాత్రం వేరేగా ఉంది. రెండవ పాయింటు చెప్పేదేమిటంటే, అతను నిరాకారుడు, సర్వాంతర్యామి కాబట్టే, ఏ ఆకారానికైన్నైనా తీసుకోగలడు, ఎక్కడైనా ఉండగలడు.

సహజంగా ఈ వేదాలూ, భగవద్గీత వీటన్నింటిలో ఏదో ఒక శ్లోకం తీసుకుని  మీకు నచ్చింది మీరు రాసుకుంటారు. సహజంగా ఇలాంటి పనులే చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ, పూర్తిగా అవగాహణ ఉన్న వారు వాటిని వివరిస్తే గాని మనకు అందులోని తత్వం బోధపడదు.

ఇక మరో శ్లోకానికి వద్దాం. 

ఎవరైతే ప్రాకృతిక వస్తువులను (గాలి,నీరు మొ//వాటిని) ఉపాసిస్తారో
 వారు చీకటి (నరకం)లో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి (సృష్టితాలు –
 మానవునిచేత తయారయ్యే వస్తువులను,బొమ్మలను) ఉపాసిస్తారో వారు
 మరింత అంధకారంలోకి ప్రవేశిస్తారు. -యజుర్వేదం 40:9

అసలు యజుర్వేదములో పై శ్లోకం ఏమని చెబుతుంది. సంభూతి, అసంభూతి అంటే ఏమిటి? అసలు శ్లోకం ఏమిటి?

యజుర్వేదం 40 చాప్టరు : 

Mantra – 9
अन्धं तमः प्रविशन्ति येसंभूतीमुपसते |
ततो भूय ऽ इव ते तमो य ऽ उ संभुत्याः रताः ||

Translation: Those people enter into darkness, who worships only “Asambhuti”, and those too enters into darkness who worship only “Sambhuti”

ఇది అసలు అర్థం. ఇక్కడే అర్థం అయ్యుంటుంది మీకు ఆ శ్లోకం యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటో ! పోనీ తరువాతి శ్లోకాలు ఏమి చెబుతాయో అదీ చూద్దాం.

Mantra-10
अन्य देवाहुः सम्भवादन्यदाहुरसम्भावात् |
इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ||

Translation: We have heard from that Devata, who said the above (40:9) to us, that the effect of worshiping the “Sambhuti” has a different effect then worshiping the “Asambhuti”.

Mantra-11
संभूतिं  च विनाशं च यस्त द्वेदोभय सह |
विनाशेन मृत्युं तीर्त्वा संभूत्यामृतमश्नुते ||

Translation: Hence know the art of “Sambhuti” as well as the “Vinash”. With worshiping the art of Vinash, you can win over the death, and by worshiping the art of Sambhuti you can become immortal

సింపులుగా చెప్పాలంటే …

మంత్ర 9: కేవలం సంభూతిని కానీ, కేవలం అసంభూతిని కానీ పూజించకూడదు.
మంత్ర 10: సంభూతిని పూజించడం వలన కలిగే ఫలితాలు, అసంభూతిని పూజించడం వలన కలిగే ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి. 
మంత్ర 11: కాబట్టి సంభూతినీ, అసంభూతినీ / వినాష్ కలిపి పూజించండి.

“సంభూతి”ని పూజించడం వలన ఒక ఫలితం, “అసంభూతిని” పూజించడం వలన మరో ఫలితం ఉంటుందని 10వ శ్లోకం చెబుతుంది. ఇక 11వ శ్లోకం అయితే “సంభూతి”ని ఆరాధించడం వలన Immortalగా ఉంటాము అని చెబుతోంది. ఇక్కడ వినాష్ అనేది “అసంభూతి”కి పర్యాయపదంగా ఉపయోగించారని భావిస్తున్నారు కొంత మంది. అది అయినా కాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు 9వ శ్లోకం అర్థం ఏమిటి? బహుషా వారి ఉద్దేశ్యం, కేవలం “సంభూతి”ని కానీ, కేవలం “అసంభూతి”ని కానీ పూజించడం వలన ఫలితంలేదు అనేకదా??

ఈ లింకులో ఒక వ్యక్తి దీన్ని బాగా వర్ణించాదు చూడండి..

Link : http://akhilapadhiblogs.blogspot.in/2012/08/andhatama-pravishanti-ye-asambhuti.html 

ఇతను దాన్ని సరిగ్గా అనువాదం చేయలేదు అని మీరనుకుంటే.. ఇక్కడ కూడా చూడండి. వేరేవాల్లు అనువాదం చేశారు..

Link : http://sacred-texts.com/hin/wyv/wyvbk40.htm 

సంస్కృత పదాలకు చాలా అర్థాలుంటాయి. వాటిని Contextని భట్టి తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక మంత్రాన్ని తీసుకుని అర్థం మనకు నచ్చినట్లు తీసుకోకూడదు. ఆ చాప్టర్ మొత్తం తీసుకుని, ఆచాప్టర్ ఏమి చెబుతుంది అని మొత్తంగా ఆకలింపు చేసుకోవాలి. ఆపని చేయకుండా మీరైనా, నేనైనా మనం మన వాదాలను నిరూపించుకోవడం కోసం వాటిని వాడుకోరాదు.

ఈ సంభూతి అంటే మానవ నిర్మితాలనీ, అసంభూతి అంటే ప్రకృతిలోని వస్తువులనీ (సూర్యుడు, గాలి, అగ్ని గట్రా) మీరు అంటున్నారు. కానీ, చాలా మంది వాటికి మరో అర్థాన్ని ఇచ్చారు. కొందరు సంభూతి అంటే Pattern అని చెప్పడం నేను చూశాను. వాటి అర్థాలు ఏవైనా “సంభూతిని” పూజించడం వలన Immortalగా ఉంటామని చెబుతోంది కదా మరో శ్లోకం ! అది ఎలా మర్చిపోయారు??

మీలాంటి వారంతా చేసే పని ఒక్కటే.. ఏవో నాలుగు శ్లోకాలు ఏరుకుని, వాతికీ మీకు నచ్చిన అర్థాలు ఇచ్చుకుని, మీ మత సూక్తులకు అనుగుణంగా వాటిని రాసుకుని, ప్రస్తుతం హిందువులు చేసే పనులు తప్పు అని నిరూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇక మీరు ఇచ్చిన యోగ శిఖ ఉపనిషద్ లోని శ్లోకానికి వద్దాం …

విషయమును ధ్యానించు పురుషుని యొక్క మనస్సు విషయమందే
రమించును. నన్ను (సర్వేశ్వరుని) స్మరించుట వాని చిత్తము నా (సర్వేశ్వరుని)
యందే లీనమగును. యోగశిఖోపనిషత్ 3:6

ఈ యోగ శ్లోకం కొరకు నేను చాలా ప్రయత్నించాను.  ఇది దొరకలేదు. ఎవరైనా యోగ శిఖోపనిషద్ అనువాదం వివరంగా దొరికితే చూపించగలరు.  ఎందుకంటే.. ఇక్కడ విషయము అంటే విగ్రహము అని అనుకోవడానికి వీలులేదు. దానికి తోడు యోగ శిఖోపనిషద్‌ను కొంత మంది ఇంగ్లీషులోకి అనువదించారు. అందులో మూడవ చాప్టరులో ఈ తరహా అర్థం వచ్చే వ్యాఖ్యలు ఏమీ కనపడలేదు.

అసలు యోగ శిఖోపనిషద్ లో 3 చాప్టరు 6 శ్లోకం ఇది.

अकारादिक्शकारान्तान्यक्शराणि समीरयेत्‌।
अक्शरेभ्यः पदानि स्युः पदेभ्यो वाक्यसंभवः॥ ६॥

akārādikśakārāntānyakśarāṇi samīrayet |
akśarebhyaḥ padāni syuḥ padebhyo vākyasaṁbhavaḥ || 6|| 

Link:  http://hatharaja.blogspot.in/2011/02/yoga-shikha-upanishad.html#more

మూడవ చాప్టరు మొత్తానికి ఆ పేజీలో ఇచ్చిన అనువాదం …

That great ever living Nadha (sound) is called Sabhda Brahman. It is the strength residing in the Mooladhara. Para is the foundation for its own self and is of the form of Bindhu. That Nadha coming out of Parashakthi (similar to  the germ coming out of the seed) is called Pasyanthi (we see). The Yogis who are able to see using the Pasyanthi Shakthi, understand that it is the whole world. That power produces sound like a rain starting from the heart. Hey Lord of Lords, there it is called Madhyama. It is called Vaikari when it merges in the sound form with Prana and exists in the throat and jaw. It produces all the alphabets from Aa to Ksha. From alphabet words arise and from words rise the sentences and from them all the Vedas and Mantras. This Goddess Saraswathi lives in the cave of intelligence in all beings. In meditation when will power melts, you can reach this Para Thathwa.

ఈ మొత్తం అనువాదములో, అభిలాష్ గారు చెప్పిన అర్థం వచ్చే శ్లోకమే కనిపించడం లేదు. ఆ శ్లోకాన్ని చదివిన తరువాత నేను గ్రహించినది ఏమిటంటే …
akārādikśakārāntānyakśarāṇi = akārādi + kśa kārā + ntāny + akśarāṇi = (may be) “అ” నుండి “క్ష” అక్షరం వరకూ 
samīrayet = ?
akśarebhyaḥ = (may be) ఏదో అక్షరాల గురించి చెపుతున్నారు
padāni = ?
syuḥ  = ?
padebhyo  = (may be) పదాల గురించి చెబుతున్నారు
vākyasaṁbhavaḥ = vākya  + saṁbhavaḥ = (may be) వాఖ్యాల గురించి మాట్లాడుతున్నారు.
పైన ఉన్న వాటిని భట్టి, ఈ శ్లోకం .. పైన ఇచ్చిన అనువాదములోని ఈ వాఖ్యమును వివరిచే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను …  

It produces all the alphabets from Aa to Ksha. From alphabet words arise and from words rise the sentences and from them all the Vedas and Mantras.

( ఎనీ వే, ఇదంతా కేవలం నా ఊహాగానం మాత్రమే. ఈ శ్లోకాన్ని ఎవరైనా సంస్కృతం తెలిసిన వారు అర్థాన్ని తెలుపగలరు ) 
చూశారుగా ముస్టాఖ్ అహ్మద్ గారూ, మీరు ఇచ్చిన శ్లోకాలలో కొన్ని శ్లోకాలు తప్పు. మరికొన్ని అర్థాలు తప్పు. వీటిని ఉపయోగించి మీరు విగ్రహారాధన గురించి, బహుదైవోపాసన గురించి మీరు అభిప్రాయాలు ఎలా ఇస్తున్నారు? 
ఇప్పటితో అయిపోలేదు. మీరు రాశిన పోస్టులో మరికొన్ని విషయాల గురించి తరువాతి టపాలలో వివరిస్తాను !