ఇండియాలో ఇస్లామిక్ యుద్దాలు : సూఫీ Vs వహాబి, ఖాద్రీ Vs జకీర్ నాయిక్

Update: బంగ్లాదేశ్‌లో జరిగిన తీవ్రవాద దాడుల తరువాత ఒక పేరు బయటకి వచింది. అదే “జకీర్ నాయిక్”.  అతను టెర్రరిస్టులను ప్రోత్సహించే విధంగా ప్రసంగాలు చేశాడని కొంత మంది, కాదని కొంత మంది అంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, అతని మీద అనుమానం ఉన్నట్టు మేము చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ, జకీర్ నాయక్ ప్రసంగాలు అతివాదానికి దగ్గరగానే ఉంటున్నాయి.

ఇతర మతాలను నిందించడం, వారిని తప్పులు పట్టడం, ఇస్లాములో కూడా కాస్త భిన్న అభిప్రాయాలు ఉన్నవారిని ముస్లిములు కాదనడం వంటివి ఆయన ప్రసంగాలలో మనం చూడొచ్చు. ప్రస్తుతం NIA జకీర్ నాయక్ ప్రసంగాల పరిశీలిస్తోంది. ప్రభుత్వం కూడా సీరియసుగానే తీసుకుంటోంది. ఆయన నడుపుతున్న “పీస్ టీవీ”కి ఇండియాలో అనుమతులు లేవని, దాన్ని ప్రసారం చేయడం నేరమని తేల్చింది.

ఇది వరకు నేను జకీర్ నాయక్ మీద రాసిన రెండు ఆర్టీల్లు మళ్ళీ  ప్రచురిస్తున్నాను చూడండి !!


Posted on July 23, 2015 at 9:35 am

(జకీర్ నాయక్ అతని అనుయాయుల ప్రచారాలు మీడియాను బాగానే ఆకర్షిస్తున్నాయి. మొన్న టైంస్ ఆఫ్ ఇండియా పేపరు చదువుతూ ఉంటే కనపడింది ఈ ఆర్టికల్. దానికి నా స్వేచ్ఛానువాదం, ఇందులో కొంత నా విశ్లేషననూ కూడా జోడించాను.)

ప్రస్తుతం అంతర్జాలములో ఇస్లామిక్ యుద్దాలు బాగానే జరుగుతున్నాయి. టెక్నాలజీ అభివృద్ది చెందేకొద్దీ ఈ యుద్దాలు బాగా ముదురుతున్నాయి కూడా. ప్రస్తుతం ఇండియాలోని ముస్లిముల మధ్య అంతర్జాలములో విచిత్రమైన పోరు ఒకటి సాగుతోంది. అదే సూఫీ Vs వహాబీ పోరు.

ఈ రెండు సిద్దాంతాలకూ ఫేసుబుక్కులో గ్రూపులు, పేజీలు, అనేక మంది ఫాలోయర్లూ ఉన్నారు. వహాబీల రిప్రెజెంటేటివుగా జకీయ నాయిక్ వ్యవహరిస్తూంటే, సూఫీల రిప్రెజెంటేటివుగా తాహిర్ ఉల్ ఖాద్రీ వ్యవ్యహరిస్తున్నారు. వీరిద్దరు చెప్పే అంశాల మీద, వీడియోల మీద వందల కొలది కామెంట్లు ఉంటాయి. సమర్ధిస్తూ కొంత మంది, వ్యతిరేకిస్తూ మరి కొంత మంది ! ఈ ఇద్దరు గురువులకీ అంతర్జాలములో, నిజ జీవితములో అనేక మంది ఫాలోయర్లు ఉన్నారు. వీరిని అనుసరించే వారి మధ్య విభేదాలు, ఒకరినొకరు తమ పక్క సిద్దాంతం వారిని “కాఫిర్” అని పిలుచుకునే స్థాయిలో ఉన్నాయి.

వీరికి (వహాబీలకు) నిధులు సౌదీ నుండి అందుతున్నాయని తెలుస్తోంది.

వికీలీక్స్, బహిర్గత పరిచిన వివరాల ప్రకారం సౌదీ ఆయిల్ డాలర్లు, ఇండియాలో వహాబీ, సలాఫి భావజాలాన్ని ప్రోత్సహించడానికి విరివిగా అందుతున్నాయి.

హైదరాబాదును తీసుకుంటే 35% జనాభా ముస్లిములే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ మాజీ  సభ్యుడి ప్రకారం, భారత దేశం సూఫీ తత్వానికి పెట్టింది పేరు. సూఫీ తత్వం ప్రేమనూ, సహనాన్నీ బోధిస్తుంది. (కనీసం వహాబీ ఇజముతో పోలిస్తే, ర్యాడికల్ కాదు).

కానీ, సౌదీల సిద్దాంతం (వహాబీ ఇజం) ప్యూరిటీ కోసం తపించే అతివాద భావజాలమని చెప్పొచ్చు. మనకు హిందూ అతివాదులు ఎలా ఉన్నారో, వీరిలో వహాబీలు అలాంటివారు. దీని వలన భారత దేశములోని ముస్లిం సొసైటీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

వహాబి ఇజం, ముస్లిములను పూర్తిగా అతివాద మార్గాన్నఎంచుకోమంటుంది. కానీ సూఫీ ఇజం మాత్రం, ఇస్లామిక్ గురువులు (Saints) చెప్పినవి కుడా పరిగణలోనికి తీసుకోవాలంటుంది. కొన్ని మజీదులు కూడా ఈ రెండు భావజాలాలలో ఏదో ఒకదాన్ని నమ్ముకొని ఉంటాయి. అబిడ్స్‌లో ఉన్న ఒక మజీదు, పురానీ హవేలీలో ఉన్న మరో మజీదు వేరు వేరు భావజాలాన్ని ఫాలో అవుతున్నాయి. ఈ మజీదుల మధ్య ఆధిపత్య పోరుకూడా ఉంటుంది. ఎవరు జనాలను బాగా ఆకర్శించగలరు ఊనేదాని మీద.

హైదరాబాద్ సిటీలో వహాబీ ఇజం తన ఉనికిని బాగానే చాటుకుంటోంది. అరబిక్ పదమైన రమాదాన్, అల్లాహఫీజ్ బాగా పాపులరవుతున్నాయి. ఉర్దూ పదాలైన రంజాన్, ఖుదాహఫీజ్ వంటి పదాలు వాడకం క్రమేపీ తగ్గుతోంది. దీన్ని కొంత మంది తప్పు పడుతున్నారు. ఇండియాలో ఇస్లాం అరబ్బులకన్నా, పర్షియన్లకు (ఇరాన్) దగ్గరగా ఉంటుంది అని వీరి భావన.

వహాబీ ఇజాన్ని సమర్ధించేవారి మాట మరోలా ఉంది. వహాబీ ఇజం శాంతినీ, సహనాన్ని పెంపొదింప జేసేది అని వారు వాదిస్తున్నారు. అంతే కాక, పాశ్చాత్య మీడియా తమని వక్రికరిస్తోంది అని కూడా చెబుతున్నారు. సౌదీ నుండి భారత్‌కు ఎంత డబ్బు వచ్చింది చెప్పడం కష్టమే అయినా, ఈ వహాబీ ఇజాన్ని పెంపొందించడానికి దాదాపుగా మిలియన్ డాలర్లు వచ్చాయని ఒక అసోసియేషన్ చెబుతోంది.

కాకపోతే మరికొందరు ఏమంటున్నారంటే, ఈ వహాబీ ఇజం అనేది, సౌదీలొ పనిచేసి వచ్చిన వారి ద్వారా వ్యాప్తి చెందుతోంది అని. మజీదులకీ, మదర్సాలకు నిధులు రావడం బాగా తగ్గిందని, ఇప్పుడు కేవలం విధ్య, హెల్త్ కేర్ వంటి వాటికే అధికంగా నిధులు వస్తున్నాయనీ అంటున్నారు. వహాబీ ఇజములో అతివాదం  ఏమీ లేదనీ, ఇది కేవలం దేవునికీ భక్తునికీ మధ్య మరో మనిషి ఉండకూడదు అనే ఫిలాసఫీని ఫాలో అవుతుందనీ చెబుతున్నారు.

విశేషమేమిటంటే, సూఫీ శాఖను నమ్మేవారు ఈ వహాబీ ఇజాన్ని పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెలుతున్నారు. ఇది వహాబీలకు అంతగా రుచించడం లేదు. భారతీయ ముస్లిములు తమ సమస్యలు తామే పరిష్కరించుకోగలరని వారికి మధ్యవర్తుల సహాయం అవసరం లేదనీ చెబుతున్నారు.

టైంస్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆ ఆర్టికల్ చూడాలనుకుంటే ఇక్కడ చూడండి.

Wahabi versus Sufi: social media debates
Link : http://timesofindia.indiatimes.com/home/sunday-times/deep-focus/Wahabi-versus-Sufi-social-media-debates/articleshow/48128165.cms

సింపులుగా చెప్పాలంటే, ఈ వహాబీ ఇజం, సలాఫీ ఇజం అనేవి అతివాద భావాలు. సూఫీ ఇజం కాస్త లిబరలుగా ఉండే భావజాలం.

ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్స్, ప్రస్తుతం ఇరాక్, సిరియాలలో అరాచకాలు సృష్టిస్తున్న ISIS or ISIL ఇవన్నీ ఈ వహాబీ ఇజాన్ని ఫాలో అవుతున్నవే. 

కొంత మంది ఈ వహాబీ ఇజం అనే పదాన్ని అంగీకరించరు. వారు దీనికి సలాఫీ ఇజం అని పిలుచుకుంటారు. ఈ వహాబీ ఇజనికీ, సలాఫీ ఇజానికీ కొన్ని తేడాలు ఉన్నాట్లున్నాయి. కానీ, రెండు ప్యూరిటీ కోసం పరితపించే అతివాద భావజాలాలే.

Wahhabism
Link : https://en.wikipedia.org/wiki/Wahhabism

ఈ వహాబీ ఇజం గురించి ఒక సారి రాం జెట్మలాని చెప్పిన మాటలు ఇవి.  

Mr. Jethmalani, who is president of the All-India Senior Advocates Association, said:

“Unfortunately in the 17th century, they produced an evil man in Saudi Arabia by the name of Wahab, who was concerned about the decline of the Muslim world, but he hit upon a wrong remedy.”

He alleged that the Wahabi terrorism instilled rubbish in the minds of young people to carry out terrorist attacks. When he said

“India had friendly relations with a country that supported Wahabi terrorism,”

Saudi Arabia’s Ambassador Faisal-al-Trad was seen walking out of the conference held at Vigyan Bhavan.

Jethmalani’s remarks on Wahabism prompt Saudi envoy to walk out of meet

Link: http://www.thehindu.com/news/national/jethmalanis-remarks-on-wahabism-prompt-saudi-envoy-to-walk-out-of-meet/article52666.ece .

జెఠ్మలానీ ఈ మాటలు అన్న తరువాత సౌదీ అంబాసిడర్ ఆ పరిసరాలని వీడి వెల్లిపోయారు. తరువాత వీరప్ప మొయిలీ, ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని భారత ప్రభుత్వం మాటలు కావని వివరణ ఇచ్చిన తరువాత తిరిగి వచ్చాడు.

ఇక మన బ్లాగుల్లోకి వద్దాం .మన మితృలు కొంత మంది, దేవునికీ, భక్తునికీ మధ్య ఇంకెవరూ ఉండకూడదు  చెబుతున్నారు. తప్పేమీ కాదు. ఎవరి ఇష్టం వారిది. కానీ, వీరు దర్గాలను, ఉర్సులనూ వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మాత్రం నేను ఆమోదించను.

దర్గా అనేది సూఫీ శాఖ వారికి ఎంతో ముఖ్యమైనది. అజ్మీర్ దర్గా, కడప దర్గా, నిజాముద్దీన్ దర్గా ఇవన్నీ పవిత్ర ప్రదేశాలు. భారత దేశములో ఉన్నంత వరకూ వాటిని వ్యతిరేకించే అధికారం ఎవరికీలేదు. అది వహాబీలకు అయినా సరే, సలాఫీలకు అయినా సరే.

నిజానికి దర్గాలకు వెల్లడం అనేది ముహమ్మద్ చెప్పిన హడిత్‌ల ప్రకారం సమ్మతమే. కొంత మంది దీన్ని ఒప్పుకోవడం లేదు అంతే.

సున్నీల ప్రకారం:

  • The person who performs Hajj and then visits my tomb, will be regarded as though he had seen me in my worldly life.
  • I had prohibited visiting graves for you. From now on you can visit graves.

సో, ప్రవక్త కొన్ని హడిత్‌లలో, సమాధులను సందర్షించవచ్చని చెప్పడం జరిగింది.

షియాల ప్రకారం కూడా సమాధులను సందర్శించడం తప్పు కాదు.

కానీ వహాబీ ఇజం మాత్రం ఖురాన్ సూక్తులు, హడిత్‌ల ఆధారంగా అది తప్పని చెబుతుంది.

  • If you join others in worship with Allaah, (then) surely (all) your deeds will be in vain, and you will certainly be among the losers.
  • The most evil of mankind are those who will be alive when the Last Day arrives and those who take graves as places of worship.

Validity of Dargah in Islam
Link: https://en.wikipedia.org/wiki/Dargah#Validity_of_Dargahs_in_Islam

ఏదేమైనా, మన ముస్లిం మితృలు, ఈ అతివాద వహాబీ ఇజాన్ని వదులుకుని, ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించి, దర్గాలకు వెల్లడం తప్పు అని చెప్పడం మానుకుంటే బావుంటుంది. సూఫీ శాఖలోని వారికి, వారికి నచ్చినట్లుగా ప్రార్థనలు చేసుకునే హక్కుంది. దాన్ని కాదనే హక్కే మనకు లేదు.

ఇవే కాకుండా, హిందువులనూ, క్రిష్టియన్లనూ దేవాలయాలకు వెల్లొద్దు అని చెప్పడం మానండి. మా శాస్త్రాలలో దేవాలయానికి వెల్లడం నిషిద్దం  కాదు. కాబట్టీ మాకు వెల్లే హక్కుంది, ధర్మ శాస్త్రాల పరంగా మరియు భారతీయ చట్టాల పరంగానూ, ఆవిషయం మరిచిపోకండి.

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2016/07/09/%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%af%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6/trackback/